Jump to content

కుదరదంటే కుదరదంతే!


Recommended Posts

కుదరదంటే కుదరదంతే!
636364565209178666.jpg
  • ఏపీ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న కేంద్రం
  • విదేశీ రుణాలు విడిగా చూపడానికీ ససేమిరా
 
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): చుట్టుముడుతున్న ఆర్థిక కష్టాల నుంచి బయటపడటం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తలకుమించిన భారమవుతోంది. విభజన కష్టాల నుంచి బయటపడడానికి కొన్ని ప్రత్యేక మినహాయింపులను కోరుతున్న రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం నుంచి ప్రతికూల సమాధానాలే ఎదురవుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక హోదా అంటూ కొంత కాలయాపన జరిగింది. అయితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు పెద్దగా ఏమీలేవని తేలిపోవడంతో దాన్ని పట్టుకొని వేలాడే బదులు ఆకర్షణీయమైన ప్యాకేజీతో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
 
అయితే దీనికి మరికొంత సమయంపట్టే అవకాశం ఉండటంతో ఆర్థిక వనరుల సమీకరణకు వీలుగా కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం పదేపదే కోరుతున్నప్పటికీ కేంద్రం మాత్రం ససేమిరా వీలుకాదంటూ ప్రతిపాదనలన్నింటినీ తోసిపుచ్చుతోంది. తాజాగా అధిక రుణాలు పొందేందుకు వీలు కల్పించే ఒక వెసులుబాటును ఇవ్వడానికి కూడా కుదరదని రాష్ట్ర పభ్రుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది.
 
రాష్ట్ర విభజన తర్వాత ఆదాయ వనరులు గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అప్పులు సుమారు 2 లక్షల కోట్లకు దాటిపోయింది. ఇది రాష్ట్ర స్థూల ఆదాయంలో 27.04 శాతంగా ఉంది. అయితే ఏ రాష్ట్రప్రభుత్వ అప్పులైనా ఆ రాష్ట్ర స్థూల ఆదాయంలో 25శాతానికి మించకూడదని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం చెబుతోంది. 2014-15లో ఇది 29 శాతం పైనే ఉండేది. ఇప్పుడు కొంత తగ్గినప్పటికీ పరిమితిని మించే ఉంది. దీనివల్ల కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఎత్తేయాలని లేదా పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం అంగీకరించలేదు. మధ్యేమార్గంగా మరో వెసులుబాటునైనా కల్పించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్రలెక్కల్లో చూపించకుండా వెసులుబాటు కల్పిస్తే ఆ మేరకు అదనపు రుణాలను తెచ్చుకుంటామని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ... కేంద్రం అది సాధ్యపడదని తేల్చిచెప్పింది.
 
ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుల నుంచి, ఇతర విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకుంటే తప్ప పనులు ముందుకు సాగవు. అయితే ఇప్పటికే పరిమితికి మించి రుణభారం ఉన్నందున కొత్త రుణాల కోసం ఈ మాత్రం వెసులుబాటైన కల్పించాలన్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చడంతో ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే నిబంధనలు అంటూ గిరిగీసుకోవడం సమంజసమే అయినప్పటికీ ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

Link to comment
Share on other sites

Guest Urban Legend

What about schedule 9-10 institutions properties from TG if not properties at least AP rightful Share of 1000's of crores in bank accounts

 

Ah issue ni vadilesara

Rey governor ga

Link to comment
Share on other sites

What about schedule 9-10 institutions properties from TG if not properties at least AP rightful Share of 1000's of crores in bank accounts

 

Ah issue ni vadilesara

Rey governor ga

 

around 50k crores ani appatlo news lo vesaru.. malli emindho..

Link to comment
Share on other sites

Guest Urban Legend

around 50k crores ani appatlo news lo vesaru.. malli emindho..

Ap govt court ki veltharu anukunta or vellaro..gurtuledhu

Centre ippinchali

Central govt comedy chestundhi ippinchalsindhi poyi calm ga reverse game aadutunnaru

Tg govt memu ivvam ani cheptunnaru

Governor gadu temples tirugutunnadu

 

Opposition adagadhu

Pk ki pattadhi

Methaavi..sangalu upayogam ledhu

Link to comment
Share on other sites

Guest Urban Legend

E roju civil supplies dept head office opened in Vijayawada

 

Pullarao saying civil supplies dept ki TG govt 137 crs baaki..vunnaru anta

Adhi ivvatam ledhu

Link to comment
Share on other sites

Guest Urban Legend

Idhi ah governor activities

 

 

 

