Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply

ద్యమంలా భూ సమీకరణ

రాష్ట్ర మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్ల

కోనేరుసెంటరు(మచిలీపట్నం), న్యూస్‌టుడే: పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం భూసమీకరణ ప్రక్రియను ఉద్యమ స్ఫూర్తితో పూర్తిచేయాలని మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు కోరారు. స్థానిక రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో శనివారం వారు మడ, రెవెన్యూ అధికారులు, భూసమీకరణ కమిటీలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ సమీకరణను త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రణాళికబద్ధమైన కృషిని వేగవంతం చేయాలని సూచించారు. కమిటీ సభ్యులు ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తూ భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీని క్షుణ్ణంగా వివరించాలన్నారు. చిన్న, పెద్ద రైతుల జాబితాలను తయారు చేసి వ్యక్తిగతంగా వారిని కలవాలని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న రైతుల వద్దకు వెళ్లి సమీకరణకు సత్వరం సహకరించేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న మెరుగైన ప్యాకేజి పట్ల రైతుల్లో ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. పోర్టు ద్వారా బందరు పరిసర ప్రాంత భూములకు విలువ వస్తుందని, లేకుంటే ఎవరూ కన్నెత్తి చూడరని తెలిపారు. ప్రసుత్తం ఎకరాకు వస్తున్న ఫలసాయం, భూసమీకరణకు సహకరించడం ద్వారా వచ్చే ఆదాయాలను పోల్చిచూపి ఏది లాభదాయకమో రైతులకు వివరించాలన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఏడాదికి రూ.100 కోట్ల వరకూ లీజు రూపంలో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బందరును ఇండస్ట్రియల్‌ నోడ్‌ కింద గుర్తించినందున రూ.3,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. రూ.లక్ష కోట్లతో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటుకు అరబ్‌ దేశాలకు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. విజయవాడ- మచిలీపట్నం రహదారి విస్తరణ పనులు రూ.750 కోట్ల అంచనాతో శరవేగంగా సాగుతున్నాయని, 216 రహదారి పనులు పురోగతిలో ఉన్నాయన్న విషయాన్ని స్థానికులకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నికల ప్రచారం తరహాలో భూసమీకరణ నిర్వహించాలన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని విషయాన్ని గుర్తించి ఆ లోటు భర్తీ చేయాలని కోరారు. ఎంపీ నారాయణరావు మాట్లాడుతూ మెట్ట, మాగాణి, అసైన్డ్‌ భూముల గురించి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చాక రైతుల్లో సుముఖత వ్యక్తమవుతోందని, ముందుకు వచ్చే రైతులకు డాక్యుమెంటేషన్‌ విషయంలో కమిటీలు సహకరించాలన్నారు. పోర్టు ఉద్యమం తరహాలో కమిటీలు రంగంలోకి దిగి సమీకరణను వేగవంతం చేయాలని కోరారు. భూములు ఇచ్చిన రైతుల పత్రాలు, వారి హక్కులను మడ అధికారులు పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం కౌలు మొత్తాన్ని మంజూరు చేస్తారన్నారు. అసైన్డ్‌ భూములు చేతులు మారినప్పటికీ రైతుల హక్కులను నిర్ధరించి కౌలు చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించామన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు లేవనెత్తిన సమస్యలపై మంత్రి, ఎంపీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గోకవరం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి తన ఐదెకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకారపత్రాలను మంత్రి, ఎంపీకి అందజేశారు. మడ డిప్యూటీ కలెక్టర్లు, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్‌ గోపు సత్యనారాయణ, పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, బూరగడ్డ రమేష్‌నాయుడు, గొర్రెపాటి గోపిచంద్‌, నారగాని ఆంజనేయప్రసాద్‌, తలారి సోమశేఖర్‌, బోలెం హరిబాబు, కుంచె నాని, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

600 crores tho water project to supply water to industry&port  started

Railway line ki funds released in budget to expland lane to port from Gudiwada

Already Bandar ro Port area road works going

Bandar-Vijaywada road expansion going brisk pace

NH 30 from Uttarakhand-Vijayawada already getting expanded(All central states gets better access to this port with that)

NH-16 "coastal corridor" state given funds and works going 

 

 

Also both AP&T asking for Bandar port-to-Hyderabad expressway

 

 

/**********************

Krishnapatnam port ki a rojullo DECOIT every possible way lo addam paddaru at every stage. Bandar ki ippudu Jaffa.

Banadar janala ki malli charitralo ki ekke chance economical drive force ga after Brirish left India

Link to comment
Share on other sites

బందరు పోర్టుకు భూములు రెడీ
 
  • రేపు 3014 ఎకరాలు అప్పగింత
మచిలీపట్నం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమ ల అప్పగింతకు రంగం సిద్ధమైంది. మొత్తం 4,800 ఎకరాలు నిర్మాణ సంస్థ నవయుగకు అప్పగించా ల్సి ఉండగా, వాటిలో ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు 3014.43 ఎకరాలు ఉన్నాయి. తొలుత ఈ భూములను పోర్టుకు అప్పగించాలని ఇటీవల కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో... అందుకనుగుణంగా అధికారులు చర్య లు చేపట్టారు. శనివారం ప్రభుత్వ, అసైన్డ్‌ భూములకు సంబంధించిన హద్దులను అధికారు లు పరిశీలించారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణంతోపాటు ఇండస్ర్టియల్‌ కారిడార్‌, మెగా టౌన్‌షిప్‌ ఏర్పాటు కోసం 33,177.78 ఎకరాలకు భూ సమీకరణ జరుగుతోంది.
 
