Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌కు 1289.10 ఎకరాలు స్థలం
ఈనాడు, అమరావతి: ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌కు 1289.10 ఎకరాలు స్థలాన్ని 50 ఏళ్లపాటు షరతులతో లీజుకు ఇస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీధర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగిడ గ్రామంలో స్థలాన్ని కేటాయించారు. మూడు సంవత్సరాల్లో సిమెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేయాల్సి 

Link to comment
Share on other sites

ఎపి విమానయాన రంగానికి ఎమిరేట్స్‌ గ్రూప్‌ తోడ్పాటు
09-02-2018 00:32:19

మౌలిక సదుపాయాల కల్పనపై ఎంఒయు
హైదరాబాద్‌ : రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధికి తోడ్పడేందుకు ఎమిరేట్స్‌ గ్రూప్‌ అంగీకరించింది. ఇందులో భాగంగా ఇందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తుంది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఒయు)పై ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ అండ్‌ గ్రూప్‌ చైర్మన్‌, సిఇఒ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తౌం, ఎపి ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఎపిఇడిబి) సిఇఒ కృష్ణ కిశోర్‌ సంతకాలు చేశారు. రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధికి అసరమైన నైపుణ్యాలు, పెట్టుబడుల విషయంలోనూ ఎమిరేట్స్‌ గ్రూప్‌ సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో వైమానిక, విమానయాన రంగాలను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం మరింత చేయూత ఇస్తుందని ఎపిఇడిబి సిఇఒ చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాలు, అందుకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి విషయంలోనూ ఎమిరేట్స్‌ గ్రూప్‌ సహకరిస్తుంది.
 

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో ఆటో క్లస్టర్‌
09-02-2018 00:30:43
ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామన్న కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు
న్యూఢిల్లీ : దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఆటోమొబైల్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. వీటి ద్వారా ఆటోమొబైల్‌ పరిశ్రమ వృద్ధికి, ఎగుమతుల్లో పురోగతికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆటో క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రణాళికా విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని సురేష్‌ ప్రభు తెలిపారు. విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ఆటో క్లస్టర్‌ విషయమై మాట్లాడనున్నట్టు మంత్రి చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఆటో క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు. గురువారంనాడిక్కడ ఆటో కాంపోనెంట్స్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన సందర్భంగా సురేష్‌ ప్రభు మాట్లాడారు.
 
తూర్పు తీరంలో ఆటో పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ఒక బ్లూప్రింట్‌ను పరిశ్రమ తయారు చేయాలని, దీని ఆధారంగా చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ తీరంలోనూ క్లస్టర్‌ తెస్తామని, ఫలితంగా ఆటో ఎగుమతులు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. రానున్న సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని తాకుతుందని, ఇందులో లక్ష కోట్ల డాలర్లు వస్తుసేవల ఎగుమతుల ద్వారా సమకూరనున్నట్టు ఆయన చెప్పారు.
 
ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకెళుతోందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ కంపెనీలు భారత్‌లో తయారీకి అవకాశం ఉన్న ఉత్పత్తులపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందన్న భరోసాను ఇచ్చారు.

Link to comment
Share on other sites

గండ్రాజుపల్లిలో కొత్త పారిశ్రామిక పార్కులు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పడనున్నాయి. రూ.66.06 కోట్లు విలువ చేసే ఐదు ప్రాజెక్టులను రాష్ట్రానికి కేటాయించేందుకు కేంద్రం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో ఉద్యోగాల సృష్టి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లస్టర్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని (సీడీపీ) అమలు చేస్తున్నాయని పరిశ్రమల శాఖ కమిషనరు సిద్దార్థ్‌ జైన్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం రూ.36.86 కోట్లు ఇవ్వనుండగా.. సీడీపీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంది. ఐదు ప్రాజెక్టులను చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుపతిలో ఒక ఉమ్మడి సేవల కేంద్రం (సీఎఫ్‌సీ) ఏర్పాటు కానుండగా.. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక పార్కుల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, చిత్తూరు జిల్లాలోని గండ్రాజుపల్లిలో కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తారు.

