Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
బందరు కాల్వకు ఇరు వైపులా పచ్చదనం
23-07-2018 09:25:19
 
636679347186377058.jpg
  • వృక్షాలకు బహుళ వర్ణాలు
  • అందాల కోసం ఏలూరు, రైవస్‌ ఎదురు చూపులు
నిన్నమొన్నటి వరకు ఎటు చూసినా చెత్తాచెదారమే. గోదారమ్మ ఎర్ర నీళ్లను కలుపుకుని కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతుంటే ఆ నీటి నిండా వ్యర్థాలే ఉండేవి. నేడు ఆ పరిస్థితి కొంత వరకు మారింది. నగరం మధ్యలో నుంచి ప్రవహించే బందరు కాల్వ ఇప్పుడు అందరి చూపునూ తనవైపు తిప్పుకుంటోంది. కాల్వకు ఇరు వైపులా ఉన్న గట్లు పచ్చదనాన్ని పరుచుకోగా, నీటిపై వ్యర్థాలు మాయమయ్యాయి. కాల్వ గట్టుకు ఇరువైపులా ఉన్న వృక్షాలు సప్తవర్ణాలతో మెరిసిపోతున్నాయి.
 
విజయవాడ: మూడు కాలువల ద్వారా ముందుకు సాగుతోంది కృష్ణమ్మ! ఆ కాల్వల గట్లు ఒకనాడు దుర్గంధం వెదజల్లుతూ ఉండేవి. ప్రభుత్వం సుందరీకరణపై దృష్టి సారించడంతో ఇప్పుడు ఈ గట్లపై పచ్చదనం పరుచుకుంటోంది. బందరు కాల్వ వెంబడి గట్లు ఇప్పటికే ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ గట్ల వెంట ప్రతి కిలోమీటరుకూ ఓ రంగుల ప్రపంచం కనువిందు చేస్తోంది. ఇప్పటి వరకు వాల్‌పేపర్‌లలో చూసిన దృశ్యం వాస్తవ రూపం దాల్చుతోంది. చెత్త, చెట్లు, మురికితో అధ్యాన్నంగా ఉన్న బందరు కాల్వ గట్లు రంగులు, హంగులతో మెరుస్తున్నాయి. వీటితో పాటు నగరం మధ్య నుంచి దిగువకు ప్రవహించే ఏలూరు, రైవస్‌ కాలువలను అనుసంధానం చేయడంతోపాటు వాటికి ఇరువైపులా పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.
 
 
ముందుగా సుందరీకరణ
ప్రకాశం బ్యారేజ్‌ నుంచి మొదలైన ప్రధాన కాలువ మూడుగా విడిపోతుంది. అవే రైవస్‌, ఏలూరు, బందరు కాలువలు. ఇక వెలగలేరు నుంచి బుడమేరు కాలువ మొదలవుతుంది. ఇది ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కనిపించినప్పటికీ, దాని నిండా మురుగునీరే. ఏలూరు, బందరు, రైవస్‌ కాలువలు ఖరీఫ్‌, రబీ పంటలకు సాగునీటిని అందించడంతోపాటు అనేక గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయి. నగరం మధ్య నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల మేర ఈ కాల్వలు ప్రవహిస్తున్నాయి. ముందుగా ఈ కాలువల గట్లను సుందరీకరించడానికి యంత్రాంగం నడుంబిగించింది.
Link to comment
Share on other sites

టేడియం శంకుస్థాపనకు భారీగా ఏర్పాట్లు
23-07-2018 09:33:19
 
636679351981289922.jpg
  • 24న లేబర్‌కాలనీలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణ శంకుస్థాపనకు సీఎం రాక
  • సాయంత్రం 5గంటలకు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
విజయవాడ: 29వ డివిజన్‌ విద్యాధరపురం లేబర్‌ కాలనీలో ఆరు ఎకరాల ఖాళీ స్థలంలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణం కోసం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 24న సాయంత్రం అయిదు గంటలకు అంతర్జాతీయ క్రీడా ప్రాంగణం నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే ఆ ప్రాంగణంలో ముఖ్యమంత్రి సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ క్రీడా మైదానం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటంపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం శంకుస్థాపన చేయనున్న శిలాఫలకం కూడా సిద్ధమైంది.
 
