Jump to content

Amaravati


Recommended Posts

ఏపీలో ఉగాదినాడు ఏడు ప్రధానరోడ్లకు శంకుస్థాపన
 
636260277840083680.jpg
అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతిష్ఠాత్మకమైన ఏడు సబ్‌ ఆర్టీరియల్‌ రహదారుల నిర్మాణానికి ఉగాదిన భూమి పూజ జరగనుంది. యర్రబాలెం-పెనుమాక రోడ్డుకు తూర్పుదిశగా వున్న ప్రాంతంలో శంకుస్థాపన నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు శంకుస్థాపన స్థల పరిశీలన చేశారు.
 
 
గుంటూరు/మంగళగిరి: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం రూ.915 కోట్ల వ్యయంతో ఏడు సబ్‌ ఆర్టీరియల్‌ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. ఈ రహదారులను నిర్మించేందుకు సీఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 29వ తేది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఈ రోడ్లకు శంకుస్థాపన జరిపించేందుకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. రాజధాని ప్రాంతంలో భాగంగా వున్న యర్రబాలెం పంచాయతీ పరిధిలో యర్రబాలెం-పెనుమాక రోడ్డుకు తూర్పుదిశగా వున్న ప్రాంతంలో శంకుస్థాపన నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. శంకుస్థాపన నిమిత్తం ఎంపిక చేసిన ఈ స్థలాన్ని శుక్రవారం ఉదయం అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్ధసారధి, జడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తదితర అధికారులు పరిశీలించారు. శంకుస్థాపనకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండేకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. శనివారం మధ్యాహ్నం అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో అన్ని అంశాలపై చర్చించి ఏడు ప్రాధాన్య రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి రోడ్‌ మ్యాప్‌ని ఖరారు చేస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
 
సీడ్‌ యాక్సెస్‌తో అనుసంధానం..
రాజధానికి సంబంధించి ఇప్పటికే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారికి అనుసంధానంగా రాజధానిలోని లేఅవుట్లను కలుపుతూ ఏడు ప్రాధాన్య రోడ్లను మాస్టర్‌ ప్లానలో మార్కింగ్‌ చేశారు. ఈ రోడ్ల నిర్మాణం వలన రాజధానిలో ఏ ప్రాంతానికి అయినా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో చేరుకోనేందుకు వీలు కలుగుతుంది. వీటికి సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కృతిక శుక్ల పలుమార్లు సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమై రోడ్ల నిర్మాణాలకు భూసేకరణ ఆటంకాలు లేకుండా చేశారు. డీజీపీఎస్‌ సర్వే తదితర పనులు కూడా పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో నిర్మించనున్న ఏడు ప్రాధాన్యత సబ్‌ ఆర్టీరియల్‌ రహదారులను ఇ-8, ఎన్‌-9, ఎన్‌-4, ఎన్‌-14, ఇ-10, ఇ-14, ఎన్‌-16గా వ్యవహరించబోతున్నారు. ఈ రోడ్ల నిమిత్తం మొత్తం 331.1 హెక్టార్ల భూమిని వినియోగించుకోనున్నారు. ఈ ఏడు రహదారులను నాలుగు ప్యాకేజిలుగా విభజించి నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఈ రహదారుల వెంట రూ 6.46 కోట్ల వ్యయంతో గ్రీనరీని కూడ అభివృద్ధి చేసేవిధంగా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఏడు ప్రాధాన్యత రహదారుల వెంబడి మొత్తం 64,605 మొక్కలను నాటేవిధంగా ప్రణాళికను రూపొందించారు.మొదటి ప్యాకేజి కింద ఇ-8 రహదారిని కృష్ణాయపాలెం నుంచి నెక్కల్లు వరకు 13.65 కి.మీ పొడవున నిర్మిస్తారు. రూ.221 కోట్ల వ్యయంతో దీనిని నాలుగులేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తారు. ఈ రహదారి మార్గంలో మూడు బ్రిడ్జిలు, 17 కల్వర్టులను నిర్మించాల్సివుంది. రెండో ప్యాకేజి కింద ఎన్‌-9 రహదారిని ఉద్దండరామునిపాలెం నుంచి నిడమర్రు వరకు 13.16 కి.మీ. పొడవునా ఉత్తర-దక్షిణ దిశలుగా నిర్మిస్తారు. రూ.197 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ నాలుగులేన్ల రహదారిమార్గంలో రెండు బ్రిడ్జిలు, 17 కల్వర్టులను నిర్మించాల్సివుంది. మూడో ప్యాకేజి కిందఎన్‌-4, ఎన్‌-14 రహదారులను నిర్మించనున్నారు. ఎన్‌-4ను వెంకటపాలెం-నవులూరు మధ్య 7.23 కి.మీల నిడివిలో రూ 116 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఈ రహదారి మార్గంలో రెండు బ్రిడ్జిలు, 12 కల్వర్టులు రానున్నాయి. ఇదే ప్యాకేజికింద చేపట్టనున్న ఎన్‌-14 రహదారిని కూడ నాలుగులేన్ల రహదారిగా బోరుపాలెం-శాఖమూరుల మధ్య 8.27 కి.మీ.ల పొడవున నిర్మించనున్నారు. ఈ మార్గంలో కూడ రెండు బ్రిడ్జిలు, ఏడు కల్వర్టులు రానున్నాయి. నాలుగో ప్యాకేజి కింద ఇ-10, ఇ-14, ఎన్‌-16 పేర మూడు రహదారులను నిర్మిస్తారు. వీటిలో ఇ-10ను పెనుమాక-ఐనవోలు మధ్య, ఇ-14ను మంగళగిరి-నీరుకొండ మధ్య, ఎన్‌-16ను అబ్బురాజుపాలెం-నెక్కల్లు మధ్య నిర్మించేవిధంగా ప్రతిపాదించారు. ఇవి కూడ నాలుగులేన్ల రహదారులే. ఇ-10 రహదారిని 7.81 కి.మీ.ల నిడివిలో రూ.105 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ మార్గంలో ఒక్క బ్రిడ్జి, 14 కల్వర్టులు రానున్నాయి. ఇ-14 రహదారిని 7.33 కిలోమీటర్ల నిడివిలో రూ 71 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఈ మార్గంలో 12 కల్వర్టులను నిర్మించాల్సివుంది. ఎన్‌-16 రహదారిని 8.77 కి.మీ.ల నిడివిలో రూ 102 కోట్ల వ్యయంతో నిర్మించేవిధంగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో ఒక్క బ్రిడ్జి, 12 కల్వర్టులు రానున్నాయి.
Link to comment
Share on other sites