Link to comment
Share on other sites

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్, పేపర్’ (APP) రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఏపీపీ ప్రతినిధులు భారతదేశంలోనే అతిపెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. పెద్దఎత్తున ముడిపదార్ధాలను దిగుమతి చేసుకునేందుకు, చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తూర్పు తీరంలో వున్న ఏపీలో తమ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.


 


ఇందుకోసం ఏదైనా నౌకా తీరానికి సమీపంలో రెండున్నర వేల ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూ కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసరప్రాంతాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. తమకు భూమిని కేటాయించిన రెండున్నరేళ్లలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి ఏపీపీ ప్రతినిధులు వివరించారు. రోజుకు సరాసరి 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ పరిశ్రమను నెలకొల్పుతామని ఇందులో నాలుగో వంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు.

అలాగే, జర్మనీకి చెందిన ఆగ్రో కెమికల్స్‌ సంస్థ బేయర్ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాలలో సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో తమ ప్రతిపాదనలు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. సన్న, చిన్నకారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇప్పటికే సాగులో సాంకేతికతను మేళవించి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. భూసార పరిక్షల్లో అధునాతన పరికరాలు, సీసీ కెమేరాలు, డ్రోన్ల సాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. టమోటా పంటకు ప్రసిద్ధి చెందిన మదనపల్లిలో, మామిడి పంటకు ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు జిల్లాలో వున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సమగ్ర ప్రతిపాదనలతో నెలరోజుల్లోగా వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

రాష్ట్రంలో భారీ కాగిత పరిశ్రమ
15-02-2018 01:28:58

ఏర్పాటుకు ముందుకొచ్చిన ఏపీపీ
2500 ఎకరాలు కేటాయించాలని వినతి
రెండున్నరేళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామని హామీ
సాగులో సాంకేతిక సహకారానికి బేయర్‌ రెడీ
22న ‘కియ’కు సీఎం..జనవరిలో రోడ్లపైకి కార్లు
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో భారీ కాగితం తయారీ పరిశ్రమ ఏర్పాటుకానుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్‌ పేపర్‌’ (ఏపీపీ) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఏపీపీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దేశంలోనే అతి పెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ముడిపదార్థాలు దిగుమతి చేసుకునేందుకు, చైనా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించినట్లు ఏపీపీ యాజమాన్య ప్రతినిధులు వెల్లడించారు.
 
తమకు ఏదైనా ఓడరేవు సమీపంలో రెండున్నరవేల ఎకరాలను కేటాయించాల్సిందిగా సీఎంను కోరారు. ఈ ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారు. కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు సమీపంలో భూములు పరిశీలించాలని ఏపీపీ యాజమాన్య ప్రతినిధులకు సీఎం సూచించారు. తమకు భూమి కేటాయించిన రెండున్నరేళ్లలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఏపీపీ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంకి హామీ ఇచ్చారు.
 
రోజుకు సగటున 4వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కాగిత పరిశ్రమను నెలకొల్పుతామని ఇందులో నాలుగోవంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, జర్మనీకి చెందిన ఆగ్రో కెమికల్‌ సంస్థ ‘బేయర్‌’ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో సాంకేతక సహకారమందించేందుకు ముందుకు వచ్చింది. ఈమేరకు సీఎంతో బేయర్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. నెలరోజుల్లో సమగ్ర ప్రతిపాదనలతో వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సహకారం అందిస్తామని సీఎం వారికి తెలిపారు.
 
మరో ఏడాదిపాటు సిమెంటు సరఫరా
సీఎం చంద్రబాబుతో సిమెంటు కంపెనీల ప్రతినిధులు బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వానికి ప్రస్తుతం అందిస్తున్న ధరకే మరో ఏడాది పాటు సిమెంటు సరఫరా చేస్తామని వారు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకాస్త ధర తగ్గించే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సిమెంటు కంపెనీలకు సూచించారు.
 
