Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply
బందరుకు మహర్దశ
 
636121134560710279.jpg
  • మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు కసరత్తు 
  • కలెక్టరేట్‌లో మడ కార్యాలయం ప్రారంభం నేడు 
ప్రాచీన నగరమైన బందరు అత్యంత అధునాతన నగరంగా ఆవిర్భవించ బోతోంది. ఇందుకు అవసరమైన మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. భూ సమీకరణపై ప్రజలలో ఉన్న అపోహలు, అనుమానాలు తొలగిపోతున్నాయి. రైతుల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. కలెక్టరేట్‌లో శనివారం ఉదయం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఎంఏడిఏ) కార్యాలయం పారంభం కానుంది. శుక్రవారం బందరు ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ బందరు అభివృద్ధి, భూ సమీకరణ ప్రక్రియ, మడ కార్యాలయ అంశాలను వివరించారు.

(ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం)

మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ) కార్యాలయం కలెక్టరేట్‌లో శనివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ విషయాలను రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ కొనకళ్ళ నారాయణరావు వెల్లడి చేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిఽథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ బందరు అభివృద్ధి, భూ సమీకరణ ప్రక్రియ, మడ కార్యాలయ అంశాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బందరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మడను ఏర్పాటు చేశామన్నారు. సీఆర్‌డీఏ తరహాలో ఎంఏడిఏ అనూహ్య రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన భూ సమీకరణ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. రైతులలో వ్యతిరేకత క్రమేణా తగ్గి పోతుందన్నారు. నాలుగు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామన్నారు. మంగినపూడి బీచ్‌ అభివృద్ధికి అడ్డుపడు తున్నారని, స్టేడియం నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నారని చివరకు పోర్టు నిర్మాణ విషయంలోనూ ప్రతిపక్ష నేత వైఖరి సక్రమంగా లేదన్నారు.
 
భూ సమీకరణ ద్వారా తమ భూములు కోల్పోతున్నామనే ఆందో ళనలో పలువురు రైతులు ఉన్నారని ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పేర్కొంటూ అసత్య ప్రచారమే అందుకు కారణమన్నారు. వాస్తవంగా రైతులకు భూ సమీకరణ ద్వారా ఎంతో విలువైన భూములు దక్కనున్నాయన్నారు. ఫలితంగా రైతులకు ఎకరానికి కోటి రూపాయల నుంచి కోటిన్నర వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసే మెగా టౌన్‌షిప్‌లో రైతులకు భూములు ఇస్తామన్నారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల రైతులకు సైతం సముచిత న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ్య), మునిసిపల్‌ చైర్మన్‌ బాబాప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ చంటి, పార్టీ నాయకులు బూరగడ్డ రమేష్‌నాయుడు, కుర్రా నరేంద్ర, తలారి సోమశేఖర్‌, కుంచె నాని, వాలిశెట్టి తిరుమలరావు, పాషా, చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
మడ కార్యాలయం నేడు ప్రారంభం
మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంటు అధారిటీ కార్యాలయం శనివారం ఉదయం ప్రారంభమవుతుందని మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ తెలిపారు. కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మడ కార్యాలయం ఏర్పాటు చేస్తారన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లామంత్రులు దేవినేని ఉమా, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని నాని, శాసనమండలి, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు.
Link to comment
Share on other sites

 

ఒక్క రోజే 1300 ఎకరాలు

అంగీకార పత్రాలు అందజేసిన రైతులు

‘మడ’ కార్యాలయం ప్రారంభించిన నారాయణ

మచిలీపట్నం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలో బందరు పోర్టు భూసమీకరణ ఊపందుకొంది. శనివారం ఒక్క రోజే 1300 ఎకరాలను ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. మచిలీపట్నం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ- మడ) కార్యాలయాన్ని మంత్రి నారాయణ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు బైకులపై ర్యాలీగా తరలివచ్చారు. భూసమీకరణకు భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ పత్రాలను అందజేశారు. వీరిని మంత్రులు అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రైతులు భూసమీకరణలో పాలుపంచుకోవాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్న చైనా, జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాల అభివృద్ధిలో పోర్టులు కీలకపాత్ర పోషించాయన్నారు.

