Jump to content

Amaravati


Recommended Posts

అందరికీ అందుబాటు ధరలో ఇళ్లు
సీఆర్‌డీఏ అధికారులకు సీఎం ఆదేశం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ నిర్మించనున్న ‘హ్యాపీ నెస్ట్‌’ ప్రాజెక్టులో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో, అతి పారదర్శకంగా ఇళ్లు కేటాయించేందుకు ఐదంచెల విధానాన్ని అనుసరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నాణ్యత-అందుబాటు ధరలు, విశ్వసనీయత, ప్రజా సంతృప్తి, పూర్తి పారదర్శకత, ముందు వచ్చినవారికి ముందు.. అన్న ఐదు అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించినట్టు సీఆర్‌డీఏ మీడియా సలహాదారు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హ్యాపీనెస్ట్‌ అమరావతిలో చేపడుతున్న తొలి గృహనిర్మాణ ప్రాజెక్టు కావడంతో ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారని, ఇది సీఆర్‌డీఏ బాధ్యతను మరింత పెంచుతుందని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిపారు. హ్యాపీనెస్ట్‌లో తొలిదశలో 600 ఫ్లాట్లను అందుబాటులోకి తెస్తున్నామని, ఈ నెల 9న బుకింగ్‌ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

Link to comment
Share on other sites

సమాయత్తం
07-11-2018 08:37:46
 
636771766677596702.jpg
  • సీఆర్డీయేలో అవగాహన సదస్సులు
  • ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం రోజున 20 హెల్ప్‌డెస్క్‌లు
  • ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు
  • సందేహాల నివృత్తికి సంసిద్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రోచర్‌ను ఆవిష్కరించిన క్షణం నుంచే అన్ని వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న హ్యాపీనెస్ట్‌ (అమరావతిలోని ప్రప్రథమ ప్రజా నివాస సముదాయం)పై వారికి మరింత అవగాహన కల్పించేందుకు సీఆర్డీయే సమాయత్తమవుతోంది. ఈ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని తొలిదశకు ఈనెల 9వ తేదీన బుకింగ్‌లు ప్రారంభమవనున్న దృష్ట్యా అంతకు ముందురోజు అంటే గురువారంనాడు అవగాహన సదస్సులను నిర్వహించబోతోంది. అంతేకాకుండా బుకింగ్‌లు చేసుకోవాలనుకునే ప్రజల సౌలభ్యం కోసం శుక్రవారం హెల్ప్‌ డెస్క్‌లను సైతం ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు.
 
అమరావతి(ఆంధ్రజ్యోతి): హ్యాపీనెస్ట్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు గత కొన్నిరోజులుగా వేలాదిమంది సీఆర్డీయే వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. సీఆర్డీయే ఇచ్చిన నెంబర్‌కు వందలాదిమంది ఫోన్లు చేస్తున్నారు. వీరిలో పలువురు మరిన్ని వివరాల గురించి వాకబు చేయడంతోపాటు బుకింగ్‌ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారు. ఈ సందర్భంగా పలు సందేహాలు, అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని శ్రీధర్‌ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలోని కింది అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో ఈనెల 8వ తేదీ ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గంటకొకటి చొప్పున అవగాహన సదస్సులను నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు.ఒక్కో సదస్సులో సుమారు 100మంది వరకు పాల్గొనేందుకు వీలుంటుందన్నారు. ఈ సదస్సుల్లో హ్యాపీనె్‌స్టకు సంబంధించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను చూపడమే కాకుండా బుకింగ్‌ ప్రక్రియను ఏ విధంగా చేసుకోవాలో సవివరంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు వెలిబుచ్చే అనుమానాలు, సందేహాలను సీఆర్డీయే అధికారులు నివృత్తి చేస్తారని చెప్పారు. 
 
హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు..
హ్యాపీనెస్ట్‌ తొలి దశలో భాగంగా అందులోని 3 టవర్లలో ఉండే 300 డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్ల బుకింగ్‌ ప్రారంభమయ్యే శుక్రవారంనాడు కూడా వాటిని బుక్‌ చేసుకోవాలనుకునే వారి సౌకర్యార్ధం హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీధర్‌ తెలిపారు. విజయవాడలోని సీఆర్టీయే ప్రధాన కార్యాలయం పార్కింగ్‌ ప్రదేశంలో 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 20 హెల్ప్‌డెస్క్‌లు పని చేయడం ప్రారంభిస్తాయన్నారు. హ్యాపీనె్‌స్టలోని ఫ్లాట్లను బుక్‌ చేసుకోవాలనుకునే వారు వీటిని ఆశ్రయిస్తే, అక్కడి అఽధికారులు సత్వరమే వారు కోరుకున్న అపార్ట్‌మెంట్ల బుకింగ్‌ ప్రక్రియను పూర్తి చేయడంలో సహకరిస్తారని తెలిపారు. ఈ అవకాశాలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.
 
ఇవీ బుకింగ్‌ మొత్తాల వివరాలు
awerhawerte.jpgహ్యాపీనె్‌స్టలో మొత్తం 12 టవర్లలో 1,200 ఫాట్లు రానున్నాయి. ఇవి 12 సైజుల్లో ఉంటాయి. అన్నీ తూర్పు లేదా పడమర ముఖంతో మాత్రమే ఉండే ఈ ఫ్లాట్లలో తొలిదశలో భాగంగా 3 టవర్ల (ఏ, బీ, సీ)లో 300 డబుల్‌, ట్రిబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లను నిర్మించాలని సీఆర్డీయే నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి వీటి ఆన్‌లైన్‌ బుకింగ్‌లను ప్రారంభించనుంది. ఒకవేళ వీటిల్లో 80 శాతానికిపైగా బుకింగ్‌ అయినట్లయితే మలిదశలో మరొక 3 టవర్లలోని 300 అపార్ట్‌మెంట్లకు బుకింగ్‌లు నిర్వహిస్తారు. అయితే హ్యాపీనెస్ట్‌ పట్ల వ్యక్తమవుతున్న స్పందన దృష్ట్యా తొలి 300 ఫ్లాట్లకు బుకింగ్‌ అది ప్రారంభమైన తొలి రోజునే అయిపోతుందని అధికారులు నమ్మకంతో ఉన్నారు.
 
బుకింగ్‌ అమౌంట్లు
హ్యాపీనెస్ట్‌లోని ఫ్లాట్లలోని 12 క్యాటగిరీలు, వాటి బుకింగ్‌ అమౌంట్ల వివరాలిలా ఉన్నాయి. 1225, 1295 చదరపుటడుగుల ఫ్లాట్లకు రూ.2.50 లక్షల చొప్పున, 1510, 1590 చ.అ.లకు రూ.3 లక్షల చొప్పున, 1630, 1710 చ.అ. ఫ్లాట్లకు రూ.3.50 లక్షల చొప్పున, 1870, 1980 చ.అ.లకు రూ.4 లక్షల లెక్కన, 2120, 2245 చ.అ.లకు రూ. 5 లక్షల చొప్పున, 2635, 2750 చదరపుటడుగుల విస్తీర్ణం ఉండే వాటికి రూ.7 లక్షల చొప్పున బుకింగ్‌ అమౌంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తాలను ఆన్‌లైన్‌లో దాఖలు చేసే అప్లికేషన్లతోపాటే నెట్‌ బ్యాంకింగ్‌ లేదా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించాలి. డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు, చెక్కులు, నగదు రూపంలో చెల్లించేందుకు వీలుండదు. ఈ మొత్తాన్ని ఆ తర్వాత జరిపే చెల్లింపుల్లో మినహాయిస్తారు.
 
ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌
aernAEr.jpgమొదట బుక్‌ చేసుకున్న వారికి మొదటగా (ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన) ఈ ఫ్లాట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం నిర్ణయించిన ధరలను అవసరమైతే పెంచే అధికారం సీఆర్డీయేకు ఉంటుంది. అయితే యూనిట్లను బుక్‌ చేసినంతనే వాటిని కేటాయించినట్లుగా భావించరాదని, బుకింగ్‌ అమౌంట్‌ను చెల్లించిన 30 రోజుల్లోగా అగ్రిమెంట్‌ టు సేల్‌ను చేసుకుంటేనే ఫ్లాట్లను కేటాయించినట్లని నిబంధనల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఎవరన్నా నిర్ణీత గడువులోగా సేల్‌ అగ్రిమెంట్‌ను చేసుకోలేని పక్షంలో వారు చెల్లించిన బుకింగ్‌ అమౌంట్‌ నుంచి 50 శాతాన్ని మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తారు.
 
2020 డిసెంబర్‌కల్లా పూర్తి..
హ్యాపీనెస్ట్‌ పనులను ఈ ఏడాది ముగిసేలోపే మొదలుపెట్టాలని సీఆర్డీయే భావిస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు ఏపీ రెరా యాక్ట్‌ నిబంధనల ప్రకారం 36 నెలలు (2021 డిసెంబర్‌) వరకు గడువుంది. అయినప్పటికీ పనులను చకచకా జరిపించి, ఒక ఏడాది ముందుగానే అంటే 2020, డిసెంబర్‌నాటికే 12 టవర్లనూ పూర్తి చేసి, కొనుగోలుదారులకు అప్పగించాలనే లక్ష్యంతో సీఆర్డీయే ముందుకు సాగుతోంది.
Link to comment
Share on other sites

సీఆర్డీఏ హ్యాపీనెస్ట్‌ ప్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభం
09-11-2018 09:19:16
 
636773519579777600.jpg
విజయవాడ: అమరావతిలోని కీలక ప్రాంతంలో 12 వందల అపార్ట్‌మెంట్ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందు కోసం నేలపాడు వద్ద 15 ఎకరాల్లో హ్యాపీనెస్ట్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీని నిర్మించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. చదరపు అడుగు రూ.3,492 వ్యయంతో ఈ నిర్మాణం జరుగనుంది. ఇందుకు సంబంధించి ఫ్లాట్ల బుకింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. వినియోగదారుల కోసం 20 హెల్ప్ డెస్క్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒకేసారి లక్షమంది కనెక్ట్‌ అయ్యే విధంగా సర్వర్‌‌ను ఏర్పాటు చేశారు. దేశవిదేశాల నుంచి హ్యాపీనెస్ట్ బుకింగ్‌కు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. ప్రారంభమైన మొదటి ఐదు నిమిషాల్లోనే సర్వర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దాదాపు 75 వేల మంది సర్వర్‌తో అనుసంధానం అయ్యారు. తాకిడి ఎక్కువగా ఉండటంతో సర్వర్‌ నెమ్మదించింది. మొదటి 20నిమిషాల్లో 75శాతం ప్లాట్లు బుకింగ్‌ అయినట్లు అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

