Jump to content

Prakasam Barrage


Recommended Posts

ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు ఎత్తివేత
19-08-2018 18:35:36
 
636703005382452281.jpg
విజయవాడ: ఎగువ నుంచి భారీగా వరదలు రావడంతో ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు ఎత్తివేశారు. బ్యారేజి ఇన్‌ఫ్లో-17 వేలు, ఔట్‌ఫ్లో-7 వేల క్యూసెక్కులుగా ఉంది. తూర్పు, పశ్చిమ కాలువలకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని అధికారులు తగ్గించారు. అంతేకాకుండా సుంకేసుల డ్యాం 18 గేట్లను అధికారులు ఎత్తివేత వేశారు. ఇన్‌ఫ్లో 1.39 లక్షలు, ఔట్‌ఫ్లో 1.37 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

  • 3 months later...

విజయవాడ: పెథాయ్ తుఫాను ప్రభావంతో క్రమంగా కృష్ణమ్మలో నీటి మట్టం పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎగువ నుంచి భారీగా నీరు చేరడంతో ఐదు గేట్లు ఎత్తి కొద్ది మొత్తంలో నీటిని విడుదల చేశారు. కృష్ణానదిలో నీరు మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

  • 5 years later...

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 70 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది.

Updated : 07 Aug 2024 13:03 IST
 
 
 
 
 
 

124145621_070824prakasambarrage1a.jpg

విజయవాడ: శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. సాయంత్రం లేదా రాత్రికి లక్షన్నర క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాల్వల ద్వారా విడుదల చేసే వరదనీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

124145621_070824prakasambarrage1b.jpg

Loading video
Link to comment
Share on other sites

  • 4 weeks later...

AP News: వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

Updated : 31 Aug 2024 16:37 IST
 
 
 
 
 
 

310824gates-inner.webp

విజయవాడ: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి పైవంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...