Jump to content

Amaravati


Recommended Posts

అంబేద్కర్‌ జయంతి నాడే స్మృతి వనానికి శంకుస్థాపన
 
636254190636224593.jpg
  • 125 అడుగుల విగ్ర హ ఏర్పాటు
  • నాలుగు ప్రదేశాలను పరిశీలించిన మంత్రి రావెల
  • శాఖమూరు, ఐనవోలు రెవెన్యూలోనే..
  • 20 ఎకరాలు కేటాయించనున్న సీఆర్‌డీఏ
తుళ్ళూరు: రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా 97.69 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 125 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహ స్థాపనకు ప్రభుత్వం స్థల పరిశీలన చేపట్టింది. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌ బాబు సీఆర్‌డీఏ అధికారులతో కలిసి శాఖమూరు, ఐనవోలు రెవెన్యూ పరిధిలో నాలుగు ప్రదేశాలను పరిశీలించారు. శాఖమూరు పరిధిలోని జస్టిస్‌ సిటీ ప్రాంతంలో అంబేద్కర్‌ స్మృతి వనానికి స్థలం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే 200 ఎకరాల్లో సీఆర్‌డీఏ గ్రీనరీ పార్క్‌ ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని స్మృతి వనానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్త్నునట్లు మంత్రి రావెల కిషోర్‌బాబు ఆంధ్రజ్యోతికి తెలిపారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ 14కి జ్ఞాన కేంద్రం, లైబ్రరీ పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. స్థల పరిశీలనలో సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌, సీఆర్‌డీఏ భూవ్యవహారాల ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ రఘునాథరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

21వ శతాబ్ది అద్భుతం అమరావతి
 
636254196550434269.jpg
  • నూతన నిర్మాణాలకు ఎన్‌ఐడీ తోడ్పాటు
  • దక్షిణాదిలోనే తొలి పూర్తిస్థాయి క్యాంపస్‌ అమరావతిలో..
  • మూడు విభాగాల్లో 180 సీట్లు
  • త్వరలో జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష
  • గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైౖర్మన్‌ ఉదయంత్ మల్హోత్రా


ఆంధ్రజ్యోతి, విజయవాడ ఫీచర్స్‌: ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి తమ వంతు సహాయం అందిస్తామని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ) విజయవాడ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైౖర్మన్‌ ఉదయంత్ మల్హోత్రా పేర్కొన్నారు. స్థానిక గేట్‌వే హోటల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన రాజధాని నిర్మాణాలకు ఎన్‌ఐడీ డిజైన్లపై సూచనలు అందిస్తుందని అన్నారు. 21వ శతాబ్ధపు అద్భుతంగా అమరావతిని నిర్మించనున్నామని వెల్లడించారు. అమరావతికే తలమానికంగా, సంస్కృతి సంప్రదయాలు ప్రతిబింబించేలా శాశ్వత భవన నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. సీఆర్‌డీఏ భవనాల నిర్మాణాలకు 50 ఎకరాలు కేటాయించిందని, కేంద్రం నిధులు సమకూర్చిందని వెల్లడించారు. దక్షిణాదిలోనే తొలి ఎన్‌ఐడీ క్యాంపస్‌ను విజయవాడలో 2015-16లో ప్రారంభించామని వివరించారు. వినూత్న డిజైన్లతోనే ఉత్పత్తులకు విలువ పెరుగుతుందని అన్నారు. డిజైన్ల్‌పై ప్రజల ఆలోచనసరళి మారాలని సూచించారు. ఇంటర్‌, ప్లస్‌ 2 పూర్తి చేసిన విద్యార్థులు ఇండస్ట్రియల్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్స్‌ అండ్‌ అపరెల్‌ డిజైన్‌ విభాగాల్లో ఒక్కో విభాగంలోనూ 60 సీట్లతో కోర్సులు ప్రారంభించామని వివరించారు. 2017-18 విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీకి జాతీయ స్థాయి డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వ హిస్తున్నామని తెలిపారు. తాత్కాలికంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2015-16 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించామని తెలిపారు. రెండవ బ్యాచ్‌లో 60 మంది విద్యా ర్థులను తీసుకున్నామని, మూడవ బ్యాచ్‌లో 180 మంది విద్యార్థులకు నాలుగేళ్ల కోర్సు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరి చేనేత వర్గాలకు వినూత్న డిజైన్లు అందించి నేత పని వారాలను ప్రపంచ స్థాయికి తీసుకెళతామని స్పష్టం చేశారు. ఎన్‌ఐడీ విజయవాడ డైరెక్టర్‌ ప్రద్యుమ్న వ్యాస్‌, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సైన్సు సిటీ నిర్మాణానికి రూ.18 కోట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో సైన్సు సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Link to comment
Share on other sites

