sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 రైలు మార్గంపై కేంద్రం చిన్న చూపు03-02-2019 07:50:33 అమరావతి-ఎర్రుపాలెం మార్గానికి రూ.10లక్షలు విదిల్చిన వైనం ప్రజల ఆశలు నిరాశలు కంచికచర్ల : అమరావతి-ఎర్రుపాలెం రైల్వే మార్గం ఇప్పట్లో ఏర్పాటయ్యే సూచన లు కనిపించట్లేదు. ఈ లైను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.10 లక్షలు విదిల్చింది. దీనిపై ఎన్నో ఆశలు పె ట్టుకున్న ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాజధాని అమరావతి నుంచి విజయవాడ జంక్షన్‌తో సంబంధం లేకుండా డోర్నకల్ మార్గం ద్వారా నేరుగా హైదరా బాద్ వెళ్లేలా మూడేళ్ల క్రితం ఎర్రుపాలెం రైల్వేలైనును తెర మీదకు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పాటు అప్పట్లో కేంద్రంలోని బీజేపీ పెద్దలు అనుకూలంగా ఉండటంతో 57 కిలో మీటర్ల పొడవైన విజయవాడ - గుంటూరు మార్గం లో నంబూరు నుంచి వయా అమరావతి మీదుగా ఎర్రుపాలెం రైల్వే లైను విషయమై సర్వే కూడా చేశారు. జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు మండలాల మీదుగా మీదుగా ఎర్రుపాలెం వద్ద విజయవాడ - డోర్నకల్ లైనుకు అనుసంధానమవుతుంది. కొత్తపేట, గొట్టుముక్కల, చెన్నారావుపాలెం గ్రామాల వద్ద రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాల నుకున్నారు. మొదట్లో సింగిల్ లైను వేయా లని నిర్ణయించారు. ఆ తర్వాత డబుల్ లైనుగా ప్రతిపాదించారు. ఇందుకోసం ఒకేసారి భూసేకరణ చేయాలనుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆమోదం కోసం పంపిన ప్రతిపాదనలు రైల్వే బోర్డులో ఉన్నాయి. ఈలోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వైరం ఈ రైల్వే లైనుకు బ్రేక్ వేసింది. లైను కోసం అయ్యే ఖర్చులో కొంత మొత్తం రాష్ట్రం భరించాలని బోర్డు అధికారులు మెలిక పెట్టారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించ లేదు. దీంతో రైల్వే లైనుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ప్రారంభంలో సర్వే కోసం రూ.50 కోట్లు కేటాయించిన కేంద్రం తర్వాత మొం డిచేయి చూపింది. శుక్రవారం పార్లమెం ట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.10 లక్షలే కేటాయించారు. నాడు అలా.. నేడు ఇలా.. ఈ రైల్వే లైను ఏర్పడితే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందడానికి అవకాశా లుం టాయి. అమరావతి రాజధాని కాక ముం దే కంచికచర్లలో రియల్ ఎస్టేట్ రంగంలో బూమ్ వచ్చింది. భూముల ధరలు ఆకాశా న్నంటాయి. రోడ్డు పక్కన ఎకరం రూ.1.50 కోట్లు పలికింది. రోడ్డు సదుపాయం లేని డొంకల్లో సైతం ఎకరం రూ.25 లక్షలకు తగ్గలేదు. అలాంటిది మూడేళ్ల నుంచి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ తిరోగమిస్తోంది. రాజధానికి ముఖ ద్వారంగా, చేరువగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు, కంపెనీలు, ఇతర సంస్థల ఏర్పాటు రూపంలో చెప్పుకోదగిన అభివృద్ధి జరగక పోవటమే ఇందుకు కారణం. అవుటర్ రింగ్ రోడ్డు కూడా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇన్నర్ రింగు రోడ్డు టెండరు దశలో ఉంది. అదిగో ఇదిగో అంటున్నారు తప్పితే దాము లూరు-వైకుంఠపురం రిజర్వాయరుకు సం బంధించి క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించ లేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం గుంటూరు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జన రల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, అమ రావతి రైలు మార్గాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉందని, సింగిల్ లైనుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పటంతో ఈ ప్రాంత ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. అ లాంటిది బడ్జెట్‌లో కేటాయిరపులు లేకపో వడం పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 నేలపాడులో ఏపీ హైకోర్టు03-02-2019 10:20:25 అమరావతి: సొంతగడ్డపై ఆంధ్రప్రదేశ్ న్యాయపాలన ప్రారంభంకాబోతోంది. ఐదు కోట్ల ఆంధ్రులు సగర్వంగా తలెత్తుకునే విధంగా అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏపీ హైకోర్టు నిర్మాణాన్ని ఏపీ సీఆర్డీఏ పూర్తి చేసింది. అమరావతి నేలపాడులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. నేలపాడు నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏబీఎన్‌లో...
