Jump to content

Vja International Airport


Kiran

Recommended Posts

Air India flight from JFK to BZA anta from next week.. one of US Telugu groups lo disco chesukuntunnaru :dream:

 

Enjoy US people

unlikely to be that soon. there is no customs/immigration at Vijayawada yet. staff allocation is not that easy. I have not seen any news regarding that in recent times.

Link to comment
Share on other sites

unlikely to be that soon. there is no customs/immigration at Vijayawada yet. staff allocation is not that easy. I have not seen any news regarding that in recent times.

Customs next week lo ne clearance istharu annaru...

 

Raju garu unnaru gaa... thanu chusukuntunnaru antha... ayithe well n good kada... :dream:

Link to comment
Share on other sites

Customs next week lo ne clearance istharu annaru...

 

Raju garu unnaru gaa... thanu chusukuntunnaru antha... ayithe well n good kada... :dream:

 

Customs alone is not enough. customs vunte, we can check-in the baggage. just convenient in changing to connecting flights, nothing more. Need to go to another air port that has immigration to fly out of the country.

Link to comment
Share on other sites

Eenadu Article today:

వెంకయ్యనాయుడు హర్షం

విజయవాడకు అంతర్జాతీయ విమానాశ్రయహోదా కల్పనపట్ల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తంచేశారు. దీనివల్ల రాజధాని ప్రాంతానికి ప్రపంచ నలుమూలల నుంచి అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కొత్త టెర్మినల్‌ ప్రారంభించారని, రన్‌వేను 2,386 మీటర్ల నుంచి 3,360 మీటర్లకు పెంచుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. 

మరో నాలుగు నెలల సమయం
విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు పెట్టడానికి నాలుగు నెలల సమయం పడుతుందని సమాచారం.

 

http://www.nandamurifans.com/forum/index.php?/topic/367458-ntr-amaravati-international-airport/page-21

Link to comment
Share on other sites

Air India flight from JFK to BZA anta from next week.. one of US Telugu groups lo disco chesukuntunnaru :dream:

 

Enjoy US people

Kaneesam customers ticket book chesukuni flight nindaalannaa 1 or 2 months ahead tickets release cheyyalemo kadaa!? :D

Link to comment
Share on other sites

అమరావతి నుంచి విదేశాలకు ఎయిర్‌ ఇండియా రెడీ !

636297400441644740.jpg

 

  • కోస్తా జిల్లాల నుంచి లక్షలాది సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు
  •  పర్యాటకం, వ్యాపారాల రీత్యా విదేశాలకు భారీగా రాకపోకలు
  • విదేశాల్లో వేలాది సంఖ్యలో రాజధాని ప్రాంతం విద్యార్థులు
  •  విదేశీయులు కూడా భారీగా రాకపోకలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ హోదాను అంది పుచ్చుకోవటంతో విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రపంచ దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపటానికి దేశీయ ప్రభుత్వ దిగ్గజ విమానయాన సంస్థ ’ ఎయిర్‌ ఇండియా ’ నుంచి స్పష్టమైన హామీ రాగా ఆసియా దేశాలకు నడిపేందుకు ఎయిర్‌ ఏషియా సంస్థ నుంచి సుముఖత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ అయిన ’ ఇండిగో ’ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారికంగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. కోస్తా జిల్లాల నుంచి లక్షలాది సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. కృష్ణాజిల్లాలో ఈ సంఖ్య అగ్రస్థానంలో ఉంది. ప్రతి వంద ఇళ్ళకు ఒక ఒక ఎన్‌ఆర్‌ఐ ఉన్నట్టు అంచనాలున్నాయి. విదేశీ విద్య, ప్రాజెక్టు వర్క్స్‌, ఉద్యోగాలు, ఉపాధి పొందటం, వ్యాపార లావాదేవీలు నిర్వహించటం , విదేశీ వస్తువుల కొనుగోళ్ళు తదితరాల రీత్యా లక్షలాది సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే ఆరు లక్షల మంది ఎన్‌ఆర్‌ఐలు ఉంటారన్నది ఛాంబర్‌ వర్గాల అంచనా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పర్యాటక స్థలాల సందర్శనల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రతి ఏడాది భారీ సంఖ్యలో విదేశాలకు వెళుతుంటారు. సింగపూర్‌, మలేషియా, థాయ్‌ల్యాండ్‌, హాంకాంగ్‌ , శ్రీలంక, యూఎస్‌ఏ, యూరప్‌ దేశాలు, దుబాయ్‌, కువైట్‌, ఆస్ర్టేలియా వెళ్ళేవారు ఎక్కువుగా ఉన్నారు. నమ్మలేని విషయం ఏమిటంటే.. జూదం ఆడటానికి విదేశాలకు వెళ్ళే సంపన్నులకు ఈ ప్రాంతంలో కొదువ లేదు. క్యాసినోవాలు మన దేశంలో నిషిద్ధం. జూదం, బెల్లీ డ్యాన్స్‌లు, బాడీ మసాజ్‌లతో కూడిన ’ క్యాసినోవా క్లబ్బుల కోసం .. ఆసియా దేశాలకు ట్రిప్పులు వేసే వారి సంఖ్య తక్కువ ఏమీ లేదు. ఆఫ్రికా ఖండ దేశాలకు వెళ్ళేవారి సంఖ్య ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎక్కువుగా ఉంటుందని నమ్ముతారా ? నమ్మాల్సిందే ! ఆఫ్రికా ఖండ దేశాలలో సహజ వనరులు అపారంగా ఉంటాయి. ఖనిజ వనరులు కూడా విపరీతంగా ఉంటాయి. రెండు జిల్లాల నుంచి ఎక్కువుగా ఖనిజ వనరుల వెలికితీత కోసం లీజులు పొందిన వారు కూడా ఉన్నారు.
 
