Jump to content

Recommended Posts

Posted
రాజధానిలో ఐటీ సందడి!

636355333811526990.jpg

అమరావతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో ఐటీ సంస్థల సందడి మరింత పెరగనుంది. ఈ నెల 21న మంగళగిరిలో పైకేర్‌ సంస్థను మంత్రి లోకేశ్‌ ప్రారంభిస్తారు. ఇక్కడే ఏర్పాటయిన పైడేటా సెంటర్‌ను ఈనెల 28 ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఇందులోనూ 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, ఈనెల 31న విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన, మరో 10 ఐటీ కంపెనీలను పాల్గొనే అవకాశం ఉంది.

Posted
రాజధానిలో ‘పై డాటా’..సై
 
 
636362220753975615.jpg
  • తొలిదశ ప్రాజెక్టుకు నేడే శ్రీకారం
  • మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • రాజధానిలో తొలి ఐటీ ప్రాజెక్టు
మంగళగిరి: స్థానిక ఐటీ పార్కులో ప్రతిష్టాత్మకమైన ఐటీ ప్రాజెక్టు... పై డాటా సెంటర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ కంపెనీ పై డాటా సెంటర్‌ దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాజధాని అమరావతి ప్రాంతంలో రూపుదిద్దుకున్న తొలి అంతర్జాతీయ ఐటీ ప్రాజెక్టు కూడ ఇదే కావడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో నాల్గవ టైర్‌ డాటా సెంటర్‌గా గుర్తింపు పొందనున్న తొలి ఐటీ ప్రాజెక్టు కూడ ఇదే కానుంది. ఈ డాటా సెంటర్‌ ఏర్పాటు వలన మూడొందల మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి కలుగనుండగా స్థానికంగా మరో రెండేవేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ప్రస్త్తుతానికి తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేసి శుక్రవారం రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. లోకేష్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ పాల్గొంటారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
 
 
మంగళగిరిలో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి చెందిన ఇక్కడి ఐటీ పార్కులో ప్లాటు నెం.12 కింద పదెకరాలను 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ 2015 మేలో జీఓ నెం.11 పేరుతో ఉత్తర్వులను ఇచ్చింది. ప్రభుత్వం కూడ ఎన్నో షరతులను విధిస్తూ లీజు కేటాయింపులను చేసింది. 33 ఏళ్లకుగాను లీజుకింద రూ.పదికోట్లను చెల్లించాలని కోరగా పై డాటా యాజమాన్యం ఆ చెల్లింపులను చేసింది. సదరు భూమిని ఏపీఐఐసీ నుంచి పై డాటా కంపెనీ స్వాధీనం చేసుకున్న ఆరు మాసాల్లోగా నిర్మాణ పనులను ఆరంభించి తదుపరి 15 మాసాల్లోగా ప్రాజెక్టు తొలిదశను పూర్తిచే యాలని ఆతదుపరి మూడు మాసాల్లోగా ప్రాజెక్టులో అనుకున్న విధంగా పనులు ప్రారంభించి తీరాలని ప్రభుత్వం షరతులు విధించింది. ప్రాజెక్టు పనితీరు పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందినట్టయితేనే తదుపరి 33 ఏళ్లకు లీజు కొనసాగుతుందని కూడ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాజెక్టులో విధిగా 300 మందికి తగ్గకుండా ఐటీ నిపుణులకు ఉపాఽధిని కల్పించాలని కూడ ప్రభుత్వం స్పష్టం చేసింది. పై డాటా సెంటర్‌ యాజమాన్యం కూడ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలను చేపట్టింది. భూమిని స్వాధీనం చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఇక్కడ భవన నిర్మాణ పనులను చేపట్టింది. చాలా శరవేగంగా తొలిదశ భవన సముదాయాన్ని పూర్తి చేసింది. మొత్తం ఐదు లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న పై డేటా సెంటర్‌ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.600 కోట్లను ఖర్చు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. తొలి దశ కింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఐదు వేల సర్వర్‌ ర్యాక్‌లను ఏర్పాటుచేశారు. ఒక్కో ర్యాక్‌లో 47 సర్వర్‌లకు స్థానం కల్పించినట్టు చెబుతున్నారు. ఈ ఐటీ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడ మంచి సహకారాన్ని అందించింది. ప్రాజెక్టు నిర్వాహణకు అవసరమయ్చే అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా విద్యుత్‌, నీటి సరఫరా విషయంలో రాజీలేని విధంగా ఏర్పాట్లను చేసింది.
 