 

13 కోట్ల జనాభా ఉన్న జపాన్‌లో 1020 పోర్టులు, చైనాలో 2 వేల పోర్టులు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 14 పోర్టులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న బందరు పోర్టుకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. బందరు పోర్టు, పోర్టు అధారిత పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన భూసమీకరణ ‘మడ’ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. పోర్టు భూసమీకరణపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని భూముల విషయంలోనూ ప్రతిపక్షాలు కాకిగోల చేశాయన్నారు. రాజధాని కోసం తీసుకున్న 33 వేల ఎకరాల్లో రోడ్లు, పార్కులు, డ్రైనేజీలతో పాటు రైతులకు ప్లాట్లు పంపిణీ చేయగా ప్రభుత్వం వద్ద కేవలం 6 వేల ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు.

 

బందరు పోర్టు విషయంలోను అలాగే జరుగుతుందన్నారు. పోర్టు, పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉండగా ఎలాంటి అభివృద్ధిని ఆశించామో అధికారంలోకి వచ్చాక దాని కోసమే పని చేస్తున్నామన్నారు. బందరు పోర్టును నిర్మించి తీరుతామన్నారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా అభివృద్ధి గురించి పట్టించుకోని నాయకులు ఇప్పుడు అక్కసుతో అడ్డు పడుతున్నారన్నారు. బందరు పోర్టును అడ్డుకోవాలని చూస్తే బంగాళాఖాతంలో కలిసి పోతారని విపక్షాలను హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

 

బైకు ర్యాలీలో మంత్రులు

భూసమీకరణకు అంగీకారపత్రాలు ఇచ్చేందుకు బైకులపై రైతులు ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు. బందరు పోర్టు కోసం ఇప్పటి వరకు 250 ఎకరాలను సమీకరించగా, శనివారం మరో 1300 ఎకరాలకు రైతులు అంగీకారపత్రాలను అందజేశారు. దీంతో మొత్తం 1550 ఎకరాలు సమీకరించినట్లయింది. శనివారం నాటి ఉదంతంతో భూసమీకరణ మరింత ఊపు అందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...

మచిలీపట్నం నౌకాశ్రయానికి రైలు మార్గం

వంతెనలకు రూ. 750 కోట్లు

9 ఆర్‌ఓబీలు, 10 ఆర్‌యూబీలు

కేంద్ర రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు

ఈనాడు, అమరావతి: రాబోయే ఖీ000మచిలీపట్నం నౌకాశ్రయానికి (పోర్టు) రైలు మార్గాన్ని అనుసంధానం చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు జరుగుతున్న విజయవాడ-గుడివాడ ప్రాజెక్టును మచిలీపట్నం డీప్‌ వాటర్‌ పోర్టు వరకు పొడిగించనుంది. మచిలీపట్నం స్టేషన్‌ నుంచి పోర్టు వరకు 10 కిమీ కొత్త మార్గం నిర్మిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం (జాయింట్‌ వెంచర్‌)తో చేపట్టే ఈ ప్రాజెక్టుకు రూ.130 కోట్లు ఖర్చుకానుంది. ఈ పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఈ మార్గం దోహదపడనుంది. భద్రతకు కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఏపీకి 9 ఆర్‌ఓబీలు (పైవంతెనల), 10 ఆర్‌యూబీల (కింది వంతెనలు)ను మంజూరు చేసింది. వీటికి రూ.750 కోట్లు ఖర్చుకానుంది. ఇందులో రైల్వేశాఖ రూ. 278 కోట్లు, ఏపీ రూ. 472 కోట్లు భరించనున్నాయి. ఉత్తరాంధ్రలోకొత్తవలస-కోరాపూట్‌ డబ్లింగ్‌ రూ. 250 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Anybody has stats on how much is expected to be pooled for the project and how much is done as of today.

 

There were several numbers floated over the time. Not sure what is the latest/final number.

 

here is an excerpt from The Hindu 

 

"The port and the port-based industries, it is estimated, would require 30,000 acres or so near Machilipatnam and Bantumilli. of which 10,000 acres is Government land. The Government would have to acquire roughly 20,000 acres of private land. Initially, the Government issued notification a few days ago for acquisition of 14,500 acres of private land for the deep water port. There is resistance from farmers and fishermen in many villages to the land acquisition, but the State Government wants to win them over by resorting to land pooling system as it did in the case of acquisition of lands for the capital at Amaravathi". 

 

There was not much of progress on pooling until this. but as you know even a small leak can break strongest dam (a.k.a jaffas created resistance). Let us hope common sense prevails and more follow suit.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...