కియ పనుల ప్రారంభానికి సీఎం
ఈ నెల 22న అనంతపురం ప్లాంటులో కియ ఫ్రేమ్‌ వర్క్‌ బిగింపు పనులను ప్రారంభించనుంది. ఈ పనుల ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం చంద్రబాబును కియ ప్రతినిధులు ఆహ్వానించారు. దీనికి సీఎం అంగీకరించారు. దీంతో కియ యాజమాన్యం ఆహ్వాన పత్రికలను సిద్ధం చేసి, తొలి కాపీని బుధవారం సీఎంకు అందజేసింది. ఈ సందర్భంగా సంక్రాంతి నాటికి కియ కార్లను రాష్ట్రంలో విడుదల చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను సీఎం కోరారు.
 
కాగా.. కియ కార్ల తయారీ సంస్థలో ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుగా అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. కియ సంస్థకు గతంలో ఇచ్చిన హామీల మేరకు జీఎస్టీ అనంతర ప్రోత్సాహక ప్రయోజనాల కోసం అమలు చేసే ప్రత్యేక విధానంపై గురువారం నాటి ఎస్‌ఐపీబీ చర్చించనుంది.
 
రాష్ట్రంలో కంటెంట్‌ కార్పొరేషన్‌
రాష్ట్రంలో కంటెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఇంధన, మౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తృతం కానున్న తరుణంలో ప్రజలకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించే ప్రసారాలను రూపొందించే నిపుణులతో ఈ కంటెంట్‌ కార్పొరేషన్‌ పనిచేస్తుంది.

Link to comment
Share on other sites

పెట్టుబడి అవకాశాలను కళ్లకు కట్టండి
16-02-2018 02:51:43

ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ నమూనా
ప్రదర్శనలు ఏర్పాటు చేయండి
భాగస్వామ్య సదస్సుపై సీఎం ఆదేశం
చిత్తూరులో టెక్స్‌టైల్‌, అనంతలో
అపెరల్‌ పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ ఓకే
అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కళ్లకుకట్టేలా వివరించి, పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఆటోమొబైల్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశ్రమల నమూనా ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన స్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎ్‌సఐపీబీ) సమావేశం జరిగింది. స్మార్ట్‌ పవర్‌గ్రిడ్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌, డిజరప్టివ్‌ టెక్నాలజీ, సోలార్‌ స్టోరేజ్‌ రంగాలకు చెందిన వారిని ఆ సదస్సులో భాగస్వాముల్ని చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రియల్‌ టైం గవర్నెన్స్‌ ద్వారా పరిశ్రమలకు సత్వరం అనుమతులు ఇస్తున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లు తెలియజేయాలన్నారు. ఏపీలో తయారయ్యే కియ కారు, ఫాక్స్‌కాన్‌ సెల్‌ఫోన్లు తదితర ఉత్పత్తులన్నింటినీ సదస్సులో ప్రదర్శించాలన్నారు.
 
పలు పరిశ్రమలకు ఆమోదం
ఎస్‌ఐపీబీ సమావేశంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. చిత్తూరు జిల్లాలో 150 ఎకరాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులతో అరవింద్‌ ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ గార్మెంటింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏటా వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేయనున్న గార్మెంటింగ్‌ పరిశ్రమలో 8 వేల మందికి, టెక్స్‌టైల్స్‌లో 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అనంతపురం జిల్లా పాలసముద్రంలో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో సాయిదివ్య అపెరల్స్‌ అండ్‌ ఫ్యాషన్స్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ ఏడాది మార్చి నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించి 2 వేల మందికి ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో నాచు కార్పొరేషన్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో రూ.1033.22 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్‌ డీఐ పైప్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. 161.16 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా, 1200 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. భూమి కేటాయించిన 30 మాసాలలోపు ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.

Link to comment
Share on other sites

ఏపీలో ఏసీల తయారీ యూనిట్‌! 
రూ.1,300 కోట్ల పెట్టుబడులు 
  ఏడాదికి 10 లక్షల యూనిట్ల సామర్థ్యం 
50 ఎకరాల స్థలంలో ఏర్పాటు 
  ‘ఈనాడు’తో ఈజీపీఎల్‌ సీఈఓ ఇజాజుద్దీన్‌ 
ఈనాడు - హైదరాబాద్‌ 

