Jump to content

Amaravati


Recommended Posts

సీఆర్‌డీఏ పరిధిలో జీఎస్‌టీ మినహాయింపు 
పంచాయతీలు, మున్సిపాల్టీల సేవలకు వర్తింపు

ఈనాడు, దిల్లీ: సీఆర్‌డీఏ పరిధిలోని పంచాయతీలు, మున్సిపాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధీకృతసంస్థ, ప్రభుత్వ సంస్థలు అప్పగించిన సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపునిచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ప్రతాప్‌శుక్లా తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం చేసే ఖర్చుపై పూర్తి జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందా అని మంగళవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఏపీసీఆర్‌డీఏ యాక్ట్‌ కింద ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు ప్రభుత్వ సంస్థ హోదా కల్పించాలని కోరుతూ 2016 డిసెంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. దీని సేవలను జీఎస్‌టీ విధానంలో కూడా నెగెటివ్‌ లిస్ట్‌ కిందికి తీసుకురావాలని కోరినట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో మౌలికవసతుల అభివృద్ధి, తయారీ కార్యాకలాపాల్లో పాల్గొనే కంపెనీలు చెల్లించే జీఎస్‌టీలో కేంద్ర ప్రభుత్వ వాటాను పదేళ్లపాటు తిరిగి చెల్లించాలని కూడా కోరినట్లు తెలిపారు. జీఎస్‌టీపై జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారసంస్థ, ప్రభుత్వ ప్రాధికార సంస్థలు అందించే సేవలను ఏదైనా కార్యకలాప రూపంలోకానీ, ఏదైనా పనికి సంబంధించికానీ పంచాయతీ, మున్సిపాల్టీకి అప్పగిస్తే దానికి జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. రహదారులు, వంతెనలు, సొరంగాలు, రహదారి రవాణాకోసం టెర్మినల్‌, మెట్రో, మోనోరైల్‌, పైప్‌లైన్‌, నీటిసరఫరా ప్లాంట్లు, నీటిశుద్ధి, మురుగుశుద్ధి, ప్రభుత్వ వర్క్స్‌ కాంట్రాక్ట్‌ సేవలకు 12శాతం రాయితీ జీఎస్‌టీ వర్తిస్తుందన్నారు.

Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి దృష్టికి రాజధాని రహదారుల పనులు 
పనుల ఆలస్యంపై ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి ఆగ్రహం 
చర్యలు తప్పవని గుత్తేదారుకు హెచ్చరిక 

తుళ్ళూరు,న్యూస్‌టుడే: ఎన్నిసార్లు చెప్పినా పనుల్లో పురోగతి కనిపించడంలేదని, ఇలాగైతే చర్యలు తప్పవని అమరావతి అభివృద్ధిసంస్థ సీఎండీ లక్ష్మీపార్థసారథి గుత్తేదారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రహదారుల నిర్మాణం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. ప్యాకేజీ-3 నిర్మాణం చేపట్టిన గుత్తేదారు సంస్థ బీఎస్సీపీఎల్‌ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సంస్థ నిర్మిస్తున్న ఎన్‌-4(వెంకటపాలెం-నవులూరు),  ఎన్‌-14(బోరుపాలెం-శాఖమూరు) పనులను మంగళవారం పరిశీలించారు. రహదారుల మధ్యలో జరుగుతున్న వంతెన పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయని మండిపడ్డారు. పనుల్లో ఎందుకు పురోగతి లేదని సంస్థప్రతినిధి దశరథరామయ్యను ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా కనిపించటంలేదని అన్నారు. గుత్తేదారుల వ్యవహారాన్ని  సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళుతున్నట్లు చెప్పారు.
బలమైన కర్రలతో మొక్కలను నిలబెట్టాలి.. రాజధాని అమరావతిలో రహదారుల వెంట నాటిన మొక్కలకు బలమైన కర్రలను ఆసరగా పెట్టాలని  ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి అధికారులకు సూచించారు. రహదారుల పరిశీలనలో భాగంగా ఈ-8 రోడ్డులో జరుగుతున్న పచ్చదనం పనులను పరిశీలించారు. మహాగని, వేపమొక్కల పెంపకం బాగుందన్నారు. మొక్కలు నిలువుగా పెరిగేలా చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆమె వెంట ఏడీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు రత్నకుమార్‌, ముఖ్య ఇంజినీరు టి.మొజెస్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు నరసింహమూర్తి, డిప్యుటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఇలెన్గోవన్‌లు ఉన్నారు.