దానికి తోడు శంకుస్థాపన అనంతరం ఆయన సభలో ప్రసంగించనున్నారు. సుమారు రూ.60 కోట్లతో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణం నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రీడా ప్రాంగణంలో మూడు వాలీబాల్‌ కోర్టులు, కబడ్డీ కోర్టులు నాలుగు, పది బ్యాడ్మింటన్‌ కోర్టులు, స్విమ్మింగ్‌ తదితర కోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నారు.
Link to comment
Share on other sites

దేశంలో తొలి ఒలింపిక్స్‌ ఏపీలోనే 
ఈ దిశగా వసతులు మెరుగుపరుస్తాం 
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 
విజయవాడలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన 
ఈనాడు - అమరావతి 
24ap-main14a.jpg

న్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్న భారత్‌.. క్రీడల్లో మాత్రం ఇంకా అనుకున్న పురోగతి సాధించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఒలింపిక్స్‌ నిర్వహించలేదని భవిష్యత్తులో మన దేశంలో నిర్వహించే తొలి ఒలింపిక్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి తగ్గట్లుగా రాష్ట్రంలోని క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. మంగళవారం విజయవాడలోని విద్యాధరపురంలో అమరావతి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రముఖ మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లేకు చెందిన సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు గాండీవం, ప్రాజెక్టు పాంచజన్యం కార్యక్రమాలను తీసుకొచ్చామన్నారు. వీటిని లాంఛనంగా ప్రారంభించారు. గతంలో కేవలం క్రికెట్‌కే ప్రాధాన్యం ఇచ్చేవారని, ఇప్పుడు అన్నింటిపైనా ఆసక్తి చూపిస్తున్నారన్నారు. గోపీచంద్‌కు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం స్థలాన్ని ఇచ్చామని.. దాని నుంచి ఇప్పుడు అనేక మంది క్రీడాకారులు తయారవుతూ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారని ప్రశంసించారు. శిక్షకులు ముందుకు వస్తే వారికీ ఇస్తానన్నారు. 12 ఏళ్లలోపు బాల, బాలికలను తీసుకుని వారికి అన్ని విధాలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు. 2018-19లో సీఎం కప్‌ పేరిట వివిధ పోటీలు నిర్వహించి ప్రతిభను వెలికితీస్తామన్నారు. అటువంటి వారికి స్కాలర్‌షిప్‌లతో పాటు, నగదు పురస్కారాలు, ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. విజయవాడతో పాటు రాజధాని అమరావతిలోనూ అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామన్నారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ప్రాంతీయ క్రీడా ప్రాంగణాలు వస్తాయమన్నారు. భవిష్యత్తులో పాఠశాల క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా చూడాలని శాప్‌ ఛైర్మన్‌ను కోరారు. దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఎక్కడా ప్రారంభం కాలేదని మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే అన్నారు. దీనికింద బాల, బాలికలను ఎంపిక చేసి వారికి అన్ని రకాలుగా తర్ఫీదు ఇస్తామన్నారు.

క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు 
కార్యక్రమానికి హాజరైన అర్జున, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. కరణం మల్లీశ్వరి, అశ్వనీ నాచప్ప, షైనీ విల్సన్‌, వలసమ్మ తదితరులకు శాలువా కప్పి జ్ఞాపికలు అందజేశారు. స్థానిక క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు చెక్కులను అందజేశారు. వివిధ జిల్లాల యువజన సంఘాలకు క్రీడా కిట్‌లను అందించారు. విజయవాడకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి బేబీ డాలీ శివానీని సన్మానించి రూ.25 లక్షలను ఇస్తున్నట్లు ప్రకటించారు. సెయిలింగ్‌లో ప్రతిభ చూపుతున్న నావికా అధికారి లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ స్వాతిని కూడా ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా రూ.10 లక్షలు ప్రకటించారు. వోల్గా ఆర్చరీ అకాడమీ నిర్వాహకుడు సత్యనారాయణకు ఇల్లు, అకాడమీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున తోడ్పతామన్నారు.