జపాన్‌కు చెందిన ఫుజిత్సు జనరల్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌ కండీషనర్ల (ఏసీ) తయారీకి భారీ ప్లాంటును ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రీమియం ఏసీలను విక్రయిస్తున్న పుజిత్సు జనరల్‌ దేశీయ మార్కెట్‌కు సరఫరా చేయడానికే కాక మధ్య ప్రాచ్యం, ఐరోపా దేశాలకు ఎగుమతి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయడం అనుకూలంగా ఉంటుందని, రవాణా వ్యయాలు తగ్గుతాయని భావిస్తోంది. సాధారణంగా ఏసీల తయారీ యూనిట్‌కు రూ.100-120 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని.. అంతర్జాతీయ, దేశీయ ఏసీల మార్కెట్‌ వృద్ధిని పరిగణనలోకి తీసుకుని దాదాపు 20 కోట్ల డాలర్లతో (రూ.1,300 కోట్లు) భారత్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోందని భారత్‌ ఫుజిత్సు జనరల్‌ అనుబంధ కంపెనీ ఈటీఏ జనరల్‌ (ఈజీపీఎల్‌) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), డైరెక్టర్‌ ఎం.ఇజాజుద్దీన్‌ తెలిపారు. ‘భారత్‌లో దక్షిణాదిలోనే యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం. ఎగుమతులకు వీలుగా ఓడరేవు ఉంటే వ్యయాలు తగ్గుతాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని చెన్నై సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని రకాల ఏసీలను ఇక్కడ ఉత్పత్తి చేస్తాం. ఏడాదికి దాదాపు 10 లక్షల యూనిట్ల సామర్థ్యంతో దశ వారీగా ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ యూనిట్‌ వల్ల దాదాపు 750 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. 50 ఎకరాల స్థలం అవసరమవుతుంది. భారత మార్కెట్‌ స్థిరత్వం, స్థితిగతులను వచ్చే రెండేళ్లు అధ్యయనం చేసి నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత ఏడాదిలో యూనిట్‌ను సిద్ధమవుతుందని’ ఇజాజుద్ధీన్‌ ‘ఈనాడు’కు తెలిపారు. బ్లూస్టార్‌ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఏసీల యూనిట్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది.
థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి.. 
ప్రస్తుతం ఫుజిత్సు జనరల్‌కు థాయ్‌లాండ్‌, చైనాల్లో ఏసీలను తయారు చేసే యూనిట్లు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో తయారైన ఏసీలను దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తున్నామని ఫుజిత్సు జనరల్‌ ప్రెసిడెంట్‌ ఇత్సురో సైతో తెలిపారు. చైనాలో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ వచ్చే రెండు, మూడేళ్లలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని, ఇందులో 20 కోట్ల డాలర్లను భారత్‌లో తయారీ యూనిట్‌పై పెట్టాలని భావిస్తున్నామని వివరించారు. పెట్టుబడులకు భారత్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఐరోపా, అమెరికా తదితర దేశాల్లో ఫుజిత్సు జనరల్‌ ఏడాదికి 35 లక్షల ఏసీలను విక్రయిస్తోందని, ఇందులో దాదాపు 10 శాతం  వాటా భారత్‌కు ఉంటుందని సైతో అన్నారు.
విపణిలోకి 26 రకాల ఏసీలు విడుదల 
రానున్న వేసవి కాలంలో ఏసీల అమ్మకాలను పెంచుకోవడానికి ఈజీపీఎల్‌ దేశీయ విపణిలోకి 26 కొత్త ఏసీలను విడుదల చేసింది. ఇందులో ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీలు, క్యాసెట్‌ ఏసీలు మొదలైనవి ఉన్నాయి. సాధారణంగా ఏసీని తరచూ కొనుగోలు చేయరని.. శబ్దరహిత, ఇంధన ఆదా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వినియోగదారులు ఏసీలను కొనుగోలు చేస్తారని ఇజాజుద్ధీన్‌ వివరించారు. సాధారణంగా సగటు ఏసీ ధర రూ.30,000 ఉంటుందని,  ఫుజిత్సు జనరల్‌ విక్రయిస్తున్న ‘జనరల్‌’ ఏసీల ధర 50 శాతం అధికంగా ఉంటుందన్నారు. రూ.50,000 పైన ధర ఉన్న ఏసీలు ప్రీమియం విభాగం కిందకు వస్తాయి. 2000లో భారత మార్కెట్‌లోకి ఫుజిత్సు జనరల్‌ అడుగు పెట్టింది. ప్రస్తుతం రూమ్‌, వాణిజ్య విభాగాల్లో దాదాపు 40 రకాల ఏసీలను విక్రయిస్తోంది. రూమ్‌ ఏసీల విభాగంలో ఏడాదికి 60 లక్షల ఏసీలు విక్రయం అవుతుంటే.. కంపెనీ వాటా 4 శాతం. ప్రస్తుతం దేశంలో ప్రీమియం ఏసీలకు తక్కువ మార్కెట్‌ ఉంది. మొత్తం ఏసీల విక్రయాల్లో ఇన్వర్టర్‌ ఏసీల వాటా 20 శాతం ఉందని.. త్వరలోనే సగానికి సగం వాటాకు చేరగలదన్నారు. దేశీయ ఏసీల మార్కెట్‌ ఏడాదికి 15% వృద్ధి చెందుతోందని ఇజాజుద్ధీన్‌ వివరించారు.