గుంటూరు ఛానల్‌ నుంచి ప్రత్యేక పైపులైనుతో కృష్ణా జలాలను అందించడంతో పాటు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు కూడ ప్రభుత్వం ఏర్పాట్లను గావించింది. తాగునీటి ప్రాజెక్టు కోసం రూ.ఆరు కోట్ల వ్యయంతో ప్రజారోగ్యశాఖ ఆఽధ్వర్యంలో పనులను చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత అవసరాలకు 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేసి దానికి తాడేపల్లిలోని నులకపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ ప్రత్యేక విద్యుత్‌ లైనును ఏర్పాటుచేశారు. ఇందుకోసం రమారమి రూ.ఏడు కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018 నాటికి ప్రాజెక్టులో ర్యాక్‌ల సంఖ్యను 15వేల వరకు పెంపు చేసే అవకాశం వుంది. ఆ సందర్భంలో సబ్‌స్టేషన్‌ సామర్ధ్యాన్ని 60 మెగావాట్స్‌కు పెంచాల్సివుంటుంది. మొత్తంమీద 2018 నాటికి భారతదేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌గా పై డేటా అవతరించబోతుంది. క్లౌడ్‌ కంఫ్యూటింగ్‌ సర్వీస్‌లో అత్యంత ఎక్కువ సామర్ధ్యం కల సర్వర్‌లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పై డేటా తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటుంది.
 
Posted

మంగళగిరి మరో సైబరాబాద్‌ అవుతుంది

21brk103a.jpg

అమరావతి: వచ్చే రెండేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో రెండు లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రాష్ట్రానికి మరిన్ని ఐటీ పరిశ్రమలను రప్పించేందుకు నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విధానాలు తీసుకొచ్చామని చెప్పారు. మంగళగిరిలో పైకేర్‌ సర్వీసెస్‌ ఐటీ సంస్థను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖతో సమానంగా అమరావతిని ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా చేస్తామని చెప్పారు. సైబరాబాద్‌కు శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ఐటీ పరిశ్రమలు వస్తాయా? అని అందరూ ఎద్దేవా చేశారని.. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో ప్రపంచం చూస్తోందన్నారు. మంగళగిరి కూడా భవిష్యత్‌లో అదేవిధంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. మంగళగిరిలో ఐటీ పార్కుకు ఇప్పటివరకు రూ.220కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 2019లోపు మంగళగిరి ఐటీ క్లస్టర్‌లో 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అమరావతిలో 200 ఎకరాల్లో ఐటీ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నామని.. డిసెంబర్‌లోపు హెచ్‌సీఎల్‌ సంస్థ తన కార్యకలాపాలు అక్కడి నుంచి ప్రారంభిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేథస్సు పరిశోధనలకు కేంద్రంగా మలుస్తామని మంత్రి తెలిపారు.