Link to comment
Share on other sites

క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన
25-07-2018 07:37:09
 
636681010289194569.jpg
విజయవాడ: రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశేషంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విద్యాధరపురంలో రూ. 60 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి మంగళవారం సీఎం శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోను, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణంలోను శిక్షణ ఇస్తున్న పాంచజన్యం, గాండీవం ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆర్చరీ ప్రదర్శనను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా సుమారు తొమ్మిదెకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ క్రీడా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
గతంలో ఎన్నో అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన సీఎం తాజాగా అనిల్‌కుంబ్లే సారథ్యంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు గాండీవం ద్వారా అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అనిల్‌కుంబ్లే మాట్లాడుతూ క్రీడాకారులను గుర్తించి, వారిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా 29వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు మైలవరపు కృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని గజమాలతో సత్కరించారు.
 
Link to comment
Share on other sites

వెహికల్‌ డిపోలో ఐరన్‌ మెన్‌
26-07-2018 07:29:16
 
636681869555549242.jpg
  • క్యాలెండర్‌ సిరీస్‌లో యోగా మ్యాన్‌
  • ప్లాంట్‌ జంగిల్‌పై కాంక్రీట్‌ జంగిల్‌
  • రూపం మార్చుకున్న స్ర్కాప్‌
విజయవాడ: వెహికల్‌ డిపో నుంచి ఐరన్‌ మ్యాన్‌ నగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ప్లాంట్‌ జంగిల్‌ను నిలువునా నరికి కాంక్రీట్‌ జంగిల్‌ తలెత్తి చూస్తోంది. మనిషి ఆలోచనల నుంచి ఇనుప ప్రాణులు రూపుదిద్దుకుని నగరం దృష్టిని తమవైపు మరల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఏమిటిదంతా అనుకుంటున్నారా? విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న స్ర్కాప్‌ స్కల్ప్చర్స్‌. ఇనుప చువ్వల కోడి పుంజు, గ్యాస్‌ సిలిండర్ల గొరిల్లా.. ఇనుప రేకుల క్యాలెండర్‌ సిరీస్‌, ఐరన్‌ గమేళాలతో ఊసరవెల్లి, ఇనుప డబ్బాలతో ట్రైబల్‌ మ్యాన్‌ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 ఆకృతులు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఆరు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాప్‌లో కళాకారుల ప్రతిభ చూపు తిప్పుకోనివ్వడంలేదు. బుధవారంతో వర్క్‌షాప్‌ ముగియగా, మరో రెండ్రోజుల సమయాన్ని కళాకారులు అదనంగా కోరుతున్నారు.
 
వర్క్‌షాప్‌కు ముందుగా 32కు పైగా ఆకృతుల నిర్మాణానికి ప్రణాళికలు రచించుకున్న కళాకారులు నిర్ణీత కాలంలో వాటిని సిద్ధం చేయలేకపోయారు. కాబట్టి మరికొంత సమయాన్ని ఇవ్వాలని వీఎంసీ యంత్రాంగానికి విన్నవిస్తున్నారు. నగరంలోని రామవరప్పాడు రింగు మొదలుకుని రమేష్‌ హాస్పిటల్‌ వరకు ఉన్న వాకింగ్‌ ట్రాక్‌లో వీటిని ఏర్పాటుచేయాలన్నది నగర కమిషనర్‌ జె.నివాస్‌ ఆలోచన. అందులో భాగంగానే కల్చరల్‌ సెంటర్‌ సీఈవో ఈమని నాగిరెడ్డి సహకారంతో ఈ స్ర్కాప్‌ స్కల్ప్చర్ల వర్క్‌షాప్‌కు గత శుక్రవారం శ్రీకారం చుట్టారు. బుధవారం వరకు ఆ వర్క్‌షాప్‌లో పలు శిల్పాలను రూపొందించడానికి కార్యరంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే ప్రస్తుత శిల్పాలు రూపుదిద్దుకున్నాయి.
 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన 30 మంది కళాకారులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఏ మాత్రం అదనపు సమయాన్ని అందించినా.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని ఉత్సాహంగా చెబుతున్నారు. తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శించడానికి అభివృద్ధి విజయవాడ వంటి ప్రాంతం అనువైందని, ఈ ప్రదేశంలో రెండోసారి కూడా అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందంటున్నారు. వారి చేతుల్లో రూపుదిద్దుకున్న శిల్పాల గురించి వారి మాటాల్లోనే..
 
