Jump to content

Amaravati


Recommended Posts

ప్రాణం పోయినా భూములు ఇవ్వం
జేసీ ఇంతియాజ్‌కు ఉండవల్లి రైతుల స్పష్టీకరణ
amr-gen6a.jpg
ఉండవల్లి(తాడేపల్లి)న్యూస్‌టుడే:  ప్రాణం పోయినా భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఉండవల్లి సీఆర్డీఏ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ పరిధిలో భూసేకరణ, భూసమీకరణ అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ రైతులకు వివరించారు. ప్రధానంగా భూసేకరణకు సంబంధించి 154 ఎకరాలకు డీడీ ఇచ్చిన తర్వాత న్యాయస్థానం స్టే ఇచ్చిందని జేసీ తెలిపారు. సీడ్‌ యాక్సస్‌ రహదారి నిర్మాణం జరుగుతోంది... స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి భూసమీకరణలో పాల్గొనాలని కోరారు. రాజధానిలో సింహభాగమైన సీడ్‌ యాక్సస్‌ రహదారి నిర్మాణం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో జరగాల్సి ఉంది. ఉండవల్లిలో రహదారికి 50 ఎకరాలకు 15.2 ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌లో వచ్చింది. 34.8 ఎకరాలు ఇంకా రావాల్సి ఉంది.  రైతులు స్వచ్ఛందంగా పూలింగ్‌కు వస్తే రహదారి నిర్మాణం వేగంగా జరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జేసీ ఇంతియాజ్‌ తెలిపారు. సీడ్‌ యాక్సస్‌ రహదారికి బయట ఉన్న ప్రాంతంలో భూసేకరణపై హైకోర్టు స్టే ఉన్నందున దానికి లోబడే ఉంటుందని అన్నారు. భూములపై అభ్యంతరాలు ఏమైనా జిల్లా అధికారుల పరిధిలో ఉంటే పరిష్కరిస్తానని తెలిపారు. తమ పరిధిలో లేనివాటిని పభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. జేసీ ఇంతియాజ్‌ చెప్పిన మాటలతో రైతులు ఏకీభవించలేదు. భూ సమీకరణపై 11(1) నుంచి స్టే ఉందని ఉండవల్లికి చెందిన డాక్టర్‌ కన్నారావునాయుడు జేసీకి తెలిపారు. స్టే ఉండగా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయటం భావ్యం కాదని అన్నారు. కోర్టు అనుమతి తీసుకునే స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి నుంచి భూములు తీసుకుంటామని జేసీ సమాధానమిచ్చారు. యుటిలిటీ జోన్‌ పేరుతో ఉండవల్లిలోని 29 గ్రామాలకు సంబంధించి డంపింగ్‌ యార్డు చూపుతున్నారని కన్నారావునాయుడు తెలిపారు. మురుగునీటి శుద్ధి కేంద్రం, బస్సు మరమ్మతుల విభాగం, ఎలక్ట్రికల్‌ పోల్‌ విభాగాలు ఉండవల్లిలోనే పెట్టినట్లుగా రేఖా చిత్రాల్లో చూపారని అన్నారు. ఇప్పటి వరకు సీఆర్డీఏ నుంచి ఎవరూ తమ ఇబ్బందులపై అడిగిన వారు లేరని చెప్పారు. దౌర్జన్యంగా.. మరో విధంగా తీసుకోగలమనే నమ్మకంతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఉండవల్లిని డ్రైల్యాండ్‌గా రాశారు.. మాస్టర్‌ప్లాన్‌లో కరకట్టను విస్తరిస్తున్నారు. దాని కింద కొంత పొలం పోతుంది. సీడ్‌ యాక్సస్‌ రహదారికి 200 అడుగులు పోతుంది. దాని తర్వాత కొండవీటి వాగును 600 అడుగులుకు పెంచుతారు. దీని వల్ల భూములు, ఇళ్ల స్థలాలు పోతాయి. 60 మీటర్లు రహదారికి అడిగారు. ఇవ్వటానికి అభ్యంతరం లేదు... మిగిలిన పొలాలు వదిలేస్తారా అంటూ న్యాయవాది రామచంద్రరావు ప్రశ్నించారు. భూములు ఇస్తామని చెప్పేవారు ఎవరూ లేరని తెలిపారు. రోడ్డుకు తీసుకున్న భూమి కాకుండా మిగిలిన భూమిని రైతు తనకు ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందా అని ప్రశ్నించారు.
 
