swas Posted November 7, 2016 Posted November 7, 2016 Every disrict head quarters lo festivals pettandi like vijayawada festival ani stalls petti local products ni encourage cheyandi. Guntur festival Vizag festival ,,,,, deni valla chala use and local products ni easy ga market cheyochu with low cost ChiefMinister 1
Guest Urban Legend Posted November 7, 2016 Posted November 7, 2016 Vijayawada adventure club rappelling events conduct chestundhi moghalrajpuram konda paina, under shekar babu(Everest climber) guidance and other programs alsoMore info herehttps://www.facebook.com/vjatrekkers/
sonykongara Posted November 14, 2016 Author Posted November 14, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/383487-vijayawada-adventure-club/
sonykongara Posted November 14, 2016 Author Posted November 14, 2016 మూలపాడులో ‘హరిత పర్యాటకం’ ట్రెక్కింగ్, ప్యారాచూట్ సౌకర్యాలు అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు ఎంపీ గోకరాజు గంగరాజుకి బాధ్యత అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు ఏ చిన్న అవకాశం లభించినా ప్రభుత్వం వదులుకోవడం లేదు. రాషా్ట్రనికి పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా అడుగులు వేస్తోంది. తొలుత రాజధాని అమరావతిలో పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో ఆంధ్రా క్రికేట్ అసోసియేషన నూతనంగా నిర్మించిన రెండు అంతర్జాతీయ మైదానాలను నాలుగు రోజుల క్రితం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సమయంలో స్టేడియం చుట్టూ ఉన్న పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతారవణాన్ని చూసిన ముఖ్యమంత్రికి ఆ ప్రాంతంలో ‘హరిత పర్యాటకం’ అభివృద్ధి చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో వెంటనే ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా అని కృష్ణాజిల్లా కలెక్టర్‌ను అడిగారు. ఆయన వెంటనే మూలపాడు సమీపంలో 900 ఎకరాల ప్రభుత్వం భూమి ఉందని బదులిచ్చారు. ప్రస్తుతం కొంత భూమిలో ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలు పెంచుతున్నారని వివరించారు. దీంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక హాబ్‌గా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతంలో కొండలు, వాగులు ఉండడంతో ట్రెక్కింగ్, ప్యారాచూట్ వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో పర్యాటకులు నాలుగైదు రోజులు ఉండేందుకు అనువైన భవనాలు కూడా నిర్మించాలని ఆదేశించారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాజధాని నుంచి మూలపాడుకు కేవలం 15 నిముషాల్లో చేరుకోవచ్చు. సీఎం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. మూలపాడు రాష్ట్రంలో అతి పెద్ద హరిత పర్యాటక కేంద్రంగా మారే అవకాశముంది. బాధ్యత ఎంపీ గోకరాజుది! ఏసీఏ నూతనంగా నిర్మించిన అంతర్జాతీయి క్రికెట్ స్టేడియంలో పర్యాటకులు ఉండేందుకు ఐదు గదులను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ విషయాన్ని ఎంపీ గోకరాజు గంగరాజు సీఎం చంద్రబాబుకు వివరించారు. మూలపాడులో పర్యాటకాభివృద్ధి చేయాలని సీఎం ముందుగానే నిర్ణయించుకోవడంతో ఆ బాధ్యతను ఎంపీకే అప్పగించారు. ఎంపీతో కలిసి పని చేసేందుకు ఒక కన్సలెంట్‌ను కూడా అప్పగిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఏడాదికి నాలుగైదు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచలు నిర్వహిస్తే మూలపాడుకు క్యూ కట్టే పర్యాటకుల సంఖ్య ఎక్కువే. క్రికెట్ స్టేడియంతో పాటు కొండలు, వాగులు, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కలిసోచ్చే అంశం.