 
ప్లాంట్‌ జంగిల్లో... కాంక్రీట్‌ జంగిల్‌
డెవలప్‌మెంట్‌లో భాగంగా శివార్లలోని గ్రామాలను నగరంలో కలిపేస్తున్న రోజులివి. ఫలితంగా గ్రామాల్లోని పచ్చదనం కనుమరుగవుతూ ప్లాంట్‌ జంగిల్‌ కాస్తా.. కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోంది. దాన్ని సింబాలిక్‌గా చూపించే నమూనానే ఈ అర్బన్‌ స్పాల్‌. గతంలో చెట్లపైనే మనిషి నివసించేవాడు. ఇవాళ చెట్లు నరికి నివాసాలు ఏర్పాటుచేసుకుంటున్నాడని చెప్పడమే ఈ నమూనా ఉద్దేశం.
- జి.రామకృష్ణ, కళాకారుడు
 
 
క్యాలెండర్‌ సిరీస్‌ - యోగా మ్యాన్‌, విష్‌ ఫర్‌ ఫ్రీడమ్‌
మనిషి మస్తిష్కంలో ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, ఎన్నింటికో స్థానమిస్తుంటాడు. వాటి మధ్యన మనిషి మెదడు ఎపుడూ రంగుల రాట్నంలా పనిచేస్తూనే ఉంటుంది. ఆ నిర్ణయాలకు ప్రతిరూపంగా మా విష్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ను ఏర్పాటుచేశాను. మేము ప్రాక్టీస్‌ చేసే సమయంలో క్యాలెండర్‌ సిరీస్‌ ప్రకారం నమూనాలను చేస్తుంటాం. అందులో భాగంగానే మా స్నేహితుడు శ్రీను ఈ క్యాలెండర్‌ సిరీస్‌ పై యోగా డే ను గుర్తుచేస్తూ క్యాలెండర్‌పై తెలుగు తల్లి నమూనాను, క్యాలెండర్‌పై యోగా మ్యాన్‌ను సిద్ధం చేశాడు.
- మండా శ్రీనివాసరావు, విజయవాడ
 
నమూనా ఇపుడే పూర్తవుతోంది
ఈ ఆకృతి ఒక్కొక్కరికీ ఒక్కో రూపంలో కనిపిస్తుంటుంది. అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో ఈ ఆకృతిని సిద్ధం చేస్తున్నాను. కాన్సెప్ట్‌ను ఇపుడే సిద్ధం చేస్తున్నాను. రేపటికల్లా సిద్ధమవుతుంది.
- మెహర్‌, కళాకారిణి, ముంబై
Link to comment
Share on other sites

విజయవాడలో రెడీ అవుతున్న మొదటి ఫైవ్ స్టార్ హోటల్... సెప్టెంబర్ లో ప్రారంభం...

Super User
28 July 2018
Hits: 71
 
novotel-28072018-1.jpg
share.png

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి, తాత్కాలిక రాజధాని విజయవాడలో మొదటి ఫైవ్ స్టార్ట్ హోటల్ రెడీ అవుతుంది. అదేంటి, ఇప్పటి దాక విజయవాడకు ఫైవ్ స్టార్ హోటల్ లేదా అని ఆశ్చర్యపోతున్నారా ? ఏమి చేస్తాం అండి అన్నీ మనమే నిర్మించుకుందాం. ఇప్పటికే బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడుకు వెళ్ళే సర్వీస్ రోడ్ లో, వినాయక్ ధియేటర్ ఎదురుగ నోవాటెల్‌ ఫైవ్ నక్షత్రాల స్టార్‌ హోటల్‌ నిర్మాణంలో ఉంది. నోవాటెల్‌ మొత్తం 16 ఫ్లోర్స్ లో కడుతున్నారు. ఈహోటల్‌లో సకల సౌకర్యాలు గల 110 గదులు ఉంటాయి. వరుణ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఈ హోటల్‌ నిర్మాణం జరుగుతుంది.

