Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని పురోగతిని తెలిపే ‘అమరావతి రియల్‌టైం’..!

వెబ్‌సైట్‌ రూపొందిస్తున్న సీఆర్‌డీఏ

అందుబాటులోకి ప్రతి ప్రాజెక్టు సమాచారం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ‘అమరావతి రియల్‌టైం’ పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. 2018 నాటికి రాజధాని నిర్మాణ పరంగా నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాలు, నిధుల సమీకరణ, భూసమీకరణ వంటి అంశాల్లో పురోగతిని ఎప్పటికప్పడు తెలుసుకునేందుకు, సమీక్షించేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇది ఒక డ్యాష్‌ బోర్డులా పనిచేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, సామాన్య ప్రజల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో అందరికీ అన్ని విషయాలు చూసేందుకు వీలుండదు. ముఖ్యమంత్రి, సీఆర్‌డీఏ కమిషనర్‌లకు, వివిధ విభాగాధిపతులకు, ప్రాజెక్టు మేనేజర్లకు వేర్వేరుగా యాక్సెస్‌ ఉంటుంది. వీరిలో ఎవరి బాధ్యతలేంటి? ఎవరి పరిధిలో ఏ అంశాల్ని సమీక్షించాల్సి ఉంటుంది? అన్న దాన్ని బట్టి, ఆయా అంశాలు వారికి అందుబాటులో ఉంటాయి. సామాన్య ప్రజలు ఎలాంటి పాస్‌వర్డ్‌ అవసరం లేకుండా నేరుగా చూడవచ్చు. వీరికి ఆయా ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి సీఆర్‌డీఏ అందుబాటులో ఉంచిన సమాచారం వరకు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ వెబ్‌సైట్‌ను సీఆర్‌డీఏ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ సీహెచ్‌2ఎం సిద్ధం చేస్తోంది. అమరావతి నగర ప్రణాళికల అమలు, ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం, రహదారులు, నీరు, విద్యుత్తు సరఫరా లైన్లు వంటి ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఆర్థిక నగరం సహా నవ నగరాల పురోగతి, రైతులకు స్థలాలిచ్చిన లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి, సామాజిక సదుపాయాల కల్పన ఇలా... రాజధానిలో చేపట్టే ప్రతి చిన్న ప్రాజెక్టుకి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రాజెక్టుని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? ఇప్పటివరకు ఎంత శాతం పూర్తయింది? వంటి వివరాలన్నీ ఉంటాయి. మరో నెలన్నరలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దీన్ని రెండు మూడు రోజులకు ఒకసారి డేటా అప్‌డేట్‌ చేసేలా రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సీఆర్‌డీఏ సమీక్షలో భాగంగా... ప్రాజెక్టు పురోగతిని ఏ క్షణానికి ఆ క్షణం (రియల్‌టైం) అప్‌డేట్‌ చేసేలా వెబ్‌సైట్‌ను సిద్ధం చేయమని ఆదేశించారు.

Link to comment
Share on other sites

ఇక వేగంగా రాజధాని!
 
