Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply
మంగినపూడికి మహర్దశ
పర్యాటక కేంద్రంగా బీచ్‌ అభివృద్ధి
ప్రస్తుతం రూ.2 కోట్లతో పనులు
మరో రూ.4.50 కోట్లకు ప్రణాళిక
సమీక్షించిన మంత్రి రవీంద్ర
kri-top2a.jpg
మంగినపూడి (గొడుగుపేట), న్యూస్‌టుడే: మంగినపూడి బీచ్‌ను పర్యాటక కేంద్రాల్లో జిల్లాకే తలమానికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం ఆయన బీచ్‌లోని అభివృద్ధి పనులను పరిశీలించి మరిన్ని వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీచ్‌లో సకల వసతులు కల్పించడంతోపాటు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముడ భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషిచేస్తున్నామనీ, ఈ పనులకు త్వరలోనే కన్సల్‌టెంట్‌ను నియమించేందుకు ముడ అధికారులు అంగీకరించారని తెలిపారు. ముడ ఆధ్వర్యంలో విద్యుద్దీకరణ, పార్కుల ఏర్పాటు, పిల్లలు ఆడుకునేందుకు క్రీడా ప్రదేశాల ఏర్పాటు తదితవ వసతులు కల్పిస్తామని చెప్పారు. ఆర్‌ అండ్‌బి శాఖ ద్వారా రూ.2 కోట్లతో అతిథిగృహం నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని వివరించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెస్టారెంట్‌ నిర్మాణం, రిసార్ట్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని త్వరలోనే అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు బీచ్‌ అభివృద్ధి కోసం ఉపాధిహామీ నిధులు రూ.3.50కోట్లతో మెరక పనులు, రూ.2కోట్లతో అంతర్గత అభివృద్ధి పనులు చేపట్టామనీ, మరిన్ని అభివృద్ధి పనులకోసం పర్యాటకశాఖ ద్వారా రూ.4.50కోట్లతో ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇలా అన్ని విదాలుగా బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.మున్సిపల్‌ ఛైర్మన్‌ బాబాప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయణ ప్రసాద్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మరకాని పరబ్రహ్మం, కల్లుగీత ఆర్థికసంస్థ డైరెక్టర్‌ నారగాని ఆంజనేయప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయణప్రసాద్‌, ఎంపీటీసీ సభ్యుడు నాగమల్లేశ్వరరావు, గొర్రెపాటి గోపీచంద్‌, తెదేపా మండల అధ్యక్షుడు కుంచె దుర్గాప్రసాద్‌(నాని), జిల్లామత్స్యసహకారసంఘ అధ్యక్షుడు రమేష్‌, ముడ విసీ విల్సన్‌బాబు, తహసీల్దారు నారదముని, ఎంపీడీవో జీవి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 

 

Link to comment
Share on other sites

పోర్టు గ్రామాల్లో ముడాకు స్పందన కరవు
25-05-2018 07:44:41
 
636628310837543366.jpg
  • భూములిచ్చేందుకు ముందుకు రాని రైతులు
  • భూమి కొనుగోలు పథకంపై అనాసక్తి
  • మందకొడిగా గ్రామసభలు
 
మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంయూడీఏ) అధికారులకు పోర్టు గ్రామాల్లో ఎదురీత తప్పడంలేదు. పోర్టు భూముల కోసం ప్రభుత్వం మూడు పథకాలు అమలు చేస్తున్నా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. కొత్తగా అమల్లోకి వచ్చిన భూమి కొనుగోలు పథకంపైనా ఆసక్తి చూపడం లేదు. గ్రామ సభలు మందకొడిగా సాగడమే ఇందుకు నిదర్శనం. రైతులకు విస్తృతమైన అవగాహన కల్పిస్తే తప్ప పోర్టు భూముల ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం లేదు.
 