 

novotel 28072018 2

సెప్టెంబర్ నాటికి సిద్ధమవుతుందని వరుణ్‌ గ్రూప్‌ చెప్తుంది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. నోవాటెల్‌ ఫైవ్ స్టార్ట్ హోటల్‌ విజయవాడకు ప్రథమ ఆకర్షణగా ఉండనుంది. అమరావతి పరిధిలో గుంటూరు, విజయవాడ పరిధిలో మరిన్ని ఫైవ్ స్టార్ట్ హోటల్స్ రానున్నాయి.. ఐటీసీ.. మారియేట్.. నోవాటెల్.. గ్రీన్‌పార్క్.. కీస్(కేఈవైఎస్) వంటి అనేక స్టార్ హోటళ్లు నగర పరిసర ప్రాంతాలకు రానున్నాయి. కొన్ని ఇప్పటికే, నిర్మాణాలు కూడా మొదలుపెట్టాయి.

novotel 28072018 3

అమరావతిలో 5 స్టార్‌ కేటగిరిలో హోటళ్లను నెలకొల్పే అవకాశాన్ని నోవాటెల్‌, హిల్టన్‌, క్రౌన్‌ ప్లాజా, డబుల్‌ ట్రీ అనే ప్రఖ్యాత గ్రూపులు దక్కించుకున్నాయి. ఒక్కో హోటల్‌లో 200 గదులుంటాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లు, లాంజ్‌లు, బాంక్వెట్‌ హాళ్లు, పార్కింగ్‌ వసతులు కొలువు దీరతాయి. ఇక.. 4 స్టార్‌ హోటళ్లను స్థాపించేందుకు హాలిడే ఇన్‌, గ్రీన్‌ పార్క్‌, జీఆర్‌టీ, దసపల్లా గ్రూపులు ఎంపికయ్యాయి. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించిన ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌- అంగీకారపత్రాలు)లను ఆయా హోటల్‌ గ్రూపులకు జారీ చేసిన సీఆర్డీయే.. మిగిలిన అధికారిక లాంఛనాలను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.

Link to comment
Share on other sites

సూపర్ ఫాస్ట్ గా, విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు...

Super User
28 July 2018
Hits: 18
 
super-28072018-1.jpg
share.png

కోస్తా ప్రజల చిరకాల స్వప్నం మరికొద్ది రోజుల్లో సాకారం కానుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు కార్పొరేట్ సంస్థలను తలదన్నే వైద్య సేవలను అందించేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శరవేగంగా సిదమవుతోంది. నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. చిన్న చిన్న పనులు, ఫినిషింగ్ పూర్తి చేసి త్వరలోనే ఇది ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కాంట్రాక్టు సంస్థ కేఎంవీ గ్రూప్ పనులును పూర్తి చేస్తుంది.

 

super 28072018 1

ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 293 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది. రూ.150 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రూ.120 కోట్ల నిధులను కేంద్రం కేటాయించగా రూ.30 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయిస్తోంది. సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో మొత్తం ఎనిమిది విభాగాల వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వస్తాయి.

super 28072018 1

గుండె, మెదడు, న్యూరాలజీ, నెప్రాలజీ, నవజాత శిశువు, మూత్రశయం వంటి విభాగాలు ఇక్కడ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ విభాగాలకు సంబంధించిన రోగులు గుంటూరు, హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్‌ స్పెషాలిటీ అందుబాటులోకి వస్తే విజయవాడలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

 
Advertisements
 

Add comment

Link to comment
Share on other sites

New tunnel on the anvil in the city

THE HANS INDIA |   Jul 30,2018 , 01:43 AM IST
   

grabon.jpg

New tunnel on the anvil in the city
New tunnel on the anvil in the city
 
 
Vijayawada: The state government is planning to construct a new tunnel in Vijayawada city from Gunadala to Mogulrajapuram or Bhavanipuram to One Town. The new road connectivity would reduce traffic snarls while it can also create alternative road network system.
 