Link to comment
Share on other sites

పెట్టుబడి అవకాశాలను కళ్లకు కట్టండి
16-02-2018 02:51:43

ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ నమూనా
ప్రదర్శనలు ఏర్పాటు చేయండి
భాగస్వామ్య సదస్సుపై సీఎం ఆదేశం
చిత్తూరులో టెక్స్‌టైల్‌, అనంతలో
అపెరల్‌ పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ ఓకే
అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కళ్లకుకట్టేలా వివరించి, పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఆటోమొబైల్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశ్రమల నమూనా ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన స్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎ్‌సఐపీబీ) సమావేశం జరిగింది. స్మార్ట్‌ పవర్‌గ్రిడ్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌, డిజరప్టివ్‌ టెక్నాలజీ, సోలార్‌ స్టోరేజ్‌ రంగాలకు చెందిన వారిని ఆ సదస్సులో భాగస్వాముల్ని చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రియల్‌ టైం గవర్నెన్స్‌ ద్వారా పరిశ్రమలకు సత్వరం అనుమతులు ఇస్తున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లు తెలియజేయాలన్నారు. ఏపీలో తయారయ్యే కియ కారు, ఫాక్స్‌కాన్‌ సెల్‌ఫోన్లు తదితర ఉత్పత్తులన్నింటినీ సదస్సులో ప్రదర్శించాలన్నారు.
 
పలు పరిశ్రమలకు ఆమోదం
ఎస్‌ఐపీబీ సమావేశంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. చిత్తూరు జిల్లాలో 150 ఎకరాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులతో అరవింద్‌ ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ గార్మెంటింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏటా వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేయనున్న గార్మెంటింగ్‌ పరిశ్రమలో 8 వేల మందికి, టెక్స్‌టైల్స్‌లో 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అనంతపురం జిల్లా పాలసముద్రంలో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో సాయిదివ్య అపెరల్స్‌ అండ్‌ ఫ్యాషన్స్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ ఏడాది మార్చి నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించి 2 వేల మందికి ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో నాచు కార్పొరేషన్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో రూ.1033.22 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్‌ డీఐ పైప్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. 161.16 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా, 1200 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. భూమి కేటాయించిన 30 మాసాలలోపు ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.

