Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో మరో ఇంజనీరింగ్ అద్భుతం...
16-12-2018 11:18:11
 
636805558898720282.jpg
 
అమరావతిలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్క్రుతం కాబోతోంది. దేశంలో మొట్టమొదటిసారిగా 4 మీటర్ల రాక్ ఫౌండేషన్‌తోపాటు డయాగ్రిడ్ నిర్మాణాలను చేపట్టారు. సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలు జీఏడీ టవర్ల నిర్మాణంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తుపాన్ ప్రభావం తీవ్రంగా లేకపోతే ఈనెల 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రెండో టవర్‌లో రాక్ ఫౌండేషన్‌కు 11వేల 500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించబోతున్నారు. రాజధాని అమరావతిలో గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయని వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ... నాలుగు మీటర్ల లోతు నుంచి మొత్తం కాంక్రీట్ నింపి ఆ తర్వాత డయాగ్రీట్ భవనం కూడా భారత దేశంలో మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాఫ్ట్ ఫౌండేషన్‌తో బేస్‌మెంట్ లెవెల్‌కు వచ్చిన సచివాలయ భవనాల నిర్మాణం మరో 18 నెలల్లో పూర్తి చేసేందుకు ఏపీ సీఆర్డీయే రంగం సిద్ధం చేసింది. ఎల్ అండ్ టీ, షాపూర్జీ, పల్లోంజీ, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ.. మొత్తం మూడు కంపెనీలు నిర్మాణంలోపాలు పంచుకుంటున్నాయి.
 
అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. డిజైన్ల ప్రక్రీయ దాటి నిర్మాణంలోకి వచ్చింది. గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, గెజిటెడ్ అధికారులు, నాలుగోతరగతి ఉద్యోగుల నివాసాల కోసం 10 టవర్ల నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుంది. నిర్మాణ నగరాన్ని తలపించే విధంగా జరుగుతున్న పనుల్లో సుమారు 40 వేల మంది కార్మికులు బాగస్వాములవుతున్నారు. రాయపుడి గవర్నమెంట్ కాంప్లెక్స్ సమీపంలో శాస్వత సచివాలయం, శాఖాధిపతులు కార్యాలయాలు, సాధారణ పరిపాలన కార్యాలయాలు, కమిషనరేట్ల నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం ఐదు టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇందుకు 1,2 టవర్ల నిర్మాణాన్ని షాపూర్జీ, పల్లోంజీ సంస్థలు చేపట్టగా 3,4 టవర్ల నిర్మాణాలను ఎల్ అండ్ టీ, ఐదో టవర్ నిర్మాణాన్ని నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేపట్టింది.
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన వైసీపీ.. మారుతున్న పరిణామాలతో మరో సెల్ఫ్ గోల్ చేసుకున్నామా? అని మదనపడుతోంది. మద్దతు ఇస్తానని ఓవైసీ వెంటపడుతున్నా.. మనస్ఫూర్తిగా ఆహ్వానించలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ పార్టీలతో ఎవరికి లాభం? తెలంగాణ ఎఫెక్ట్ ఏపీలో ఎలా ఉండబోతోంది? టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి జగన్ ఏం సాధించారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో అనూహ్యమైన రాజకీయ మార్పులు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం, చంద్రబాబు ప్రచారం చేయడంతో తాము కూడా ఏపీ రాజకీయాల్లో తమ వంతు పాత్ర పోషిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
Link to comment
Share on other sites

సంక్రాంతికి హ్యాపీనెస్ట్‌-2
ఆకృతులపై సీఆర్‌డీఏ కసరత్తు
ఈనాడు - అమరావతి

రాజధానిలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ హ్యాపీనెస్ట్‌-1కి ప్రజల నుంచి ఊహించని స్పందన రావడంతో, దీనికి కొనసాగింపుగా మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కసరత్తు చేస్తోంది. హ్యాపీనెస్ట్‌-2కి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఆకృతులపై ఆర్కిటెక్ట్‌లతో సమావేశం నిర్వహించింది. ఈ ప్రాజెక్ట్‌లో కూడా వెయ్యి నుంచి 1200 ఫ్లాట్ల వరకు ప్రజలకు అందుబాటులోకి తేనుంది. సంక్రాంతి నాటికి హ్యాపీనెస్ట్‌-2కి బుకింగ్‌లు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ‘ఈనాడు’కి తెలిపారు. ఇప్పటికే బుకింగ్‌ పూర్తయిన.. హ్యాపీనెస్ట్‌-1 ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్ని నెల రోజుల్లో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

