sonykongara Posted August 11, 2018 Author Posted August 11, 2018 ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద విజయవాడ : తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద భారీగా పెరిగింది. మున్నేరు, కట్లేరు, వైరా తదితర వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 14,500 క్యూసెక్కుల వరదనీరు మున్నేరు తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్టు జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. రేపు ఉదయానికి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని వాగుల్లోనూ భారీగా వరద నీరు ప్రవాహం పెరిగిపోవటంతో ప్రకాశం బ్యారేజీ క్రమేపీ నిండుతోంది. బ్యారేజీలో 11 అడుగుల మేర నీటిమట్టం ఉందని.. ఈ సాయంత్రానికి పూర్తిగా నీటిమట్టం 12 అడుగులకు చేరి బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 3 టీఎంసీల నీటి నిల్వకు చేరుకునే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణాలోని మధిర తదితర ప్రాంతాల్లో రాత్రి 180 మిల్లీ మీటర్ల మేర వర్షం కురియడంతో మున్నేరు, వైరా నదులతో పాటు కట్లేరు వాగుల్లో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం 14 వేల500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత పెరిగి 20 వేల క్యూసెక్కుల వరకూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువ ఉన్న తూర్పు, పశ్చిమ కాలువలైన ఏలూరు, బందరు, రైవస్ కాలువలతో పాటు గుంటూరు ఛానల్ కు 11 వేల క్యూసెక్కుల నీటిని పూర్తి సామర్ద్యంతో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 14 పంపులను నిలిపివేశారు. దీంతో పోలవరం కుడికాలువ ప్రవాహం 4 వేల క్యూసెక్కులకు తగ్గింది. కృష్ణాలో వరద ప్రవాహాన్ని అనుసరించి పట్టిసీమ ప్రాజెక్టులోని మిగతా పంపులను కూడా నిలిపివేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

sonykongara Posted August 12, 2018 Author Posted August 12, 2018 ప్రకాశం బ్యారేజ్‌కు కొనసాగుతున్న వరద12-08-2018 08:55:29 విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. కాగా... కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో బ్యారేజీలోకి వరద నీరు భారీగా వస్తోంది. దీంతో నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే డెల్టా కాలువకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
sonykongara Posted August 12, 2018 Author Posted August 12, 2018 ప్రకాశం బ్యారేజీకి జలకళ విజయవాడ: కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండటంతో జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ఐదు గేట్లు ఎత్తిన అధికారులు 5వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కురుస్తోన్న వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉదయం 6.30గంటలకు నాలుగు గేట్లు తెరిచి ఒక మీటరు వరకు కృష్ణా నది నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అలాగే, 7 గంటలకు మరో గేటును ఎత్తి నీరు విడుదల చేశారు. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది గేట్లను ఒక్క మీటర్ ఎత్తుకు ఎత్తడం ద్వారా కిందకు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారీజీలో నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. ఈ తొమ్మిది గేట్ల ద్వారా మొత్తం 6525 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. మున్నేరు వాగు నుంచి 18వేల క్యూసెక్కులు, మధిర నుంచి 4వేలు, పాలేరు నుంచి 5వేల క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో బ్యారేజీకి ఉంటోంది. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో మధ్యాహ్నానికి మరో 4 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు సమాచారం.
sonykongara Posted August 12, 2018 Author Posted August 12, 2018 ప్రకాశం బ్యారేజీ 40 గేట్లు ఎత్తివేత విజయవాడ: కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండటంతో జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో బ్యారేజి నిండుకుండలా మారింది. దీంతో 40 గేట్లు ఎత్తిన అధికారులు 29 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కురుస్తోన్న వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉదయం 6.30గంటలకు నాలుగు గేట్లు తెరిచి ఒక మీటరు వరకు కృష్ణా నది నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అలాగే, 7 గంటలకు మరో గేటును ఎత్తి నీరు విడుదల చేశారు. తాజాగా మొత్తం 40 గేట్లను ఒక్క మీటర్ ఎత్తుకు ఎత్తారు. ప్రకాశం బ్యారేజీకి 30 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మున్నేరు వాగు నుంచి 18వేల క్యూసెక్కులు, మధిర నుంచి 4వేలు, పాలేరు నుంచి 5వేల క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో బ్యారేజీకి ఉంది. కాలువల ద్వారా 12 వేల క్యూసెక్కుల నీటిని సాగుకు విడుదల చేస్తున్నారు. వరద్ద ఉద్ధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
EMANI NTR Posted August 12, 2018 Posted August 12, 2018 Ee season lo ippatidhaka pattiseema water yentha vidudala chesaru ?
rk09 Posted August 12, 2018 Posted August 12, 2018 (edited) 14 hours ago, EMANI NTR said: Ee season lo ippatidhaka pattiseema water yentha vidudala chesaru ? Around 30 tmc Edited August 12, 2018 by rk09
manaNTR Posted August 13, 2018 Posted August 13, 2018 Vykuntapuram Barrage After మున్నేరువాగు and మధిర?
swarnandhra Posted August 13, 2018 Posted August 13, 2018 14 minutes ago, manaNTR said: Vykuntapuram Barrage After మున్నేరువాగు and మధిర? Madhira joins Munneru before it merges Krishna. Yes, vykunthapuram barrage will be after that merge.
sonykongara Posted August 13, 2018 Author Posted August 13, 2018 సప్త వర్ణ లేజర్ కాంతుల్లో శోభిల్లుతున్న ప్రకాశం బ్యారేజీ https://goo.gl/J5do3N #PrakasamBarrage మరిన్ని చిత్రాలు కోసం క్లిక్ చేయండి
sonykongara Posted August 13, 2018 Author Posted August 13, 2018 http://gallery.eenadu.net/photo-gallery.aspx?sliderid=4939
LuvNTR Posted August 13, 2018 Posted August 13, 2018 @sonykongara vijayawada ki water threat undi anta ee year. CBN garu should take cautionary measures now itself to evacuate necessary people.
Peter Griffin Posted August 14, 2018 Posted August 14, 2018 5 hours ago, LuvNTR said: @sonykongara vijayawada ki water threat undi anta ee year. CBN garu should take cautionary measures now itself to evacuate necessary people. enduku ala @LuvNTR
LuvNTR Posted August 14, 2018 Posted August 14, 2018 3 hours ago, Peter Griffin said: enduku ala @LuvNTR astrology prediction.
Guest Urban Legend Posted August 14, 2018 Posted August 14, 2018 11 hours ago, LuvNTR said: cautionary measures now itself to evacuate necessary people 500 crores tho wall kattaru le ramalingeswara nagar varaku no problems
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now