Posted

సీఎంపై నమ్మకంతోనే ఐటీ సంస్థల రాక

ఇది కేవలం ట్రైలరే..ముందుంది సినిమా

మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్య

మంగళగిరిలో పైకేర్‌ ఐటీ కంపెనీ ప్రారంభం

21ap-state1a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటివరకు ట్రైలర్‌ మాత్రమే చూశారని, త్వరలోనే సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో ‘పైకేర్‌’ హెల్త్‌కేర్‌ సొల్యూషన్‌ ఐటీ సంస్థను శుక్రవారం మంత్రి లోకేశ్‌ ప్రారంభించారు. 80వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీ ఏర్పాటయింది. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ ఎలాంటి సదుపాయాలు లేని చోట ఇక్కడ ఐటీ కార్యాలయం ఏర్పాటుచేయడం మామూలు విషయం కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే ఇక్కడికి ఐటీ సంస్థలు విరివిగా వస్తున్నాయని తెలిపారు. మంగళగిరిలో 120 ఎకరాలలో ఐటీ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, దీనివల్ల పది వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. పైకేర్‌ సంస్థ తొలిదశలో ఇక్కడ 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని, తరువాత దశలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనుందని తెలిపారు. పైకేర్‌ సంస్థ ఉపాధ్యక్షురాలు సుధా పెంట్యాల, ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య, ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డాక్టర్‌ రవి వేమూరి, సీఈఓ కోగంటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

‘సెల్‌కాన్‌’ సెల్‌ఫోనును విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

చిత్తూరు జిల్లాలో గత నెలలో ప్రారంభమైన ‘సెల్‌కాన్‌’ పరిశ్రమ నుంచి సెల్‌ఫోన్ల తయారీ ప్రారంభం కావడం రాష్ట్ర అభివృద్ధికి శుభ సంకేతమని మంత్రి లోకేశ్‌ అభివర్ణించారు. సచివాలయంలో ‘సెల్‌కాన్‌ క్లిక్‌ స్మార్ట్‌ఫోన్‌’ను మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ త్వరలో సెల్‌ఫోన్ల తయారీకి సంబంధించిన అన్ని రకాల ముడి పరికరాలను ఇక్కడే తయారుచేయనున్నారని వివరించారు. ‘కార్బన్‌’ సంస్థ కూడా రాష్ట్రంలో యూనిట్‌ను స్థాపించేందుకు సంప్రదిస్తోందని, చైనాకు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ కూడా ఇక్కడినుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని వివరించారు. సెల్‌కాన్‌ సంస్థ అధినేత వై.గురు పాల్గొన్నారు.

చట్టం తనపని తాను చేస్తుంది

రాష్ట్రంలో డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి లోకేష్‌ మంగళగిరి వద్ద విలేకరులతో అన్నారు. ‘నేను తప్పు చేసినా ముఖ్యమంత్రి వదలరు, నన్ను జైల్లో పెడతారు’ అని పేర్కొన్నారు. అన్ని కేసులు ఒకేసారి విచారించాలని జగన్‌ వేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంపై వ్యాఖ్యానిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని, వారు జైలుకు వెళ్లక తప్పదని వివరించారు.

* ఈ ఏడాది ఉపాధి హామీ నిధుల ఏకీకరణ ద్వారా రూ.9వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు. పథకం తీరుతెన్నులపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు.

* విద్యాలయాల్లో ర్యాగింగ్‌ నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలని లోకేశ్‌ అన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రూపొందించిన ర్యాగింగ్‌ నిరోధక గోడపత్రికలను సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు.

Posted
రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు


636363302143249344.jpg


సెల్‌కాన్‌ ‘మేకిన్‌ ఆంధ్రా’ బాట

త్వరలో కార్బన్‌ రాక: లోకేశ్‌

క్లిక్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఆవిష్కరణ

 

ఎలక్ట్రా‌నిక్స్‌ పరికరాల తయారీ రంగంలో 2019 నాటికి లక్ష ఉద్యోగాలు కల్పించి తీరతామని ఐటీ మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ‘మేకిన్‌ ఆంధ్ర’లో భాగంగా సెల్‌కాన్‌ కంపెనీ రేణిగుంట ప్లాంటులో రూపొందించిన ‘క్లిక్‌’ స్మార్ట్‌ ఫోన్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. దేశంలో రోజూ పది కొత్త మొబైల్స్‌ తయారవుతుంటే అందులో మూడు ఆంధ్రాలోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.