రెండో ప్రాజెక్టుపైనా అంతే ఆసక్తి
హ్యాపీనెస్ట్‌-1 ప్రాజెక్టులో 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా... 300 ఫ్లాట్లకు నవంబర్‌ 9న, మిగతా 900 ఫ్లాట్లకు డిసెంబర్‌ 10న ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ రెండు సందర్భాల్లోను ఫ్లాట్‌లు బుక్‌ చేసుకోవడానికి ప్రజలు పోటీ పడ్డారు. రెండో విడత బుకింగ్‌ సందర్భంగా.. 19 వేలకు మందికిపైగా బుకింగ్‌ ప్రక్రియంతా పూర్తిచేసి, డబ్బులు చెల్లించడానికీ సిద్ధమయ్యారని కమిషనర్‌ చెప్పారు. హ్యాపీనెస్ట్‌ సిరీస్‌లో భాగంగా తదుపరి ప్రాజెక్టులో ఏమైనా మార్పులు చేయాలా అన్న అంశంపై ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు కోరగా.. ఇంత వరకు 4,500 మందికిపైగా స్పందించారని వెల్లడించారు. ‘‘హ్యాపీనెస్ట్‌-2 ఆకృతులపై ఇప్పటికే ఆర్కిటెక్ట్‌లతో చర్చించాం. ఈ ప్రాజెక్టు ఆకృతులూ దాదాపుగా హ్యాపీనెస్ట్‌-1లానే ఉంటాయి. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా ఆకృతులను మరింత మెరుగుపరుస్తాం. రెండు మూడు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. హ్యాపీనెస్ట్‌-2 ఏ ప్రాంతంలో చేపట్టేదీ త్వరలోనే ప్రకటిస్తాం. సంక్రాంతి నాటికి బుకింగ్‌లు ప్రారంభిస్తాం’’ అని కమిషనర్‌ వివరించారు. హ్యాపీనెస్ట్‌-1లో ఫ్లాట్లు బుక్‌ చేసుకోవడానికి విదేశాల్లో స్థిరపడిన వారూ పోటీ పడ్డారు. సుమారు 16 దేశాల నుంచి ఫ్లాట్‌లు బుక్‌ చేసుకున్నారు. భారతదేశం నలుమూలల నుంచీ 659 మంది, అమెరికా నుంచి 175, సింగపూర్‌ నుంచి 13, యూఏఈ నుంచి 12 మంది ఫ్లాట్‌లు బుక్‌ చేసుకున్నారు. ఇంకా ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ఖతార్‌, కెనడా, బహ్రెయిన్‌, మలేసియా తదితర దేశాల నుంచి ఫ్లాట్‌లు బుక్‌ చేసుకున్నారు.

హ్యాపీనెస్ట్‌-1కి త్వరలోనే టెండర్లు
హ్యాపీనెస్ట్‌-1 ప్రాజెక్టుకి సోమ, మంగళవారాల్లో సీఆర్‌డీఏ టెండర్‌ ప్రకటన జారీ చేయనుంది. మూడు వారాల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని, సంక్రాంతి నాటికి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని శ్రీధర్‌ చెప్పారు. నిర్మాణ ఆకృతులను ఇప్పటికే ఐఐటీ మద్రాస్‌కి పంపించి ఆమోదముద్ర పొందినట్లు తెలిపారు. ‘‘ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నవారికి ఒక ‘వెల్‌కం కిట్‌’ పంపిస్తున్నాం. దానిలో డ్రాఫ్ట్‌ సేల్‌ అగ్రిమెంట్‌, కరపత్రం వంటివి ఉంటాయి. ఫ్లాట్‌లు బుక్‌ చేసుకున్నవారిలో ప్రతి 40 మందికి ఒక ప్రతినిధిని నియమిస్తున్నాం. ప్రతి ఖాతాదారుకి ప్రత్యేక డ్యాష్‌బోర్డు సిద్ధం చేస్తాం.  బుక్‌ చేసుకున్న ఫ్లాట్‌కి సంబంధించిన చెల్లింపులు, పత్రాల వివరాలన్నీ దానిలో ఉంటాయి’’ అని తెలిపారు.

Link to comment
Share on other sites

సెక్రటేరియట్‌ టవర్ల ర్యాఫ్ట్‌.. శంకుస్థాపన వాయిదా!?
18-12-2018 07:58:40
 
636807167215036962.jpg
  • ఈ నెల 24న ప్రారంభించేందుకు అధికారుల యోచన
  • ముఖ్యమంత్రి ఆదేశానుసారం తుది నిర్ణయం
అమరావతి (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా, అత్యంత భారీగా అమరావతిలోని సెక్రటేరియట్‌ టవర్లకు వేయదలచిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రారంభ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇది ఈ నెల 19వ తేదీన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ద్వారా మొదలవ్వాల్సి ఉంది. అయితే పైథాయ్‌ తుపాను ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసేందుకు సీఆర్డీయే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే దీనిని ఐదు రోజుల తర్వాత అంటే ఈ నెల 24వ తేదీన సీఎం ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది ముఖ్యమంత్రేనని సమాచారం.
 