 
మచిలీపట్నం: పోర్టు పనులు ప్రారంభించాలనే తాపత్రయంలో ప్రభుత్వం ఉంది. ఇందుకవసరమైన భూముల కోసం ముడా అధికారులు చేస్తున్న కసరత్తు ముందుకు సాగడం లేదు. పనుల ప్రారంభం ఇప్పటికే ఆలస్యం కాగా దీనిపై సీరియస్‌గా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. భూ సమీకరణ తోపాటు భూసేకరణ చేపట్టిన ముడా అధికారులు కొత్తగా భూమి కొనుగోలు పఽథకం అమలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల జీవో 55ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం భూములకు ధర నిర్ణయించి పోర్టు భూముల ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈ కమిటీ కన్వీనర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ వ్యవహరిస్తారు. ముడా వీసీతో పాటు బందరు ఆర్‌డీవో, పోర్టు అధికారులు తదితరులు సభ్యులుగా ఉంటారు. భూమి కొనుగోలు పథకంపై అవగాహన కల్పించడానికి పోర్టు గ్రామాల్లో ముడా అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి స్పందన కరువవుతుంది.
 
భూసమీకరణ, భూసేకరణ మాదిరిగానే భూమి కొనుగోలు పథకాన్ని రైతులు పెద్దగా స్వాగతించడం లేదు. ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో భూములిచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గురువారం గోపువానిపాలెంలో జరిగిన గ్రామసభకు అరకొరగా హాజరైన రైతులు భూమి కొనుగోలు పథకంపై పెదవి విరిచారు. ఎకరానికి ఎంత రేటు ఇస్తారో చెప్పకుండా మా భూములెలా ఇస్తామంటూ ముడా డిప్యూటీ కలెక్టర్లను రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ముడా అధికారులు గ్రామ సభలకు హాజరైన కొద్దోగొప్పో రైతులకు భూమి కొనుగోలు పథకం గురించి వివరిస్తున్నారు. రైతులు తమ అభీష్టం మేరకు భూ సమీకరణ లేదా సేకరణ కాకుంటే భూమి కొనుగోలు పఽథకాన్ని వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు. రైతులు తరువాత చెబుతామని దాటవేస్తున్నారు. దీంతో ముడా అధికారుల పని పోర్టు గ్రామాలకు వెళ్లామా.. వచ్చామా అన్నట్లు ఉంది.
 
760 ఎకరాల వద్దే ఆగిన వైనం
పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల్లో పట్టా భూములకు సంబంధించి ఇప్పటి వరకు ముడా అధికారులు 760 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. పోర్టు కోసం మొత్తంగా 5300 ఎకరాలు సేకరించాల్సి ఉండగా వీటిలో ప్రభుత్వ అసైన్డ్‌ భూములు 3014 ఎకరాలు ఉన్నాయి. ఆయా భూములను గత ఏడాది మార్చిలోనే కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. మిగిలిన 2286 ఎకరాలు పట్టాభూములు. వీటిలో సమీకరణ ద్వారా 760 ఎకరాలు సేకరించి నెలలు గడు స్తుండగా అక్కడ నుంచి అడుగు ముందుకు పడటం లేదు.
 
అవగాహన అవసరం
భూమి కొనుగోలు పథకంపై రైతులకు విస్తృతమైన అవగాహన అవసరంగా కనిపిస్తోంది. రైతులకు ఊరటగా ఉంటుందని పథకాన్ని ప్రవేశపెట్టగా ధరలో గ్రామాల మధ్య వ్యత్యాసాలుండడంతో రైతులు సిద్ధపడడంలేదు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, పథకం అమలు కమిటీ గ్రామాల్లో పర్యటిస్తే ఫలితం దక్కే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఎకరం... రూ.22 లక్షలు
14-06-2018 08:05:34
 
636645603467219676.jpg
  • పోర్టు భూములకు ధర నిర్ణయం
  • భూమి కొనుగోలు పథకం అమలుకు సన్నద్ధం
  • రైతులతో ముడా అధికారుల సంప్రదింపులు
పోర్టు భూముల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూమి కోనుగోలు పథకం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నారు. ఈ పథకం ద్వారా ఎకరాకు రూ. 22 లక్షల ధరను నిర్ణయించారు. దీనిపై పోర్టు గ్రామాల రైతులతో ముడా అధికారులు సంప్రదింపులు జరుపుతుండగా వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధర ఇంకాస్త పెంచాలనే అభిప్రాయంతో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది.
 