Link to comment
Share on other sites

కరుణిస్తే.. కొండకు వైభవం 
తితిదే సహకారంతో వైకుంఠపురం ప్రగతి 
‌అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రమే.. 
స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వరుడు 
పురాతన ఆలయం ప్రగతి 
ఈనాడు-అమరావతి 
amr-sty3a.jpg

కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే ప్రాంతం.. స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వరుడు.. సుమారు 5వేల సంవత్సరాల నాటి ఆలయం.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్రమైన వైకుంఠపురం వేంకటేశ్వరుని ఆలయం అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా రాజధాని ప్రాంతానికి తలమానికం కానుంది. రూ.100కోట్లతో వెంకన్న ఆలయాన్ని నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటించింది. ఈ ఆలయ ప్రాశస్త్యం, పవిత్రత, ఇతర అంశాల ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడే ఆలయాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వాసిరెడ్డి వెంకట్రాదినాయుడు కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. అంతకుముందు పాలించిన రాజులు భూములు ఇచ్చి చేయూతనిచ్చారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో వైకుంఠపురం కొండపై ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నివిధాలా అనుకూలమైనదన్న వాదన వినిపిస్తోంది.

ఆధ్యాత్మిక, పర్యటకానికి అనుకూలం 
అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం సమీపంలో కౌంచగిరి కొండపై వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిశారు. సుమారు 5వేల సంవత్సరాల క్రితం నుంచి ఆలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో కొండ కింది భాగంలో ఆలయం నిర్మించారు. రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మికంగా పేరొందిన ఈ ఆలయ ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ఆలయాన్ని నిర్మించాలని తితిదేని కోరింది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై చదునైన ప్రాంతం లేనందున అభివృద్ధి పనులకు అధిక వ్యయం చేయాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయం చూడాలని తితిదే ప్రభుత్వానికి లేఖ రాసింది. కొండ పైభాగంలో బైరవకోనగా పిలుస్తున్న ప్రాంతంలో సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో చదునైన ప్రాంతం ఉంది. దీనిని వినియోగించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వైకుంఠపురం వద్ద కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుండటంతో ఈప్రాంతం పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున వేలమంది భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం కొండపైకి మెట్లదారి మాత్రమే ఉంది. కొండను ఒకవైపు గట్టుగా చేసుకుని వైకుంఠపురం బ్యారేజీ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక్కడే గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ రోడ్డు వంతెన, రైలు వంతెన కృష్ణానదిపై నిర్మించనున్నారు. ఈక్రమంలో వైకుంఠపురం కొండను అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మికంగా, పర్యటకంగా వృద్ధి చెందడానికి అనేక అనుకూలతలు తోడ్పడుతాయి. గతంలోనే కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం ప్రారంభమైనా రాజకీయ కారణాలతో అడ్డంకి ఏర్పడి ఆగిపోయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదికి కుడివైపు కరకట్ట వైకుంఠపురం కొండ వరకు ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట మీదుగా భక్తులు వైకుంఠపురం ఆలయానికి చేరుకునేవారు. ఈమార్గాన్ని ఇటీవల కొంత అభివృద్ధి చేశారు. రాజధాని నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కృష్ణానది కరకట్ట ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