 

అంబేద్కర్‌ జయంతి నాడే స్మృతి వనానికి శంకుస్థాపన

 

636254190636224593.jpg
  • 125 అడుగుల విగ్ర హ ఏర్పాటు
  • నాలుగు ప్రదేశాలను పరిశీలించిన మంత్రి రావెల
  • శాఖమూరు, ఐనవోలు రెవెన్యూలోనే..
  • 20 ఎకరాలు కేటాయించనున్న సీఆర్‌డీఏ
తుళ్ళూరు: రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా 97.69 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 125 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహ స్థాపనకు ప్రభుత్వం స్థల పరిశీలన చేపట్టింది. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌ బాబు సీఆర్‌డీఏ అధికారులతో కలిసి శాఖమూరు, ఐనవోలు రెవెన్యూ పరిధిలో నాలుగు ప్రదేశాలను పరిశీలించారు. శాఖమూరు పరిధిలోని జస్టిస్‌ సిటీ ప్రాంతంలో అంబేద్కర్‌ స్మృతి వనానికి స్థలం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే 200 ఎకరాల్లో సీఆర్‌డీఏ గ్రీనరీ పార్క్‌ ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని స్మృతి వనానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్త్నునట్లు మంత్రి రావెల కిషోర్‌బాబు ఆంధ్రజ్యోతికి తెలిపారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ 14కి జ్ఞాన కేంద్రం, లైబ్రరీ పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. స్థల పరిశీలనలో సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌, సీఆర్‌డీఏ భూవ్యవహారాల ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ రఘునాథరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

 

avasarama idi? 

Link to comment
Share on other sites

Narukulla padu vagu bridge finish chesaru....kanisam start ayyindi ani kuda telidu idi

 

 

Sumita Dawra‏ @SumitaDawra  
#Endroi #Bridge on #Guntur #Amaravati highway was executed in six months by AP R&B department @SiddaRaghavarao @AndhraPradeshCM @MORTHIndia

 

 

 

C7cKbkwVsAA4xGs.jpg

Link to comment
Share on other sites

avasarama idi? 

exactly... CBN announce chestadani telisi mundhe announce chesadu KCR. taruvata calm ayyipoyadu. CBN asalu enduku announce chesado deni valana asalu votes vastayo ledho kuda telvadu. Asalu Ambedkar ki AP ki sambandham kuda ledhu