 

 

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థలు మూతపడుతున్నాయి. కానీ, రాష్ర్టానికి ఐటీ సంస్థల పెట్టుబడులు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న విశ్వాసం... నమ్మకమే. అది చాలు!’ అని పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. శుక్రవారం మంగళగిరిలో ‘పైకేర్‌ సెంటర్‌’ను లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... ‘‘1995లో సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను ఏర్పాటు చేసినప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా. అప్పుడు అక్కడ రాళ్లూరప్పలు ఉన్నాయి. సింగిల్‌ రోడ్డు ఉండేది. ఆ రోజుల్లో అందరూ ‘ఐటీ కంపెనీలు వస్తాయా?!’ అని విమర్శలు చేశారు.

 

నవ్వారు. ఇప్పుడు సైబరాబాద్‌లో ఆరు లేన్ల రహదారులు వచ్చాయి’’ అని లోకేశ్‌ అన్నారు. మంగళగిరి ఐటీ పార్కు కూడా అలాగే అభివృద్ధి చెందుతుందని, 22 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మంగళగిరి ఐటీపార్కులో ఇప్పటి వరకూ 220 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. ‘సీఎం చంద్రబాబు మీద ఉన్న నమ్మకం వల్లే ఇక్కడికి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీలన్నింటిలోనూ 30ు తెలుగువాళ్లే ఉన్నారు. వారంతా ఆంధ్రలో ఐటీ సంస్థలను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు. అందువల్లే పలు సంస్థలు ఆంధ్రాకు వస్తున్నాయి’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

 

 

పైకేర్‌ సెంటర్‌లో ప్రాథమిక స్థాయిలో ప్రారంభోత్సవ రోజునే 500 మందికి ఉపాధి కల్పించడంపై లోకేశ్‌ సంతోషం వ్యక్తం చేశారు. 2019లోపు 22 ఎకరాల మంగళగిరి ఐటీ క్లస్టర్‌లో 10వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన అన్నారు. అమరావతిలో 200 ఎకరాల్లో ఐటీ క్లస్టర్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. డిసెంబరులో హెచ్‌సీఎల్‌ ప్రారంభిస్తామని లోకేశ్‌ ప్రకటించారు. రాష్ట్రంలో త్వరలోనే డ్రోన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, స్మార్ట్‌సిటీ సెంటర్‌ను ప్రారంభిస్తామని అన్నారు. ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌ మొబైల్‌ తయారీ కంపెనీలు ప్రారంభం అయ్యాయని, త్వరలో కార్బన్‌ మొబైల్‌ కంపెనీని ప్రారంభిస్తామని చెప్పారు.

 

దేశంలో తయారవుతున్న ప్రతి 10 సెల్‌ ఫోన్‌ కంపెనీలలో రెండు ఏపీలోనే పెట్టుబడులు పెడుతున్నాయని లోకేశ్‌ అన్నారు. ఐటీ కంపెనీలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంతోపాటు మిగిలిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అవసరమైతే ఐటీ శాఖ తరఫున బస్సులు వేస్తామని లోకేశ్‌ అన్నారు. రాబోయే రోజుల్లో లక్ష ఐటీ ఉద్యోగాలు, మరో లక్ష ఉద్యోగాలు తయారీ రంగంలో కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. తాను తక్కువ మాట్లాడతానని, ఎక్కువ పని చేస్తానని లోకేశ్‌ అన్నారు. రాష్ర్టాభివృద్ధిలో ఇప్పటి వరకూ టైలర్‌ మాత్రమే చూశారని, ఇకముందు సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మొదట బలపరిచింది తెలుగుదేశం పార్టీయేనని మంత్రి లోకేశ్‌ అన్నారు. అందువల్ల రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అయితే రాష్ట్రానికి కేంద్రం సాయం చేయటంలేదన్న వాదన సరికాదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

 

అసాంఘిక కార్యక్రమాలు జరగవ్‌

రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ డ్రగ్స్‌ వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగవని లోకేశ్‌ అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను తప్పు చేసినా ముఖ్యమంత్రే స్వయంగా అప్పగిస్తారన్నారు. రాష్ట్రంలో రిమోట్‌, ఫిజికల్‌ పోలిసింగ్‌ వ్యవస్థ సమర్ధవంతంగా అమలు జరుగుతుందన్నారు. ఇప్పటికే నాలుగు వేల సీసీ కెమెరాల ద్వారా నిఘా విభాగాన్ని పటిష్టవంతం చేశామని, రాబోయే ఏడాదిన్నర కాలంలో మరో వెయ్యి సీసీ కెమెరాలను నెలకొల్పుతామని మంత్రి నారా లోకేశ్‌ తెలియజేశారు.