పట్టాలెక్కేనా? 
రాజధానికి  మణిహారం 
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి సమీపంలో వైకుంఠపురం ఉంది. తితిదే ప్రకటించినట్లు దీనిని రూ.100కోట్లతో పనులు చేస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంది. పర్యటకంగా ప్రగతి సాధ్యమవుతుంది. సమీపంలో పంచారామాలలో ప్రథమారామం అమరలింగేశ్వరుని ఆలయం, అనంతవరం కొండపై వేంకటేశ్వరుడు, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, కృష్ణానదికి అటువైపు కనకదుర్గ ఆలయం ఉండటంతో వీటన్నింటినీ కలిపి ఆధ్యాత్మిక వలయంగా అభివృద్ధి చేయవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో ఉంది. తితిదే తాజాగా ఫిబ్రవరి 26వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ప్రభుత్వ తీసుకునే నిర్ణయంపై వైకుంఠపురం ఆలయ వైభవం ఆధారపడి ఉంది.

Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణానికి రూ.కోటి విరాళం 
08ap-main13b.jpg
రాజధాని అమరావతి నిర్మాణం కోసం నీరుకొండకు చెందిన ముప్పవరపు స్వరాజ్యలక్ష్మి ముఖ్యమంత్రికి రూ.కోటి విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి విరాళం ఇవ్వడం అభినందనీయమని, ఎంతోమందికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తారని చంద్రబాబు అన్నారు.
ఆకృతులపై సీఎం సమీక్ష
ఈనాడు, అమరావతి: రాజధానిలో నిర్మించనున్న ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్‌, దర్బారుహాలు నిర్మాణ ఆకృతులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెయిన్‌కు చెందిన రికార్డో భోఫిల్‌్, ఎఫ్‌హెచ్‌డీ గ్రూప్‌, ఆర్‌ఎస్‌పీ సంస్థల ప్రతినిధులు ఆయా నిర్మాణాలకు తాము రూపొందించిన ఆకృతులను సీఎంకు వివరించారు. పరిశీలించిన సీఎం కొన్ని మార్పులు సూచించి.. సవరించిన ఆకృతులను తీసుకురావాలని సూచించారు. అంతకుముందు సచివాలయం భవనానికి సంబంధించిన సవివర ఆకృతలపై నార్మన్‌ ఫోస్టర్‌ కంపెనీ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ద్వారా సీఎంకు వివరించారు.
Link to comment
Share on other sites

 

రాజధానికి అంతంతే!

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ.689.14 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రాజధానిలో భూమిలేని పేదలకు పింఛన్లకు రూ.65.60 కోట్లు, రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపునకు రూ.166.53 కోట్లు కేటాయించింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.457.01 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్‌లోను రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయింపులు స్వల్పంగానే ఉన్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రపంచబ్యాంకు నుంచి సీఆర్‌డీఏ రూ.3200 కోట్ల రుణం తీసుకుంటోంది. రుణం మంజూరు ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ప్రపంచబ్యాంకు రుణం మంజూరు చేస్తే సీఆర్‌డీఏ మ్యాచింగ్‌ గ్రాంట్‌గా 30 శాతం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. దానికోసమే ప్రభుత్వం ఈ రూ.457.01 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది.

08ap-main14b-sml.jpg

08ap-main14c-sml.jpg

Link to comment
Share on other sites

సీఆర్‌డీఏ అధికారులతో సీఎం సమీక్ష
09-03-2018 06:49:17
 
636561749585013939.jpg
అమరావతి: రాజధాని నిర్మాణ నమూనా రూపకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివా సంలో సీఆర్‌డీఏ అధికారులతో సమావేశ మైన ఆయన స్పానిష్‌ ఆర్కిటెక్స్‌ రిరాక్డో బోఫిల్‌, ఎఫ్‌హెచ్‌డీ గ్రూప్‌, ఆర్‌ఎస్‌పీ మరికొన్ని సంస్థలు రూపకల్పన చేసిన రాజ్‌భవన్‌, గవర్నర్‌ దర్బార్‌ హాల్‌, గవర్నర్‌ నివాసం, సీఎం నివాసం, క్యాంపు కార్యాల యం నమూనా ఆకృతులను పరిశీలిం చారు. నిర్మాణ నమూనాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో కంపెనీల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. 20 ఎకరాల్లో నిర్మించనున్న వైల్డర్‌నెస్‌ పార్కు నమూ నాలను పరిశీలించారు. ఈ పార్కులో మూలికా వనాలు, పుష్ప వనాలు, రెయిన్‌ ఫారెస్టు, రెస్టారెంట్‌ స్పా తదితర సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు
Link to comment
Share on other sites

