Jump to content

Recommended Posts

Posted
ఇబ్రహీంపట్నం వైపు పెరిగిన రియల్‌ బూమ్‌
26-01-2019 05:03:51
 
636840758327510634.jpg
  • ఐకానిక్‌ బ్రిడ్జి శంకుస్థాపనతో పెరిగిన జోరు..
  • జాతీయ రహదారుల వెంట ఎకరా రూ.6 కోట్లు !
పశ్చిమ కృష్ణాలో ర్యాపిడ్‌ గ్రోత్‌ ఏరియా. ఐకానిక్‌ బ్రిడ్జి శంకుస్థాపనతో ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ముఖ ద్వారంగా నిలవబోతున్న ప్రాంతం. అదే ఇబ్రహీంపట్నం. ఈ ప్రాంతంలో నెలకొన్న స్థిరాస్తి జోరుపై ఈ వారం ప్రత్యేక కథనం..
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఇబ్రహీంపట్నం. విజయవాడకు దగ్గరగా, రాజధాని అమరావతికి కూత వేటు దూరంలో కృష్ణానది ఈవల ఉన్న ప్రాంతం. ఇక్కడ ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శంకుస్థాపన చేసి, వెంటనే పనులకు శ్రీకారం చుట్టింది. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో రియల్‌ బూమ్‌ ఏర్పడింది. ఐదేళ్ల క్రితం నాటి రియల్టీ జోష్‌ మళ్లీ కనిపిస్తోంది. ఈ వంతెన శంకుస్థాపనతో ఇప్పటి వరకు ఈ ప్రాంత రియల్టీ రంగం ఎదుర్కొన్న స్తబ్దత వీడింది.
 
భారీగా ధరలు
విజయవాడ శివారు భవానీపురం నుంచి గొల్లపూడి, గుంటుపల్లి, రాయనపాడు, సూరాయపాలెంల వరకు ఉన్న ప్రాంతం ఇప్పుడు వేగంగా అభవృద్ధి చెందుతోం ది. దీంతో ఈ ప్రాంతంలో జాతీయ రహదారి వెంట ఎకరం రూ.6 కోట్ల వరకు పలుకుతోంది. జాతీయ రహదారి వెంబడి నుంచి రెండు కిలోమీటర్ల లోపలకు వెళ్ళే కొద్దీ ఎకరం కోటి నుంచి రూ. 2 కోట్లు పలుకుతోంది. ఇంకా లోపలకు వెళితే ఎకరం రూ.50 లక్షల చొప్పున దొరుకుతుంది.
 
మినీ సెక్రటేరియట్‌గా గొల్లపూడి
గొల్లపూడి నుంచి చూస్తే విజయవాడతో సమాంతరంగా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌, ఫార్మాలాబ్‌లు కొలువుదీరాయి. రెస్టారెంట్స్‌, మాల్స్‌వంటి వాటితోపాటు కాంక్రీట్‌ జంగిల్‌ మాదిరిగా భారీ అపార్ట్‌మెంట్స్‌ నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ కమిషనరేట్లు, డైరెక ్టరేట్‌ కార్యాలయాలు పెద్ద ఎత్తున గొల్లపూడి ప్రాంతలో కేంద్రీకృతం అయ్యాయి. దీంతో ఈ ప్రాంతాన్ని మినీ సెక్రటేరియట్‌గా పిలుస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరటంతో ఉద్యోగులు ఈ ప్రాంతంలోనే నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరి కోసం ఇప్పటికే కొన్ని అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. గొల్లపూడి మీదుగా 65వ నెంబర్‌ జాతీయ రహదారి రాయనపాడు, సూరాయపాలెం, గుంటుపల్లిలను కలుపుతూ ఇబ్రహీంపట్నం మీదుగా నందిగామ, కోదాడల మీదుగా హైదరాబాద్‌కు వెళుతుంది. దీంతో గొల్లపూడి, రాయనపాడు, గుంటుపల్లి ప్రాంతాల్లో జాతీయ రహదారి సమీపంలో అనేక భారీ అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి.
 
