Jump to content

Central govt clarification towards aid to andhra


Prasadr

Recommended Posts

We are not fully dependent on them... Plan B is already in action.

 

We have resources(land, water etc) and they have money...do bartering and engage them in development. I think we will be set by 2018. Shows how quickly one can revive under strong leadership.

Link to comment
Share on other sites

ఆ రూ.2,050 కోట్లతో సరి!
 
636006032762499002.jpg
  • రాజధానికి ఇక పైసా కూడా ఇవ్వలేం
  • రాష్ర్టానికి తేల్చి చెప్పిన కేంద్రం
  • 2020 దాకా వెనుకబడిన
  • జిల్లాలకూ ఏడాదికి 350కోట్లే
  • రెవెన్యూ లోటు 6,803 కోట్లన్న కాగ్‌
  • ఆ లెక్కల వరకే కేంద్రం ఓకే
  • పరిశ్రమలకు పన్ను రాయితీలకూ నో
  • జీఎస్టీయే మందు.. అందాకా ఆగాల్సిందే
న్యూఢిల్లీ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘‘దేశ రాజధాని ఢిల్లీని మించిన రాజధానిని ఏపీకి నిర్మించి ఇస్తాం... కంగారుపడకండి...’’ అంటూ ఎన్నికల సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ చెప్పిన మాటలు నీటి మూటలుగా మారనున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకూ కేటాయించిన రూ.2,050 కోట్లతోనే సరిపెట్టుకోవాలని, ఇక ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఇటీవల ఏపీకి ఆర్థికసాయంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు అంశాలపై ఇక ‘‘మాటలు లేవు... మాట్లాడుకోవడాలు లేవు’’ అన్నట్లుగా కేంద్ర ఆర్థికశాఖ వ్యవహరించినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే కేటాయించిన రూ.2,050 కోట్లతోనే సర్దుకోవాలని, ఇక ఏమీ ఇవ్వలేమని చేతులెత్తేసింది. కాగా, ఇందులో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కేటాయించిన వెయ్యి కోట్లను మినహాయించి మరో రూ.2,500కోట్లు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కేంద్రం అందుకు ఎంతమాత్రమూ అంగీకరించలేదని తెలిసింది. విభజన చట్టంలోని 94(3)సెక్షన్‌ ప్రకారం రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి భవనాల నిర్మాణాలకు మాత్రమే కేంద్రం సాయం చేయాలని స్పష్టంగా ఉందని, ఈ భవనాలన్నీ రూ.2,050 కోట్లతోనే నిర్మించుకోవచ్చని, సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం భావిస్తే కేంద్రమే ఎన్‌బీసీసీ ద్వారా ఈ భవనాలను నిర్మించి ఇస్తుందని ఆర్థికశాఖ తెలిపింది.
 
వెనకబడిన జిల్లాలకు సాయంపైనా..
రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.200 కోట్లను వచ్చే ఎనిమిది సంవత్సరాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేటాయించాలని సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాకు రూ.50కోట్లు చొప్పున మరో నాలుగేళ్లకు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ‘‘వెనుకబడిన జిల్లాలకు సాయంపైన మా వైఖరిని ఎప్పుడో చెప్పేశాం. అయినా, ఏపీ అధికారులు మాత్రం వారి ముఖ్యమంత్రి దగ్గర అసలు విషయం చెప్పకుండా ఇంకా ప్రయత్నం చేస్తున్నాం... చూస్తాం... తప్పకుండా వస్తాయంటూ కాలక్షేపం చేస్తున్నారు’’ అని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
 