 
బందరు పోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించాలనే చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంతో వాటిని అమలు చేసేందుకు మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ముడా) అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పోర్టు భూముల కోసం 2015 నుంచి ప్రయత్నాలు జరుగుతున్న విషయం విదితమే. తొలుత భూసేకరణ చేపట్టగా తదనంతరం భూసమీకరణ అమలుచేశారు. ఈ రెండింటికీ రైతులు పెద్దగా మొగ్గుచూపకపోవడంతో భూమి కొనుగోలు పథకాన్ని ఇటీవల తెరపైకి తెచ్చారు. రైతుల అభిప్రాయాలను, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొంటున్నారు. దీనిపై ఎంపీ కొనకళ్ల నారాయణరావుతోపాటు కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ముడా అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమీక్షించి పోర్టు భూములకు ధర నిర్ణయించినట్లు మంత్రి ప్రకటించారు. ఈ పథకం ద్వారా భూమి కొనుగోలు చేయడం, అందుకుగాను రైతులకు నిర్ణీత ధర చెల్లించడంపై జరిగిన కసరత్తు అనంతరం ఎకరాకు రూ. 22 లక్షలు చెల్లించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజెప్పేందుకు ముడా అధికారులు పోర్టు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే ధర నిర్ణయంపై పెదవి విరుస్తున్న రైతులు మరికొంత పెంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎకరాకు రూ. 25 లక్షలు చెల్లించాలనే అభిప్రాయంతో రైతాంగం ఉన్నట్లు తెలుస్తోంది.
 
 
ప్రక్రియ పూర్తయ్యేనా...
భూమి కొనుగోలు పథకం ద్వారా పోర్టు భూముల ప్రక్రియ పూర్తిచేయాలనే తలంపుతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇందుకు రైతులు ఎంతవరకు సమ్మతిస్తారో చూడాల్సి ఉంది. జూలై నాటికి భూముల ప్రక్రియ పూర్తిచేసి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుతోపాటు కలెక్టర్‌ లక్ష్మీకాంతం చెబుతున్న సంగతి తెలిసిందే. అది జరగాలంటే ముందు భూముల అంశం పూర్తికావాల్సి ఉంది. అందుకోసమే భూమి కొనుగోలు పథకం ప్రవేశపెట్టారు. ఇందుకు రైతులు ముందుకొస్తే భూముల ప్రక్రియ పూర్తికావడానికి అవకాశం ఉంటుంది.
 
అవసరాల రీత్యా రైతులు కొంత భూమిని భూమి కొనుగోలు పథకానికి ఇచ్చినా మరికొంత భూమిని భూసమీకరణ ద్వారా పోర్టు నిర్మాణానికి ఇచ్చే అవకాశం ఉంటుందని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పోర్టు భూములకు సంబంధించి మరో అంశంగా ఉన్న భూసేకరణ పథకం ఆగస్టుతో ముగియనుంది. తదనంతరం ఈ పథకాన్ని రెన్యూవల్‌ చేసే అవకాశం లేదు. కొత్త చట్టం అమలులోకి రావడంతో భూసేకరణ ద్వారా రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో భూసమీకరణ లేదా భూమి కొనుగోలు పథకానికి రైతులు ముందుకొస్తారని భావిస్తున్నారు.
 