The local body officials and experts in the respective wing would jointly workout the new roadway. Already, the Vijayawada Municipal Corporation (VMC) has invited the global tenders in this regard at an estimated project cost of Rs 200 crore.
 
 
 
 
 
 
 
 
 
 
As per plans, the new tunnel would be constructed by taking suggestions and designs from international consultants. Indeed, the citizens are facing challenges to move on the city roads following the construction of capital city Amaravati.
 
 
 
The traffic has been increasing due to development works. In this backdrop, the state government entrusted road expansion work and formation of new road connectivity work, including tunnel construction, to the local body authority.  
 
As part of new plans, the local body officials identified hills in the city between Mogulrajapuram and Gundala stretch and Bhavanipuram and One Town which are creating traffic hurdles. The hills also doubled the journey time from Eluru Road to Bandar Road-bus station stretch.
 
Similarly, the citizens have to turn around the hill to reach from One Town to Bhavanipuram. The VMC initially proposed to construct two tunnels in the two stretches but now would complete at least one on a priority basis. The journey time could be reduced nearly 20 minutes in the two respective stretches.
 
Senior consultant of private agency K Subba Rao said that former MP the late KL Rao had suggested the tunnels for reducing the traffic in the city. He recalled that the existing Chittinagar tunnel was constructed by suggestions of KL Rao. He hoped that the new tunnel would be helpful to commuters.
 
Link to comment
Share on other sites

రైల్వే స్టేషన్‌కు ఐకానిక్ స్వాగత ద్వారం
30-07-2018 08:10:24
 
636685350246272635.jpg
  • సర్క్యులేటెడ్‌ ఏరియాలో రీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌
  • మెయిన్‌ ఎంట్రన్స్‌ విస్తరణ
  • రైల్వే స్టేడియం వైపు కుదింపు, విస్తరణ
  • క్వార్టర్స్‌, రైల్వే ఆసుపత్రి వైపు విస్తరణ
  • రైల్వే కార్యాలయాల తరలింపునకు యోచన
 
విజయవాడ: దక్షిణ మధ్య రైల్వేలోనే అతిపెద్దదైన బెజవాడ రైల్వేస్టేషన్‌కు ఐకానిక్‌ గ్రాండ్‌ ఎంట్రన్స్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పుడున్న డబుల్‌ లేన్‌ మెయిన్‌ రోడ్డును మరింత విస్తరించాలని రైల్వే అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. రైల్వేస్టేషన్‌ బయట సర్క్యులేటెడ్‌ ఏరియా ఏదైతే ఉందో దాని స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.40 కోట్లతో రైల్వే ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో, రైల్వేస్టేషన్‌ సర్క్యులేటెడ్‌ ఏరియాలో కూడా అభివృద్ధి చేపట్టాలని నిర్ణ యించారు.
 
 
ఐకానిక్‌ ఎంట్రన్స్‌
ముఖ్యంగా రైల్వే ప్రధాన మార్గాన్ని రైల్వేస్టేషన్‌ స్థాయికి తగినట్టుగా ఐకానిక్‌గా నిర్మించాలన్న ఆలోచనను రైల్వే అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికలు సిద్ధం కాలేదు. రైల్వేస్టేషన్‌ మెయిన్‌ ఎంట్రన్స్‌ ప్రస్తుతం రెండు లేన్లుగా ఉంది. గతంలో ఇది సింగిల్‌ లేన్‌పై కొంచెం ఎక్కువగా ఉండేది. కొద్దికాలం కిందట రైల్వే స్టేడియం వైపు భాగంలో స్వల్పంగా విస్తరించి డబుల్‌ లేన్‌గా తీర్చిదిద్దారు. సెంట్రల్‌ డివైడర్‌ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ మార్గాన్ని మరింత విశాలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికోసం ప్రస్తుత రైల్వే స్టేడియం వైపు భాగంలోనూ, దానికి ఎదురుగా క్వార్టర్స్‌, ఆఫీసు కార్యాలయాల ప్రాంతంలో విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల రోడ్డు వెడల్పు మరింత పెరుగుతుంది. చాలా విశాలంగా మారుతుంది.
 