Link to comment
Share on other sites

On 11/20/2018 at 6:37 AM, sonykongara said:

JU42G29.jpg

 

16 minutes ago, Hello26 said:

Veellem manushulu swami. Ila ayithe Seed Access Road complete avudda before elections? 

This will be the major hurdle for Accessing Amaravati. There is no direct non-stop route to Any part of the capital now.

Seed access will be connected to NH-5 only after 2019 general elections. Babu garu doesn't want to touch Vundavall-Penumaka P**ta batch close to Election time. Unless these villages farmers see the development in Amaravati and convince themselves, there is no way this happens before 2019. Babu garu ee villages names ethithe chalu PK gaadu egesukuntu vachesthunnadu, vullipai gaadu.

Link to comment
Share on other sites

3 minutes ago, ravikia said:

 

This will be the major hurdle for Accessing Amaravati. There is no direct non-stop route to Any part of the capital now.

Seed access will be connected to NH-5 only after 2019 general elections. Babu garu doesn't want to touch Vundavall-Penumaka P**ta batch close to Election time. Unless these villages farmers see the development in Amaravati and convince themselves, there is no way this happens before 2019. Babu garu ee villages names ethithe chalu PK gaadu egesukuntu vachesthunnadu, vullipai gaadu.

court  dwarga gattiga try chesthe saripothundi

Link to comment
Share on other sites

10 minutes ago, sonykongara said:

court  dwarga gattiga try chesthe saripothundi

Kastam bro ippudu. Court ichina adi implement cheyalsindhi Govt e kada. Problem is with PK instigating the farmers with his casette group and CBN doesn't want anything instigating now. 

Edited by ravikia
Link to comment
Share on other sites

3 minutes ago, ravikia said:

Kastam bro ippudu. Court ichina adi implement cheyalsindhi Govt e kada. Problem is with PK instigating the farmers with his casette group and CBN doesn't want anything instigating now. 

vijayawada city lone chesthunnaru,court ok ante,pk gadu entha chinchukunna emi kadu.

Link to comment
Share on other sites

అమరావతి రాజధాని కాకముందే ఇక్కడ ఎకరం రూ.3కోట్ల పైమాటే..!
22-11-2018 11:01:10
 
636784816207209356.jpg
  • ఉండవల్లి రైతులకు ఊరడింపు!
  • పూలింగ్‌కి ఒప్పించేందుకు జేసీ ప్రయత్నాలు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నగరానికి భూసమీకరణ కింద భూములను ఇచ్చేందుకు ఉండవల్లి రైతులను ఒప్పించే ప్రయత్నాలను జాయింట్‌ కలెక్టర్‌ ఏఎం డీ ఇంతియాజ్‌ ముమ్మరం చేశారు. భూ సమీకరణ ప్రారంభమై ఇంచు మించుగా మూడేళ్లు పూర్తి కావొస్తోన్నా నేటికీ ఉండవల్లి గ్రామంలో చాలా మంది రైతుల నుంచి పూలింగ్‌ కింద భూములు సీఆర్‌డీఏకు అందలేదు. దాంతో భూ సేకరణ చట్టం కింద రైతుల భూములను తీసుకొనేందుకు ఆ సంస్థ నోటిఫికేషన్లు ప్రకటించగా కొంతమంది రైతులు హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు కూడా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ఒప్పించేందుకు జేసీ ఇంతియాజ్‌ చర్చలు జరుపుతున్నారు.
 
