Jump to content

Recommended Posts

Posted

Dredging works in Krishna River for Pillar Foundations have been started a week ago with 6-8 Dredging machines on work at respective pillar locations for ICONIC BRIDGE which had foundation ceremony on Jan 12, 2019 recently.. L&T is taking up this Prestigious Project

DyFFECDU8AEqLUZ.jpg
DyFFEo6U8AADl_h.jpg
Posted
శ్రీవారి ఆలయానికి.. సుముహూర్తం
30-01-2019 08:10:34
 
636844326352111064.jpg
  • రేపే ముఖ్యమంత్రిచే శంకుస్థాపన
  • ఇప్పటికే 25 ఎకరాల కేటాయింపు
  • ఐదెకరాల్లో ఆలయ నిర్మాణం
  • మొదటి విడత రూ.135 కోట్లు కేటాయించిన టీటీడీ
తుళ్లూరు: రాజధాని అమరావతిలో కృష్ణానదీ తీరాన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 31న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల లోపు ముహుర్తం ఖరారైంది. వెంకటపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన నదీ తీరాన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయ నిర్మాణం జరగబోతోంది. సోమవారం నుంచి శంకుస్థాపనకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రారంభించారు. సీఎం రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పోలీస్‌లు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
 
5asewtawe.jpgబాంబ్‌ స్కాడ్‌ అణువణువునా తనిఖీలు నిర్వహిస్తోంది. ఐదెకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నారు. ముందుగా టీటీడీ రూ.135 కోట్లు ఇందుకు ఖర్చు చేస్తోంది. మిగిలిన 20 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎలా ఉంటుందో, అదేరీతిలో ఏ మాత్రం తీసిపోకుండా ఆలయ నిర్మాణం జరగనుంది .నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు, ప్రధాన ద్వారం వద్ద మరో గాలి గోపురం, ఆలయ శిఖరం నిర్మాణం చేస్తారు. ఆలయం పూర్తిగా అభివృద్ధి చేయడానికి రూ.400 కోట్లు ఖర్చు కాగలదని టీటీడీ అంచనా వేసింది.
Posted
On 1/29/2019 at 9:47 AM, sonykongara said:
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

 

28ap-state10a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణానికి సోమవారం అంకురార్పణ జరిగింది. తితిదే నుంచి వచ్చిన వేదపండితుల ఆశీర్వచనాలతో సోమవారం ఉదయం ఆచార్యవరణం, అంకురార్పణ పూజతో పనులకు శ్రీకారం చుట్టారు. సీడ్‌యాక్సెస్‌ రహదారి సమీపంలోని వెంకటపాలెం వద్ద శ్రీవారి క్షేత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయ నిర్మాణ ప్రదేశంలో భూకర్షణ నిర్వహించనున్నారు.

 

This is going to change face of amatavathi completely imo, ttd funding kabatti no issues n worries...

Posted
కూల్‌.. కూల్‌.. కేపిటల్‌
31-01-2019 04:08:57
 
636845045385273840.jpg
  • ఇంటింటికీ పైపు ద్వారా ఏసీ
  • రాజధానికి వినూత్న చల్లదనం
  • దుబాయ్‌ కంపెనీ ముందుకు
  • రూ.260కోట్లు,20వేల టన్నుల
  • సామర్థ్యంతో ఒక్కో ఏసీ ప్లాంటు
  • భూమి,డక్ట్‌ సర్కార్‌ ఇస్తే చాలు
  • ఖర్చంతా భరించనున్న కంపెనీ
  • 2.5 ఎకరాల్లో ఏర్పడే ప్లాంటుతో
  • 500 ఎకరాల్లోని భవంతికి ఏసీ
అమరావతి: ఇంటింటికీ పైపుల ద్వారా మంచినీళ్లు, గ్యాస్‌ సరఫరా చేస్తున్నట్లే, ఏపీ కూడా సరఫరా చేసే రోజులు వచ్చేశాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇంటింటికీ పైపుల ద్వారా ఏసీని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ బుధవారం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఈ విష యం తెలిపారు. దుబాయ్‌కి చెందిన తబ్రీద్‌ అనే సంస్థ నూతన రాజధానిలో ఈ సౌకర్యం కల్పించడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థతో సీఆర్‌డీఏ ఇప్పటికే దీనిపై ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొంది. దుబాయ్‌లో ఇప్పటికే ఈ తరహా విధానం అమలు అవుతోంది. రాష్ట్ర ప్రభు త్వ అధికారులు అక్కడకు వెళ్లి చూసి సంతృప్తి చెందిన తర్వాత దానిని అమరావతిలో అమలు చేయడానికి పచ్చ జెండా ఊపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా ఈ విధానం అమల్లోకి వస్తుండటం విశేషం. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం అనే విధానం ద్వారా దీనిని అమలు చేస్తారు.
 
