Jump to content

Top Private universities in Amaravati


Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply

Top Posters In This Topic

అమృత వర్సిటీకి ‘ఫ్రీహోల్డ్‌’గా భూమి!
 
  • 200 ఎకరాలు ఇవ్వనున్న ప్రభుత్వం
  • ఆర్‌బీఐకి 11, సీపీడబ్ల్యూకి 28 ఎకరాలు
  • ఈ రెండింటికీ 99 ఏళ్ల లీజుకు
  • మంత్రుల బృందం సిఫారసులు
  • రేపటి కేబినెట్‌ భేటీలో నిర్ణయం
 
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సీఆర్‌డీఏ పరిధిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకోనుంది. బీఆర్‌ఎస్‌ మెడిసిటీ, అమృత యూనివర్సిటీ, బ్రహ్మకుమారి సొసైటీ, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ, రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌, బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌... సీఆర్‌డీఏలో భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా సంస్థలకు భూకేటాయింపులు చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం) అక్టోబరు 10న, మళ్లీ 26న సమావేశమైంది. ఇందులో అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఆర్‌బీఐకి 11 ఎకరాలు, సీపీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌కి 28 ఎకరాలు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇతర విజ్ఞప్తులపై తగిన సమాచారం లేకపోవడంతో జీవోఎం నిర్ణయం తీసుకోలేకపోయింది. అమృత యూనివర్సిటీకి తొలిదశలో 150, రెండోదశలో 50 ఎకరాలు కేటాయించనున్నారు.
 
ఆర్‌బీఐకి కేటాయించనున్న 11 ఎకరాల్లో 5 ఎకరాలను ఆఫీసు స్థలం కోసం, 6 ఎకరాలను రెసిడెన్షియల్‌ అవసరాల కోసం, సీపీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించనున్న 28 ఎకరాల్లో 11 ఎకరాలు కార్యాలయస్థలానికి, 18 ఎకరాలు రెసిడెన్షియల్‌ అవసరాల కోసం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, అమృత యూనివర్సిటీకి కేటాయించే భూమిని నిబంధనలు లేకుండా ఫ్రీహోల్డ్‌ విధానంలో ఇవ్వాలని, మిగిలిన రెండింటికీ 99ఏళ్ల పాటు లీజుకివ్వాలని జీవోఎం నిర్ణయానికొచ్చింది. అంటే అమృత యూనివర్సిటీ ఆ భూమిని తనఖా పెట్టి రుణం కూడా తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు 3 సంస్థలకు భూములు కేటాయిస్తూ సిద్ధం చేసిన ఫైలును ఆర్థిక శాఖ, వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్‌ శాఖ, ఉన్నత విద్యాశాఖకు అభిప్రాయం కోసం పంపించారు. దీనిపై ఇప్పటి వరకూ వైద్యఆరోగ్య శాఖ స్పందించలేదు.
 
కానీ, ఆర్థిక శాఖ, ఉన్నత విద్యాశాఖ అభ్యంతరాలు లేవనెత్తాయి. వీటితో మున్సిపల్‌ శాఖ కూడా ఏకీభవించింది. సీఆర్‌డీఏ పరిధిలో కొన్ని సంస్థలకు లీజు ప్రాతిపదికన, మరికొన్ని సంస్థలకు ఫ్రీహోల్డ్‌ ప్రాతిపదికన కేటాయించడానికి సరైన కారణాలు, వివరాలు తెలియజేయాల్సి ఉందని ఆర్థికశాఖ అభిప్రాయపడింది. దీనివల్ల విమర్శలకు బ్రేక్‌ పడుతుందని తెలిపింది. సీఆర్‌డీఏకి స్పష్టమైన భూకేటాయింపుల విధానం ఉండాలని సూచించింది. జీవోఎం సిఫారసులు, ప్రభుత్వశాఖలు లేవనెత్తిన అభ్యంతరాలు, చేసిన సూచనలపై మంగళవారం జరగనున్న కేబినెట్‌లో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి బోస్టన్‌!
 