పోర్టు భూములు మొత్తంగా 5,300 ఎకరాలు కాగా వాటిలో 3014 ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్‌ భూములుగా ఉన్నాయి. ప్రభుత్వ అసైన్డ్‌ భూముల ప్రక్రియ ఏడాది క్రితమే పూర్తి అయింది. మిగిలిన 2286 పట్టా భూముల కోసం కసరత్తు జరుగుతోంది. వీటిలో 751ఎకరాలకు భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి అంగీకారం లభించగా మిగిలిన 1526 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇంకా ఈ భూములు మంగినపూడిలో 153 ఎకరాలు ఉండగా, తవిసిపూడిలో 269, గోపువానిపాలెంలో 630, కరగ్రహారంలో 375, పోతేపల్లిలో 24, చిలకలపూడిలో 75 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములు రైతుల అభీష్టం మేరకు భూసమీకరణ లేదా భూమి కొనుగోలు పథకం ద్వారా తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది.
 
 
రైతులతో సంప్రదిస్తున్నాం
భూమి కొనుగోలు పథకంపై పోర్టు గ్రామాల రైతులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ముడా డిప్యూటీ కలెక్టర్లు గ్రామాల వారీగా రైతులతో చర్చిస్తున్నారు. భూమి కొనుగోలు పథకానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరపై తెలియజేస్తున్నారు. దీనిపై రైతులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి వ్యతికరేకత మాత్రం వ్యక్తం కావడం లేదు. ఇంకొంత ధర పెంచాలనే అభిప్రాయం కనిపిస్తోంది. దీనిపై మంత్రి రవీంద్రతో పాటు కలెక్టర్‌ లక్ష్మీకాంతంతో చర్చిస్తాం. రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడానికే ప్రభుత్వం కృషి చేస్తుంది.
విల్సన్‌బాబు, ముడా వీసీ
Link to comment
Share on other sites

45 రోజుల్లో భూసేకరణ పూర్తి కావాలి
మచిలీపట్నం పోర్టుపై మంత్రి కొల్లు సమీక్ష

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేయాలని యువజన, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. జులైలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా పనుల తీరు ఉండాలన్నారు. ఈ అంశంపై సచివాలయంలో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, మౌలిక వసతుల అవసరాలకు మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ రూ.1092 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం మార్గం సుగుమం చేసిందన్నారు. కార్యక్రమంలో ఇంధనం, పెట్టుబడులు, మౌలిక వసతులశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌, రాష్ట్ర ఓడరేవుల సంచాలకులు కోయ ప్రవీణ్‌, మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు విల్సన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

పోర్టుకు రూ.1385 కోట్ల రుణం
20-06-2018 09:18:44
 
636650831379539357.jpg
  • ముడాకు అనుమతిస్తూ క్యాబినెట్‌ తీర్మానం
  • ఊపందుకుంటున్న భూసేకరణ
విజయవాడ (ఆంధ్రజ్యోతి): బందరు పోర్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పోర్టు అభివృద్ధి, ఇండస్ట్రియల్‌ కారిడార్‌, టౌన్‌ షిప్‌ నిర్మాణాల కోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ.1385 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటి (ముడా)కు అనుమతిని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దీంతో బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్టు అయింది. 2015 నుంచి పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
 
 
పోర్టుకు కేటాయించిన భూములు 5,300 ఎకరాలు కాగా ఇందులో 3,014 ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్‌ భూములే. అసైన్డ్‌ భూముల కేటాయింపును ప్రభుత్వం ఏడాది క్రితం పూర్తి చేసింది. మిగిలిన 2,286 ఎకరాల పట్టా భూములను భూ సమీకరణ విధానంలో సేకరించటానికి ప్రభుత్వం కసరత్తు జరిపింది. వీటిలో 751 ఎకరాలకు మాత్రమే రైతుల నుంచి భూసమీకరణకు అంగీకారం లభించింది. మిగిలిన 1,536 ఎకరాల సేకరించాల్సి ఉంది. భూసమీకరణకు ముందుకు రాని రైతులకు ఎకరానికి 22 లక్షల చొప్పున చెల్లించి ఈ భూములను సేకరించాలని ముడాను ప్రభుత్వం సూచించింది. భూసమీకరణ విధానంలో ప్రభుత్వానికి భూములు ఇవ్వటానికి ఇప్పటి వరకు సందిద్గంలో ఉన్న రైతులు భూసేకరణ కింద ఎకరానికి 22 లక్షలు ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకు రావడంతో రైతుల దోరణిలో కూడా కొంత మార్పు కనిపిస్తోంది.
 