రెండున్నర ఎకరాల్లో ఏర్పాటయ్యే ఒక ప్లాంట్‌ సుమారుగా 500 ఎకరాల్లో నిర్మితమయ్యే భవనాలకు అవసరమయ్యే ఏసీని సరఫరా చేస్తుంది. భారీ కంప్రెసర్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. దీని నుంచి పైపుల ద్వారా చల్లదనం ఈ భవనాలకు సరఫరా అవుతుంది. అక్కడ అంతర్గతంగా నిర్మించే పైపుల ద్వారా ప్రతి గది కి చల్లదనం చేరుతుంది. ఈ విధానంలో ఈ తరహా సౌకర్యం పొందేవారు విడిగా ఏసీ యంత్రాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏసీ సరఫరా, నియంత్రణకు అవసరమయ్యే పరికరాలను మాత్రం గదుల్లో ఏర్పాటు చేసుకొంటే సరిపోతుంది. ఒక ప్లాంట్‌ ఏర్పాటుకు సుమారుగా రూ. 260 కోట్లు వ్యయం అవుతుంది. ఈ డబ్బును తబ్రీద్‌ సంస్థ తానే పెట్టుబడి పెడుతుంది. ఏసీ సరఫరా ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టుకొంటుంది.
 
అహ్మదాబాద్‌ తరువాత..
 
భారతదేశంలో ఇప్పటివరకూ పైపులైన్‌ ఏసీ సదుపాయం గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని గిఫ్ట్‌ సిటీ అనే భ వనానికి ఉంది. 5 వేల టన్నుల ఏసీని ఈ భవనానికి సరఫరా చేస్తున్నారు. అమరావతిలో అంత కంటే భారీ గా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కో ప్లాంట్‌ 20 వేల టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు అవుతోంది. అవసరమై తే దానిని 40 వేల టన్నులకు విస్తరించగలిగే అవకా శం ఉంది. నగరంలో నిర్మాణాలు పెరుగుతున్న కొద్దీ ఇటువంటి ప్లాంట్లు మరిన్ని వ చ్చే అవకాశం ఉంది. దు బాయ్‌లో ఇటువంటి ప్లాంట్లు 90 ఉన్నాయి. దేశంలో ఇంత విస్తృత స్థాయిలో ఇటువంటి ప్లాంట్లు నవీన టెక్నాలజీతో అమరావతిలోనే ఏర్పాటు అవుతున్నాయి.
 
తన్నుకుపోయిన తబ్రీద్‌
 
అమరావతిలో పైపులైన్‌ ఏసీ ఏర్పాటుకు సింగపూర్‌ పవర్‌ సంస్థ కూడా పోటీ పడింది. తబ్రీద్‌ తక్కువ ధరకు అందివ్వడానికి ముందుకు రావడంతో దానిని ఎంపిక చేశారు. ప్రభుత్వం దానికి అవసరమైన భూమి, పైపుల ఏ ర్పాటుకు డక్ట్‌లో సదుపా యం మాత్రం ఇవ్వాల్సి ఉం టుంది. మంచినీరు, విద్యుత్‌ వంటి వాటి కోసం అమరావతిలో ప్రతి రోడ్డు వెం టా ఇప్పుడు సిమెంట్‌ డక్ట్‌లు నిర్మిస్తున్నారు. అందులోనే ఈ పైపులకు కూడా చోటు కల్పిస్తారు. అమరావతిలో కొత్త సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్‌, హై కోర్టు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల నివాస భవనాలకు కలిపి రెండు ప్లాంట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. సింగపూర్‌ స్టార్టప్‌ సిటీ కి రెండు ఏసీ ప్లాంట్లు కావాలని అంచనా. ఆ సిటీకి కూడా ఈ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. హ్యాపీ నెస్ట్‌ పేరుతో సీఆర్‌డీఏ నిర్మిస్తున్న నివాస సముదాయాలు 1- 2 దశల భవనాలకు కూడా ఈ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రైవేట్‌ సంస్థలు తమకు కూడా ఇటువంటి సదుపాయం కావాలంటే సంబంధిత సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
 
కేసీఆర్‌ అలా అన్నా..
 
అమరావతిలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మితం అవుతోందని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఇందులో 17 వేల మంది ఉద్యోగులు పనిచేయబోతున్నారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రస్తుత సచివాలయం పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, అమరావతిలో అవసరం లేకుండా పెద్ద సచివాలయం నిర్మిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఈ వ్యాఖ్యల ప్రస్తావన శ్రీధర్‌ వద్ద వచ్చింది. ‘‘అమరావతి సచివాలయం నమూనా వేరు. హైదరాబాద్‌ సచివాలయంలో డైరెక్టరేట్లు, కమిషనరేట్లు లేవు. అవన్నీ నగరంలో వివిధ ప్రదేశాల్లో వివిధ భవనాల్లో ఉన్నాయి. మేం ఇక్కడ కొత్త సచివాలయంలో వీటన్నింటిని అందులోకి తెచ్చేస్తున్నాం. చాలావరకూ కార్పొరేషన్లు కూడా ఇందులోకే వచ్చేస్తాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ కొత్త సచివాలయంలోకి వచ్చేస్తాయి. ప్రజలు అనేక చోట్లకు తిరగాల్సిన పని లేకుండా అన్నీ ఒక చోటే ఉంటాయి. ఒక శాఖకు సంబంధించిన కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టరు, అనుబంధ శాఖలు, వాటి అధికారులు, కార్పొరేషన్లు అన్నీ ఒక చోటే ఉండేలా ముఖ్యమంత్రి ఈ సచివాలయాన్ని నిర్మింప చేస్తున్నారు. అందుకే ఇంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. ఈ కార్యాలయాలు అన్నింటిలో కలిపి ప్రస్తుతం 17 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, వారందరూ కూర్చోవడానికి అనువైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఇంత మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన క్యాంటీన్లు, ఆస్పత్రులు, జిమ్‌లు, ఈత కొలను, సూపర్‌ మార్కెట్లు, ఉద్యోగుల పిల్లల కోసంక్రష్‌లు, ప్లే స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని, 4 వేల కార్లు, ఐదారువేల ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ ఉంటుందని ఆయన అన్నారు. రోజూ నాలుగైదు వేల మంది సందర్శకులు ఉంటారు.
 
11వేల క్యూబిక్‌ మీటర్ల ర్యాఫ్ట్‌
 
మొత్తం 5 టవర్లుగా సచివాలయం ఉంటుంది. భూగర్భంలో ఒక దాని నుంచి మరొకదానికి వెళ్ళడానికి దార్లు ఉంటాయి. ఇవికాక ఉద్యోగులు అటూ ఇటూ తిరగడానికి రెండో అంతస్థులో అన్నింటిని కలుపుతూ వంతెనలు నిర్మిస్తున్నాం. 40 అంతస్థుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ టవర్లకు సిమెంట్‌తో నిర్మించిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ దేశంలో ఒక రికార్డు. ఒక్కో టవర్‌కు 11,000 క్యూబిక్‌ మీటర్ల సిమెంట్‌ ఫౌండేషన్‌ వేశాం. మొత్తం 5 టవర్లకు 55 వేల క్యూబిక్‌ మీటర్ల ఫౌండేషన్‌ వచ్చింది.
- శ్రీధర్‌, కమిషనర్‌, సీఆర్‌డీఏ
 
కరెంటు ఖర్చు తక్కువే..
 
సాధారణంగా ఏసీ అనగానే కరెంటు బిల్లు భారీగా వస్తుందని భయపడతారు. అయితే, ఇప్పుడు విద్యుత్‌ ద్వారా అయ్యే వ్యయం కంటే ఈ కేంద్రీకృత విధానంలో తక్కువ ఖర్చు అవుతుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ వెల్లడించారు. ఏసీ యంత్రాల వాడకానికి విద్యుత్‌కు సుమారుగా రూ. పది వ్యయం అవుతుందని అనుకొంటే ఈ విధానంలో రూ. ఆరు మాత్రమే ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. దీనివల్ల సాధారణ ఏసీ యంత్రాలతో వచ్చే కాలుష్య సమస్య తగ్గుతుందని, మరింత సమర్ధవంతంగా చల్లదనాన్ని అందివ్వడం వీలవుతుందని కమిషనర్‌ వివరించారు.
Posted
అమరావతి చల్లచల్లగా

 