  • తుది డిజైన్లు ఆమోదించి వెంటనే నిర్మాణ పనులు
  • అమరావతితో చరిత్ర సృష్టిద్దాం..మహానగరంగా తీర్చిదిద్దుదాం
  • రాజధానిలో 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
  • 2 లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం
  • సీఆర్డీయే అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌
అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతో చరిత్ర సృష్టిద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రజారాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రాజధాని పనుల పురోగతిపై ఆదివారం సీఆర్డీయే అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ రూపొందించిన నమూనాలను సోమవారం పరిశీలిస్తామన్నారు. డిజైన్ల ఎంపిక పూర్తిచేసి, ఇకపై వేగంగా రాజధాని నిర్మాణ పనులు చేపడుతామన్నారు. రాజధాని నగరం అంటే శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ మాత్రమే కాదన్నారు. కేవలం 200 ఎకరాల్లో ఈ భవనాలన్నీ నిర్మించవచ్చని, ఉద్యోగులు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోతే నిర్మానుష్యం అయిపోతుందన్నారు. అలా కాకుండా యువతకు ఉపాధి కల్పన కేంద్రంగా, ప్రజల సంపద పెంచే ఆర్థికసేవల నిలయంగా.. ఒక మహానగరంగా అమరావతిని నిర్మించాలన్నది తన అభిలాష అని పేర్కొన్నారు. అమరావతి అంటే తన దృష్టిలో ప్రజల సంపద అని చెప్పారు. కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకే పరిమితం కాకుండా...ప్రపంచానికే ప్రజారాజధాని అమరావతి అన్న ముద్ర పడాలన్నారు. అమరావతి వేల ఏళ్ల క్రితమే ప్రజా రాజధానిగా విలసిల్లిందని చరిత్ర చెబుతోందని, ఇప్పుడు ఆ చరిత్రను పునరావృతం చేద్దామన్నారు. అమరావతి నగరం ప్రజల సంపద అని, దీనిపై అంతర్జాతీయంగా ఆసక్తి వ్యక్తమవుతోందన్నారు.
నవ నగరాల నిర్మాణం
పెద్ద మనసుతో భూములిచ్చిన ప్రతి రైతుకు పాదాభివందనం అని, వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణాల నమూనాల తుది ముసాయిదాను నార్మన్‌ ఫోస్టర్స్‌ సమర్పించిన వెంటనే ప్రభుత్వ భవనాలతో సహా ప్రజావసరాలైన విద్య, వైద్యం, వాణిజ్యం, పరిశ్రమలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ప్రఖ్యాత ఐటీ కంపెనీలను నెలకొల్పేందుకు వీలుగా నవ నగరాలను వేగంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని నగర నిర్మాణంలో ప్రతి కట్టడం అమరావతి సంస్కృతి, వారసత్వ సంపదకు ప్రతి రూపంగా ఉండాలన్నారు.
అమరావతి చరిత్రకు నూతన నగరంతో ప్రతి సృష్టి చేద్దామన్నారు. రాజధాని నిర్మాణంలో సహకరించేందుకు ప్రపంచబ్యాంకు, హడ్కో వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. హోటళ్లు, విద్యాసంస్థల స్థాపనకు ఇప్పటికే బిడ్లు దాఖలయ్యాయని, వాటిపై త్వరితగతిన పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీయే అధికారులను ఆదేశించారు. రాజధాని నగర నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు.. రూ1.25 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయని సీఎం తెలిపారు. ఈ ఒప్పందాలతో అమరావతిలో రెండు లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రాజధాని నిర్మాణంలో పూర్తి పారదర్శకత ఉండేలా స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. కజకిస్తాన్‌ రాజధాని ఆస్తానా 1294 ఎకరాల్లో నిర్మాణమై ప్రపంచ గుర్తింపును సాధించిందని...అమరావతిని 1450 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
4 విభాగాలుగా నిర్మాణాలు
సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. రాజధానిలో నిర్మాణాలను నాలుగు విభాగాలుగా చేపట్టనున్నట్లు సీఎంకు వివరించారు. మొదటి సెగ్మెంట్‌లో అసెంబ్లీ, రెండో సెగ్మెంట్‌లో మంత్రులు, కార్యదర్శులు, శాఖాఽధిపతుల కార్యాలయాలు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులకు గృహ సముదాయాలు, మూడో సెగ్మెంట్‌లో సాంస్కృతిక భవనాలు, ప్రైవేట్‌ వాణిజ్య సముదాయాలు, నాలుగో సెగ్మెంట్‌లో క్రీడా సముదాయాలు, కన్వెన్షన్‌ కేంద్రాలు నిర్మించనున్నట్లు తెలిపారు. కృష్ణా నదికి అభిముఖంగా రాజ్‌భవన్‌, సీఎం అధికారిక నివాసాలు ఉంటాయన్నారు.
Link to comment
Share on other sites

త్వరలోనే అటవీ భూముల డీనోటిఫికేషన్?
 
  • కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు!
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న అటవీ భూములను డీనోటిఫై చేసి, తనకు అప్పగించాల్సిందిగా ఏపీసీఆర్‌డీయే దాదాపు రెండేళ్లుగా చేస్తున్న అభ్యర్థనలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భూములను రాజధాని కోసం అప్పగిస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కొన్నివారాల్లోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ శాఖకు అనుబంధంగా పని చేసే ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ అధికారులు కోరిన సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వడమే కాకుండా వెలిబుచ్చిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేశారు. దీంతో, దీర్ఘకాలంగా నానుతూ వస్తున్న ఈ అంశం త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఏపీ సీఆర్‌డీయే ఆశిస్తున్నట్లు భోగట్టా.
12,444 హెక్టార్ల కోసం కృషి
ప్రపంచంలోని మేటి 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలంటే భూసమీకరణ ప్రాతిపదికన సమీకరించిన సుమారు 33,000 ఎకరాలు, ప్రభుత్వ భూములతోపాటు అమరావతికి సమీపంలో, వివిధ ప్రదేశాల్లో విస్తరించి ఉన్న 12,444 హెక్టార్ల అటవీ భూమి కూడా అవసరమని సీఆర్‌డీయే భావిస్తోంది. ఈ అటవీ భూములను డీనోటిఫై చేసి, తమకు అప్పగిస్తే వాటిల్లో రాజధాని ప్రాంతానికి చుట్టుపక్కల అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామిక, వాణిజ్య తదితర క్లస్టర్లను అభివృద్ధి పరచాలన్నది ఆ సంస్థ అభిప్రాయం. నిబంధనలను అనుసరించి ఈ భూమికి సరిసమానమైన భూమిని వేరొక ప్రాంతంలో ఇచ్చేందుకు అంగీకరించడంతోపాటు అందులో అడవులను పెంచేందుకు అవసరమైన నిధులను కూడా ఇస్తామంటూ ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర అధికారులు, సీఆర్‌డీయేల మధ్య ఇప్పటికి పలు పర్యాయాలు సమావేశాలు నిర్వహించినా డీనోటిఫికేషన్ కు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు.
ఎప్పటికప్పుడు ఈ అంశం ఒక కొలిక్కి వచ్చేస్తుందనిపించినా కేంద్ర అధికారులు మళ్లీ ఏవేవో అనుమానాలు వ్యక్తం చేయడంతో అలా జరగకపోవడం పరిపాటైంది. కానీ, ఈ నెల 16న ఢిల్లీలో జరిన చర్చలు మాత్రం ఈ అంశానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే విధంగా సాగినట్లు సమాచారం. రాష్ట్ర అధికారుల వివరాలపై కేంద్ర అధికారులు సంతృప్తి చెందారని భావిస్తున్న సీఆర్‌డీయే ఉన్నతాధికారులు ఇకపై వాయిదాలు అవసరం లేకుండా అటవీ భూముల డీనోటిఫికేషన్ కు కేంద్రం ఉత్తర్వులు వెలువరించడం ఖాయమని విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ పరిణామం చోటు చేసుకోవచ్చునని వారు అంచనా వేస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణాల ఫైనల్ ప్లానింగ్ సిద్ధం
 
 
636310494624853899.jpg
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు డిజైన్లను సిటీ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన ఫైనల్ ప్లానింగ్ సిద్ధమైంది. దీనిని రూపొందించిన లండన్‌కు చెందిన నార్మన్ కోస్టర్స్ ఫోస్కర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ తాము సిద్ధం చేసిన ప్లాన్‌ను ప్రభుత్వానికి అందజేయనుంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర మంత్రులు, కార్యదర్శుల బృందం ప్రణాళికను పరిశీలించనుంది. ఇవాళ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం సీఎం చంద్రబాబు నివాసంలో మంత్రులు, నార్మన్ ఫోస్కర్స్ సంస్థ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇప్పటికే వారి ప్లానింగ్‌కు అనుగుణంగా భవనాల డిజైన్ల నమూనాను నార్మన్ ఫోస్కర్స్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. వాటిని మంగళవారం ఉదయం సీఎం పరిశీలిస్తారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి.
Link to comment
Share on other sites