Link to comment
Share on other sites

భారీ పరిశ్రమల కేంద్రంగా నెల్లూరు
ఈనాడు, నెల్లూరు: నెల్లూరు జిల్లా భారీ పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఎగుమతుల కోసం సముద్ర తీరం, దగ్గరలో చెన్నై నగరం ఉండటం.. పారిశ్రామిక వాడలు, అందుబాటులో భూములు... వీటన్నింటి కారణంగా పారిశ్రామిక వేత్తలు జిల్లావైపు చూస్తున్నారు. దగదర్తి మండలం దామవరం దగ్గర 1,300 ఎకరాల్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. సాగరమాల ప్రాజెక్టు కింద నాలుగు ప్రధాన రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానం చేయటానికి రూ.1,690 కోట్లతో పనులు ప్రతిపాదించారు. అవి టెండరు దశలో ఉన్నాయి.రెండు సంవత్సరాల్లో సర్వేపల్లి పారిశ్రామిక వాడలో క్రిభ్‌కో ఎరువుల కర్మాగారం, నాయుడుపేటలోని పారిశ్రామిక వాడలో బ్రేక్స్‌ ఇండియా ప్రై లిమిటెడ్‌ స్పాంజ్‌ ఇనుము కర్మాగారం, చిల్లకూరు మండలంలో నెక్కంటి మెగా ఫుడ్‌ పార్కు, తడ మండలం మాంబట్టు దగ్గర ఫార్మా రంగానికి చెందిన టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌, పవన విద్యుత్తు తయారీలో వినియోగించే జనరేటర్లను తయారు చేసే గెస్టమ్ప్‌, కొడవలూరు మండలంలో అలెప్‌ సంస్థలు ప్రారంభమయ్యాయి. కేంద్రం దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసే తీరప్రాంత ఉపాధి మండలి నెల్లూరుకే మంజూరు చేసింది. దీనికోసం అధికారులు 16 వేల ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 
అనుమతుల దశలో..: రక్షణ రంగానికి చెందిన సంస్థ మిథాని (మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌) ఏర్పాటుకు అనుమతులు పూర్తయ్యాయి. సంస్థ కోసం కొడవలూరు మండలం బొడ్డువానిపాలెం దగ్గర 110 ఎకరాలు కేటాయించారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బోహాంగ్‌ క్రిస్టర్‌ స్టోన్‌ టెక్నాలజీ ప్రై లిమిటెడ్‌, నెల్లూరు విద్యుత్తు వాహనాల తయారీ ప్రై లిమిటెడ్‌, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల ఏర్పాటుకు అనుమతులు పూర్తయ్యాయి. ఆమంచర్ల పారిశ్రామిక వాడ, కె.కె.గుంట పారిశ్రామిక వాడల్లో వాటికి భూములను కేటాయించారు. వాటి ద్వారా రూ.4,932 కోట్లు పెట్టుబడుల రూపేణా వస్తాయని అంచనా.
-  కోస్తాతీర ఉపాధి మండలి(సీఈజడ్‌) ఏర్పాటుకు 16,353 ఎకరాల భూములను సేకరించారు. ఇందులో భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించాలన్నది ఆలోచన. అందుకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సంప్రదింపులు మొదలయ్యాయి. భారత్‌ జింక్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు ప్రారంభించారు. గమేషా (పవన విద్యుత్తు పరికరాలను తయారు చేసే) పరిశ్రమను కొడవలూరు మండలంలోని కిసాన్‌ సెజ్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశారు

Link to comment
Share on other sites

ఎపిలో లేటెస్ట్‌వన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌
20-02-2018 01:01:21

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (పిటిఎల్‌) వెల్లడించింది. లేటె్‌స్టవన్‌ డాట్‌కామ్‌ పేరుతో ఇ-కామర్స్‌ పోర్టల్‌ను నిర్వహిస్తున్న పిటిఎల్‌ దక్షిణాది రాష్ట్రాల కోసం కర్నూలులో ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీకి ఢిల్లీ, ముంబైల్లో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లున్నాయి. కర్నూలు ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ నుంచి 48 గంటల్లో దక్షిణాది రాష్ట్రాలకు డెలివరీ చేయవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 40 మంది ఉద్యోగులుండగా రానున్న రోజుల్లో దీన్ని వందకు చేర్చనున్నట్లు పిటిఎల్‌ తెలిపింది.