 
అధునాతన పార్కింగ్‌
ఇక అంతర్గత సర్క్యులేటెడ్‌ ఏరియా విషయానికి వస్తే.. కారు, ఆటో, వెహికల్‌ పార్కింగ్‌ వంటి వాటిని కూడా స్మార్ట్‌గా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న బస్టాపులను కూడా మరింత ఆధునికీకరించాలని నిర్ణయించారు. బస్సుల రాకపోకలకు సంబంధించి ఇన్‌, అవుట్‌ మార్గాల్లో వన్‌వే అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల సంబంధిత బస్టాపులలో ఒకేసారి 10 బస్సులు నిలుపుదల చేసినా ఎక్కడా ట్రాఫిక్‌ అన్నది లేకుండా చూడొచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
 
 
రైల్వే స్టేడియం తొలగిస్తారా?
రైల్వే మినీ స్టేడియాన్ని కుదించటానికి రైల్వే అధికారులు గతంలోనే నిర్ణయించారు. రైల్వే స్టేడియాన్ని పూర్తిగా ఇక్కడి నుంచి తొలగించి సత్యనారాయణపురంలోని రైల్వే స్థలాల్లో ఏర్పాటు చేయవచ్చని, దీనివల్ల స్టేషన్‌కు అభిముఖంగా సువిశాలమైన స్థలం సమకూరుతుందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు ఎప్పటి నుంచో రైల్వే ఉన్నతాధికారులకు చెబుతూ వస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలను అంతగా సీరియస్‌గా తీసుకోవట్లేదు. ప్రస్తుతం రైల్వే స్టేడియాన్ని కొంతమేర కుదించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
 
 
రోడ్ల విస్తరణ ప్రతిపాదన
ప్రధాన రోడ్డులో రైల్వే స్టేడియం వైపు కొంత, రెండవ వైపు క్వార్టర్స్‌, కార్యాలయాల వైపు మరికొంత విస్తరించటం ద్వారా రైల్వేస్టేషన్‌కు విశాలమైన రోడ్డు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారనుంది. ఈ రోడ్డుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు అనేక అట్రాక్షన్లు కల్పించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆఫీసు కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో ఉన్న రైల్వే పలు విభాగ కార్యాలయాలను షిఫ్టింగ్‌ కావడానికి ఆదేశించినట్టు తెలుస్తోంది. రైల్వే స్కూల్‌, కాలేజీ వైపు అనేక భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. కొన్నింటికి ఇటీవల కాలంలో రైల్వేశాఖ అధికారులు రెన్నోవేషన్‌ చేస్తున్నారు. వాటిలోకి షిఫ్ట్‌ అయ్యేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
ఈ అంశంపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. విస్తరించిన రోడ్డు వెంబడి కమర్షియల్‌ కార్యకలాపాలు కూడా సాగించాలన్నది రైల్వే అధికారుల ఆలోచన. ఈ రోడ్డుతో పాటు సర్క్యులేటెడ్‌ ఏరియా పరిధిలోకి వచ్చే తూర్పు ప్రవేశ ద్వారానికి అభిముఖంగా రైల్వే హాస్పిటల్‌ ప్రాంతం మీదుగా వెళ్లే రోడ్డును కూడా రైల్వేశాఖ విస్తరించాలని భావిస్తోంది. రైల్వే హాస్పిటల్‌ వైపు ప్రాంతాన్ని కొంత లోపలికి జరపనున్నారు. దీనివల్ల రోడ్డు మరింత విశాలంగా మారుతుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...