636148538412884723.jpg
  • హార్వర్డ్‌, కాలిఫోర్నియా, స్టాన్‌ఫర్డ్‌లూ ఆసక్తి చూపుతున్నాయి
  • టెలికాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులతో చంద్రబాబు
 
 
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘ఇప్పటికే అమరావతిలో తమ క్యాంప్‌సలను స్థాపించేందుకు ముందుకు వస్తున్న ప్రఖ్యాత విద్యాసంస్థలకు తోడుగా బోస్టన యూనివర్సిటీ కూడా క్యాంప్‌సను నెలకొల్పేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తుండడం స్వాగతించదగిన పరిణామం. హార్వర్డ్‌, కాలిఫోర్నియా, స్టానఫర్డ్‌ ఇత్యాదివి కూడా అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇలాంటి సంస్థల ఆగమనంతో మన విద్యార్థులు ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యను పొందగలిగే అరుదైన, అమూల్యమైన అవకాశాన్ని పొందగలుగుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధిని నాణ్యతతో, పర్యావరణహితంగా, ఆకట్టుకునే విధంగా జరిపేందుకు తోడ్పడే పకడ్బందీ కార్యాచరణను తక్షణమే రూపొందించండి. పనుల్లో వేగం పెంచండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతి నిర్మాణ ప్రగతిని సమీక్షించేందుకు ప్రతి బుధవారం నిర్వహిస్తున్న సమావేశానికి సన్నాహకంగా మంగళవారం ఆయన సీఆర్‌డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం అమరావతిలో నెలకొల్పే క్యాంప్‌సకు ఈనెల 24న శంకుస్థాపన చేస్తానన్నారు.
Link to comment
Share on other sites

veellaki kooda Acre 50l ki yee naa istundi :blink:

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 200 ఎకరాలు

 

  •  భూమి కేటాయించాలని సీఆర్డీయేకు ఆదేశాలు 
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజధాని పరిధిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించాలని సీఆర్డీయే కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో ఎకరాకు రూ.50 లక్షలు ధర నిర్ధారిస్తూ 200 ఎకరాలను కేటాయించాలని సూచించింది. రాజధాని ప్రాంతంలో అప్రూవ్డ్‌ మాస్టర్‌ప్లాన్‌ పరిధిలో ఈ భూమిని గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. భూమి ధర, కేటాయింపుల విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా ఒకే విధానం అవలంభించాలని సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్థాపనకు 200 ఎకరాల భూమి కేటాయించాలని ఆ యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మంత్రివర్గాన్ని నియమించింది. వర్సిటీకి రెండు విడతల్లో ఈ భూమి కేటాయించేందుకు మంత్రివర్గం కొన్ని నిబంధనలు పెట్టి సిఫారసు చేసింది. మంత్రివర్గం సిఫారసులను దృష్టిలోకి తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
Link to comment
Share on other sites

 

Cabinet allots 200 acres for Amrita University

  • Staff Reporter

print   ·   T  T  

 

 

 

 

 

Gives nod for constitution of Swachh A.P. Mission

Copy_of_15vjsub_GB_3081858e.jpg
Chief Minister N. Chandrababu Naidu chairing the Cabinet meeting in Vijayawada on Tuesday.

The State Cabinet on Tuesday approved a proposal to allot 200 acres to Amrita University in two phases in Amaravati. In phase-I, the AP Capital Region Development Authority will allot 150 acres and 50 acres in phase-II. The Cabinet also approved allotment of 11 acres to the Reserve Bank. Of this, five acres were for constructing office buildings and the rest for residential buildings. Another proposal to allot 28 acres to the Central Public Works department in Amaravati had also been approved.

Announcing the details of the Cabinet meeting here, Agriculture Minister P. Pulla Rao and Labour Minister K. Atchannaidu said the Information Technology (IT) and Investment department would avail itself of a loan of Rs. 300 crore from the banks to purchase ‘customer premises equipment boxes’. The State government would give a guarantee for the loan, they said.