నేటినుంచి ‘హ్యాపీనెస్ట్‌’ బుకింగ్‌లు
09-11-2018 03:09:35
 
  • మరో 300ఫ్లాట్ల విక్రయానికి సీఎం అనుమతి
అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మొట్టమొదటి ప్రజా నివాస సముదాయం ‘హ్యాపీనెస్ట్‌’ ఫ్లాట్ల తొలిదశ బుకింగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 1,200 ఫ్లాట్లతో నిర్మితం కానున్న ఈ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో 300 ఫ్లాట్ల బుకింగ్‌ను ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తున్నామని ఏపీసీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఇప్పటికి 17వేలకు పైగా ఆన్‌లైన్‌, ఫోన్‌ విచారణలు వచ్చాయని ఆయన సీఎం చంద్రబాబుకు వివరించారు. దీంతో మరో 300 ఫ్లాట్లకూ త్వరలోనే బుకింగ్‌ జరిపేందుకు సీఎం అనుమతించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో గురువారం ఏపీసీఆర్డీయే సమీక్షా సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, హ్యాపీనెస్ట్‌ అపార్ట్‌మెంట్లను పూర్తి పారదర్శకంగా, ‘మొదట దరఖాస్తు చేసుకున్నవారికే మొదట’ ప్రాతిపదికన కేటాయించాలన్నారు. తొలివిడతలో 80శాతానికి పైగా బుక్‌ అయితే వెంటనే మరో 300ఫ్లాట్లకు బుకింగ్‌ జరపడానికి ఆయన అనుమతి ఇచ్చారు. అవీ అయిపోతే ప్రాజెక్ట్‌లో మిగిలిన 600అపార్ట్‌మెంట్లకు కూడా బుకింగ్‌ ప్రారంభించాలని సూచించారు.
Link to comment
Share on other sites

హ్యాపీనెస్ట్‌లో.. మరో 300 ఫ్లాట్లు
09-11-2018 08:29:13
 
636773489543767736.jpg
  • విక్రయానికి సీఎం అనుమతులు
  • ప్రజల నుంచి లభిస్తున్న స్పందనే కారణం
  • సీఆర్డీయే సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాలు
  • నేటి ఉదయం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ప్రారంభం
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధానిలో సీఆర్డీయే ఆధ్వర్యంలో 1,200 ఫ్లాట్లతో నిర్మితమవనున్న హ్యాపీనెస్ట్‌కు లభిస్తున్న స్పందన దృష్ట్యా మరో 300 ఫ్లాట్లకూ త్వరలోనే బుకింగ్‌ జరిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమతించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో చంద్రబాబు గురువారం సీఆర్డీయే 21వ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హ్యాపీనెస్ట్‌లోని తొలి మూడు టవర్లలోని 300 ఫ్లాట్ల బుకింగ్‌ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారం భిస్తున్నామని సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివ రాలు తెలుసుకునేందుకు ఇప్పటికి 17,000కు ఆన్‌లైన్‌, ఫోన్‌ విచారణలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హ్యాపీనెస్ట్‌ ఫ్లాట్లలో నాణ్యతకు, సామాజిక మౌ లిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా, మొదట దరఖాస్తు చేసుకున్న వారికే మొదటగా కేటాయింపు ప్రాతిపదికన కేటాయించాలన్నారు. తొలి విడత బుకింగ్‌ జరిగే 300 ఫ్లాట్లలో 80 శాతంపైగా బుక్‌ అయినట్లయితే ఆ వెంటనే మరొక 300లకు బుకింగ్‌ జరపాల్సిందిగా పేర్కొన్నారు.
 
ttdf6df7bn.jpgఅవి కూడా బుక్‌ అయితే ఈ ప్రాజెక్ట్‌లోని మిగిలిన 600 అపార్ట్‌మెంట్లకు కూడా బుకింగ్‌ జరపాలన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైతే మరో 1200 ఫ్లాట్లతో కూడిన మరొక ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించవచ్చునని సూచించారు. వీటికి ఆయా ప్రదేశాల్లో ఉన్న భూమి ధరలకు అను గుణంగా ధరలను నిర్ణయించాలన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చదరపు అడుగు ధర రూ.4,000 నుంచి రూ.7,000 మధ్యనే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. అవసరమైతే అఖిల భారత సర్వీస్‌ అధికారుల కోసం కూడా హ్యాపీనెస్ట్‌ తరహా గృహాలను నిర్మిస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని న్యాయపరమైన వివాదాలతో హైదరాబాద్‌లో తాము గృహాలను పొందలేకపోయామని, దీనిని దృష్టిలో ఉంచుకుని అమరావతిలో తమకు రాయితీ ధరలపై ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందిగా ఎన్జీవోలు కోరుతున్నారని శ్రీధర్‌ తెలిపారు. స్పందించిన సీఎం వారి వేతన స్కేళ్లకు అను గుణంగా ప్లాట్ల కేటాయింపునకు నిర్దిష్ట కార్యా చరణ ప్రణాళికతో ముందుకు రావాలన్నారు.
 