 
పోర్టుకు సంబంధించిన ఏ పని ప్రారంభించాలన్నా భూముల సేకరణ పూర్తి చేయటం తప్పనిసరి. రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంతంలో 33 వేల ఎకరాల భూములను ప్రభుత్వం భూసమీకరణ ద్వారా ఏడాదిలోగా సేకరించింది. రైతులందరూ స్వచ్చందంగా ముందుకు రావడంతో రాజధాని ప్రాంతంలో రోడ్లు, భవనాల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. కానీ బందరు పోర్టు కోసం అవసరమైన భూములను సమీకరించటంలో జరుగుతున్న జాప్యం పోర్టు నిర్మాణాన్ని ఆలస్యం చేసింది. భూసమీకరణ పూర్తయిన తరువాత డిజైన్‌ల రూపకల్పన చేపట్టాల్సి ఉంటుంది. 2014లో బందరు పోర్టు నిర్మాణం చేపడతామని చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటానికి ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తోంది. రైతులు కూడా కొంత ఉదార స్వభావంతో ఒకడుగు ముందుకు వేస్తే పోర్టు నిర్మాణ పనులు త్వరగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

ఇక త్వరగా.. భూసేకరణ
23-06-2018 10:07:29
 
636653452640322919.jpg
  • ముఖ్య ప్రాజెక్టులకు ‘ఎస్‌ఐఎస్‌ ’ మినహాయింపు !
  • విజయవాడ లైట్‌ మెట్రో రైల్‌కు, విమానాశ్రయ విస్తరణ, జల రవాణా ప్రాజెక్టులకు ఇబ్బంది లేదు
  • ఇన్నర్‌, ఔటర్‌ రోడ్లు, పారిశ్రామిక కారిడార్లు త్వరగా సాకారం
విజయవాడ , (ఆంధ్రజ్యోతి): ఇక భూసేకరణకు ఎక్కువ సమయం పట్టదు. ఆ చట్టంలో తెచ్చిన సవరణలు.. రాజధాని ప్రాంతంలో ముఖ్య ప్రాజెక్టులకు తక్కువ వ్యవధిలోనే భూములు సేకరించడానికి దోహదపడనున్నాయి. నగర శివారులో భూ సేకరణ ప్రక్రియను త్వరగా ముగించడానికి అవకాశం ఏర్పడబోతోంది. నూతన భూసేకరణ చట్టంలో ముఖ్య ప్రాజెక్టులకు సంబంధించి సోషల్‌ ఇంపాక్ట్‌ సర్వే (ఎస్‌.ఐ.ఎస్‌)కు మినహాయింపు ఇవ్వడంతో భూ సేకరణ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత త్వరగా భూములను స్వాధీనం చేసుకోవ టానికి మార్గం సుగమం కానుంది. కొత్త చట్టంలో రైతులతో, బాధితులతో నేరుగా సంప్రదించే అవకాశం ఉంది. చట్ట సవరణలతో విజయవాడలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు భూ జాప్యం తగ్గనుంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ తుది దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత ఎంత భూమి కావాలో నిర్దేశిస్తారు. ఇంతకు ముందు నగరానికి మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు మొత్తం 80 ఎకరాల భూమి కోసం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో 60 ఎకరాల భూములు నిడమానూరులోనే ఉన్నాయి. మిగిలిన 20 ఎకరాలు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు మీద ఉన్నాయి. దీనికోసం భూ సేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చారు. నిడమానూరు వద్ద భూసేకరణ తలనొప్పిగా మారింది.
 