రాజధాని కోసం అమరావతి బ్యారేజీ
 
636260027488437664.jpg
  •  ప్రజలు, పరిశ్రమలకు నీటికోసం నిర్మాణం 
  •  మున్నేరు దిగువన నిర్మించాలని యోచన 
  •  జల వనరుల శాఖ ప్రతిపాదన.. సీఎం సానుకూలం 
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): సముద్రంలో కలుస్తున్న వందల క్యూసెక్కుల వరద నీటికి అడ్డుకట్టవేసి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకుగాను ‘అమరావతి బ్యారేజీ’ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఈ బృహత్తర నీటి పథకానికి రాష్ట్ర జల వనరుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజధాని నగరం భవిష్యత్ జనాభాను దృష్టిలో ఉంచుకుని 2050 దాకా ప్రజల, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేలా 12.75 టీఎంసీల సామర్థ్యం కలిగిన అమరావతి బ్యారేజీ నిర్మాణం చేపట్టడంపై జల వనరుల శాఖ నిపుణుల కమిటీ క్షేత్రస్థాయి పర్యటన జరిపింది. ఈమేరకు అంతర్గత జల రవాణా చీఫ్‌ ఇంజనీరు వి.శ్రీధర్‌, కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీరు, సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌లతో కూడిన బృందం జల వనరుల శాఖకు నివేదిక అందజేసింది. ఈ నివేదికకు జల వనరుల శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వైకుంఠపురం సమీపంలోని మున్నేరు దిగువ భాగంలో అమరావతి బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో బ్యారేజీ నిర్మించడం వల్ల ముంపు ప్రభావం ఉండదని, పశువుల జీవనానికీ, ప్రజా జీవన సరళికి ఎలాంటి ముప్పూ ఉండదన్న నిర్ధారణకు వచ్చాకే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జల వనరుల శాఖ ఆమోద ముద్ర వేసింది.
ఏటా 525.65 టీఎంసీలు కడలిపాలు
వరదల సమయంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యం ప్రకాశం బ్యారేజీకి లేదు. ఫలితంగా గత 40 ఏళ్లుగా ఏటా 525.65 టీఎంసీల వరద నీరు సముద్రం పాలవుతోంది. ఇప్పటిదాకా వేసవిలో తాగు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు విజయవాడ నగరం ప్రకాశం బ్యారేజీలోని అడుగంటిన జలాలపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు రాజధాని నగరం ఏర్పాటు, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు కానుండడంతో నీటి అవసరాలు పెరిగాయి. దీంతో కొత్త బ్యారేజీ నిర్మాణం ఆవశ్యత ఏర్పడింది. ప్రతిపాదిత అమరావతి బ్యారేజీని పులిచింతల డ్యామ్‌కు 22.5 కిలోమీటర్ల దిగువన, ప్రకాశం బ్యారేజీకి ఎగువన 10.5 కిలోమీటర్ల మధ్య మున్నేరు వాగు కృష్ణా నదిలో కలిసేచోట కృష్ణా జిల్లా దాములూరు-గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం గ్రామాల మధ్య నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలో నీటి ప్రవాహం వెడల్పు 295.50 మీటర్లు ఉంటుంది. ఇక్కడ నిర్మించే బ్యారేజీ 25 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 24 లక్షల క్యూసెక్కుల నీటిని నిల్వచేసే సామర్థ్యం కలిగేలా డిజైన్‌ చేశారు. రెగ్యులేటర్‌ గేట్ల ఎత్తు 27.50 మీటర్లు ఉంటుంది. బ్యారేజీ లోతు 10 మీటర్లు ఉంటుంది. అందువల్ల గ్రావిటీ ద్వారానే అమరావతికి అవసరమైన తాగునీటిని, పరిశ్రమలకు నీటిని అందించేందుకు వీలు కలుగుతుంది. 9.08 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ అమరావతి బ్యారేజీని మున్ముందు 12.75 టీఎంసీల వరకు పెంచుకునేందుకూ వీలుంటుంది. ఈ బ్యారేజీ నిర్మాణంపై రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జల వనరుల శాఖ వివరించింది. దీనికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు.
Link to comment
Share on other sites