The Cabinet approved constituting Swachh Andhra Pradesh Mission, which would be implemented from State level to the Panchayat level. The Chief Minister would be the Chairman of the Mission, while the Urban Development, Panchayati Raj and Housing Ministers would be vice-chairmen.

International fund for

agri development

The Andhra Pradesh Township and Infrastructure Development Corporation (APTSIDCO) would construct 1.20 lakh houses as against 1.93 lakh houses sanctioned by the Central government. The rest would be constructed by the AP Housing Corporation.

The government proposed to set up an International Agriculture Development Fund to mitigate drought in the four districts of the Rayalaseema region. As much as Rs.1149 crore were required for it. The government would take up the project under externally aided projects (EAP). It would benefit 1.65 lakh farmers. The Agriculture University and students would be involved in it. The Central government would repay the EAP assistance, they said.

The Cabinet cleared a proposal to acquire private properties in Visakhapatnam under the Land Pooling Scheme (LPS) 2016. The Indian Oil Corporation (IOC) would set up an LPG bottling plant at APSEZ at Achyutapuram in Visakhapatnam. It would have to pay Rs. 40 lakh per acre.

Link to comment
Share on other sites

దక్షిణాదిన ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి రాజధాని అమరావతి ప్రాంతంలో 200 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రెండు దశల్లో అప్పగించే ఈ భూమికి ఎకరం రూ.50 లక్షలుగా ధర నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఈ విశ్వవిద్యాలయంలో 52 వేల మంది విద్యార్థులకు ఇంజినీరింగ్‌, బిజినెస్‌, వైద్య కోర్సులను అందించనున్నారు. పదేళ్లలో మొత్తం రూ.4,400 కోట్ల పెట్టుబడితో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. వర్సిటీ ఏర్పాటు పూర్తయ్యేనాటికి 12 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. విశ్వవిద్యాలయ నిర్మాణానికి సంబంధించి భూమిపూజ కార్యక్రమాన్ని ఈ నెల 24న నిర్వహించే అవకాశముంది.15032079_1472981489382104_35194380411939

Link to comment
Share on other sites

అమరావతికి మరో విద్యా సంస్థ

గుంటూరు: అమరావతి రాజధాని నగరానికి మరో ఉన్నత విద్యా సంస్థ తరలిరానున్నది. మహారాష్ట్రలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్న బంట్స్‌ సంఘ్స్‌ ఎస్‌ఎం షెట్టీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ సంస్థ రాజధానిలో విద్యా సంస్థ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. బోరుపాలెం సమీపంలో ఈ సంస్థకు 150 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ కేటాయించింది. అందులో పాఠశాల, జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలను ఆ సంస్థ ప్రారంభిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. గ్రాడ్యూయేషన్‌లో బీకాం, బీఏఎఫ్‌, బీబీఐ, బీఎస్‌సీ(ఐటీ), బీఎంఎస్‌, బీఎంఎం కోర్సులను, పోస్టుగ్రాడ్యూయేషన్‌లో ఎంకాం, ఎంఎస్‌సీ(ఐటీ) కోర్సులను ప్రారంభిస్తుంది. 1998లో మహారాష్ట్రలోని పొవాయిలో ప్రారంభమైన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. అనతికాలంలో 10 వేల మందికి పైగా విద్యార్థులు ఆ సంస్థలో చదువులు కొనసాగిస్తోన్నారు. ఎస్‌ఎం షెట్టీ హైస్కూల్‌ అండ్‌ జూనియర్‌ కళాశాల, అంతర్జాతీయ పాఠశాల, ఏంజెల్స్‌ డే కేర్‌ అండ్‌ ప్లేరూం, కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌తో నాలుగు క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ అమరావతికి రావడం వలన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతోన్నాయి. ఈ నెల 30వ తేదీన బోరుపాలెంలో షెట్టీ విద్యా సంస్థకు భూమిపూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపాయి.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...