సోషల్‌ ఇంపాక్ట్‌ సర్వే (ఎస్‌ఐఎస్‌) చేయడానికి సమయం పట్టింది. తర్వాత జరిగిన పరిణామాలతో మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టు నుంచే వైదొలగాల్సి వచ్చింది. తర్వాత లైట్‌ మెట్రో డీపీఆర్‌ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో నిడమానూరులో భూముల అవసరం లేకపోవడంతో 60 ఎకరాల భూములకు మినహాయింపు ఇచ్చారు. బందరు, ఏలూరు రోడ్ల వెంట భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు, ప్లాన్ల మంజూరుకు అనుమతులు లేవు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డే కాకుండా రాజధాని ప్రాంతంతో పాటు, జక్కంపూడి ఇతర అనేక రోడ్ల మీదుగా కారిడార్లు సాగే అవకాశం ఉంటుంది. ఈ సారి భూముల అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎస్‌ఐఎస్‌ లేకపోవడంతో సంప్రదింపులు, చర్చలతో భూములు సేకరించవచ్చు.
 
పలు ప్రాజెక్టులకు మార్గం సులువు
విజయవాడ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టుల కోసం ఎక్కువగా భూ సేకరణ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మల్లవల్లి భూములు, వీరపనేనిగూడెంలో భూములు సేకరించటానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుత చట్ట సవరణ ద్వారా రైతులతో సంప్రదింపుల విధానం వారికి న్యాయమైన పరిహారాన్ని నిర్ణయించుకోవడానికి దోహద పడనుంది. విమానాశ్రయ విస్తరణ ఇప్పటికే జరిగింది. జరుగుతోంది. భవిష్యత్తులో రెండవ రన్‌వే కోసం భూములు కావాల్సి ఉంటుంది. ఏలూరు కాల్వ డైవర్షన్‌ ఇప్పుడు నిలుపుదల చేసినా.. భవిష్యత్తులో జల రవాణా ప్రాజెక్టులను విస్తరించడానికి కచ్చితంగా డైవర్షన్‌ చేయాల్సి వస్తుంది. ఇన్నర్‌, ఔటర్‌ రోడ్లకు కూడా భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా జరిగిన సవరణలు ప్రక్రియ వేగంగా జరగడానికి దోహదపడుతున్నాయి.
Link to comment
Share on other sites

భూ క్రయవిక్రయాలకు తొలగిన అడ్డంకి
పోర్టు పరిశ్రమల భూసేకరణ
నోటిఫికేషన్‌ ఉపసంహరణ: మంత్రి కొల్లు
kri-gen1a.jpg