రాయనపాడు స్టేషన్‌
గొల్లపూడి-ఇబ్రహీంపట్నం మధ్య ఉన్న రాయనపాడు రైల్వేస్టేషన్‌ను అధికారులు ఇటీవలే శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. దాదాపుగా 26 రైళ్లు ప్రస్తుతం ఇక్కడ ఆగి రాకపోకలు సాగిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే రైళ్లూ రాయనపాడులో ఆగనున్నాయి. దీంతో రాయనపాడు ప్రాంతానికి రాకపోకలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ ఇక్కడి నుంచి ప్రత్యేక ంగా బస్సులు నడుపుతోంది. ఈ ప్రాంత రియల్టీ అభివృద్ధికి పరోక్షంగా ఈ అంశాలన్నీ తోడ్పడుతున్నాయి. గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు కమర్షియల్‌గా ప్రాంతం గా అభివృద్ధి చెందడమూ ఇందుకు కలిసొస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో మాల్స్‌, కాలేజీలు, వ్యాపార కాంప్లెక్స్‌లు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ ఈ ప్రాంత రియల్టీకి కలిసివస్తున్నాయి.
 
 
 
 
రూపుమారుతోంది..
భారీ అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలతో ఇబ్రహీంపట్నం రూపు మారిపోతోంది. ఈ ప్రాంతం ప్రాం తం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. ఇబ్రహీంపట్నం రింగ్‌ దగ్గర నుంచి కొద్ది దూరంలోనే కృష్ణా తీరాన పవిత్ర సంగమం ఉంది. ప్రస్తుతం ఇది మంచి పర్యాటక ప్రాంతంగా మారింది. ఇదే పవిత్ర సంగమం దగ్గర ఐకానిక్‌ బ్రిడ్జికి శంకుస్థాపన జరిగింది. ఈ బ్రిడ్జి కృష్ణానది మీదుగా అమరావతి నగరానికి చేరుకుంటుంది. దీనివల్ల ఇబ్రహీంపట్నం ప్రాంతానికి మహర్దశ పట్టుకుంది. బడా డెవలపర్లు, రియల్‌ వ్యాపారులు ఇప్పుడు ఈ ప్రాంతంలో పెద్దఎత్తున వెంచర్లు ప్రారంభిస్తున్నారు.
Posted
అమరావతి రియల్టీకి ఎన్నికల భయం
26-01-2019 05:07:48
 
636840760693323921.jpg
  • తాత్కాలిక ‘విరామం’ తప్పదనే అంచనాలు
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి స్థిరాస్తి రంగానికి ఎన్నికల భయం పట్టుకుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ ప్రాంత రియల్టీలో పెద్దగా జోరు ఉండక పోవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై పరిశ్రమవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు రియల్టర్లు, రాజధాని రైతులు ఇది మరింత ఊపందుకుంటుందని భావిస్తుంటే, మరికొందరు మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాబోయే మూడు నాలుగు నెలలు స్తబ్ధత తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల వచ్చే వరకు రాజధాని ప్రాంత స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నాలుగు నెలల్లో అమరావతి ప్రాంత రియల్టీ రంగంలో పెద్దగా కదలిక ఉండదని భావిస్తున్నారు.
 
ఊపందుకున్న నిర్మాణాలు
రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం సుమారు రూ.40,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రహదారులు, మౌలిక వసతులతోపాటు గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాసం కోసం 3,840 అపార్ట్‌మెంట్లతో నిర్మిస్తున్న 61 టవర్లు, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, జుడీషియల్‌ కాంప్లెక్స్‌, ఐకానిక్‌ వంతెన, అమరావతి సెంట్రల్‌ పార్క్‌ ఇందులో ముఖ్యమైనవి. ఇందులో కొన్ని హౌసింగ్‌ టవర్ల నిర్మాణం వచ్చే నెలలో పూర్తి కానుంది. హైకోర్టు తాత్కాలిక నిర్వహణ కోసం నిర్మిస్తున్న జుడిషియల్‌ కాంప్లెక్స్‌కు వచ్చే నెల 3వ ప్రారంభోత్సవం జరగనుంది. ఆ వెంటనే అందులోనుంచే హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
 
పెరిగిన ధరలు
జుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంతో రాజధానికి వచ్చే కక్షిదారులు, న్యాయవాదులు, ఉద్యోగులు, ఇతరుల సంఖ్య పెరగనుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు న్యాయవాదులు, ఉద్యోగులు, రాజధాని గ్రామాల్లోనే స్థిరనివాసాల కోసం ప్లాట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గత నెల నుంచి అన్ని రాజధాని గ్రామాల్లో ప్లాట్ల ధరలు చదరపు గజానికి సుమారు రూ.2,000 నుంచి రూ.4,000 వరకూ పెరిగాయి. అంతకు ముందుతో పోల్చితే ప్లాట్ల కోసం ఎంక్వైరీలూ అధికమయ్యాయి. అమరావతి అభివృద్ధి వేగం పుంజుకునే కొద్దీ ధరలు ఇంకా పెరుగుతాయని కొందరు రియల్టర్ల అంచనా.
Posted
ఫిబ్రవరి 1 నుంచి అమరావతి డిజైన్‌ ఫెస్టివల్‌
27-01-2019 07:59:39
 