sonykongara Posted November 30, 2016 Author Posted November 30, 2016 గగన విహారం..! హాట్ ఎయిర్ బెలూన్స్‌లో ప్రయాణం అమరావతికి క్రిస్మస్ నాటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముందుకొచ్చిన యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా భవానీపురం: ఆంగ్ల సినిమాలు చూసే వారికి ‘హాట్ ఎయిర్ బెలూన్స్’ గురించి బాగా తెలుసుంది. భారీ బెలూన్ ఆకాశంలో ఎగురుతూ బెలూన్ దిగువన చిన్న బుట్టలో హీరో, హీరోయిన్లు ఆకాశ విహారం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికీ ఒక్కసారైనా అలా బెలూన్‌లో కూర్చుని గాలిలో విహారం చేయాలని ఉంటుంది. అలాంటి వారి కోరిక కొన్ని రోజుల్లో తీరబోతుంది. హాట్ ఎయిర్ బెలూన్స్‌ను అమరావతి నగర వాసులకు పరిచయం చేసేందుకు యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా (వైహెచ్‌ఏఐ) సిద్ధమవుతోంది. ఈ ఏడాది క్రిస్మస్ పర్వదినం నాటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమిటీ హాట్ ఎయిర్ బెలూన్స్.. విమానం కంటే ముందుగా మనుషులు గాలిలో ఎగిరేందుకు ఈ హాట్ ఎయిర్ బెలూన్‌ను ఉపయోగించారని, 1783లో తొలిసారిగా దీనిని వినియోగించారని తెలుస్తోంది. భారీ బెలూన్‌లో వేడిగాలిని నింపుతారు. దిగువన ఏర్పాటు చేసే కంట్రోలింగ్ రోప్ సిస్టం ద్వారా హాట్ ఎయిర్ బెలూన్ ఆకాశంలో ఎగురుతుంది. మంటతో భారీ బెలూన్‌లోని గాలిని వేడి చేయటం ద్వారా బెలూన్ విచ్చుకొని ప్రయాణం చేయవచ్చు. వేడి గాలి బరువు అంతే స్థాయి ఉన్న చల్లని గాలి కంటే తక్కువగా ఉంటుంది. వేడి, చల్లని గాలి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు, సాంద్రతలో కూడా భారీ తేడా ఉంటుంది. ఈ వ్యత్యాసం వల్లనే వేడిగాలి ఉన్న బెలూన్ బలంగా పైకి లేస్తుంది. బయట వాతావరణం చల్లగా ఉండి, బెలూన్ లోపల గాలి వేడిగా ఉన్నప్పుడు ఈ బెలూన్లు ఎక్కువ బరువును మోసుకెళ్లగలవు. పర్యాటక కేంద్రాల్లో... భారీ బెలూన్‌లను పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. విదేశాల్లో అనేక పర్యాటక ప్రాంతాల వద్ద ఈ బెలూన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వాటిలో ప్రయాణం సందర్శకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఏపీలో మొదటి సారిగా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్‌ను అమరావతికి తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మన దేశంలో ఈ బెలూన్‌ల వినియోగంగా తక్కువగా ఉన్నప్పటికీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలోని పర్యాటక ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అమరావతిలోని ఔత్సాహిక సాహసీకులు వాటి కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. వాతావరణం బాగుంటే.. బెలూన్లు ఆకాశంలో ఎగరాలంటే వాతావరణం అనుకూలంగా ఉండాలి. గాలిలో