మంగళవారంనాడు చంద్రబాబు సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులు, నిపుణులతో నిర్వహించదలచిన సమావేశంలో ఈ అంశంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారంటున్నారు. అప్పటికి వాతావరణం అనుకూలిస్తుందని గనుక సమావేశం భావించినట్లయితే ఈ నెల 24వ తేదీన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయడం మొదలవుతుందని, లేని పక్షంలో మరి కొన్ని రోజులు వెనక్కి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ప్రారంభించిన తర్వాత మూడు రోజులపాటు నిరంతరాయంగా, రేయింబవళ్లు వేయాల్సి ఉన్నందున మధ్యలో ఎటువంటి అవాంతరాలు ఎదురవబోవన్న కచ్చితమైన నిర్ధారణకు వచ్చాకే ఈ బృహత్‌ యజ్ఞాన్ని ఎప్పుడు మొదలెట్టాలన్న విషయంపై తగు నిర్ణయం తీసుకుంటారంటున్నారు.
 
మన దేశంలో ఇంతకు ముందెక్కడా కనీవినీ ఎరుగని రీతిలో అమరావతిలోని సెక్రటేరియట్‌- హెచ్‌వోడీల 5 టవర్లు (ఒక్కొక్కటి 40 అంతస్థులతో 4, 50 అంతస్థులతో 1)కూ కలిపి ఒకే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను 13 అడుగుల లోతున, సుమారు 12,000 క్యూబిక్‌ మీటర్ల మేర వేసేందుకు సీఆర్డీయే నిర్ణయించిన సంగతి తెలిసిందే. వేలాదిమంది కార్మికులు, అధికారులు, నిపుణులతోపాటు భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి, యంత్రపరికరాలు, సునిశిత ప్రణాళికలు, అద్భుత సమన్వయంతో దీనిని చేపట్టేందుకు గత కొన్ని వారాలుగా ఈ సంస్థ సమాయత్తమవుతోంది.
 
అత్యంత భారీగా వేయబోయే సచివాలయ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు సుమారు 1300 టన్నుల స్టీల్‌, 3,000 టన్నుల సిమెంట్‌, 12,000 టన్నుల కంకర, 8,000 టన్నుల ఇసుక, 3,000 టన్నుల ఫ్లైయాష్‌, పెద్ద పరిమాణంలో జీజీబీఎస్‌ (ఇనుము తయారీ సందర్భంగా వెలువడే రజనులాంటి పదార్ధం)తోపాటు 12 లక్షల లీటర్ల కృష్ణానదీ జలాలు అవసరం! వీటన్నింటినీ కలిపి, కాంక్రీట్‌ మిక్సర్‌ తయారు చేసేందుకు 35 టన్నుల సామర్ధ్యముండే భారీ హెడ్‌ మిక్సర్లను వాడతారు. పునాదుల్లో వేడిని గణనీయంగా తగ్గించి, ఆకాశహర్మ్యాల జీవితకాలాన్ని పెంచేలా కాంక్రీట్‌ మిశ్రమాన్ని రూపొందించేందుకు గాను కృష్ణా నీటిని బాగా చల్లబరిచి వినియోగించేందుకు వీలుగా ప్రత్యేకంగా ‘ఛిల్లర్‌ ప్లాంట్ల’ను ఏర్పాటు చేస్తున్నారు.
 
నిర్మాణ సామగ్రి తరలింపునకు భారీ ప్రణాళికలు..
పైన పేర్కొన్న పరిమాణాల్లో నిర్మాణ సామగ్రిని సెక్రటేరియట్‌ నిర్మాణ ప్రదేశం వద్ద ఉంచడం సాధ్యం కాదు కాబట్టి అవి లభ్యమయ్యే చోట్ల నుంచి, లేదా అవి తయారయ్యే ఫ్యాక్టరీల నుంచి వాటిని ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేసే రోజుల్లో నేరుగా చేర్చనున్నారు. జీజీబీఎస్‌ ఫ్యాక్టరీలుండే నంద్యాల నుంచి అది, సిమెంట్‌ ఫ్యాక్టరీలుండే జగ్గయ్యపేట తదితరాల నుంచి దానిని భారీ ట్రక్కుల ద్వారా నేరుగా ఫౌండేషన్‌ స్థలికే చేర్చనున్నారు.
 