KTR

@KTRTRS

Received this delightful greeting along with a sapling from Governor Sri ESL Narasimhan Garu

Link to comment
Share on other sites

తెలంగాణ నుంచి రూ.137కోట్లు రావాలి

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

24brk71a.jpg

విజయవాడ: రాష్ట్ర విభజన అనంతరం ఆంద్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.137కోట్లు రావాల్సి ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజయవాడలో పౌరసరఫరాల సంస్థ నూతన కార్యాలయాన్ని ఛైర్మన్‌ లింగారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విభజన తర్వాత ప్రభుత్వ శాఖలు వేరైనప్పటికీ కార్పోరేషన్ల విషయంలో ఇంకా పూర్తిస్థాయి విభజన జరగలేదన్నారు. తెల్లకార్డుదారులకు కేంద్రం పంచదార, నీలి కిరోసిన్‌ నిలిపివేసిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పౌరసరఫరాల శాఖ కార్యకలాపాలు ఇక నుంచి విజయవాడ నుంచే కొనసాగుతాయని తెలిపారు.

Link to comment
Share on other sites

Appulu koda ey place lo tesukoni untey Valley katali ani court ki velandi, astulu emo meru dabutaru appulu memu katala ori xxx congo batch ap ni nakincharu ga

supreme court ki velli AP ki anulamga judgement vacchaka kuda, puspalu dicharu malli AP KI

Link to comment
Share on other sites

Appulu koda ey place lo tesukoni untey Valley katali ani court ki velandi, astulu emo meru dabutaru appulu memu katala ori xxx congo batch ap ni nakincharu ga

ఉమ్మడి సంస్థల్ని జనాభా నిష్పత్తిలో పంచుకోవాల్సిందే 

25-08-2016 01:28:47

  • తీర్పు పునస్సమీక్షకు సుప్రీం తిరస్కృతి 
  • తెలంగాణ వ్యాజ్యం కొట్టివేత 
  •  గత తీర్పు పునస్సమీక్షకు సుప్రీం తిరస్కృతి 
న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థలను జనాభా ప్రాతిపదికన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలంటూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉన్నతవిద్యా మండలి వివాదంపై ఏపీ ఉన్నతవిద్యా మండలి, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మార్చి 18న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఉన్నత విద్యామండలితో సహా ఉమ్మడి సంస్థలు, వాటి ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లోని నగదు నిల్వలను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. ఇరు రాషా్ట్రలూ రెండు నెలల్లోపు చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తీర్పుచెప్పింది. రెండు రాషా్ట్రలూ స్పందించకపోవటంతో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుంది. ఉమ్మడి సంస్థల విభజనకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇరు రాషా్ట్రల నుంచి ఇద్దరేసి చొప్పున ప్రతినిధులతో ఈ కమిటీని నియమించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఏప్రిల్‌ 18న రివ్యూ పిటిషన్లను దాఖలు చేస్తూ, తీర్పును సమీక్షించాలని కోరాయి. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి రెండు కేసులు దాఖలు చేసినా, ఆయా కేసుల్ని కలిపి విచారించిన సుప్రీంకోర్టు రెండింటికీ కలిపి ఒక్క తీర్పునే ఇచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి మాత్రం రెండు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయటం గమనార్హం. ఇందులో ఏపీ ప్రభుత్వ కేసులో తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఈనెల10న జడ్జిలు జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలు చాంబర్‌లో పరిశీలించి, తిరస్కరించారు. ఏపీ ఉన్నతవిద్యామండలి కేసులో తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జడ్జిలు పరిశీలించారు. గతంలో తామిచ్చిన తీర్పును పునస్సమీక్షించేది లేదని పేర్కొంటూ వ్యాజ్యాన్ని తోసిపుచ్చారు. దీనితో క్యురేటివ్‌ పిటిషన్‌ను దాఖలుచేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, సాధారణంగా రాష్ట్రప్రభుత్వాలు సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్లను దాఖలు చేయవు. అలాంటి సంప్రదాయం లేదని సీనియర్‌ న్యాయవాదులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థలు, వాటి ఆస్తులు, బ్యాంకుఖాతాల్లోని నగదును రెండు రాషా్ట్రలూ జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవటం అనివార్యమయ్యింది. రాషా్ట్రలు చొరవ చూపని పక్షంలో కేంద్రం ఈ పని చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి సంస్థల విభజన ఇప్పుడు కేంద్రం బాధ్యత. న్యాయపరమైన అడ్డంకులు ఏమీ లేనందున కేంద్రం నియమించిన కమిటీ ఇక వేగంగా పని పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...