Link to comment
Share on other sites

చంద్రబాబును చూసే ఏపీకి పెట్టుబడులు 
24 నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు 
ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులకు అంగీకారం 
39 దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధి బృందాలు 
పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వెల్లడి 
ఈనాడు - అమరావతి
కేంద్రాన్ని చూసి కాదు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. యూరోపియన్‌ దేశాల్లో పర్యటించిన సమయంలో కూడా పలు 
సంస్థల అధిపతులు ఈ విషయం చెప్పారని వెల్లడించారు. ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన వివరాలను మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కేంద్రం నిర్వహిస్తున్న సదస్సుకు రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోందన్నారు.  రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రం నుంచి అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించిన విధంగా ప్రోత్సాహకాలు సాధించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు.
రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సిద్ధం 
విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు సందర్భంగా రూ.3లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకునేందుకు పలు సంస్థలు అంగీకరించాయని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. సదస్సు ప్రారంభం నాటికి ఈ మొత్తం ఇంకా పెరుగుతుందన్నారు. 2016 సదస్సులో చేసుకున్న ఒప్పందాల్లో 44.26శాతం, 2017 సదస్సులోని ఒప్పందాల్లో 39.76శాతం అమల్లోకి వచ్చినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. మంగళగిరి వద్ద మంగళవారం అత్యాధునిక పరిశోధనశాల ప్రారంభించామన్నారు. ఇందులో వివిధ దేశాలకు ఎగుమతి చేసే ఆహార ఉత్పత్తులను పరీక్షించుకోవచ్చన్నారు.
అన్ని రాష్ట్రాల కంటే ముందే ఏపీకి విద్యుత్తు వాహనాలు 
విద్యుత్తు వాహనాలను అందుబాటులోకి తేవడంలో దేశంలోని అన్ని  రాష్ట్రాల కంటే ఏపీ ముందుంటుందని అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. కియా సంస్థ కూడా దీనిపై దృష్టి పెట్టిందన్నారు. ఈ నెల 22న కియా మోటార్స్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు.
ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి 
విశాఖ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సురేష్‌ప్రభుతోపాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతున్నట్లు చెప్పారు. 14 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు, 39 దేశాల నుంచి ప్రతినిధి బృందాలు హాజరవుతున్నట్లు వివరించారు. 2,500 మంది పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికామన్నారు. సదస్సులో 9 ప్లీనరీ సెషన్స్‌(సీఐఐ ఆధ్వర్యంలో), 8 రాష్ట్ర సెషన్స్‌, 2 కొరియా, జపాన్‌ దేశాల సెషన్స్‌ జరుగుతాయన్నారు.
సహజ వనరుల గని ఆంధ్రప్రదేశ్‌ 

మంగళగిరి, న్యూస్‌టుడే: వ్యవసాయం, చేపల పెంపకానికి అవసరమైన సహజవనరులు రాష్ట్రంలో విస్తారంగా ఉన్నాయని పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి చెప్పారు. అమరావతి సమీప మంగళగిరిలో మంగళవారం ఉదయం లిండే ఇండియా సంస్థ ఏర్పాటుచేసిన ఆహార ప్రయోగశాల, శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ మంగళగిరిలో లిండే సంస్థ వినూత్న ఆహార శుద్ధి సాంకేతికతతో ముందుకురావటం అభినందనీయమన్నారు. ఆహారోత్పత్తుల పరిశ్రమకు అవసరమైన క్రయోజెనిక్‌ ఫ్రీజింగ్‌ చిల్లింగ్‌ టెక్నాలజీని అందించటంలో లిండే సంస్థకు దశాబ్దాలుగా పేరుందన్నారు. లిండే గ్యాసెస్‌, తూర్పు ఆసియా ముఖ్య ప్రతినిధి మోలోయ్‌ బెనర్జీ మాట్లాడుతూ తాము ఏర్పాటుచేసిన ప్రయోగశాల, శిక్షణ కేంద్రం అందించే సాంకేతికత ఆహారశుద్ధి పరిశ్రమ అధిక లాభాలు పొందటానికి దోహాదపడుతుందని చెప్పారు

Link to comment
Share on other sites

సిమెంట్‌ పరిశ్రమలు 
భాగస్వామ్య సదస్సులో ఒప్పందం
ఈనాడు అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నాలుగు సిమెంట్‌ పరిశ్రమలు రాబోతున్నాయి. విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వంతో ఈ నాలుగు పరిశ్రమల ప్రతినిధులు ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నారు. ప్రిజమ్‌, అంబుజ సిమెంట్‌ పరిశ్రమలు కొత్తగా కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, గుంటూరు దాచేపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. రామ్‌కో, అల్ట్రాటెక్‌ పరిశ్రమలు కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలోనే పరిశ్రమలను స్థాపించబోతున్నాయి. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నడుస్తున్నాయి. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధిత యాజమాన్యాలు 1500 కోట్ల రూపాయల వంతున పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని గనులశాఖ కార్యదర్శి శ్రీధర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 21 సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...