Link to comment
Share on other sites

అమరావతి గ్రీన్‌ సిటీ
 
636258316617179402.jpg
  • 51 % పచ్చదనం.. 10% జల వనరులు
  • 14% విస్తీర్ణంలో రోడ్లు, మౌలిక వసతులు
  • భవంతులకు 25% విస్తీర్ణం మాత్రమే
  • ఫోస్టర్‌ తాజా ప్రణాళిక..సీఎంకి సమర్పణ
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఎటుచూసినా మనసును ఆహ్లాదపరిచేలా పచ్చదనం.. పరవళ్లు తొక్కే జల వనరుల సోయగంతో నిండి ఉండేలా నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపుద్దికోనుంది. ఇక పరిపాలనా భవనాల నిర్మాణంలో ప్రకృతి సిద్ధంగా స్థానికంగా దొరికే ఉత్పత్తుల వినియోగం.. ఇతర నిర్మాణాల్లోనూ అణువణువునా మన సంస్కృతీ సంప్రదాయాలు, హస్తకళలను ప్రతిబింబించేలా కళారూపాలు.. రాజధాని ప్రజల కోసం పార్కులు, ఆర్బన్‌ స్క్వేర్లు.. పర్యావరణాన్ని హాని కలిగించని ప్రజా రవాణా.. అవసరమైన మేర ఏక్కడికక్కడ విద్యుత వనరుల కల్పన... ఇదీ మొత్తంగా రాజధాని నగరం నిర్మాణానికి సంబంధించి అమరావతి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్ ఫోస్టర్‌, హఫీజ్‌ కాంట్రాక్టర్‌ సంస్థలు రూపొందించిన తాజా ప్రణాళికల స్వరూపం!
నవ్యంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రాకృతిక సహజత్వం, కళారూపాలు ఉండాలని సీఎం చంద్రబాబు చేసిన ఈ సూచనల మేరకు ఈ సంస్థలు తాజాగా ప్రణాళికలను రూపొందించాయి. 51 శాతం హరిత ప్రదేశం, 10 శాతం జలవనరులు, 14 శాతం రహదారులు, ఇతర మౌలిక వసతులు, 25 శాతం (10 లక్షల చదరపు మీటర్లు) భవంతులకు కేటాయిస్తూ కొత్తగా మార్పులు చేర్పులు చేశాయి. ఈ నెల 1వ తేదీన ఈ సంస్థలు సమర్పించిన కాన్సెప్ట్యువల్‌ ప్లాన్ (భావనాత్మక ప్రణాళిక)లో సీఎం సూచించిన మార్పుచేర్పులతో కూడిన ఈ ప్రణాళికను బుధవారం సీఎం చంద్రబాబుకు అందించాయి. దీని సారాంశాన్ని బుధవారం వెలగపూడిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, సీఆర్డీయే, పలు శాఖల ఉన్నతాధికారులకు ‘అమరావతి-ప్రజా రాజధాని-బిల్డింగ్‌ సస్టెయినబుల్‌ విజన్’ పేరుతో సంస్థ ప్రతినిధులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ లో వివరించారు. ఈ ప్రణాళికలో అమరావతి ఆసాంతం చక్కటి పచ్చదనం, అలరించే జలసౌందర్యం తొణికిసలాడేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఎక్కడికక్కడ సహజసిద్ధమైన పచ్చిక బయళ్లు, పచ్చని వృక్షాలతో ప్రజలకు ఆహ్లాదం పంచే ఉద్యానవనాలుండేలా చూశారు. ప్రజా రాజధానిగా నిర్మితమవుతున్నందున అమరావతిలో ప్రజల కోసం, ప్రజల ద్వారానే సమ్మిళిత వృద్ధిని సాధించాలన్న ఉద్దేశంతో స్థానికంగా లభ్యమయ్యే నిర్మాణ వస్తు సామగ్రి, ఉత్పత్తులనే వినియోగించాలని సూచించారు. ఫలితంగా స్థానికత ఎక్కడికక్కడ ఉట్టిపడడంతోపాటు స్థానికులకు రాజధానిలో పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వాతావరణాన్ని చల్లబరచేందుకు దోహదపడేలా నిర్మాణరీతులు, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. ఉష్ణోగ్రతలను తగ్గించే పద్ధతులను అమలు పరచడంతోపాటు వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా మారే లక్షణమున్న సామగ్రినే భవనాల నిర్మాణాల్లో వాడతారు.
 