తగ్గిన రెవెన్యూ లోటు
2014 జూన్‌ 2వతేదీ నుంచి 2015 మార్చి31వ తేదీ వరకూ ఏపీకి రెవెన్యూలోటు రూ.16,078.76కోట్లు ఉందని తేల్చి చెప్పిన కాగ్‌... తాజాగా తన లెక్కలను సవరించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన కాగ్‌ తాజా లెక్కల్లో ఏపీ రెవెన్యూ లోటు కేవలం రూ.6,803 కోట్లుగానే నిర్ధారించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం వాదిస్తోంది. ఇప్పటికే రెవెన్యూలోటు భర్తీ కింద రూ.2,803 కోట్లను ఏపీకి విడుదల చేసిన కేంద్రం మరో రూ.4వేల కోట్లను మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. రైతు సాధికారసంస్ధ రుణాలు రూ.7,500కోట్లు, విద్యుత సబ్సిడీలు రూ.1500 కోట్లను కొత్త లెక్కలుగా పరిగణించిన కాగ్‌... తాజాగా తయారు చేసిన నివేదికలో వాటిని మినహాయించి రెవెన్యూలోటును కుదించినట్లు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. రైతుసాధికార సంస్థ, విద్యుత సబ్సిడీలు పాతవేనని, కావాలంటే వాటికి సర్టిఫికెట్లు ఇస్తామని రాష్ట్ర అధికారులు చెప్పినా కేంద్రం అంగీకరించడం లేదు. దీంతో, ఇక రెవెన్యూలోటు భర్తీపైనా ఆశలు వదులుకోవాల్సిందేనని ఏపీ అధికారులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
పన్ను రాయితీలకు ఎగనామం
వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుగా పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం పదే పదే కోరింది. కేంద్రం మాత్రం... జీఎస్టీ అమలులోకి వస్తే దేశమంతా ఏకీకృత పన్నుల విధానం అమలులో ఉంటుందని, అందువల్ల పన్ను రాయితీలు అవసరం లేదని వాదిస్తోంది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందేంతవరకూ ఆగాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే పన్ను రాయితీ కల్పించలేనప్పుడు కనీసం ముందుగా ఆదాయపన్ను రాయితీనైనా ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరినా ప్రయోజనం లేకపోయింది. విభజన చట్టంలోని 94(1) ప్రకారం ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు గతంలో ఇచ్చినట్లుగా పదేళ్లపాటు పెట్టుబడి రాయితీ 30 శాతం, సెంట్రల్‌ ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ రాయితీ 100శాతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టింది. ఈ అంశంపైనా కేంద్రంతో ఇకపై మాట్లాడటం అనవసరమని ఏపీ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


రెవెన్యూ లోటు 6,803 కోట్లన్న కాగ్‌

 

CAG 22000 cr ani cheppindhi ....idhenti kwamedy ga 6803

Link to comment
Share on other sites

Modi/BJP  & center  -step by step reversal of the  obligations & promises........ They are taking in to consideration of  the extent of  'REACTION'  from  AP people & political leaders........

 

Now, they estimate they understood and got the  measure of AP public & political spectrum......Thats why lately they are opening about the  reversals a bit more deliberately......

Link to comment
Share on other sites

In simplest terms...... Present  cbn's  reaction  determine tomorrow's attitude & behavior of  Modi/BJP led Govt towards AP......That means, today's  BJP attitude  did not come from vacuum , it was based on AP public & political leaders'  REACTION(or NO ACTION) from yesterday....  Get it?

Link to comment
Share on other sites

2019 lo CBN need 25/25 MP seats... Mana janalu m chestharo :blink:

 

25/25 possible 1% , 99% impossible

 

If we want to win 1st tokkalsindi Kadapa dst eee

 

1st kadapa muncipality motham anni leaders ni tdp lo rapinchi muncipala elections lantivi petti jagan gadini zero chesthe we can easily win 20 MP seats.

Link to comment
Share on other sites

25/25 possible 1% , 99% impossible

 

If we want to win 1st tokkalsindi Kadapa dst eee

 

1st kadapa muncipality motham anni leaders ni tdp lo rapinchi muncipala elections lantivi petti jagan gadini zero chesthe we can easily win 20 MP seats.

20 vachina no use.... Atleast kadapa vadilesi 24 ayina ravali TDP ki..

Link to comment
Share on other sites

2019 lo CBN need 25/25 MP seats... Mana janalu m chestharo :blink:

15 members ni pampisthe em chesthunnaru? Gangireddhulla vaallu emi cheppina thala voopi vasthunnaru. Ilanti vallaki 25 seats endhuku asalu em chesarani istharu
Link to comment
Share on other sites

Do take a sincere hard look....retrospectively.....did ap public (all - people, leaders ...the whole spectrum) stood-up & fought against the monumental transgressions & gross violations ?

 

We all know the answer.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...