‘అహో.. అమరావతి’ అనేలా ప్రణాళిక

పరిపాలన నగరంపై దృశ్యరూప వివరణ

25brk-80-amravarit1.jpg

అమరావతి: అమరావతి పరిపాలన నగర నమూనాపై ప్రెజెంటేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్టనర్స్‌ అసోసియేట్‌ ఆర్కిటెక్ట్‌ హర్ష్‌ థాపర్‌ దృశ్యరూప వివరణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

* అమరావతిలో జీఐ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.

* ఇక్కడ ఏర్పాటు చేసే మొత్తం తొమ్మిది సిటీల్లో అడ్మిన్‌స్ట్రేటీవ్‌ సిటీ కూడా ఒకటి.

* పరిపాలన నగరం పక్కనే జస్టిస్‌ సిటీ ఉంటుంది.

* ఒక ఫైవ్‌స్టార్‌, 3 ఫోర్‌స్టార్‌ హోటళ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.* వాస్తు, దేవాలయ ఆకృతులను పరిగణనలోకి తీసుకోనున్నారు.

* అసెంబ్లీ భవనం ముందు నీటి మడుగులో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆలోచన.

* లండన్‌ పబ్లిక్‌ పార్క్‌ తరహాలో భారీ ఉద్యానవనం

* అమరావతిలో ప్రతి భవనం చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఉండనున్నాయి.

* రోడ్లు విశాలంగా ఉండటం వల్ల ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువ అవుతోంది. అందుకే రోడ్ల మధ్యలో గ్రీన్‌లైన్‌ ప్రతిపాదించారు.

* గాలి వేగానికి అనుగుణంగా భవనాల నిర్మాణం

* అమరావతి పరిపాలన నగరం ప్రధాన రహదారుల్లో డ్రైవర్‌ రహిత వాహనాలకు ప్రతిపాదన

* పరిపాలన నగరంలో కాల్వలో వాటర్‌ బోట్లు నడిపేందుకు అవకాశం

* పరిపాలన నగరంలోని కాలువలకు 0.18 టీఎంసీల నీరు అవసరం

Link to comment
Share on other sites

‘అహో.. అమరావతి’ అనేలా ప్రణాళికపరిపాలన నగరంపై దృశ్యరూప వివరణ25brk-80-amravarit1.jpg

అమరావతి: అమరావతి పరిపాలన నగర నమూనాపై ప్రెజెంటేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్టనర్స్‌ అసోసియేట్‌ ఆర్కిటెక్ట్‌ హర్ష్‌ థాపర్‌ దృశ్యరూప వివరణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.* అమరావతిలో జీఐ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.* ఇక్కడ ఏర్పాటు చేసే మొత్తం తొమ్మిది సిటీల్లో అడ్మిన్‌స్ట్రేటీవ్‌ సిటీ కూడా ఒకటి.* పరిపాలన నగరం పక్కనే జస్టిస్‌ సిటీ ఉంటుంది.* ఒక ఫైవ్‌స్టార్‌, 3 ఫోర్‌స్టార్‌ హోటళ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.* వాస్తు, దేవాలయ ఆకృతులను పరిగణనలోకి తీసుకోనున్నారు.* అసెంబ్లీ భవనం ముందు నీటి మడుగులో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆలోచన.* లండన్‌ పబ్లిక్‌ పార్క్‌ తరహాలో భారీ ఉద్యానవనం* అమరావతిలో ప్రతి భవనం చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఉండనున్నాయి.* రోడ్లు విశాలంగా ఉండటం వల్ల ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువ అవుతోంది. అందుకే రోడ్ల మధ్యలో గ్రీన్‌లైన్‌ ప్రతిపాదించారు.* గాలి వేగానికి అనుగుణంగా భవనాల నిర్మాణం* అమరావతి పరిపాలన నగరం ప్రధాన రహదారుల్లో డ్రైవర్‌ రహిత వాహనాలకు ప్రతిపాదన* పరిపాలన నగరంలో కాల్వలో వాటర్‌ బోట్లు నడిపేందుకు అవకాశం* పరిపాలన నగరంలోని కాలువలకు 0.18 టీఎంసీల నీరు అవసరం

Ee video unte vadalandi...

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...