అమరావతి విల్డర్‌నెస్‌ పార్క్‌’ డిజైన్‌ ఖరారు
10-03-2018 07:36:48
 
636562642094236124.jpg
  • ఏడీసీ ఆధ్వర్యంలో రూపొందిన ఆకృతిని ఆమోదించిన సీఎం
  • అమరావతి సెంట్రల్‌ పార్క్‌లో.. 20 ఎకరాల్లో ఏర్పాటు
 
రాజధానిలో కొలువుదీరనున్న పర్యాటక ఆకర్షణల్లో ప్రధానమైనదిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి సెంట్రల్‌ పార్క్‌ (శాఖమూరు పార్క్‌)లోని ‘విల్డర్‌నెస్‌ పార్క్‌’ డిజైన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) నేతృత్వంలో ప్రగతి గ్రీన్‌ మెడోస్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ రూపొందింపజేసిన ఈ ఆకృతిని పరిశీలించిన సీఎం దానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
 
 
అమరావతి: సుమారు 300 ఎకరాల్లో అభివృద్ధి పరచనున్న అమరావతి సెంట్రల్‌ పార్క్‌ అన్ని వయస్సులు, వర్గాల వారిని ఆకర్షించే పలు ప్రత్యేకతల సమాహారంగా రూపుదిద్దుకోనున్న విషయం విదితమే. ఒకపక్క ప్రకృతితో మమేకమయ్యే అవకాశమిస్తూనే.. మరొకపక్క సువిశాలమైన జలవనరుల్లో విహారంతో సహా సాహసక్రీడలకు ఆస్కారం కల్పించడం, ఇంకొకవైపు వినోదాన్నిచ్చే సాంస్కృతిక కేంద్రాలు, థియేటర్లు ఇత్యాదివి ఇందులో నెలకొని, ఆహ్లాదాన్ని పంచనున్నాయి.
అందులో భాగంగా ఈ భారీ ఉద్యానవనంలో రోజ్‌ గార్డెన్‌, విల్డర్‌నెస్‌ పార్క్‌, క్రాఫ్ట్స్‌ బజార్‌, ఎకో రిసార్ట్‌, అమ్యూజ్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్క్‌, చిల్డ్రన్స్‌ అడ్వెంచర్‌ పార్క్‌, భారీ ఎల్‌.ఇ.డి. వాల్‌తో కూడిన యాంఫీ థియేటర్‌, బోటింగ్‌ అండ్‌ వాటర్‌ స్పోర్ట్స్‌, లేజర్‌ షో అండ్‌ మ్యూజికల్‌ ఫౌంటైన్‌, రోజ్‌ గార్డెన్‌ టాయ్‌ ట్రైన్‌ వంటి ఎన్నెన్నో కొలువు దీరనున్నాయి. ఒక్కొక్కటిగా వీటి ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్న ఏడీసీ తాజాగా పార్క్‌ సత్వరాభివృద్ధికి కృషి చేస్తోంది.
 