కోనేరు సెంటరు, న్యూస్‌టుడే: మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల నిమిత్తం భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోర్టు నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం రైతుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకొని డీనోటిఫికేషన్‌ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 21 గ్రామాల  పరిధిలోని 12 వేల ఎకరాలకు పైగా భూముల క్రయవిక్రయాల విషయంలో ఉన్న అడ్డంకి తొలగిపోనుంది. స్థానిక రహదారులు, భవనాల శాఖ అతిథిగృహంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పోర్టు అనుబంధ పరిశ్రమల నిమిత్తం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ఉపసంహరణ విషయాన్ని వెల్లడించారు. పోర్టు నిర్మాణంతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం 2015లో భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. భూములు ఇచ్చే విషయంలో రైతుల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గ విధంగా వ్యవహరిస్తోందన్నారు. పోర్టు నిర్మాణం కోసం తొలి ప్రాధాన్యం ఇస్తూ  ప్రతిపాదిత గ్రామాల్లో పట్టా భూములను భూ సేకరణ, సమీకరణ,  కొనుగోలు విధానాల్లో రైతులు ఇష్టపడిన విధానం ద్వారా భూములు తీసుకోనున్నట్టు చెప్పారు. అనుబంధ పరిశ్రమల కోసం మొత్తం 21 గ్రామాల పరిధిలో 12,144.86 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసి ఉన్నందున  సదరు భూముల క్రయ విక్రయాల విషయంలో అడ్డంకి ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి తగు వెసులుబాటు కల్పించాలని కోరడంతో ఆయన నోటిఫికేషన్‌ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో జీవో విడుదల కానుందని చెప్పారు. తొలి నుంచి తాము చెప్పిన విధంగానే ఏ ఒక్క రైతు ఇష్టం లేకుండా భూములు తీసుకోమన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అన్నదాతల అభిప్రాయాలకు విలువ ఇచ్చి నోటిఫికేషన్‌ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపాదిత గ్రామాల్లోని పట్టా భూములకు గరిష్ఠంగా రూ.22 లక్షలు చెల్లించేలా నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. మరోసారి సమావేశమై ధరను ఖరారు చేస్తామన్నారు. చెన్నై, విశాఖపట్నం పారిశ్రామిక నడవ నిర్మాణంలో మచిలీపట్నం పోర్టుకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కాళహస్తి,  దొనబండ, కాకినాడ ప్రాంతాలకు నిర్దేశించిన నాలులైన్ల రహదారిని మచిలీపట్నంకు కలిపే విధంగా ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ సమావేశంలో తెదేపా నాయకుడు కొనకళ్ల జగన్నాథరావు, పురపాలక సంఘ అధ్యక్షుడు  మోటమర్రి బాబాప్రసాద్‌, ఏఎంసీ అధ్యక్షుడు చిలంకుర్తి సుబ్రహ్మణ్యం, జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయప్రసాద్‌, ముడ వైస్‌ ఛైర్మన్‌ విల్సన్‌బాబు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

పోర్టు భూముల కొనుగోలుకు కసరత్తు
kri-gen6a.jpg

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మచిలీపట్నం పోర్టు భూముల కొనుగోలుకు సంబంధించి చర్యలు ప్రారంభమయ్యాయి. పోర్టుకు అవసరమైన భూములు కొనుగోలు, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,385 కోట్లు రుణంగా పొందేందుకు మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడా)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముడ వీసీ విల్సన్‌బాబు మంగళవారం ముడ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో ప్రాథమికంగా చర్చించారు. పోర్టు అభివృద్ధి నిమిత్తం రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే విషయాన్ని వివరించారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్టు వారికి తెలపడంతో ఎస్‌బీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు.ఎస్‌బీఐ డిప్యూటీ జీఎం రాయప్ప, చీఫ్‌ మేనేజర్‌ కిషోర్‌, కేపీఎంజీ సంస్థ ప్రతినిధులు కరుణ్‌, శరత్‌, కార్వే సంస్థ ప్రతినిధులు రోహిత్‌కుమార్‌ సింగ్‌, వంశీకృష్ణ, ముడ ప్లానింగ్‌ అధికారి శిల్ప, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

పోర్టు రుణాలకు ప్రభుత్వ హామీ కాలవ్యవధి పొడిగింపు
30-06-2018 08:48:37
 
అమరావతి: మచిలీపట్నం నౌకాశ్రయంతోపాటు బందరులో నెలకొల్పదలచిన ఇండస్ట్రియల్‌ కారిడార్‌, ట్రంక్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌, ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్పులకు అవ సరమైన రూ.1385 కోట్ల రుణాలకు తాను ఇస్తున్న గ్యారెంటీకి సంబంధించిన కాలవ్యవధిని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణరూపేణా పొందాలని ‘ముడా (మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)’ భావిస్తోంది. బందరు పోర్టుకు అవసరమంటూ ‘ముడా’ వైస్‌ ఛైర్మన్‌ గుర్తించిన ప్రభుత్వ భూములను రెవెన్యూ శాఖ ‘ముడా’కు ముందస్తుగానే అప్పగించాలని కూడా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...