నేడు అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతులు

పరిపాలనా నగర తుది ప్రణాళిక అందజేస్తున్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ

సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రితో సమావేశం

రేపు పరిశీలించనున్న చంద్రబాబు

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో నిర్మించే పరిపాలనా నగర తుది ప్రణాళిక, మకుటాయమాన భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టు ఆకృతులను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ సోమవారం ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ ఆకృతుల్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సారథ్యంలోని మంత్రులు, కార్యదర్శుల బృందం పరిశీలిస్తుంది. పరిపాలనా నగర ప్రణాళిక, మకుటాయమాన భవనాల ఆకృతులపై నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమావేశం జరుగుతుంది. మంత్రులు, నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు ఆయనతో సమావేశంలో పాల్గొంటారు. పరిపాలనా నగర ప్రణాళిక, మకుటాయమాన భవనాల ఆకృతులకు సంబంధించిన నమూనాల్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు వెళుతున్న నేపథ్యంలో... నమూనాల్ని మంగళవారం ఉదయం పరిశీలిస్తారు. ఈ విషయాన్ని సీఆర్‌డీఏ మీడియా అడ్వైజర్‌ ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

1368 ఎకరాలకు ప్రణాళిక

పరిపాలనా నగరాన్ని 900 ఎకరాల్లో నిర్మించనున్నారు. మొదట నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఈ 900 ఎకరాలకే ప్రాథమిక స్థూల ప్రణాళిక సిద్ధం చేసింది. శాసనసభ, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలతో పాటుగా, హైకోర్టుని కూడా మొదట ఈ 900 ఎకరాల్లోనే ప్రతిపాదించింది. కానీ హైకోర్టు పరిపాలనా నగరాన్ని ఆనుకుని ఏర్పాటయ్యే న్యాయనగరంలో ఉంటేనే బాగుంటుందని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో 900 ఎకరాల పరిపాలనా నగరంతో పాటు, దానికి కొనసాగింపుగా దక్షిణ దిశలో మరో 468 ఎకరాల్ని కూడా కలిపి... మొత్తం 1368 ఎకరాలకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రణాళిక రూపొందించింది. మొదట్లో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం రెండు వేర్వేరు భవనాలను నిర్మించాలని ప్రతిపాదించింది. కానీ ఒక శాఖ చూసే మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతితో పాటు ఆ శాఖ, విభాగానికి సంబంధించిన మొత్తం సిబ్బంది ఒకే చోట ఉండాలన్న ప్రభుత్వ సూచన మేరకు... తుది ప్రణాళికలో మార్పులు చేసింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం మొత్తం 8 భవనాలు నిర్మించాలని ప్రతిపాదించింది.

డ్రైవర్‌ రహిత వాహనాలు...!

అబుదాబిలోని మస్దర్‌ నగరానికి కూడా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థే ప్రణాళిక, డిజైన్లు అందజేసింది. మస్దరలో మాదిరిగానే అమరావతిలోని పరిపాలనా నగరంలో డ్రైవర్‌ రహిత వాహనాలను ఏర్పాటు చేయాలని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతిపాదించింది. పరిపాలనా నగరంలో ఒక భవనం నుంచి మరో భవనానికి వెళ్లేందుకు వీలుగా ఈ వాహనాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో కూర్చుని ఎక్కాల్సిన ప్రదేశాన్ని సూచించే మీటను నొక్కితే వాహనం అక్కడికి వెళ్లి ఆగుతుంది. వీటితో పాటు పరిపాలనా నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్‌ కారులు, వాటర్‌ ట్యాక్సీలు వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

మూడేసి ఆకృతులు..!