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 ఏపీ హైకోర్టు శాశ్వత భవనానికి శంకుస్థాపన03-02-2019 11:21:35 అమరావతి: హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 450 ఎకరాల్లో భౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.819 కోట్లతో 12.2 లక్షల అడుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగనుంది.
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 రాజధాని డిజైన్లను పరిశీలించిన గొగోయ్ దంపతులు03-02-2019 12:19:12 అమరావతి: ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ డిజైన్లను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్మిస్తోన్న తొమ్మిది నగరాల గురించి గొగోయ్ దంపతులకు సీఆర్డీఏ కమిషనర్ వివరించారు. అలాగే హైకోర్టు ఐకానిక్ నమూనాను సీజే గొగోయ్, ఎన్వీ రమణ, చంద్రబాబు పరిశీలించారు. న్యాయమూర్తులకు డిజైన్స్‌ను నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు వివరిస్తున్నారు.
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 అమరావతిలో‘నల్సార్’కు సహకరించాలి:చంద్రబాబు అమరావతి: రాజధానిలో నిర్మించే నవనగరాల్లో న్యాయ నగరం కూడా ఒకటని.. బౌద్ధ స్థూపం రీతిలో అద్భుతంగా దాన్ని నిర్మిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల త్యాగం వృథాకాకుండా రాజధానిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు శాశ్వత భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. న్యాయనగరంలోనే న్యాయాధికారులు, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోర్టుల్లో 1.70 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తామని, ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయవ్యవస్థకు దోహదం పడతాయని చెప్పారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. అమరావతి అందాలు ఆకట్టుకుంటాయి 2022 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని.. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు తాము ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అద్భుతమైన పర్యాటక ప్రాంతాల ఏర్పాటు కూడా తమ ప్రణాళికలో భాగమేనన్నారు. రాజధానికి వచ్చే అతిథులను అమరావతి అందాలు ఆకట్టుకుంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశానని, అమరావతిలో కూడా నల్సార్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సహకరించాలని కోరారు. అమరావతిలో ఉండే న్యాయాధికారులు, సిబ్బందికి ఉచిత వసతి కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణంలో ఎన్నో సమస్యలు, అవాంతరాలను అధిగమిస్తున్నామని.. తమకు సహకరిస్తున్న ప్రజలు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతులు భూమి ఇవ్వకుంటే ఇదంతా సాధ్యమయ్యేదే కాదన్నారు.
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 Just now, sonykongara said: అమరావతిలో‘నల్సార్’కు సహకరించాలి:చంద్రబాబు అమరావతి: రాజధానిలో నిర్మించే నవనగరాల్లో న్యాయ నగరం కూడా ఒకటని.. బౌద్ధ స్థూపం రీతిలో అద్భుతంగా దాన్ని నిర్మిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల త్యాగం వృథాకాకుండా రాజధానిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు శాశ్వత భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. న్యాయనగరంలోనే న్యాయాధికారులు, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోర్టుల్లో 1.70 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తామని, ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయవ్యవస్థకు దోహదం పడతాయని చెప్పారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. అమరావతి అందాలు ఆకట్టుకుంటాయి 2022 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని.. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు తాము ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అద్భుతమైన పర్యాటక ప్రాంతాల ఏర్పాటు కూడా తమ ప్రణాళికలో భాగమేనన్నారు. రాజధానికి వచ్చే అతిథులను అమరావతి అందాలు ఆకట్టుకుంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశానని, అమరావతిలో కూడా నల్సార్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సహకరించాలని కోరారు. అమరావతిలో ఉండే న్యాయాధికారులు, సిబ్బందికి ఉచిత వసతి కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణంలో ఎన్నో సమస్యలు, అవాంతరాలను అధిగమిస్తున్నామని.. తమకు సహకరిస్తున్న ప్రజలు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతులు భూమి ఇవ్వకుంటే ఇదంతా సాధ్యమయ్యేదే కాదన్నారు. nuvvu e mata adgutavu aukunna adigavu.
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 N Chandrababu NaiduVerified account @ncbn 31m31 minutes ago నేలపాడులో నిర్మించిన హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సీజేఐ రంజన్ గొగోయ్‌తో కలిసి నేడు ప్రారంభించాము. జ్యుడిషియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన హైకోర్టును చూసి అతి తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా భవనాన్ని పూర్తి చేయడం పట్ల న్యాయమూర్తులందరూ హర్షం వ్యక్తం చేశారు.
Nfan from 1982 Posted February 3, 2019 Posted February 3, 2019 7 minutes ago, sonykongara said: Looking awesome
r_sk Posted February 3, 2019 Posted February 3, 2019 8 minutes ago, chanti149 said: ...flag? Front Garden Area lo hoist chesinattunnaru....
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 9 minutes ago, chanti149 said: ...flag? unnadi ga
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 (edited) Edited February 3, 2019 by sonykongara mahesh1987 1
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 na chinnapuddu Guntur arundalpet lo ma school daggra godala meda high court bench kavali ani rasi unedevi,appudu ardam ayyedi kadu high court bench ante ento,ippudu high court vacchesindi.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now