  పైప్‌లైన్‌ ద్వారా ఏసీ సరఫరా
  ఏర్పాటుకు సీఆర్‌డీఏ సమగ్ర ప్రణాళిక
  ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం శంకుస్థాపన
  దేశంలోనే మొదటి భారీ యూనిట్‌
ఈనాడు - అమరావతి

ap-main2a_3.jpg

ప్రతి ఇంటికీ ఏసీ మెషీన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా... కొన్నిచోట్ల పైప్‌లైన్ల ద్వారా మంచి నీరు, వంట గ్యాస్‌ సరఫరా చేస్తున్న విధానంలోనే చల్లని గాలిని కూడా పంపిస్తే.. ఎంతో బాగుంటుంది కదా! రాజధాని అమరావతిలో ఇలాంటి సదుపాయమే అందుబాటులోకి రానుంది.

రాజధాని అమరావతిలో అతి పెద్ద కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌-డీసీఎస్‌)ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, నివాసగృహాలకు ఈ విధానంలో భాగంగా ఏసీ సదుపాయాన్ని కల్పించేందుకు సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. పరిపాలన నగరంలో 40,000టన్నుల సామర్థ్యంగల యూనిట్టును నెలకొల్పడానికి యూఏఈకి చెందిన తబ్రీద్‌ సంస్థను ఎంపిక చేసింది. దీనికి ఫిబ్రవరి మొదటివారంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ.260కోట్లతో రెండున్నర ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ వ్యవస్థ దేశంలోనే పెద్దది. ప్రస్తుతం గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీలో ఐదు వేల టన్నుల సామర్థ్యంగల ఒక యూనిట్‌ ఉంది.

కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ ఉంటే..!
సాధారణంగా మనం పెట్టుకునే ఏసీల్లో రెండు యూనిట్లు..ఒకటి ఇంటి లోపల (ఇండోర్‌), మరొకటి వెలుపల (అవుట్‌డోర్‌) ఉంటాయి. కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డీసీఎస్‌)లో భాగంగా ప్రతి ఏసీకి విడివిడిగా అవుట్‌డోర్‌ యూనిట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కలిపి ఒకే యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి పైప్‌లైన్ల ద్వారా ప్రతి ఇంటికీ ‘ఏసీ’ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు.పైప్‌లైన్లను భూగర్భంలో వేస్తారు. సాధారణ ఏసీల కంటే భిన్నమైన ‘కూలింగ్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ఈ విధానంలో 40శాతం వరకు ఇంధనం ఆదాతో పాటు వినియోగదారులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రతి ఇంటిలో మీటర్లు ఉంటాయి. మనం ఎంత సమయం ఏసీ వినియోగించుకున్నామో లెక్కించి... దాని ప్రకారమే బిల్లు వసూలు చేస్తారు.

రాజధానిలో ఇలా..!
రాజధాని అమరావతిలో ఈ వ్యవస్థను మొదట పరిపాలన నగరంలోని సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి ప్రభుత్వ భవనాలకే ఈ సదుపాయాన్ని కల్పించాలనుకున్నారు. ఇప్పుడు వాణిజ్య సముదాయాలు, నివాసగృహాలకు కూడా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం 1350ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న పరిపాలన, న్యాయ నగరాలకు 40 వేల టన్నుల సామర్థ్యంగల రెండు యూనిట్లు అవసరమవుతాయని అంచనా. తబ్రీద్‌ సంస్థ తొలుత 20 వేల టన్నుల స్థాయిగల యూనిట్‌ను నెలకొల్పి దానిని 40 వేల టన్నుల సామర్థ్యానికి పెంచనుంది. భవిష్యత్తులో మరో 40 వేల టన్నుల సామర్థ్యంగల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ప్రతి 500 ఎకరాలకు ఒక డీసీఎస్‌ను నెలకొల్పనుంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, శాసనసభ, హైకోర్టు భవనాలు, ఏపీ ఎన్‌ఆర్‌టీ సంస్థ నిర్మించే టవర్లతో పాటు, పరిపాలన, న్యాయ నగరాల్లో నిర్మించే ఇతర వాణిజ్య టవర్లు, నివాస భవనాలకు ఈ రెండు డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థల నుంచి ‘చల్లని గాలి’ని సరఫరా చేస్తారు. సీఆర్‌డీఏ నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌-1, హ్యాపీనెస్ట్‌-2 ప్రాజెక్టులకూ ఇదే విధానంలో ఏసీ సదుపాయాన్ని కల్పిస్తారు. రాజధానిలో అభివృద్ధి చేయనున్న మూడు ప్రధాన వాణిజ్య ప్రాంతాలను సిటీ సెంటర్లుగా పిలుస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మరో మూడు, నాలుగు డీసీఎస్‌లను ఏర్పాటు చేయనున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. తబ్రీద్‌ సంస్థ యూఏఈ, దుబాయిల్లో 77 డీసీఎస్‌లు నిర్వహిస్తోందన్నారు. అవసరమైన భూమిని సీఆర్‌డీఏ కేటాయించిందని, పెట్టుబడి వ్యయాన్ని నెలవారీ ఛార్జీలతో పాటు ఆ సంస్థ వసూలు చేసుకుంటుందని వివరించారు. సాధారణంగా మనకు ఏసీల వినియోగానికి 10యూనిట్ల విద్యుత్‌ అవసరమైన చోట... డీసీఎస్‌ విధానంలో 6 యూనిట్లే సరిపోతాయని, ఆ మేరకు వినియోగదారులకు డబ్బు ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Posted
నేడు శ్రీవారి ఆలయ భూకర్షణం
31-01-2019 08:14:55
 