   ఈ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం మచిలీపట్నం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా)ని ఏర్పాటు చేసింది. భూ సమీకరణపై రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు భూములకు సంబంధించి కొన్ని సందేహాలు నివృత్తి కావాల్సి ఉండటంతో ప్రభుత్వ, అసైన్డ్‌ భూములపై అధికారులు దృష్టి సారించారు. పోర్టుతోపాటు ఇండస్ర్టియల్‌ కారిడార్‌, మెగా టౌన్‌షిప్‌ నిర్మాణాల కోసం భూ సమీకరణ ప్రక్రియ చేపట్టగా, తొలుత పోర్టు భూములకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బందరు మండలంలోని మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, చిలకలపూడి, బందరు రూరల్‌ గ్రామాల్లో పోర్టు భూములను గుర్తించగా, ఆ భూములకు సంబంధించిన సర్వే తదితర కార్యక్రమాలు ఇంతకు ముందే పూర్తయ్యాయి. ఆయా భూముల్లో ముడా అధికారులు ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించి, లబ్ధిదారులను గుర్తించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల హద్దులను మరోసారి పరిశీలించారు. మచిలీపట్నం తహసిల్దార్‌ నారదముని, బందరు పోర్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.మునిరెడ్డి, ముడా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించారు. వీటి అప్పగింతల ప్రక్రియ సోమవారం జరుగుతుందని ముడా వైస్‌ చైర్మన్‌ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు.
Link to comment
Share on other sites

బందరు పట్టణానికి చైనా అందాలు
 
636257157729136372.jpg
  • ముడా మాస్టర్‌ ప్లాన్‌పై జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఆసక్తి 
  •  నెలాఖరు వరకు టెండర్ల గడువు 
  •  మరింత స్పష్టత కోసం కలెక్టర్‌, వీసీ సెన్‌జన్‌ సిటీ సందర్శన 
బందరు పట్టణానికి చైనా అందాలు సంతరించుకోనున్నాయి. మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంయూడీఏ) మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే పలు దేశాల కంపెనీలు బందరు నైసర్గిక స్వరూపాన్ని పరిశీలించాయి. మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి టెండర్ల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. మచిలీపట్నం ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం పోర్టు, పరిశ్రమల ఏర్పాటుతో అనతి కాలంలో అభివృద్ధి చెందిన చైనాలోని సెన్‌జన్‌ సిటీని పరిశీలించడానికి అధికారుల బృందాన్ని పంపనుంది . కలెక్టర్‌ బాబు, ఎంయూడీఏ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డితో పాటు మునిసిపల్‌ అడ్మినిస్ర్టేటివ్‌
ప్రిన్సిపల్‌ సెక్రటరీ వళవన్‌ సెన్‌జన్‌ సిటీని సందర్శించనున్నారు.



(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం)

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంయూడీఏ) మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (ఎంఏడీఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దానిని మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంయూడీఏ) గా మార్పు చేశారు. దీనికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ తయారీ కోసం ముడా అధికారులు టెండర్లు కోరారు. ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లు నమోదు చేయాల్సి ఉండగా, ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధుల బృందం బందరులో పర్యటించింది. జపాన్‌, జర్మనీ, సింగపూర్‌ తదితర దేశాలు మచిలీపట్నం సమాచారాన్ని తీసుకుంటున్నాయి. వీటితో పాటు దేశీయంగా పలు కంపెనీలు మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి పోటీ పడుతున్నాయి. పోర్టు, పరిశ్రమల కారిడార్‌, టౌన్‌షిప్‌ ఏర్పాటు కోసం, మచిలీపట్నం సమగ్రాభివృద్ధి కోసం ఎంయూడీఏ కృషి చేస్తుంది. ఇందుకు అవసరమైన అభివృద్ధి కోసం 33,177.78 ఎకరాలకు భూసమీకరణ జరుగుతోంది. ఇందులో పోర్టు భూములు 5,292.75 ఎకరాలు కాగా ఇండస్ర్టియల్‌ కారిడార్‌, టౌన్‌షిప్‌కు 27,885.03 ఎకరాలు కేటాయించారు. ఎంయూడీఏ పరిధి 426.16 చదరపు కిలోమీటర్లు కాగా ఆ పరిధిలో 2,41,207 మంది జనాభా ఉన్నారు. మచిలీపట్నం మునిసిపాలిటీతో పాటు బందరు రూరల్‌ మండలంలోని 28 గ్రామాలు పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామం ఎంయూడీఏ పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా పోర్టు నిర్మాణం, దానికి అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటు జరగనున్నాయి. భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ఏరియాలో వాణిజ్య నివాస స్థలాలు ఇవ్వనున్నారు. వీటన్నింటిని మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరచాల్సి ఉంది.