అయితే.. నిరంతరాయంగా, అదీ ఏకధాటిన 3 రోజులపాటు ఒక్క క్షణం కూడా ఆగకుండా ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను వేయాల్సి ఉన్నందున ఈ బంకర్లతోపాటు పరిసరాల్లో లభ్యమయ్యే ఇసుకను తరలించే భారీ వాహనాలను వేగంగా, శీఘ్రంగా గమ్యస్థానాలకు చేర్చే ప్రణాళికలపై సీఆర్డీయే కసరత్తు చేస్తోంది. పోలీసులు, ఆయా మార్గాల్లోని స్థానిక సంస్థలు తదితరాలను కలుపుకుని ఇందుకు అనువైన, లోపరహితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో.. హెడ్‌ మిక్సర్లు, పైప్‌లైన్లు వంటి యంత్ర పరికరాల్లో ఏమన్నా ఇబ్బందులు తలెత్తినట్లయితే పనులు ఆగకుండా తోడ్పడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా సీఆర్డీయే దృష్టి సారించింది.
Link to comment
Share on other sites

జీఏడీ టవర్‌, హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు
18-12-2018 03:17:56
 
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని మరో రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర పర్యావరణానుమతులు లభించాయి. సెక్రటేరియట్‌ టవర్లలో ప్రధానమైన జీఏడీ టవర్‌(ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు)కు, రాజధానిలోని ప్రప్రథమ గేటెడ్‌ కమ్యూనిటీ అయిన హ్యాపీనెస్ట్‌ వీటిల్లో ఉన్నాయి. అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మితమవుతున్న సచివాలయ సముదాయంలో మొత్తం 5 టవర్లు ఉండగా వాటిల్లో 4 ఒక్కొక్కటి 40 అంతస్థులతో, జీఏడీ టవర్‌ 50 అంతస్థులతో రూపుదాల్చనున్న విషయం విదితమే.
Link to comment
Share on other sites

రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
18-12-2018 22:01:06
 
636807673853465806.jpg
అమరావతి: డిసెంబర్ 27న సెక్రటేరియట్ టవర్ల నిర్మాణానికి ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించిన చంద్రబాబు... ఇకపై రాజధానిలో 15 రోజులకోసారి ప్రజల భాగస్వామ్యంతో ఈవెంట్లు నిర్వహిస్తామన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై మరో భారీ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 500 మంది సైకిలిస్టులతో రాజధానిలో 100 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపడతామన్నారు. ఎన్‌జీవోల కోసం నిర్మిస్తున్న 21 టవర్లలో జనవరి నాటికి 4 టవర్లు, జనవరి నాటికి 7 ఫ్లోర్లతో సీఆర్‌డీఏ నూతన భవనాన్ని సిద్ధం చేస్తామన్నారు. డిసెంబర్ 31 నాటికి జ్యుడీషియల్ కాంప్లెక్స్ సిద్ధమవుతుందని చెప్పారు. న్యాయమూర్తులు, అధికారులతో చర్చించి హైకోర్టు తరలింపునకు కార్యప్రణాళికను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. అధికారులకు తెలిపారు
Link to comment
Share on other sites

వసతులతో సహా ఇళ్లు నిర్మించండి   

 

సీఆర్‌డీఏ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం 
జనవరి నాటికి ఆరు టవర్లు సిద్ధం 
జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ డిసెంబరు 31కి సిద్ధం

18ap-state1a.jpg

ఈనాడు, అమరావతి: ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవనాలను వేగంగా పూర్తిచేయడంతో పాటు వారికి అవసరమైన సామాజిక మౌలిక సదుపాయాల కల్పనపైనా తక్షణం దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. కొత్త సంవత్సరం కొత్త ఇళ్లల్లో చేరేవారు తమ అవసరాల కోసం వెతుక్కోవల్సిన పరిస్థితి రాకూడదని అన్నారు. రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఇతర ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 61 టవర్లలో ఆరు జనవరిలోగా సిద్ధమవుతాయి. తాత్కాలిక హైకోర్టు (జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌) భవన నిర్మాణం డిసెంబరు 31కి పూర్తవుతుంది.  షాపింగ్‌, వినోద అవసరాలకు వారు మళ్లీ విజయవాడకో, గుంటూరుకో వెళ్లాల్సిన అవసరం రాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సదుపాయాలేమీ లేకుండా ఇళ్లు నిర్మించినా నిరర్థక ఆస్తులుగానే ఉండిపోతాయని వ్యాఖ్యానించారు.