విహారం ఉదయం, సాయంత్రం వేళల్లోనే సాధ్యపడుతుంది. సూర్యోదయం జరిగిన మూడు గంటల వరకు, సూర్యాస్తమయానికి మూడు గంటల ముందు దీనికి అనువైన సమయం. ఎండ తీవ్రంగా ఉంటే కుదరదు. బయట వేడి, బెలూన్‌లో వేడి సమానమైనప్పుడు ఆకాశ విహారం సాధ్యపడదు. ఎన్నో జాగ్రత్తలు... ఈ బెలూన్‌ను గాలిలో ఎగురవేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విశాలమైన ప్రాంగణం అవసరం. బెలూన్‌ను ఎగరవేయడానికి, దించడానికి అనుకూలమైన వాతావరణం, ప్రదేశం ఉండాలి. విమానానికి మాదిరిగా దీనికి పైలట్ కూడా ఉంటాడు. వాతావరణం, గాలి వేగం, వెలుతురు, పొగమంచు వంటి వాటిని పరిగణలోకి తీసుకుని బెలూన్‌ను గాలిలో ఎగరవేయవచ్చా? లేదా..? అనేది పైలట్ నిర్ణయిస్తాడు. బెలూన్ ఎగిరే ప్రాంతంలో విద్యుత్తు లైన్లు, స్తంభాలు, చెట్లు, భవనాలు ఉండకూడదు. మనుషులకు ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. బుట్టలో కూర్చొని.. ఈ బెలూన్‌కు దిగువన ఒక బుట్ట ఉంటుంది. దానిని బెలూన్‌కు దిగువన పటిష్టంగా కడతారు. బుట్టలో ఉండే సిలిండర్ ద్వారా బెలూన్‌లోని గాలిని వేడి చేస్తారు. బుట్టలో పైలట్‌తో సహా ఆరు నుంచి ఎనిమిది మంది వరకు ప్రయాణం చేయవచ్చు. దాదాపు 300 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేసే అవకాశం ఉంది. మన దేశానికి చెందిన విజయపథ్ సింఘానియా ఈ బెలూన్‌లో అత్యధిక ఎత్తులో ప్రయాణించి రికార్డు సృష్టించారు. ముంబై నుంచి పంచగాని వరకు 240 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. వీటిలో ప్రయాణంతో పాటు పండుగలను కూడా నిర్వహిస్తారు. బెలూన్ ఫెస్టివల్‌ను ఈ ఏడాది మన దేశంలోని లక్నోలో నిర్వహించారు. ఆ రాష్ట్ర పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హాట్ ఎయిర్ బెలూన్ పండుగ ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఉత్సవం నిర్వహించారు. ఖరీదు ఎక్కువే... బెలూన్‌లో ప్రయాణం కొంచెం ఖరీదైన వ్యవహారమనే చెప్పాలి. వీటిలో ప్రయాణం చేసేందుకు ఒక్కో వ్యక్తికి సుమారు రూ.9 నుంచి రూ.12 వేలు వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అమరావతి ప్రజల కోసం ఆ మొత్తంలో పది శాతం చెల్లిస్తే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించే విషయాన్ని ఆలోచిస్తున్నామని వైహెచ్‌ఏఐ ప్రతినిధులు చెబుతున్నారు. క్రిస్మస్ నాటికి అందుబాటులో - ఎన్.విష్ణువర్థన్, కార్యదర్శి, వైహెచ్‌ఏఐ మా సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనేక సాహస క్రీడలను నిర్వహిస్తున్నాం. అమరావతి ప్రజలకు హాట్ ఎయిర్ బెలూన్‌ను క్రిస్మస్ నాటికి అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ హాట్ ఎయిర్ బెలూన్, ప్రయాణానికి సంబంధించిన వివరాలను కొన్ని రోజుల్లోనే ప్రకటిస్తాం. ఉత్సుకత ఉన్నవారు, సాహసీకులు ఎవరైనా ప్రయాణం చేయవచ్చు.