 
సెన్‌జన్‌ సిటీ సందర్శనకు అధికారుల బృందం
మచిలీపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పోర్టు, పరిశ్రమల ఏర్పాటుతో అనతి కాలంలో అభివృద్ధి చెందిన చైనాలోని సెన్‌జన్‌ సిటీని ఇందుకు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి కలెక్టర్‌ బాబు, ఎంయూడీఏ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, మునిసిపల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వళవన్‌లను పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అధికారుల బృందం ఈనెల 25 నుంచి 29 వరకు సెన్‌జన్‌ సిటీలో పర్యటించనున్నారు. హాంకాంగ్‌కు సమీపంలో ఉన్న ఈ సిటీ జనాభా 30 ఏళ్ళక్రితం కేవలం పది లక్షలు కాగా ఇప్పుడు రెండున్నర కోట్లకు పెరిగారు. మచిలీపట్నంను పోలి ఉన్న సెన్‌జన్‌ సిటీ అభివృద్ధికి దోహదపడ్డ అంశాలను ఈ బృందం పరిశీలించనుంది. అభివృద్ధికి ఏవిధమైన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు, రవాణా అభివృద్ధి, టూరిజం పెంపు తదితర అంశాలు ఏ రీతిలో జరిగాయో క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఆ విధంగా బందరు ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోర్టు నిర్మాణంతో పాటు కోస్టల్‌ కారిడార్‌, కోస్తా జాతీయ రహదారుల అభివృద్ధి, టూరిజం డెవలప్‌మెంట్‌ పక్కాగా జరిగితే పదేళ్ళలోనే సెన్‌జన్‌ సిటీని అధిగమించే అవకాశం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

పరిశీలన కోసమే...
- ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ముడా వైస్‌ చైర్మన్‌
మచిలీపట్నంను పోలి ఉన్న చైనాలోని సెన్‌జన్‌ సిటీ అనతికాలంలో ఏవిధంగా అభివృద్ధి చెందిందో పరిశీలించడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని పంపుతోంది. ఈ బృందంలో తనతో పాటు కలెక్టర్‌ బాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ (మాన్యువల్‌ అడ్మినిసే్ట్రటివ్‌) వళవన్‌ ఉంటారు. ఈనెల 25 నుంచి 29 వరకు ఈ పర్యటన ఉండవచ్చు. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. సెన్‌జన్‌ సిటీలో పోర్టు, పరిశ్రమలతో పాటు రవాణా, టూరిజం అభివృద్ధి బాగా జరిగింది. ఫలితంగా 30 ఏళ్ళలో ఎంతో అభివృద్ధి చెందింది. ఆ విధమైన అవకాశాలే బందరు ప్రాంతంలో ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఇక్కడ ఏమేమి చేయవచ్చు తదితర అంశాలను పరిశీలిస్తాం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
లాజిస్టిక్‌ హబ్‌గా బందరు!
08-04-2017 02:21:27
అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ మాన్యుఫాక్యరింగ్‌ జోన్‌ ఏర్పాటు కానుంది. పోర్టు సమీపంలో నూతన విధానంలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును కాంకర్‌ సీఎండీ వి.కల్యాణరామ కలిశారు. ఈ సందర్భంగా గత ఏడాది విశాఖ సీఐఐ సదస్సు సందర్భంగా ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుకు జరిగిన ఒప్పందం గురించి కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు కల్యాణరామ ప్రతిపాదన చేశారు. సీఎం స్వాగతించారు.
Link to comment
Share on other sites

Krishna, Guntur, West Godavari & East Godavari districts TDP will sweep all the seats if government complete Polavaram, Machilipatnam Port, Capital Buildings (50%), bring some IT companies & few Industries before Apr-2019. It will have effect on Neighboring districts. 

Link to comment
Share on other sites

The Container Corporation of India (CCI) has come up with proposals for the establishment of an Integrated Logistics and Manufacturing Zone (ILMZ) in Machilipatnam port area.

 

 

Company Chairman and Managing Director V. Kalyana Rama submitted the proposals to Chief Minister Nara Chandrababu Naidu at the Interim Government Complex at Velagapudi on Friday.

 

While instructing the officials concerned to set the process of obtaining clearances in motion immediately, Mr. Naidu said the Machilipatnam port was poised to play a critical role in the export of paddy and other agricultural products in about 200 kilometres of the hinterland and importing massive quantities of fertilizers required by the crops grown in nearly 21 lakh acres.

 

He said the port was easily accessible to both the Telugu States and its development was therefore given priority. As part of the project, the CCI would initially set up a logistics park in 300 acres at an estimated cost of Rs. 200 crore.

 

The ILMZ was planned to be developed in 1,000 acres by combining rail, road and port infrastructure.

It is expected to facilitate the entry of agri-processing, automobile manufacturing, granite, electronics and aquaculture industries.

 

Machilipatnam MP Konakalla Narayana, Principal Secretary (infrastructure and investments) Ajay Jain, Additional Secretary (CMO) A.V. Rajamouli and others participated in the deliberations.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...