నాలుగు గ్రామాల్లో భూసమీకరణపై చర్చ 
రాజధానికి ఆనుకుని ఉన్న మరో నాలుగు గ్రామాల్లో భూసమీకరణ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. రాజధానిలో ప్రస్తుతం రైతులకు ఫ్లాట్లు తిరిగి ఇవ్వగా, ప్రభుత్వ అవసరాలకు భూమి తక్కువగా ఉందని.. పెదపరిమి, హరిశ్చంద్రపురం వంటి మరో నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తెచ్చి భూసమీకరణ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అగ్రశ్రేణి విద్యాసంస్థలకే స్థలాలు 
రాష్ట్రంలోని ఒక ప్రముఖ విద్యాసంస్థకు రాజధానిలో స్థలం కేటాయింపు ప్రతిపాదనపై చర్చించారు. ఆ సంస్థ అక్రిడేషన్‌ ర్యాంకింగ్‌లో 34వ స్థానంలో ఉందని అధికారులు తెలుపగా, జాతీయ స్థాయిలో అగ్రగామి విద్యాసంస్థలకే తొలి ప్రాధాన్యమివ్వాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని సీఎం సూచించారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాసాల కోసం నిర్మిస్తున్న 61 టవర్లు నిర్ణీత గడువుకు కొంచెం అటూఇటూ పూర్తవుతాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ చెప్పారు. ‘మొత్తం 61 టవర్లను 11 గ్రూపులుగా విభజించాం. ఆరు టవర్లు జనవరిలోగా, మరో ఆరు మార్చిలోగా సిద్ధమవుతాయి. నిర్మించిన ఒక్కో భవనాన్నీ జనవరి ఒకటినుంచి స్వాధీనం చేసుకుంటాం. ఎన్జీవోల కోసం నిర్మిస్తున్న 21 టవర్లలో నాలుగు జనవరికి సిద్ధమవుతాయి. వాటిలో 192 ఫ్లాట్లు ఇంటీరియర్స్‌ సహా సిద్ధం చేస్తాం. మరో 17 టవర్ల నిర్మాణం మందకొడిగా సాగుతోంది’ అని శ్రీధర్‌ తెలిపారు.

సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు కాంక్రీట్‌ వేసే ప్రక్రియను ఈ నెల 27న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. 
జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పనులు ఇంటీరియర్స్‌ సహా డిసెంబరు 31కి సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు. హైకోర్టును  తరలించేందుకు న్యాయమూర్తులు, సంబంధిత అధికారులతో సంప్రదించి కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 
ఫిబ్రవరి 13 నుంచి ‘ఆనంద నగరాల’ సదస్సు

గత సంవత్సరం నిర్వహించిన అమరావతి హ్యాపీసిటీస్‌ సమ్మిట్‌ మాదిరిగానే వచ్చే ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు ‘ఆనంద నగరాల’ సదస్సు. 
రాజధానిలో ప్రతి 15 రోజులకు ప్రజాభాగస్వామ్యంతో కార్యక్రమాలు. 500 మంది సైక్లిస్టులతో రాజధానిలో వంద కి.మీ.ల సైకిల్‌యాత్ర. సీడ్‌యాక్సెస్‌ రోడ్డుపై భారీ ఈవెంట్‌ నిర్వహణకు సన్నాహాలు. 
జనవరినాటికి ఏడంతస్తులతో రాజధానిలో సీఆర్‌డీఏ నూతన కార్యాలయ భవనం సిద్ధం. 
మంత్రులు, న్యాయమూర్తుల బంగ్లాల తొలిదశ నిర్మాణం అక్టోబరునాటికి పూర్తి. 
రాజధాని రహదారుల్లో కొన్ని జనవరి నాటికి రాకపోకలకు సిద్ధం.

సమావేశంలోని ముఖ్యాంశాలు 
రాజధానిలో ప్రస్తుతం ఐదు నక్షత్రాల హోటళ్లు మూడు వస్తున్నాయని, 600 గదులతో వాటి నిర్మాణం జరుగుతుందని  ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి తెలిపారు. 
రాజధాని అవసరాలకు కనీసం 20 వేల గదులు అవసరమని, అందుకు తగ్గట్టు కొత్త హోటళ్లు రావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 
8 స్టార్‌హోటళ్ల ఏర్పాటుకు సంప్రదింపులు జరిపామని, మూడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, నాలుగు ఫోర్‌స్టార్‌ హోటళ్లు తొలుత ఏర్పాటవుతాయని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. మరో నాలుగు స్టార్‌ హోటళ్ల ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. 
సీఆర్‌డీఏ చేపట్టిన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులో నగదు బదిలీ ప్రక్రియలో ఇబ్బందుల వల్ల 13 ఫ్లాట్లు మిగిలాయని, త్వరలో వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు.

 

Link to comment
Share on other sites

వేగంగా పూర్తి చేయండి
19-12-2018 02:36:01
 
636807837620977193.jpg
  • నివాస సముదాయాల నిర్మాణంపై సీఎం ఆదేశం
  • ప్రణాళికాబద్ధంగా హైకోర్టు తరలింపు
  • సీఆర్డీయే సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతోపాటు వివిధ వర్గాల కోసం రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న నివాస సముదాయాలను వేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ గృహాల్లో చేరే వారు దైనందిన అవసరాలతోపాటు షాపింగ్‌, వినోదాలకు విజయవాడ లేదా గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురుకాకుండా మాల్స్‌, క్లబ్‌హౌస్‌, హోటళ్లు తదితరాలను నిర్మించాలని సూచించారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాల పురోగతిపై ఉండవల్లిలో మంగళవారం రాత్రి ఏపీసీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ ఇంటీరియర్లతో సహా నెలాఖరుకల్లా పూర్తవుతుందని అధికారులు తెలియజేయగా.. న్యాయమూర్తులు, సంబంధిత అధికారులతో మాట్లాడి, హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర హైకోర్టు తరలింపు కోసం ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మంత్రులు, న్యాయమూర్తుల బంగళాల నిర్మాణంలో తొలి దశను వచ్చే అక్టోబరుకల్లా పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
 