జనవరి 1న ఏఐఎస్‌ ఫ్లాట్లలో తొలి టవర్‌ ప్రారంభం..
ఏఐఎస్‌ కోసం నిర్మిస్తున్న టవర్లలో తొలి టవర్‌లోని 24 ఫ్లాట్ల నిర్మాణం వచ్చే నెల 15వ తేదీనాటికి పూర్తవుతుందని శ్రీధర్‌ తెలిపారు. దీంతో వాటికి 2019, జనవరి 1న ప్రారంభోత్సవం జరుపుదామని చంద్రబాబు చెప్పారు. నీరుకొండలో ఏర్పాటు చేయనున్న దివంగత ముఖ్య మంత్రి ఎన్జీ రామా రావు విగ్రహ రూపకల్పనలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదే శించారు. అమరావతి సెంట్రల్‌ పార్క్‌ (శాఖమూరు పార్క్‌) నిర్మాణంపై వివిధ సూచనలిచ్చారు. ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి, ఇతర అధికారులు మాట్లాడుతూ సీఆర్డీయే పరిధిలోని వివిధ ప్రాజెక్టులకు కలిపి మొత్తం 11,237 మంది కార్మికులు అవసరంకాగా ప్రస్తుతం 8,428మంది పనిచేస్తున్నారని, భవనాలు, రోడ్ల నిర్మా ణాలకు 29,120 మంది అవసరమైతే 16,408 మంది ఉన్నారని, ఎల్పీఎస్‌ జోన్లకు 16,698 మంది కావాల్సి ఉండగా 7,230 మంది పనిచేస్తున్నారని వివరించారు. స్పందించిన సీఎం పనులను గడువులోగా పూర్తి చేయా లంటే తగినన్ని మానవ వనరులను సమ కూర్చుకోవడం అత్యవసరమన్నారు. వారం లోగా మానవ వనరులను పెంచుతామని మంత్రి పి.నారాయణ తెలిపారు.
 
సుందరీకరణ పనుల్లో వేగం పెరగాలి..
విజయవాడ నగరంలోని కాలువల సుంద రీకరణకు ఎదురవుతున్న ప్రతిబంధకాలను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు, విజయవాడ నుంచి గన్నవరం వరకు చేపట్టిన సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. విజయవాడలోని కొండలనూ ఆకర్షణీయంగా మలచాలన్నారు. రాజధాని ప్రాంతంలో కొండలెన్ని ఉన్నాయో నోటిఫై చేయాలన్న ఆయన వాటన్నింటినీ అభివృద్ధి చేస్తే పర్యాటకరంగ ప్రగతికి ఎంతగానో దోహదపడతాయన్నారు. అమరావతి పరిస రాల్లో ప్రతిపాదిత 4, 3 స్టార్‌ హోటళ్ల నిర్మాణాలు వేగంగా జరిగి, సాధ్యమైనంత త్వరగా 10,000 హోటల్‌ గదులు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఒక కన్వెన్షన్‌ సెంటర్‌నూ శీఘ్రంగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో గృహ నిర్మా ణాలను కూడా సమీక్షించిన సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 19 లోగా 1.20 లక్షల ఇళ్లను పూర్తి చేయాలన్నారు. వీటి లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా జరపాలన్నారు. ఈ ప్రాజెక్ట్‌లకు అవసరమైన వనరుల సమీకరణకు సంబంధితులతో ఒక సమా వేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు. నగరాలతోపాటు గ్రామాల్లోని నివాసప్రాంతాలను సుందరంగా, గేటెడ్‌ కమ్యూనిటీల మాదిరిగా తీర్చిదిద్దడం తమ తదుపరి ప్రాధాన్యతగా పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో ఇందుకోసం విరివిగా మొక్కలను నాటాలని, ఇతర అభివృద్ధి చర్యలను చేపట్టాలని సూచించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...