సాంస్కృతికపరమైన నిర్మాణాలను హరిత, జలశోభ నెలవై ఉండే చోట్ల అభివృద్ధి పరుస్తారు. సిటీ స్క్వేర్స్‌, అర్బన్ స్క్వేర్స్‌ తదితర బహిరంగ ప్రదేశాలు నిత్య చైతన్యంతో విలసిల్లేలా ఉంటాయి. కాలువల పక్కన ఉండే మార్గాలు ప్రజోపయోగకరంగా రూపొందుతాయి. విద్యుత్ ను 40-60 శాతం ఆదా చేయడంతోపాటు నగర అవసరాలకు తగిన విద్యుత్ ను పీవీ సిస్టం ద్వారా ఎక్కడికక్కడ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేస్తారు. బ్యాటరీ స్టోరేజీకి ప్రాధాన్యమిస్తారు. విద్యుత్ శక్తితో నడిచే ప్రజారవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తారు. సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించే చర్యలు చేపడతారు. వాడిన నీటిని సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వాడుతారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర, హస్తకళలకు స్థానం కల్పించేందుకు వాటిని మ్యూజియాలు, సాంస్కృతిక భవంతులు, కళాకేంద్రాల్లో పదిలపరచడమే కాకుండా ప్రతి కట్టడంలోనూ అవి నిక్షిప్తమయ్యేలా చూస్తారు. రాజధానిలో నెలకొల్పే విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలను ఒక్కచోటే కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తారు.
 
ప్రజాభిప్రాయం తీసుకోండి: సీఎం
తాజా ప్రణాళిక గురించి ప్రజలందరికీ తెలియజెప్పి, దానిపై విస్తృత చర్చ జరిగేలా చూడాలని, వారి అభిప్రాయాలను క్రోడీకరించాలని సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించి, వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలన్నారు. అమరావతిలో ఎక్కడా కాలుష్యానికి ఆస్కారం లేని రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు.భూగర్భంలో నిర్మించే మెట్రో రైలు, కాలువల్లో నడిచే వాటర్‌ ట్యాక్సీలు, రహదారులపై పరుగులు తీసే వాహనాలు అన్నీ కూడా విద్యుత ఆధారంగా నడిచేవిగానే ఉండాలని పేర్కొన్నారు. పులిచింతల రిజర్వాయర్‌ దిగువన కృష్ణానదిపై నిర్మించనున్న నూతన జలాశయం నుంచి రాజధానికి నేరుగా జలమార్గాన్ని ఏర్పాటు చేసి, అందులో నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చూడాలని ఆదేశించారు. నిర్మాణదశ నుంచే అమరావతి రూపకల్పన గురించి ప్రపంచం మాట్లాడుకునేలా అణువణువునా సృజనాత్మకత, వైవిధ్యం కానవచ్చేలా తుది ప్రణాళికలను సిద్ధం చేయాలని మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ను కోరారు. ఈ సమావేశంలో మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ప్రతినిధులు క్రిస్‌ బబ్‌, రాబ్‌ హ్యారిసన్, రాబ్‌ సియ్‌మోర్‌, హర్ష్‌ థాపర్‌, హఫీజ్‌ కాంట్రాక్టర్‌, నిషాంత గుప్తా, అచ్యుత వాత్వే తదితరులు పాల్గొన్నారు.
 
9babu%20capital.jpg
Link to comment
Share on other sites

Amaravati new designs are too good and practical ga unnai

 

 

But couple of observations

 

1) Where is the public protest area? This is important in India for any govt administrative zone

 

2) How do they safeguard "administrative" area when there are protests?

What are the closing points in case of protests(with criminal brains)?

 

My question is refereed to Bhasheerbhag incident where  criminal brains suddenly gave speeches and diverted people from permitted Hussainsagar near area to "Attach Assembly".

 

Actually that day GOVT was not prepared when suddenly lakhs of people started storming assembly and some pre-planned started throwing stones.

Sad part was Govt had to fire on protesters to keep Assembly and main core area safe.

 

Unfortunately when thee things happen 99.999% of attendees will not know the criminal minds plans.

 

We saw Jagan Mohan Reddy&Bhumana Karunakar planning same "Basheerbagh scenario" in Mudragada Kapu protest too. Luckily CBN saw "basherbagh" plan and kept police under control even after attacking Police station and burning. Also that they if I remember correct one constable died too.

 

Here also they suddenly diverted people to Train track with pre-planned mind.

 

Believe me we will see this mob diversion&provocation from Jagan Reddy as that was his dad's success formula.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...