 
27న ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌
సచివాలయ టవర్లకు 27వ తేదీన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ రోజు ఉదయం సీఎం చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లలో కొన్ని జనవరి నాటికి రాకపోకలకు అనువుగా సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేస్తున్న ఉద్యానవనాలు రానున్న 2, 3 నెలల్లో పూర్తవుతాయన్నారు. అయితే అంతర్గత నిర్మాణాలకు మానవ వనరుల కొరత ఎదురవుతోందని ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారథి సీఎంకు తెలిపారు.
Link to comment
Share on other sites

అమరావతికి అటవీ భూములు ఇవ్వలేదు
19-12-2018 03:12:57
 
  • భూమి ఎందుకో నిర్దిష్టంగా పేర్కొనలేదు
  • అక్కడ రిజర్వు ఫారెస్ట్‌ 5 శాతం కూడా లేదు: కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపలేదని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి మహేష్‌ శర్మ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 3306.55 హెక్టార్ల అటవీ భూములకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపిందని, వాటిని అటవీ సలహా మండలి (ఎఫ్‌ఏసీ) పరిశీలించి, తిరస్కరించిందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల వివరాలను నిర్ధిష్టంగా పేర్కొనకపోవడంతోపాటు ప్రత్యామ్నాయ భూమిలో ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధ్యయనం చేయని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌ఏసీ తెలిపిందని వివరించారు. అంతేకాకుండా, రాజధాని ప్రాంతం మొత్తం విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు కనీసం ఐదు శాతం కూడా లేదని కమిటీ గుర్తించిందన్నారు. కాగా, నెల్లూరు జిల్లాలో మీడియం పవర్డ్‌ రాడార్‌ స్టేషన్‌కు అవసరమైన భూమిని సేకరించడానికి జిల్లా కలెక్టరు వద్ద నిధులు జమ చేశామని రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్‌ భామ్రే తెలిపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఏపీఇ ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50పనిదినాలను కల్పించామని మంత్రి రామ్‌కృపాల్‌ యాదవ్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

అమరావతిలో షాట్‌.. రెడీ..యాక్షన్‌!

రాజధాని ప్రాంతంలో సినిమాల చిత్రీకరణ
ప్రభుత్వ రాయితీలతో ముందుకొస్తున్న సినీ పరిశ్రమ
వచ్చే నెలలో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణ పనులకు శ్రీకారం
ఏఎన్‌యూలో అందుబాటులోకి రానున్న నటనా కోర్సులు
- అమరావతి ఫీచర్స్‌, న్యూస్‌టుడే

amr-gen3a_19_1.jpg

క్లాప్‌.. షాట్‌.. రెడీ.. షూట్‌.. ప్యాకప్‌.. ఈ మాటలు ఎక్కడో హైదరాబాద్‌, చెన్నైలలో నిత్యం వినిపించేవి.. వీటితో మనకేంటి సంబంధం అనుకుంటున్నారా.. అదేనండి మన అమరావతిలోనూ సైన్మాలు తీస్తున్నారు. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో సినిమాల చిత్రీకరణ ఇక్కడ జరుగుతుంది. విభజనకు ముందు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగైదేళ్లకు ఒక సినిమా చిత్రీకరణ జరిగినా గొప్పగా ఉండేది. ఇప్పుడు నెలకు ఒక సినిమా చిత్రీకరణ నవ్యనగరి ప్రాంతంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమాల చిత్రీకరణకు ఇక్కడ అందిస్తున్న ప్రోత్సాహకాలతో చిన్న సినిమాల నిర్మాతలు.. దర్శకులు ఇటువైపు చూస్తున్నారు. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న దర్శకులు సైతం షూటింగ్‌కు అనువైన ప్రాంతాల్ని ఎంపిక చేసుకుని సినిమాలు చిత్రీకరిస్తున్నారు. ఇదంతా ఒక కోణమైతే అమరావతి కేంద్రంగా సినిమాల చిత్రీకరణ జరిగేందుకు దోహదం చేసే ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మాణ పనులకు వచ్చే నెలలో అంకురార్పణ జరగబోతుంది.