636841727780872494.jpg
విజయవాడ: ఏపీసీఆర్డీఏ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌ సంయు క్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు అమరావతి డిజైన్‌ ఫెస్టివల్‌- 2019 నిర్వహించనున్నట్టు ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌ అమరావతి రీజనల్‌ సెంటర్‌ చైర్మన్‌ పవన్‌ సూర్యదేవర తెలిపారు. బందరు రోడ్డులోని ఒక హోటల్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫెస్టివల్‌ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణాత్మక రంగాల్లో పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా ఉందని అన్నారు. పీటర్‌ రిచ్‌, నార్మన్‌ ఫోస్టర్‌, కమల్‌ మాలిక్‌, సూర్య కాకాని వంటి ప్రపంచంలోని ప్రఖ్యాత ఆర్కిటెక్చర్స్‌ ట్రేడర్స్‌ పాల్గొంటున్నట్టు తెలిపారు. క్రెడాయ్‌ విజయవాడ చాప్టర్‌ అధ్యక్షుడు రమణారావు మాట్లాడుతూ నూతన డిజైన్లను రాజధాని ప్రాంతవాసులకు అందుబాటులో తెచ్చేందుకు టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిరియర్‌ డిజైనర్స్‌ అమరావతి చాప్టర్‌ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మల్లిక్‌, సాందిపాని, బిఎన్‌ఐ డైరెక్టర్‌ జైదేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు.
Posted
హైకోర్టు భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
27-01-2019 11:01:28
 
636841838254508454.jpg
  • నేలపాడులో పర్యటన
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఉదయం నేలపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నూతనంగా నిర్మిస్తున్న హైకోర్టు భవనాలను ఆయన పరిశీలించారు. రాష్ట్ర హైకోర్టుకు కోట్లాది రూపాయల అంచనా వ్యయంతో భవనాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీటి నిర్మాణం పూర్తికానున్న నేపధ్యంలో సీఎం చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితోపాటు పలువురు మంత్రులు, అధికారులు భవనాలను పరిశీలించారు. అనంతరం సంభందిత అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు.
Posted
న్యాయ కార్యకలాపాల కేంద్రంగా అమరావతి
28-01-2019 02:14:34
 
  • 450 ఎకరాల్లో న్యాయ నగర నిర్మాణం
  • తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించనున్న సీజేఐ
  • మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం: సీఎం
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘నవ్యాంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 3న తాత్కాలిక హైకోర్టు ప్రారంభం కానుంది. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించాను. ఈ మహత్తర ఘట్టం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోనుంది. భవన ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లన్నీ త్వరగా పూర్తి చేయండి’ అని అధికారులను సీఎం ఆదేశించారు.
 
హైకోర్టు నిర్మాణంపై ఆదివారం అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త రాజధానిలో న్యాయ కార్యకలాపాలు ప్రారంభమవడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దేశంలోనే ఉత్తమ న్యాయస్థానంగా నిలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అమరావతిలో న్యాయ నగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. అమరావతిలో న్యాయనగరాన్ని 450 ఎకరాల్లో నిర్మిస్తామని, తొలిదశ 2022 నాటికి, రెండో దశ 2036కు పూర్తవుతుందని వివరించారు. సచివాలయం నిర్మాణంపై మంత్రి నారాయణ మాట్లాడుతూ 55 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్న సచివాలయానికి సంబంధించిన ఐదు టవర్ల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
 
8.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 250 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న అసెంబ్లీ నిర్మాణ పనులనూ ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైకోర్టు భవన సముదాయంలో జ్యుడీషియల్‌ భవనాలు, నివాసాలు, ఆర్బిట్రేషన్‌, ధ్యాన కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు న్యాయసంస్థలు వంటివి ఉంటాయని సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ వివరించారు. హైకోర్టు కాంప్లెక్స్‌ను 42 ఎకరాల్లో రూ.1400 కోట్లతో నిర్మిస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. సీఎస్‌ పునేఠ, సీఎం ప్రత్యేక ప్రధానకార్యదర్శి సతీశ్‌చంద్ర, ముఖ్యకార్యదర్శి సాయప్రసాద్‌, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Posted
రాజధాని నిర్మాణాల పరిశీలన
28-01-2019 07:19:39
 
