Jump to content

Recommended Posts

Posted

Vijayawada: ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు.. కుట్ర కోణంపై పోలీసులకు ఫిర్యాదు

ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 06 Sep 2024 21:38 IST
 
 
 
 
 
 

124164093_06boat-1a.webp

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు మర పడవలు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమోనని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల ఒకటో తేదీ తెల్లవారుజామున మూడు భారీ పడవలు, ఒక చిన్న పడవ ఎగువ నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్‌ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఒకేసారి నాలుగు పడవలు రావడం వెనుక అనుమానాలున్నాయని ఫిర్యాదులో తెలిపారు.

Posted

 బ్యారేజీ దగ్గర గేట్లను ఢీకొట్టిన పడవుల యజమానుల ఆచూకీ కనుగొన్న పోలీసులు - గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‍కు చెందిన పడవలుగా గుర్తింపు - కొన్నేళ్లుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే పడవలు నడుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు - కుట్ర కోణం వెలికితీసేందుకు పోలీసులు విచారణ వేగవంతం - పోలీసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఉన్నతాధికారులు - పడవలను ఢీ కొట్టిన వ్యవహారాన్ని సీరియస్‍గా తీసుకున్న ప్రభుత్వం

Posted

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ.. చురుగ్గా కౌంటర్‌ వెయిట్‌లోకి మెటల్, కాంక్రీట్ పనులు

ప్రకాశం బ్యారేజీ వద్ద మరమ్మతులు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ కౌంట్‌ వెయిట్‌లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు.

Updated : 08 Sep 2024 11:29 IST
 
 
 
 
 
 

080924prakasam-baardhge-sr1.webp

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ కౌంటర్‌ వెయిట్‌లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు.  67, 69 గేట్ల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ వెయిట్లలో మెటల్, కాంక్రీట్‌ను నింపుతున్న పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద 3 గేట్లను మూసేసి పనులను అధికారులు చేస్తున్నారు. 

ఇటీవల ప్రకాశం బ్యారేజీకి చేరిన వరద ఉద్ధృతికి పడవలు(బోట్లు) వచ్చి గేట్లకు అడ్డుతగిలాయి. దానిలో ఒకటి కౌంటర్‌ వెయిట్‌ను ఢీకొనడంతో విరిగిపోయింది. 67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డుపడటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా జరగలేదు. మరోవైపు బోట్లు అడ్డుపడటంపై ఏదైనా కుట్ర ఉందేమోననే అనుమానంతో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు విజయవాడలో వరద తగ్గుముఖం పట్టింది. సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో అనేక కాలనీల్లో వరద పూర్తి స్థాయిలో తగ్గింది. మరి కొన్ని కాలనీల్లో పాదాలు తడిసేంత వరద నీరు ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది.

Posted

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అరెస్టు గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన రామ్మోహన్ అరెస్ట్ పడవుల యజమాని ఉషాద్రిని విచారించిన వన్‌టౌన్ పోలీసులు తనకు బోట్లు లేవని పోలీసులకు తెలిపిన రామ్మోహన్‌రావు – తనకున్న 5 బోట్లలో 3 బోట్లు మిస్ అయ్యాయని తెలిపిన ఉషాద్రి – రాజకీయ కోణంలో ఏదైనా జరిగిందా అన్నదానిపై పోలీసుల విచారణ

Posted

విజయవాడ: ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దర్యాప్తు అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారన్నారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3 బోట్లు ఉన్నాయని చెప్పారు. లంగర్‌ వేయకుండా 3 బోట్లను ప్లాస్టిక్‌ తాడుతో కట్టారన్నారు. బోటు యజమాని వైకాపా నేత కావడం కుట్ర కోణాన్ని బలపరుస్తోందని చెప్పారు. 45, 50 టన్నుల బరువు ఉన్న పడవలు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్‌ వెయిట్లను బలంగా ఢీకొట్టాయన్నారు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడం, గేట్లకు ఇబ్బంది లేదన్నారు. 

‘‘నందిగం సురేష్‌, తలశిల రఘురామ్‌కు బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్‌ దగ్గరి మనిషి. వాటికి వైకాపా రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్దండరాయుని పాలెం వైపు ఉండే బోట్లు వరదకు ముందే ఇవతలికి వచ్చాయి. సుమారు కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? పైస్థాయి ఆదేశాలు లేకుండా విలువైన బోట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండరు’’ అని నిమ్మల రామానాయుడు తెలిపారు.

Posted

విజయవాడ: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో అరెస్టు చేసిన ఇద్దరినీ పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పడవల యజమాని ఉషాద్రితోపాటు, మరో వ్యక్తి రామ్మోహన్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్‌ వెయిట్లను 4 పడవలు ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్‌ వెయిట్లు ధ్వంసమయ్యాయి. కొట్టుకొచ్చిన బోట్ల కోసం ఇప్పటి వరకు దాని యజమానులు రాలేదు. ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యం ఉందని గుర్తించిన పోలీసులు.. వాటిని దిగువకు వదలడంలో ఏదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 3 పడవలపై వైకాపా రంగులు ఉండటంతో, ఆపార్టీ నేతల ప్రమేయమేమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...