ప్రపంచం మెచ్చేలా అమరావతి రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఆహ్లాదం.. వినోదం.. ఆథ్యాత్మికం.. చారిత్రకంగా ఉన్న ప్రదేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఒకసారైనా వాటిని చూసి రావాలనే కుతూహలం సామాన్యులకు కలుగుతుంది. దీనికితోడు గోదావరి జిల్లాల వాతావరణం డెల్టా ప్రాంతంలో ఉంటుంది. అక్కడి వరకు వెళ్లకుండా రాజధానికి దగ్గర్లో సినిమాలు చిత్రీకరిస్తే అదే వాతావరణంతోపాటు రాయితీలు పొందవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. ఏ రాష్ట్రంలోలేని విధంగా ప్రోత్సాహకాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా షూటింగ్‌లకు భద్రతను కూడా కల్పిస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న రాజధాని ప్రాంతాన్ని వేదికగా చేసుకుని సినిమాలు తీసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

పెద్దవీ రావాలి..
చిన్న సినిమాల చిత్రీకరణకు నిర్మాతలు, దర్శకుల నుంచి స్పందన మెరుగ్గా ఉంది. ఇప్పటికే 21 సినిమాలు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం దరఖాస్తులు వచ్చి ఉన్నాయి. వాటి సంఖ్య రాన్రానూ పెరుగుతుంది. వీటితోపాటు పెద్ద సినిమాల చిత్రీకరణకు ఇక్కడికి వస్తే ఈ ప్రాంతానికి గుర్తింపుతోపాటు తక్కువ బడ్జెట్‌లో కనువిందైన ప్రదేశాల్లో సన్నివేశాల్ని తెరకెక్కించవచ్చు. సినిమా పాటలు, ప్రీ రిలీజ్‌, విజయోత్సవ వేడుకలు రాజధాని ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి.

అమరావతిలో ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌
అమరావతిలో 20 ఎకరాల్లో ఎన్టీఆర్‌ పేరుతో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే  భూమి కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యింది. సంక్రాంతి తరువాత స్టూడియా నిర్మాణానికి భూమిపూజ జరగబోతుంది. స్టూడియోల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి సైతం ప్రోత్సాహకాల్ని అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి రాయితీలు ఇస్తున్నారో అంతకంటే మెరుగైనవి సినీ, నాటక పరిశ్రమ అభివృద్ధికి ఇచ్చే ఆలోచన జరుగుతుంది. విశాఖపట్నంతోపాటు అమరావతిని సినిమాల చిత్రీకరణ కేంద్రాలుగా మార్చే ప్రణాళిక ఉంది.

అమరావతికి రండి.. ప్రోత్సాహకాలిస్తాం..
అమరావతిలో సినిమాల చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రోత్సాహకాల్ని అందిస్తున్నాం. చిత్రీకరణకు అనువైన ప్రాంతాలు.. ప్రదేశాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో నాణ్యతతో సినిమాల్ని చిత్రీకరించవచ్చు. చాలామంది ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. పెద్ద సినిమాల నిర్మాతలు, దర్శకులు.. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న కథానాయకులు అమరావతివైపు చూస్తే ఈ ప్రాంతం సినీ పరిశ్రమకు అనుకూలంగా మారుతుంది. ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఏఎన్‌యూలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత మరింత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.

- అంబికాకృష్ణ, రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌

అగ్రకథానాయకులు సైతం..
* నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న సినిమాల కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో పూర్తయ్యింది.అంతకు ముందు గౌతమిపుత్రశాతకర్ణి సినిమాకు సంబంధించి కొన్ని అంశాల్ని అమరావతి నుంచి తీసుకున్నారు.
* బెల్లకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన జయ జానకి నాయక సినిమాలో కొన్ని సన్నివేశాల్ని కృష్ణా జిల్లాలోని హంసలదీవిలో చిత్రీకరించారు. మంగళగిరికి చెందిన సినీ దర్శకులు బోయపాటి శ్రీనివాస్‌ ఈ ప్రాంతంపై ఉన్న మమకారంతో ఇక్కడ చిత్రీకరణకు మొగ్గు చూపిస్తున్నారు.
* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవిత కథల ఆధారంగా నిర్మితమవుతున్న సినిమాల్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ, హాస్య నటుడు అలీ నటిస్తున్న పండుగాడి ఫొటోస్టూడియో సినిమాలో ఎక్కువభాగం సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడే జరుగుతుంది.
* దుగ్గిరాల, తెనాలి, నకరికల్లు, నూజివీడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ సినిమాల చిత్రీకరణ సందడి ఉంటుంది.