20 ఎకరాల్లో..
ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఏర్పాటవనున్న ఈ ఉద్యానవనంలోకి ప్రవేశిస్తే అచ్చంగా ఏదో అటవీ ప్రాంతంలో ఉన్న అనుభూతి కలిగేలా దానిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ఈ పార్క్‌లో ప్రధానంగా 8 విభాగాలను ప్రతిపాదించారు. ‘జంగిల్‌- ఫారెస్ట్‌ థీం, బర్డ్స్‌ పార్క్‌ (రకరకాల పక్షిజాతులకు నెలవు), టెంటెడ్‌ క్యాంప్‌సైట్‌ (తాత్కాలిక గుడారాలతో కూడిన క్యాంప్‌), టెంటెడ్‌ కాటేజీలు (బస చేసేందుకు), టెంటెడ్‌ ఈవెంట్‌ ఎరీనా, టెంటెడ్‌ బాంక్వెట్‌ హాల్‌ (వివిధ కార్యక్రమాలు, వేడుకల నిర్వహణ నిమిత్తం), రెయిన్‌ ఫారెస్ట్‌ కేఫ్‌, ఫారెస్ట్‌ రెస్టారెంట్‌ వంటివి ఉండబోతున్నాయి. అంటే.. ఇందులో ఉండే ప్రతి ఆకర్షణ మనకు అటవీ వాతావరణాన్ని అందజేసేలా, ప్రకృతితో మమేకమైన భావన మనకు కలిగించేలా రూపుదిద్దుకోబోతున్నాయన్న మాట! అదనంగా.. ఇందులో ధన్వంతరి విగ్రహం, అమృత కలశంనూ ఐకానిక్‌ రీతిలో తీర్చిదిద్దుతారు. వాటర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి పరచడంతోపాటు రెండెకరాల్లో తూర్పు ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తారు.
 
2 ఏళ్లలో క్రమానుగత అభివృద్ధి..
 
 
ఈ విల్డర్‌నెస్‌ పార్క్‌ అభివృద్ధికి సంబంధించి ఏడీసీ పిలిచిన టెండర్లలో దానిని దక్కించుకున్న ప్రగతి గ్రీన్‌ మెడోస్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ పనుల కోసం ప్రగతి వెల్‌నెస్‌ రిట్రీట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉద్యానవనం పనులను చేపట్టి, ఒక్కొక్కటిగా పూర్తి చేయనున్నారు. ఈ పనుల్లో ప్రతిదానికీ నిర్దిష్ట గడువును ఏడీసీ నిర్దేశించింది.
 
ఆదాయ పంపిణీ వివరాలు..
కాగా.. పీపీపీ విధానంలో ఈ పార్క్‌ను అభివృద్ధి పరచనున్న ప్రగతి గ్రీన్‌ మిడోస్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌ ఏటా రూ.9.68 లక్షలను ప్రీమియంగా చెల్లిస్తుంది. ఇది ఏటా 5 శాతం చొప్పున పెరుగుతుంది. ఇది కాకుండా వార్షిక రెవెన్యూ షేర్‌ కింద రూ.34.50 లక్షలను (3వ సంవత్సరం నుంచి ప్రారంభించి) ఇస్తుంది. ఈ మొత్తాలను సదరు సంస్థ ఎవరికి చెల్లించాలన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
 
 
ప్రణాళిక ఇలా..
అవెన్యూ ప్లాంటేషన్‌.. వర్షాలు ప్రారంభమయ్యేలోపు, పొదలు, లతలు, ఇతర చిన్నతరహా మొక్కలను నాటేందుకు వర్షాలు కురిసిన తర్వాత 6 నెలల్లోపు, మోడల్‌ కాటేజీలు, ప్లాజాలను 6 నెలల్లోగా, వాటర్‌ఫ్రంట్‌ బ్యూటిఫికేషన్‌, ఈస్ట్‌ ఎంట్రెన్స్‌ ప్లాజాను 6 నెలల్లోపు, ఐకానిక్‌ నిర్మాణాలైన (ధన్వంతరి, అమృత కలశం) అంతర్గత మార్గాలు నిర్మించిన 6 నెలల తర్వాత చేపట్టి ఏడాదిలోపు, క్లబ్‌ హౌసెస్‌ మరియు కాటేజీలను పార్కు సుందరీకరణ పూర్తయిన ఏడాది తర్వాత ప్రారంభించి రెండేళ్లలోపు సిద్ధమయ్యేలా చూస్తారు. ఫుడ్‌కోర్టులను వర్షాకాలం ముగిసిన తర్వాత దశలవారీగా ప్రారంభిస్తారు.
 