 

బెల్టు షాపుల నిర్మూలనకు సీఎం కంకణం కట్టుకున్నారని, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా సమూలంగా నిర్మూలిస్తామన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిందని, ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి దశలవారీగా పరిశ్రమ ఏపీకి తరలివస్తుందని చెప్పారు. ఐటీ సలహాదారు జేఏ చౌదరి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

జలసిరి బోర్లను వినియోగంలోకి తేవాలి

ఉపాధి హామీ పథకం కింద గత మూడేళ్లలో రూ.15వేల కోట్లు ఖర్చు చేసి పలు పనులు చేశామని, దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని లోకేశ్‌ అన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్‌ జలసరి రెండో దశ పథకం కింద వేసిన 17వేల బోర్లను మూడు నెలల్లో వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయం వచ్చేలా చూడడం అత్యంత ముఖ్యమన్నారు.


Posted

Hopefully next 2 years lo 1L new IT jobs will be created in AP districts. 2-3 big MNCs vasthe possible.

Posted

Hopefully next 2 years lo 1L new IT jobs will be created in AP districts. 2-3 big MNCs vasthe possible.

CBN need to take care of IT too..should not leave it to lokesh completely...only he can woo big players

  • 2 months later...
Posted
అమరావతిలో వీఎం వేర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

ఈనాడు, అమరావతి: అమరావతిలో 4 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కంపెనీ ఏర్పాటుకు వీఎం వేర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ముందుకొచ్చింది. సచివాలయంలో సమాచార, సాంకేతిక మంత్రి లోకేష్‌ను బుధవారం కంపెనీ ప్రతినిధులు కలిశారు. 22 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించి అమరావతిలో కంపెనీ ఏర్పాటుకు అంగీకరించారు.

  • 1 month later...
Posted
14 hours ago, sonykongara said:

Kesarapalli IT park ki repu bhumi Pooja anta L&T vadu kadutunnadu anta  edi hcl vadi da leda vereda evari ki ayina telisthe news post cheyyandi

This is expansion of Medha towers. L&T building  second tower/building. This is 2nd tower/building out of proposed 4 buildings. 

HCL di .25 kilometers towards Gannavaram ooru from this Medha towers. HCL and Medha are at two different locations. 

Posted
నేడు ఐటీ పార్కు రెండో భవన శంకుస్థాపన 
amr-brk2a.jpg

కేసరపల్లి (గన్నవరం): గన్నవరం సమీపం కేసరపల్లిలో పరిశ్రమల సముదాయం ఐటీపార్కుకు మంచిరోజులు వచ్చాయి. మేథా టవర్స్‌లో ఇటీవల సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్‌ పలు కంపెనీలను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 12 సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వెయ్యి మంది ఉపాధి పొందుతున్నారు. మరిన్ని కంపెనీలు తీసుకువచ్చేందుకు మంత్రి కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో 23వ తేదీ గురువారం ఆ ప్రాంగణంలో రెండో టవర్‌ నిర్మాణానికి మంత్రి లోకేష్‌ నాయకత్వంలో శంకుస్థాపన (భూమిపూజ) చేయానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎసిట్‌, ఈపీ సాఫ్ట్‌, చందూ సాఫ్ట్‌, జాస్తి, యలమంచి, హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌, ఐఈఎస్‌, కాడ్‌ అప్లై తదితర సంస్థలు ఇక్కడికి రానున్నాయి.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...