Jump to content

HCL Technologie Expansion in VIjayawada


Recommended Posts

భారీ విస్తరణ దిశగా హెచ్‌సీఎల్‌
50 ఎకరాల కేటాయింపుపై వచ్చే మంత్రివర్గ భేటీలో నిర్ణయం
వచ్చే నెల రాష్ట్రానికి మరో 25 ఐటీ సంస్థలు రాక
ఐటీ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే అడుగుపెట్టిన దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థకు ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించనుంది. అందులో అమరావతిలో పది ఎకరాలు ఇవ్వనుంది. విజయవాడ గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్న మేథా టవర్స్‌ వద్ద ఆ సంస్థకు ఇప్పటికే ప్రభుత్వం 17 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అక్కడే మిగిలిన స్థలాన్ని కూడా ఇస్తారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఆ సంస్థ ఇక్కడ ‘హై ఎండ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ డెవలప్‌మెంట్‌’ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా పెద్దఎత్తున పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనుందని, మొత్తం ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని, అలాంటి సంస్థకు ఆలస్యం లేకుండా సహకారం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా హెచ్‌సీఎల్‌ తమ కార్యకలాపాలను విస్తరించడానికి వీలుగా స్థలం అడుగుతున్న విషయాన్ని ఐటీ మంత్రి నారా లోకేష్‌ ఆయన దృష్టికి తీసుకురాగా వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్రానికి మరో 25 ఐటీ సంస్థలు రానున్నాయని అధికారులు ఆయనకు తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా ఏర్పాటవుతున్న ఈ సంస్థల ద్వారా 2,281 మందికి ఉద్యోగాలు రానున్నాయని, ఈ ఏడాది గత ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 89 ఐటీ కంపెనీలు వచ్చి రూ.5590 కోట్ల పెట్టుబడులు పెట్టాయని వివరించారు. సీఎం జరిపిన అమెరికా పర్యటన ద్వారా రాష్ట్రానికి ఇన్నోవా, గ్లోబల్‌ ఫౌండరీస్‌, జనిపెర్‌, న్యూటానిక్స్‌, జోహో, సిస్కో, ఆల్ఫాబెట్‌, ఫెక్స్‌ట్రానిక్స్‌ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఫిన్‌టెక్‌ వ్యాలీని ప్రమోట్‌ చేయడానికి ఏటా విశాఖలో కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇందుకోసం సీఎం నేతృత్వంలో ఫిన్‌టెక్‌ రెగ్యులేటరీ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ-ప్రగతి, ఈ-ఆఫీస్‌, మీసేవ, కోర్‌ డ్యాష్‌ బోర్డు వరకు మొత్తం 32 శాఖలు 314 రకాల సేవలు అందిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5603 మీ సేవా కేంద్రాలున్నాయని వారు వివరించగా వాటి సంఖ్య పెంచాలని సీఎం సూచించారు.

భూధార్‌ పేరుతో గుర్తింపు: పెరుగుతున్న భూముల విలువ, భూ వివాదాల నేపథ్యంలో శాశ్వత పరిష్కారానికి ల్యాండ్‌ హబ్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతి స్థలానికి, పొలానికి భూధార్‌ పేరుతో యూనిట్‌ గుర్తింపును ప్రభుత్వం కల్పించనుంది. భూధార్‌ కార్డుకు 11 అంకెల గుర్తింపు నంబరు కేటాయించనున్నారు. దీని ఆధారంగా ల్యాండ్‌ హబ్‌ కోర్‌ డాటా సిద్ధం చేసి మొత్తం ఆరు శాఖలకు సంబంధించి 20 సేవలను ప్రజలకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సాంకేతిక ఇబ్బందులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.

Link to comment
Share on other sites

vulava charu bro,, ippudu icchina land pakka inka govt land undha

Medha phase 2,3 and 4 kattadaniki govt. land allocate chesi vundi. Pakkane Govt. driving training center vundi. Adi Nunna area ki maarchi aa land HCL ki istunnaru. 17 acres govt. lande. Extra 50 acres acquire cheyyalemo.
Link to comment
Share on other sites

Sony brother, Medha 1,2,3 and 4 ki allocate chesindi total 35 acres. Right now only Medha phase 1 lo buildings vunnai in 7 acres. Inka 28 acres khaligane vundi. Akkade central govt. customs department ki koncham land ichharu.

RTA office teesi aa land 17 acres HCL ki istunnaru. Additional 50 acres ikkade istaro leka Veerapanenigudem/Mallavalli daggara istaro choodali.

Link to comment
Share on other sites

Sony brother, Medha 1,2,3 and 4 ki allocate chesindi total 35 acres. Right now only Medha phase 1 lo buildings vunnai in 7 acres. Inka 28 acres khaligane vundi. Akkade central govt. customs department ki koncham land ichharu.

RTA office teesi aa land 17 acres HCL ki istunnaru. Additional 50 acres ikkade istaro leka Veerapanenigudem/Mallavalli daggara istaro choodali.

:shakehands:

Link to comment
Share on other sites

expansion in 50 acres. Doesn't mean 50 more acres right?

They need total 50 acres. 17 given, another 10 will be in Amaravati, remaining 23 will be near medha towers (according to Eenadu article, post #1)

1 billion dollars antunaru entha nijamo theliyadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...