    ఇందుకోసం కాటేజ్‌లు, వర్టికల్‌ గార్డెనింగ్‌ ఇత్యాదివాటి డిజైన్లను సిద్ధం చేశారు. గ్రీన్‌ హౌస్‌ కొటేషన్లు సేకరించారు. మొక్కలు, లాన్లకు సంబంధించిన కొటేషన్లే కాకుండా పలు జాతుల మొక్కలను సిద్ధం కూడా చేశారు. అవెన్యూ ప్లాంటేషన్‌ నిమిత్తం 25- 90 సంవత్సరాల వయస్సున్న వృక్షాలను ఇతర ప్రదేశాల నుంచి రప్పించి, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసే ప్రక్రియనూ వర్షాకాలంలోగా చేపట్టేందుకు ఏర్పాట్లు జరిగాయి.
Link to comment
Share on other sites

ఇన్నర్‌ రింగ్‌ ముసాయిదాపై అభ్యంతరాలు
10-03-2018 07:40:34
 
636562644360009256.jpg
  • వివిధ గ్రామాల నుంచి ఇప్పటికి వందకుపైగా దరఖాస్తులు
  • 18వ తేదీకి మరిన్ని వచ్చే అవకాశం
  • ప్రజల సందేహాల నివృత్తికి హెల్ప్‌ డెస్క్‌
అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ముసాయిదా మార్గంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. సీఆర్డీఏ గత నెల మూడో వారంలో విడుదల చేసిన అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐ.ఆర్‌.ఆర్‌.) డ్రాఫ్ట్‌ అలైన్‌మెంట్‌ (ముసాయిదా మార్గం)పై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 10 మండలాలకు చెందిన వందమందికిపైగా వివిధ కారణాలతో అభ్యంతర పత్రాలను దాఖలు చేశారని సమాచారం. ఐఆర్‌ఆర్‌పై ఈ నెల 18వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చు. మరో తొమ్మిది రోజుల్లో గడువు ముగియనుండటంతో మరిన్ని అభ్యంతరాలు రావచ్చని భావిస్తున్నారు.
 
పొలం పోతోందని..
ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాల్లో చాలా వరకు మా పొలం నుంచి పోతోందని, మార్చాలని కోరుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారిని సహేతుక కారణాలుంటే తెలపాల్సిందిగా కోరడంతోపాటు ప్రత్యామ్నాయ భూములనూ (డొంకలు, పోరంబోకులు, ఇతర ప్రభుత్వ స్థలాలేమన్నా ప్రతిపాదిత మార్గానికి చేరువలో ఉంటే) సూచించాల్సిందిగా సీఆర్డీయే కోరుతోంది. నోటిఫికేషన్‌లో, విడుదల చేసే మ్యాప్‌లో ఐ.ఆర్‌.ఆర్‌. వెళ్లే సర్వే నెంబర్లు మాత్రమే కనిపిస్తున్నాయని, సబ్‌ డివిజన్‌ నెంబర్లు లేకపోవడంతో ఎవరెవరికి చెందిన భూముల్లో, ఎంతెంత విస్తీర్ణం ఈ భారీ రహదారి కోసం అవసరమనే విషయంపై స్పష్టత కొరవడిందని పలువురు పేర్కొంటున్నారు.
 
   దీనిపై తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే స్పందించడం లేదని, సీఆర్డీఏ అధికారులనే అడగండంటున్నారని చెబుతున్నారు. తమ వద్ద సర్వే నెంబర్లవారీ వివరాలు తప్ప, సబ్‌డివిజన్లకు సంబంధించినవి ఉండవని, అవన్నీ రెవెన్యూ శాఖాధికారుల వద్దనే ఉంటాయి కాబట్టి వారినే సంప్రదించాలని సీఆర్డీఏ అధికారులు సూచిస్తున్నారు.
 
3 నుంచి 4 నెలల్లో ఫైనల్‌ నోటిఫికేషన్‌..
ఈ నివేదికను సీఆర్డీఏ అథారిటీ పరిశీలించి, వాటిల్లో సహేతుకమైన అభ్యంతరాలు, అనుసరించదగిన సూచనలను నిర్ధారిస్తుంది. ఆ ప్రకారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో అవసరమైన మార్పుచేర్పులు చేసి ఫైనల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. ఇదంతా జరగడానికి 3 నుంచి 4 నెలలు పడుతుందని తెలుస్తోంది.
 