             ఇవన్నీ పక్కన పెడితే .. విదేశాల నుంచి రాకపోకలు సాగించే విదేశీయుల సంఖ్య ఎక్కువుగా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. జపాన్‌, సింగపూర్‌, మలేషియా, నార్వే, న్యూజిలాండ్‌, ఇటలీ, అమెరికా, చైనా, రష్యా , ఆఫ్రికా తదితర దేశాల నుంచి వ్యాపార బృందాలు, పారిశ్రామిక బృందాలు తరలి వస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతం విదేశీయులను ఆకర్షిస్తోంది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించటం, విదేశాలలో విపరీతమైన క్యాంపెయిన్‌ నిర్వహిస్తుండటంతో ఇక్కడ వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అధ్యయనం చేయటానికి వచ్చే విదేశీ బృందాల సంఖ్య ఎక్కువుగా ఉంది. విదేశాల నుంచి ప్రధానంగా వెస్టిండీస్‌లోని కరేబియన్స్‌ కూడా వస్తున్నారు. విజయవాడ ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఉండటం, చెంతనే రాజధాని రావటం వల్ల ఉన్నత సంస్థలు ఏర్పాటు అవుతాయన్న ఉద్దేశ్యంతోనూ వచ్చే వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. విజయవాడలో విద్య నభ్యసించటానికి వెస్టిండీస్‌ తదితర దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. విదేశాల నుంచి వివిధ ప్రాజెక్టుల మీద , డాక్యుమెంటరీలను చిత్రీకరించటానికి కూడా విదేశీయులు రాజధాని ప్రాంతానికి వస్తున్నారు.
 
           విదేశీయులు ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా రాలేని పరిస్తితి. విదేశీయులు రావాలంటే హైదరాబాద్‌కు రావాల్సి వస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులు, కార్లలో ఇక్కడికి రావాల్సి వస్తోంది. విదేశీయులకు తగిన ఆతిథ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కే ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. విజయవాడలో ఫైవ్‌ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ హోటల్స్‌ ఓ అరడజను వరకు నిర్మాణ దశలో ఉన్నాయి. ఓ ఇరవై వరకు త్రీస్టార్‌, బడ్జెట్‌ హోటల్స్‌ ఏర్పాటు జరిగాయి. ఈ నేపథ్యంలో, విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ స్థాయి రావటం శుభపరిణామం. అంతర్జాతీయ స్థాయి హోదాతో ఎయిర్‌పోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాల్సి ఉంది.
అయితే వీటిని అంది పుచ్చుకోవటానికి ఓ ఏడాది సమయం పడుతుంది. రన్‌వే విస్తరణ జరుగుతోంది. ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కూడా పూర్తి కావాల్సి ఉంది. రూ 516 కోట్ల వ్యయంతో ఇంటి గ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ లోపు పాత టెర్మినల్‌ను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకు రావటానికి ఇప్పటికే టెం డర్లు కూడా పిలిచారు. కస్టమ్స్‌ , ఇమ్మిగ్రేషన్‌ శాఖల కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌ ఇండియా సంస్థకు ముందుకు రావటం , ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించటం శుభసూచికం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...