పుణే సంస్థతో ఒప్పందం..
సినిమాల్లో రాణించాలనే కల చాలామంది యువతకు ఉంటుంది. సినిమాలకు సంబంధించి వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో 650 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. శిక్షణకు ప్రముఖ పుణే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌తో చలనచిత్ర మండలి ఒప్పందం చేసుకుంది. త్వరలోనే శిక్షణ ప్రారంభం కాబోతుంది. ఏఎన్‌యూతోపాటు మరికొన్ని విశ్వవిద్యాలయాల్లోనూ సినిమాలకు సంబంధించి వివిధ కోర్సులను ప్రవేశపెట్టే ఆలోచన జరుగుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాటకరంగం ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. కొందరే ఈ రంగం నుంచి వెళ్లి సినిమాల్లో రాణించారు. సినిమాల చిత్రీకరణ ఇక్కడ పెరిగేకొద్ది రంగస్థలంలోని కళాకారులకు గుర్తింపు దక్కే అవకాశముంది.

ఎన్నో ఉపయోగాలు..
సినిమాల చిత్రీకరణ అమరావతిలో జరిగితే ఎన్నో ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా సేవారంగం గణనీయమైన వృద్ధి సాధిస్తుంది. హోటళ్ల రంగం, పర్యాటకం, పన్నుల రూపంలో లభించే ఆదాయం పెరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలోనూ ఇక్కడి ప్రాంతాలకు గుర్తింపు లభిస్తుంది. లఘుచిత్రాల్ని తెరకెక్కించే స్థాయి నుంచి కంచర్లపాలెంలాంటి సినిమాల్ని చిత్రీకరించేందుకు ఈ ప్రాంత కళాకారులు, దర్శకులకు అవకాశం దక్కుతుంది. రెండున్నర గంటల వినోదం అందించే సినిమా విభిన్న అంశాల్లో రెండుతరాలకు మేలుచేసేలా మారుతుంది.

షూటింగ్‌కు అనువైన ప్రాంతాలు ఎన్నో..
*కృష్ణానది పరీవాహక ప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. కరకట్ట వెంట సినిమాలు చిత్రీకరించవచ్చు.
*కృష్ణానదిలో బోటు విహారంతోపాటు భవానీద్వీపం అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా ఉంది. ద్వీపాన్ని ముగ్దమనోహరంగా మార్చారు. అక్కడ సినిమాలు తీయవచ్చు.
*యడ్లపాడు మండలంలోని కొండవీడు కోటకు వెళ్లే రింగురోడ్డు పర్యాటక ప్రాంతంగా మారింది. ఆ రోడ్డులోనూ.. ఉండవల్లి గుహలు, కాకాని పక్షుల కేంద్రం, కైకలూరులోని కిలకిలరావాలు సినిమాల చిత్రీకరణకు అనువైనవే.అమరావతిలో మ్యూజియంతోపాటు భారీ బౌద్ధస్తూపం, శివాలయంతోపాటు కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో సినిమాలు తీయవచ్చు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి కోట, హంసలదీవి పవిత్రసంగమంల వద్ద షూటింగ్‌ చేయవచ్చు.
*చారిత్రకతతోపాటు ఆధ్మాత్మికత కోసం విజయవాడలోని గుణదల మేరిమాత కొండ, ఫిరంగిపురం కొండ, వైకుంఠపురం కొండ, కోటప్పకొండ ప్రాంతాల్లో, విజయవాడ కనకదుర్గ ఆలయంతోపాటు ఆథ్మాతికంగా ప్రముఖ దేవాలయాలు రెండు జిల్లాల్లో ఎన్నో ఉన్నాయి.
*గన్నవరం విమానాశ్రయం, విజయవాడ రైల్వేస్టేషన్‌, ఎన్టీఆర్‌ బస్‌స్టేషన్‌, గుంటూరు మానస సరోవరం ప్రాంతాలు సైతం సినిమాలు తీసేందుకు అనువుగా ఉన్నాయి. నాగార్జునసాగర్‌తోపాటు నాగార్జునకొండ, ఎత్తిపోతల ప్రాంతాల్లో గతంలో కొన్ని సినిమాల చిత్రీకరణ జరిగింది.
*సూర్యలంక తీరం సహజసిద్ధంగా ఉంటుంది. బీచ్‌ల వద్ద సన్నివేశాల చిత్రీకరణకు ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడికి రావచ్చు. పులిచింతల, నాగార్జునసాగర్‌ కుడికాల్వ, ప్రకాశం బ్యారేజిల వద్ద కొన్ని ప్రాంతాలు సినిమాలు తీసేందుకు అనుకూలంగా ఉన్నాయి.

Link to comment
Share on other sites

నాలుగు గ్రామాల్లో భూసమీకరణపై చర్చ 
రాజధానికి ఆనుకుని ఉన్న మరో నాలుగు గ్రామాల్లో భూసమీకరణ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. రాజధానిలో ప్రస్తుతం రైతులకు ఫ్లాట్లు తిరిగి ఇవ్వగా, ప్రభుత్వ అవసరాలకు భూమి తక్కువగా ఉందని.. పెదపరిమి, హరిశ్చంద్రపురం వంటి మరో నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తెచ్చి భూసమీకరణ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
entivi migilin2 villages

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...