 
సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌
ఐ.ఆర్‌.ఆర్‌. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసేందుకుగా సీఆర్డీయే విజయవాడలోని తన ప్రఽధాన కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసి అభ్యంతరాలను స్వయంగా అందజేసే వీలునూ కల్పించింది.
 
    ఐ.ఆర్‌.ఆర్‌. ప్రతిపాదిత మార్గంలోని మండలాలు, గ్రామాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు.. ముసాయిదా అలైన్‌మెంట్‌ను తెలిపే మ్యాప్‌లను నోటిఫికేషన్‌ విడుదల చేసిన రోజే పంపిన సీఆర్డీఏ ఆయా కార్యాలయాల్లో సందేహాలను తీర్చడానికి ప్రత్యేక డెస్క్‌ను నెలకొల్పింది. సీఆర్డీయే ఉన్నతాధికారులు మరొక అవకాశాన్ని ఇస్తున్నారు. స్థానిక మండల కార్యాలయాల్లో లభ్యమయ్యే సబ్‌ డివిజన్‌ మ్యాపులను పొంది కూడా వాటి ద్వారా సరైన స్పష్టత పొందలేని వారు ఆయా మ్యాపులతో సహా ఇక్కడకు వస్తే అధికారులు వాటిల్లోని అంశాలను వివరిస్తారు.
Link to comment
Share on other sites

మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు 
ప్యాకేజీ-4 నిర్మాణ పనులపై ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి సంతృప్తి 
amr-gen2a.jpg

తుళ్ళూరు,న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో రహదారుల వెంట పచ్చదనం అభివృద్ధిచేసే క్రమంలో బిందుసేద్యం వ్యవస్థను ఏర్పాటుచేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు. వేసవిలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం తుళ్ళూరు మండలం అనంతవరం, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం పరిసరాల్లోని పనులను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. మొదట సీడ్‌యాక్సిస్‌ రహదారిపై నాటిన మొక్కలను బిందుసేద్యం ద్వారా సంరక్షించాలని చెప్పారు. అనంతరం ఎన్‌-16(బోరుపాలెం-నెక్కలు), ఈ-14(మంగళగిరి-నీరుకొండ), ఈ-10(ఐనవోలు-పెనుమాక) రహదారులను పరిశీలించారు. ఎన్‌-16 రోడ్డులో అనంతవరం వద్ద, ఈ-10లోని కృష్ణాయపాలెం వద్ద జరుగుతున్న వంతెనల నిర్మాణ పనులు తుదిదశకు చేరాయని ఏడీసీ చీఫ్‌ ఇంజినీరు టి.మోజెస్‌కుమార్‌ ఏడీసీకి వివరించారు. సాధ్యమైనంత త్వరలో రహదారులను అందుబాటులోకి తేవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఏడీసీ భూవ్యవహారాల సంచాలకులు బి.రామయ్య, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు నరసింహమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పద్మాకరప్రసాద్‌,  అటవీ విభాగం అధికారి జేవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend
10 hours ago, LuvNTR said:

ade doubt vochindi. mari edo show putup kosam villas rent ki teesukoni pettinattu unnayi le...:P

century kuda 1-6 tho ne start avvudhi ani evaro pedhayana chepparu 

Link to comment
Share on other sites

అమరావతి కాంప్లెక్స్‌’ మాస్టర్‌ ప్లాన్‌లో సవరణలు
11-03-2018 07:37:31
image.jpeg.ae46285eebaa7087157eb77b97a4cc39.jpeg
  • అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ప్లాన్‌లో స్వల్ప మార్పులు
  • ఈ కారణంతోనే భూముల అప్పగింతలో జాప్యం
అమరావతి: అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ బృహత్‌ ప్రణాళికలో మార్పుచేర్పులు చోటు చేసు కోబోతున్నాయా!? కొద్దిరోజుల క్రితం శాస నసభలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను బట్టి అవుననే సమాధానమే వస్తోంది! రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు కేం ద్రస్థానంగానూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంస్థలు, బ్యాంకుల కార్యా లయాలకు కాణాచిగానూ ఉండేలా అమ రావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ను తీర్చి దిద్దేందుకు ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో ప్రణా ళికలు రూపొందిన సంగతి విదితమే. వాటికి అనుగుణంగా ఇందులో పలు ప్రభుత్వ సంస్థలకు భూకేటాయింపు జరుపుతూ ప్రభుత్వ ఉత్తర్వులు సైతం కొన్ని నెలల క్రితమే వెలువడ్డాయి.
 