636845192960925102.jpg
  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు
  • ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో సింఘాల్‌
తుళ్లూరు: రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయానికి భూకర్షణ కార్యక్రమం నిర్వహించానికి ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు హాజరు కానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గురువారం ఉదయం 9.15 నుంచి 9.45 గంటల మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏర్పాట్లను జేఈవో భాస్కర్‌తో కలసి సింఘాల్‌ పర్యవేక్షించారు. ఆలయ నమూనాను పరిశీలించారు. భూకర్షణం జరిగే ప్రదేశాన్ని ఈవో సింఘాల్‌ పరిశీలించారు. వేదిక ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేశారు. సీఎం భూకర్షణం నిర్వహించిన తరువాత నవధాన్యాలు చల్లి నాగలితో దున్నుతారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం సీఎంకు అందజేస్తారు. భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తారు.
 
ఫిబ్రవరి పదో తేదీ వరకు వివిధ హోమాలు, పూజాది కార్యక్రమాలు ఆలయ శంకుస్థాపన ప్రదేశంలో జరుగుతాయని సింఘాల్‌ చెప్పారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఇంకా ముందుగానే నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని, అయితే రెండేళ్లు గడువు ఇచ్చామని ఈవో సింఘాల్‌ చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అందుకు మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేసినట్టు చెప్పారు.
Posted
Quote

 

రీవారి ఆలయ నిర్మాణానికి నేడు భూకర్షణం

 

ap-state37a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆధ్యాత్మికతకు అద్దం పట్టే అపురూప వేదికగా రూపుదిద్దుకోనుంది. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ఈశాన్య దిశలో శ్రీవేంకటేశ్వర స్వామి రక్షణ కవచంగా నిలవనున్నారు. తుళ్ళూరు మండల పరిధి వెంకటపాలెంలో పవిత్ర కృష్ణానదికి దక్షిణ దిక్కుగా శ్రీవారి ఆలయాన్ని అద్భుత రీతిలో నిర్మించనున్నారు. గురువారం ఉదయం 9.15 నిమిషాలకు నూతన ఆలయ నిర్మాణ ‘భూకర్షణ’ కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. బుధవారం తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు. భూకర్షణలో పాల్గొనే స్థానికుల కోసం ఉండవల్లి కూడలి, మంగళగిరి నుంచి ఐదేసి, తుళ్ళూరు ఆర్టీసీ బస్‌స్టాండు నుంచి 3 బస్సులు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకాబోతున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమం అనంతరం సీఎం నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.

 

Posted
కృష్ణమ్మ తీరాన కలియుగ వైకుంఠం

 

రూ.150 కోట్లతో వేంకటేశ్వర ఆలయం
చోళులు, చాళుక్యుల నిర్మాణ శైలి
వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయడం లక్ష్యం
నేడు సీఎం చేతుల మీదుగా భూకర్షణ, బీజావాపనం
ఈనాడు - తిరుపతి

ap-story1a_4.jpg

రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గురువారం తొలి అడుగు పడనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రభుత్వం సేకరించిన 25 ఎకరాల స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనంలోకి తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. భూకర్షణ, బీజావాపనాన్ని నిర్వహించి ఫిబ్రవరి 10న భూమిపూజ చేయనుంది. కృష్ణానది తీరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయం... చోళులు, చాళుక్యుల కాలం నాటి వాస్తు, నిర్మాణ శైలికి అద్దం పడుతుంది.

