Yaswanth526 Posted June 20, 2018 Posted June 20, 2018 NCBN today inaugurated the Eastern Delta Regulator in Vijayawada and released water into Prakasam barrage.
rk09 Posted July 13, 2018 Posted July 13, 2018 ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరదనీరు విజయవాడ: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు పోటెత్తింది. దీంతో ఈ అర్ధరాత్రి తర్వాత బ్యారేజీ గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. 4500 నుంచి 5వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని మునేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహం పెరిగింది. పట్టిసీమ, పులిచింతల నుంచి కూడా నీటి సరఫరా కొనసాగుతోంది. వరదనీరు పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
rk09 Posted July 13, 2018 Posted July 13, 2018 Finally, water may be released into sea from Barrage. Much needed.
sonykongara Posted July 14, 2018 Author Posted July 14, 2018 నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ14-07-2018 07:40:34 విజయవాడ: ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ నిండుకుండలా ఉంది. అలాగే బ్యారేజీకి 12 క్యూసెక్కుల మేరకు వరద నీరు వస్తోంది. బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో బ్యారేజీలోకి పెద్దఎత్తున వరద నీరు వస్తోంది. కాగా... బ్యారేజీ నిండుకుండలా ఉన్న నేపధ్యంలో ఈరోజు మధ్యాహ్నంలోగా గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
sonykongara Posted July 15, 2018 Author Posted July 15, 2018 బ్యారేజీకి జల కళ15-07-2018 02:35:16 విజయవాడ, కర్నూలు, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజి వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మధిర, కీసర, పాలేరు, మున్నే రు వాగుల నుంచి నీరు కృష్ణాలోకి వస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ప్రకాశం బ్యారేజి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజి గరిష్ఠ నీటిమట్టం 12 అడుగులు దాటింది. కీసర నుంచి 6095 క్యూసెక్కులు, పాలేరు నుంచి 764 క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజి నీటిమట్టం శనివారం ఉదయానికి 12 అడుగులకు చేరుకుంది. కాగా, తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగ జలాశయం ఉప్పొంగింది. శనివారం ఉదయానికి 59.542 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నిండని ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నా ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం లేదు. కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీని మినహాయిస్తే రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి జాడ కన్పించడం లేదు. శ్రీశైలంలో 20.09 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. అదేవిధంగా నాగార్జునసాగర్‌లో 133.373, పులిచింతలలో 43.9, ఏలేరులో 18.73, సోమశిలలో 66.67 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now