మకుటాయమాన భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టుల కోసం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మూడేసి ఆకృతుల చొప్పున రూపొందించింది. శాసనసభ, శాసన మండలి భవన ప్రాథమిక ఆకృతిని ఆ సంస్థ ఇది వరకే అందజేసింది. దానిలో నాలుగు గోళాకారపు భవనాలు, వాటిపై ఒక పొడవైన టవర్‌తో ఆకృతిని రూపొందించింది. ఈ కాన్సెప్ట్‌ బాగానే ఉందని, కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు ఇదే కాన్సెప్ట్‌ని ప్రాతిపదికగా చేసుకుని శాసనసభ భవనానికి సంబంధించి మూడు ఆకృతుల్ని, హైకోర్టు భవనానికి మూడు ఆకృతుల్ని ఆ సంస్థ సిద్ధం చేసింది. వీటిని మంత్రుల బృందం, అధికారులు, ముఖ్యమంత్రి పరిశీలించాక... శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి ఒక్కో ఆకృతిని ఎంపిక చేస్తారు. తర్వాత వాటి వివరణాత్మక ఆకృతుల్ని ఆ సంస్థ రూపొందిస్తుంది. సమయం కలసి వచ్చేలా... వివరణాత్మక ఆకృతుల్ని దశలవారీగా ఇవ్వాలని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థను సీఆర్‌డీఏ కోరింది. మొదట పునాదుల వరకు వివరాలిస్తే... పైలింగ్‌ దశ వరకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలన్నది సీఆర్‌డీఏ యోచన.

Link to comment
Share on other sites

Krishna River islands "Natural wonders of Amaravati"

 

Asalu CBN ikkadq capital pettinde veetini chusi . E islands chusi memu island kadatam ane rojulu vastai mundu mundu...

 

Veeti ni develop cheyyakudadu nature ki hani ani twaralo court ki vella botunna Jaffas gang....

 

 

7872_island.jpg
 

A survey of Krishna islands has been taken up by a Mumbai-based consultant firm which was selected following a tender process conducted recently. The consultant firm conducted the survey of the islands in the River Krishna as per the government directive for developing them on par with popular islands in Singapore.

 

Based on the report of the consultant, the government will make changes, if necessary, to the master plan to make the islands best tourist destinations.As per the directions of the CEO of Bhavani Island Tourism Corporation (BITC) Himanshu Shukla, coinciding with the state government’s Krishna riverfront beautification plans, all the seven islands are now being spruced up to give maximum entertainment to the people of the city where cinema is the only major recreation source so far.

 

official of the corporation said that the government is keen to develop the islands on par with the Singapore islands. The Mumbai consultant group would prepare master plans separately for each island depending on the conditions prevailing there.

 

 

The firm would take into consideration the observations of Andhra Pradesh Capital Region Development Corporation, revenue and irrigation departments and make master plans depending on the feedback provided by these departments.

 

Once the draft master plans are ready, the process of beautifying the Bhavani Island, along with other islands, would gain momentum.

Amusement parks, hotels, resorts, tents, food courts and cycling tracks are only a few aspects to mention that get prominence in developing the islands into best tourism destinations. World-class entertainment would come to the islands with private firms taking up the task.

Link to comment
Share on other sites

చంద్రబాబును కలిసిన నార్మన్‌ఫోస్టర్‌ ప్రతినిధులు
 
అమరావతి: సీఎం చంద్రబాబును నార్మన్‌ఫోస్టర్‌ ప్రతినిధులు కలిశారు. ఈ సమవేశంలో రాజధాని డిజైన్లను సీఎం పరిశీలించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలపై ఆయన పలు సూచనలు చేశారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం ఉండాలని సూచించారు. సచివాలయం, హెచ్ఓడీల ఆఫీస్‌లు పక్కపక్కనే నిర్మించాలన్నారు. సచివాలయం, హెచ్ఓడీల భవనాలకు అభిముఖంగా నివాస సముదాయాలు ఉండాలన్నారు. పరిపాలనా నగరంలో ప్రైవేటు ఆస్తులకు చోటులేదని స్పష్టంచేశారు. అమరావతి నగరాన్నివీక్షించేందుకు అత్యంత ఎత్తులో టవర్‌ నిర్మించాలని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...