636842567802819394.jpg
తుళ్లూరు: రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలను ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీసమేతంగా పరిశీలించారు. రోడ్డుమార్గంలో వచ్చిన సీఎం ముందుగా రాయపూడి రెవెన్యూలో నిర్మితమవుతున్న ఏఐఎస్‌ అపార్ట్‌మెంట్‌ టవర్లలో మోడల్‌ ఫ్లాట్లను సందర్శించారు. అనంతరం హైకోర్టు, ఎన్జీవో, గజిటెడ్‌, నాన్‌ గజిటెడ్‌, టైపు 1, 2 ఉద్యోగుల ఇళ్ల అపార్ట్‌మెంటులను పరిశీలించారు. హైకోర్టు వద్ద వేచి ఉన్న హెలికాఫ్టర్‌లో సతీమణి భువనేశ్వరితో కలిసి తిరిగి వెళ్లారు.
5awrawer.jpg 
Posted
రాజధానిలో నిర్మాణాలను పరిశీలించిన సీఎం దంపతులు

 

27AP-state1a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో వివిధ భవనాల నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సతీమణి భువనేశ్వరితో పాటు ఆమె సోదరి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం  పరిశీలించారు.  రాయపూడి పరిధిలో నిర్మిస్తున్న ఏఐఎస్‌ అధికారుల భవనం సహా అఖిలభారత సర్వీసు అధికారుల నివాస సముదాయంలో సిద్ధం చేసిన నమూనా ఫ్లాట్‌, శాశ్వత సచివాలయం, ఇటీవల నిర్మించిన రాఫ్ట్‌ కాంక్రీటు ఫౌండేషన్‌ పనులనూ పరిశీలించారు.  తాత్కాలిక హైకోర్టు భవనాన్ని, ఎన్జీవోల భవన సముదాయాలను తిలకించారు. అఖిలభారత సర్వీసు అధికారుల భవనంలోని నమూనా ఫ్లాట్‌ను తిలకించిన సీఎం సతీమణి భువనేశ్వరి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయిలో నిర్మిస్తున్న భవనాలకు దీటుగా ఇంటీరియర్‌ డెకరేషన్‌ ఉందని ప్రశంసించారు.

Posted
రాజధానిలో నిర్మాణాలను పరిశీలించిన సీఎం దంపతులు

 

27AP-state1a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో వివిధ భవనాల నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సతీమణి భువనేశ్వరితో పాటు ఆమె సోదరి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం  పరిశీలించారు.  రాయపూడి పరిధిలో నిర్మిస్తున్న ఏఐఎస్‌ అధికారుల భవనం సహా అఖిలభారత సర్వీసు అధికారుల నివాస సముదాయంలో సిద్ధం చేసిన నమూనా ఫ్లాట్‌, శాశ్వత సచివాలయం, ఇటీవల నిర్మించిన రాఫ్ట్‌ కాంక్రీటు ఫౌండేషన్‌ పనులనూ పరిశీలించారు.  తాత్కాలిక హైకోర్టు భవనాన్ని, ఎన్జీవోల భవన సముదాయాలను తిలకించారు. అఖిలభారత సర్వీసు అధికారుల భవనంలోని నమూనా ఫ్లాట్‌ను తిలకించిన సీఎం సతీమణి భువనేశ్వరి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయిలో నిర్మిస్తున్న భవనాలకు దీటుగా ఇంటీరియర్‌ డెకరేషన్‌ ఉందని ప్రశంసించారు.

Posted
ప్రగతికి ప్రతీకలు..
29-01-2019 07:59:33
 
636843455737383271.jpg
అమరావతి, ఆంధ్రజ్యోతి: రాజధానిలో ప్రభుత్వ సముదాయాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి అనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. ఓ వైపు తాత్కాలిక హైకోర్టు భవనాలు చకచకా పూర్తవుతున్నాయి. మరో వైపు ఏఐఎస్‌(ఆలిండియా సర్వీసెస్‌) భవనాలు నిర్మితమవుతున్నాయి. టవర్ల నిర్మాణాలు అదే స్థాయిలో ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా నిర్మాణాలను ఆదివారం పరిశీలిచిన విషయం విదితమే..

 

 

Posted
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

 

28ap-state10a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణానికి సోమవారం అంకురార్పణ జరిగింది. తితిదే నుంచి వచ్చిన వేదపండితుల ఆశీర్వచనాలతో సోమవారం ఉదయం ఆచార్యవరణం, అంకురార్పణ పూజతో పనులకు శ్రీకారం చుట్టారు. సీడ్‌యాక్సెస్‌ రహదారి సమీపంలోని వెంకటపాలెం వద్ద శ్రీవారి క్షేత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయ నిర్మాణ ప్రదేశంలో భూకర్షణ నిర్వహించనున్నారు.

 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...