ఎలా ఉంటుందంటే..

ap-story1b_3.jpg

* తిరుమల ఆలయ శోభ ప్రస్ఫుటించేలా మొత్తం రాతితోనే నిర్మించాలని తితిదే భావిస్తోంది. ఆలయ గోడలు, లోపలి భాగమంతా తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే ఉంటుంది. రెండు ప్రాకారాలుంటాయి. కశ్యప శిలాశాస్త్రంలోని విమానార్చన కల్పంలో పొందుపరిచినట్లు ఆగమబద్ధంగా నిర్మిస్తారు.
* రూ.150 కోట్లు వెచ్చించేందుకు ఇప్పటికే తితిదే పాలకమండలి ఆమోదించింది. నాలుగు దశల్లో వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక. దీనికి ఇప్పటికే టెండర్లు ఆమోదం పొందాయి. శంకుస్థాపన పూర్తయిన వెంటనే పనులు చేపట్టనున్నారు.
* హిందూ ఆలయ నిర్మాణశైలికి ప్రతీకగా నిలిచే కాంచీపురం, వైకుంఠ పెరుమాళ్‌ ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, బాదామీ విష్ణు చాళుక్యుల ఆలయం, హంపీలోని విరూపాక్ష, విజయ విఠల ఆలయాల నిర్మాణ శైలిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. దేశంలోని ప్రముఖ శిల్ప కళాకారులు, వాస్తుశిల్ప శాస్త్ర నిపుణులు, ఆచార్యుల సూచనలను స్వీకరిస్తున్నారు.
* ఆలయాన్ని నిర్మించాక తితిదే తన నిర్వహణలోకి తీసుకుంటుంది. పరిపాలన వ్యవహారాలకు ఓ పాలకమండలిని నియమిస్తుంది. గుంటూరు, విజయవాడల నుంచి ప్రత్యేకంగా వెంకటపాలెం శ్రీవారి ఆలయానికి బస్సులను నడపనున్నారు.

లోపలి ప్రాకారం ఇలా

గర్భాలయాన్ని 18’-6 × 18’-6 చుట్టుకొలతల ప్రకారం నిర్మిస్తారు. అంతరాలయం, అర్ధమండపం, మహామండపాన్ని 27’-9 × 27’-9 కొలతల ప్రకారం, ముఖమండపాన్ని  37’-0 × 37’0తోనూ నిర్మిస్తారు. మొత్తం ప్రాకారం పరిమాణం 250-0’ × 130’ × 0’తో ఉంటుంది. లోపలి ప్రాకారంలో గరుడాలయం, శ్రీవారిపోటు, యాగశాలతో పాటు 70 అడుగుల ఎత్తులో ఐదడుగుల తూర్పు ప్రవేశద్వారం(గోపురం) కడతారు.

వెలుపలి ప్రాకారం ఇలా

ఆలయం వెలుపలి ప్రాకారంలో ధ్వజస్తంభం, మండపం, బలిపీఠం, ఆర్జితసేవ మండపం, ఉత్సవ మండపం, పరకామణి మండపం, అద్దాల మండపం, వెలుపలి ప్రాకారం మూడువైపులా ఐదంతస్తుల రాజగోపురాలు వస్తాయి. దీంతోపాటు తూర్పు ప్రవేశద్వారం వద్ద పడికావలి మండపంతోపాటు ఏడంతస్తుల అతిపెద్ద రాజగోపురం నిర్మిస్తారు. వెలుపలి ప్రాకారం చుట్టూ నాలుగు మాడవీధులు, శ్రీవారి పుష్కరిణి, వాహన మండపం, రథ మండపం, శ్రీఆంజనేయస్వామివారి ఆలయం ఉంటాయి. మొత్తం స్థలం చుట్టూ ప్రహరీ రానుంది.

శాస్త్రోక్తంగా నిర్మాణం

ఆలయ నిర్మాణాన్ని ఆగమబద్ధంగా నిర్మిస్తాం. కొత్త రాజధానిలో కలియుగ వైకుంఠనాథుడి ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడం శుభ పరిణామం. ఇప్పటికే తితిదేకు 25 ఎకరాల భూమిని ప్రభుత్వం అందించింది. నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు లభించాయి. వచ్చేనెల 10న భూమిపూజ నిర్వహిస్తాం.

- పోలా భాస్కర్‌, తితిదే జేఈవో

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...