   ఇలా భూములను పొందిన దిగ్గజ సంస్థలు తమకు కేటాయించిన భూ ముల్లో త్వరలోనే నిర్మాణాలను చేప ట్టేందుకుగాను కార్యాలయాల ప్లాన్లను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఇలాంటి వాటిల్లోని 17 ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించిన భూములను వాటికి ఇంతవరకు సీఆర్డీయే స్వాధీ నపరచలేదు. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు ఉండబోతున్నందున సదరు సంస్థలకు తొలుత ఇస్తామన్న భూముల విస్తీర్ణం, ప్రదే శాల్లో మార్పుచేర్పులుంటాయని, ఫలితంగా భూములను అప్పగించలేకపోతున్నామని ప్ర భుత్వం శాసనసభలో పేర్కొంది! పర్య వసా నంగా.. కొద్దినెలల్లోనే నిర్మాణ పనులు ప్రారం భించేందుకు సమాయత్తమవుతున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు వేచి చూడక తప్ప ని పరిస్థితి నెలకొంది.
 
    కాగా.. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ను ఖరారు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దానిని సవరించబోతున్నట్లు స్వయానా ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో అందుకు కారణాలేమిటన్న అంశం చర్చనీ యాంశమైంది. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో ఓపెన్‌ స్పేసెస్‌ మరింత విశాలంగా (గతంలో ఉన్న 150 మీటర్ల వెడల్పు నుంచి సుమారు 300 మీటర్ల వెడల్పునకు) ఉండాలన్న సీఎం చంద్రబాబునాయుడి ఆదేశానుసారం వాటికి పక్కన వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని, తదనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను సవరించాల్సి వస్తోందని తెలుస్తోంది.
 
ప్రస్తుతం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ నిపుణులు ఇదేపనిలో నిమగ్నమై ఉన్నారని, వారు సవరించిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వానికి సమ ర్పించేందుకు మరికొన్ని వారాలు పట్ట వచ్చునని సమాచారం. అది సిద్ధమైన తర్వా తనే దానినిబట్టి పైన పేర్కొన్న సంస్థలకు జరిపే భూకేటాయింపులను ఖరారు చేసి, ఆ వెంటనే ఆయా భూములను వాటికి సీఆర్డీయే స్వాధీనం చేస్తుందని తెలుస్తోంది.
 
సంస్థలు, స్థల విస్తీర్ణం
ఆయా సంస్థలు, వాటికి ఇప్పటికే కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదించిన స్థల విస్తీర్ణపు వివరాలీ విధంగా ఉన్నాయి.. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (28 ఎకరాలు), ఆర్‌.బి.ఐ. (11ఎ.), ఇండియన్‌ నేవీ (15 ఎ.), బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (30 సెంట్లు), తపాలా శాఖ(5.50 ఎ.), ఎఫ్‌.సి.ఐ.(1.10 ఎ.), ఎల్‌.ఐ.సి. (75 సెంట్లు), ఎస్‌.బి.ఐ. (3.30 ఎ.), ఆంధ్రా బ్యాంక్‌ (2.65 ఎ.), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (1.50 ఎ.), నాబార్డ్‌ (4.30 ఎ.), కాగ్‌ (17 ఎ.), న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ (1.93 ఎ.), హెచ్‌పీసీఎల్‌ (50 సెంట్లు), సిండికేట్‌ బ్యాంక్‌ (1.30ఎ.), ఆప్కాబ్‌ (4ఎ.), ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ (5 ఎ.).
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...