 
తొలుత 419 మంది రైతులతో ఒప్పందం
కృష్ణానది ఒడ్డున తాడేపల్లి మండలంలో ఉన్న ఉండవల్లి గ్రామంలో మొత్తం 2,051.55 ఎకరాలని భూసమీకరణ కింద తీసుకొనేందుకు సీఆర్‌డీఏ 9.1ని ప్రకటించింది. కొంత విస్తీర్ణం మెట్ట పోను మిగతా భూములన్నీ జరీబు, ప్రభుత్వ సంస్థల భూములే. 2015 జనవరి 11న భూ సమీకరణకు నోటిఫికేషన్‌ వెలువడగా, ఉండవల్లిలో 589 మంది రైతులు ముందుకొచ్చి 358.8062 ఎకరాలకు సమ్మతి(9.3) పత్రాలు అందజేశారు. వీరిలో 419 మంది రైతులతో 298.0261 ఎకరాల భూమికి 9.4 అగ్రిమెంట్‌లను సీఆర్‌డీఏ కుదుర్చుకొని వారికి కౌలు చెల్లింపులు జరుపుతున్నది. సీడ్‌యాక్సెస్‌ రోడ్డుకి సు మారు 40 ఎక రాల భూమి ఇక్కడ అవసరం.
 
 
సంప్రదింపులు
కృష్ణానది ఒడ్డున ఉండవల్లి గ్రామం ఉండటం, విజయవాడ నగరానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉండటంతో అమరావతి రాజధాని నగరం ప్రకటనకు ముందే ఇక్కడ ఎకరం రూ. 3 కోట్ల వరకు ధర ఉన్నది. ఈ కారణంతో వారు భూసమీకరణని వ్యతిరేకించారు. పలుమార్లు సంప్రదింపులు అనంతరం తమకు ఎల్‌పీఎస్‌ భూముల్లోనే ప్లాట్లు ఇస్తే పూలింగ్‌ కింద భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అయితే, ఈ ప్రాంతాన్ని గ్రీన్‌ ఫీల్డ్‌గా ప్రకటించారని, వేరొక చోట భూములు ఇస్తారని ప్రచారం జరగడంతో రైతులు ల్యాండ్‌ పూలింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రాలేదు.
 
 
జాయింట్‌ కలెక్టర్లుగా పని చేసిన డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, కృతిక శుక్ల పలుమార్లు చర్చలు జరిపినా ఆశించిన స్పందన రైతుల నుంచి కనిపించలేదు.
 
 
సమస్యలను వింటూ...
మరోవైపు రైతులతో ఎప్పుడు చర్చలు ఏర్పాటు చేసినా పోలీసు బలగాలు గ్రామంలో మొహరించేవి. ఇది రైతుల్లో మరింత వ్యతిరేకతని తీసుకొచ్చింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొన్న జేసీ ఇంతియాజ్‌ ఎలాంటి పోలీసు సహకారం తీసుకోకుండా కొద్ది రోజుల నుంచి ఉండవల్లి గ్రా మానికి వెళ్లి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకిస్తోన్నారు. వారు ప్రధానంగా కోరుతోన్నది తమకు ఎల్‌పీఎస్‌ భూముల్లోనే ప్లాట్లు ఇవ్వాలంటున్నారు. అలానే గ్రామానికి సమీపంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయొద్దని అభ్యర్థిస్తున్నారు.
 
 
హైకోర్టు విచారణలో ఉన్న భూములకు సంబంధించి తీర్పు వెలు వడేంత వరకు ఆగాలని కోరుతున్నారు. రైతుల డిమాండ్లన్నింటిని తాను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకొం టానని జేసీ హామీ ఇస్తోండటంతో రైతుల తీరులో కొంత మార్పు కనిపిస్తున్నదని అధికావర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

సీఎం చంద్రబాబు చేతికి అసెంబ్లీ స్కిన్ డిజైన్లు
22-11-2018 21:31:53
 
636785192051784722.jpg
అమరావతి: నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు అసెంబ్లీ స్కిన్ డిజైన్‌ను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్వల్ప మార్పులతో వచ్చేవారం పూర్తిస్థాయి డిజైన్లు జరుగుతాయన్నారు. నవంబర్‌ 30 కల్లా అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని సీఎం అన్నారు. తిరగబడిన లిల్లీ ఫ్లవర్‌ ఆకారంలో అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని తెలిపారు. 12.4 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందన్నారు. 250 మీటర్ల ఎత్తు, 200మీ. పొడవు, వెడల్పుతో అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ టవర్‌లో రెండు గ్యాలరీలు, ర్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...