sonykongara Posted December 2, 2016 Author Posted December 2, 2016 రేపటి నుంచి విజయవాడలో రెండు రోజుల పాటు పారా స్లైడింగ్ విజయవాడ యువకులు గాల్లో తేలిపోయే రోజులు వచ్చాయి. మొన్నటిదాకా భవాని ఐలాండ్ లో , కృష్ణా నది పై పారా సెయిలింగ్ చూసాం. ఇప్పుడు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (విజయవాడ యూనిట్), రోడ్డు పై కూడా ఆకశ విహారం చేసే అవకాశం ఇవ్వనుంది. ఆఫ్ రోడ్డు పారా స్లైడింగ్ తో డిసెంబర్ 3, 4 వ తేదీల్లో అమరావతిలో కొత్త అనుభూతిని పొందవచ్చు. ప్రస్తుతం గోవా లాంటి ప్రాంతాల్లోనే ఉన్న ఈ ఆఫ్ రోడ్డు పారా స్లైడింగ్, మన ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా చూడనున్నాము. ఈ పారా స్లైడింగ్ లో జీపుకి, బెలూన్ ను కట్టి, లాక్కుని వెళ్తారు. ఈ బెలూన్ కు ఒక వ్యక్తికి పటిష్టంగా బెల్టుల సహాయంతో కడతారు. దాదాపుగా 100 అడుగుల ఎత్తు వరకు ఆకాశంలో విహారం చెయ్యవచ్చు. జీపు ముందుకి కదులుతున్నకొద్దీ, గాల్లో తేలిపోతూ థ్రిల్ ని ఎంజాయ్ చెయ్యవచ్చు. క్రిందటి నెలలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా, ట్రయిల్ రన్ కూడా నిర్వహించింది. విజయవాడలో రేపు, ఎల్లుండి (డిసెంబర్ 3,4 తేదిల్లో), పారా స్లైడింగ్ నిర్వహిస్తున్నారు. కృష్ణా తీరంలో, వారధి దిగువన ఉన్న, శివాలయం వద్ద ఈ పారా స్లైడింగ్ నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి, సాయంత్రం 4 గంటల వరకు ఇవి నిర్వహిస్తారు. ఒక్కొక్కరికి దాదాపు 15 నిమషాల సమయం పడుతుంది. దీనికోసం ఒక్కొక్కరికి Rs.600 ఛార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు, 9493362436 (రఘు), 9032899099 నెంబర్లని సంప్రదించవచ్చు. ఎయిర్ ఫోర్సు లో పని చేసిన అనుభువం ఉన్నవాళ్ళ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది.
uravis Posted December 2, 2016 Posted December 2, 2016 Hot air balloons not suitable for our climate . Para sailing is good.
sonykongara Posted December 4, 2016 Author Posted December 4, 2016 కృష్ణా తీరంలో మొదలైన పారా స్లైడింగ్ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (విజయవాడ యూనిట్) అధ్వర్యంలో, రెండు రోజుల పాటు జరగనున్న ఆఫ్ రోడ్డు పారా స్లైడింగ్, శనివారం ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్క రోజే దాదాపు 60 మంది పారా స్లైడింగ్ చేశారు. ఇవాళ (ఆదివారం) కూడా, పారా స్లైడింగ్చేసే అవకాసం ఉంటుంది. దాదాపుగా 100 అడుగుల ఎత్తు వరకు ఆకాశంలో విహరిస్తూ, గాల్లో తేలిపోతూ యువత ఎంజాయ్ చేసారు. జీపు ముందుకి కదులుతున్నకొద్దీ, గాల్లో తేలిపోతూ థ్రిల్ ని ఎంజాయ్ చేశారు. కృష్ణా తీరంలో, వారధి దిగువన ఉన్న, శివాలయం వద్ద ఈ పారా స్లైడింగ్ నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి, సాయంత్రం 4 గంటల వరకు ఇవి నిర్వహిస్తారు. ఒక్కొక్కరికి దాదాపు 15 నిమషాల సమయం పడుతుంది. దీనికోసం ఒక్కొక్కరికి Rs.600 ఛార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు, 9493362436 (రఘు), 9032899099 నెంబర్లని సంప్రదించవచ్చు. ఈ క్రింది వీడియో చూడండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో.
sonykongara Posted February 13, 2017 Author Posted February 13, 2017 కృష్ణా తీరాన సందడి చేసిన హాట్ ఎయిర్ బలూన్స్... Super User 13 February 2017 Hits: 118 గత మూడు రోజులుగా ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం వద్ద జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు , అదే విధంగా అమరావతి మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్ సంధ్రభంగా, కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బలూన్స్ , ప్యారాచూట్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. అమరావతిలో, కృష్ణా నది తీరాన, ప్రజలను పర్యాటకంగా ఆకట్టుకుంటానికి త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. విశాఖలో జరిగిన CII సమ్మిట్ లో, కొన్ని కంపెనీలతో ప్రభుత్వం ఇందుకు గాను, అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
Guest Urban Legend Posted July 20, 2017 Posted July 20, 2017 Vijayawada adventure club rappelling events conduct chestundhi moghalrajpuram konda paina, under shekar babu(Everest climber) guidance and other programs also More info here https://www.facebook.com/vjatrekkers/
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now