Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
62 పర్యాటక ప్రాజెక్టులకు బిడ్స్‌ ఆహ్వానం
 
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టే వారికి అనేక అవకాశాలు కల్పిస్తున్నట్లు టూరిజం కార్పొరేషన మేనేజింగ్‌ డైరెక్టర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. గురువారం విజయవాడలోని ఏపీటీడీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టేందుకు... రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ పెట్టామని చెప్పారు. వీటిలో 18 ప్రాజెక్టులకు దరఖాస్తులు అందాయని చెప్పారు. వీటిలో కొన్నింటికి ఒక్కటే దరఖాస్తు వచ్చిందని... మరేవరైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా నెల రోజుల పాటు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో 6 ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని గిరిజా శంకర్‌ చెప్పారు. వీటిలో బుద్ధిజం, అఖండ గోదావరి ఎకో టూరిజం, అఖండ గోదావరి ఆధ్యాత్మిక సర్క్యూట్‌, రాయలసీమ సర్క్యూట్‌, స్వదేశీ దర్శని కింద కొన్ని బీచలను అభివృద్ధి చేస్తామన్నారు. జాతీయ రహదారుల పక్కన ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో పర్యాటకుల వసతి కోసం ‘వే సైడ్‌ ఎమినిటీస్‌’ ఏర్పాటుకు ముందుకు వస్తే అనుమతి ఇస్తామన్నారు.
Link to comment
Share on other sites

కేంద్రసాయంతో 6 పర్యాటక ప్రాజెక్టులు

రూ.474 కోట్లతో ప్రతిపాదనలు

 అమరావతి: కేంద్ర పర్యాటక శాఖ అమలు చేస్తున్న స్వదేశ్‌దర్శన్‌, ప్రసాద్‌ ప్రాజెక్టులలో భాగంగా రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు అందజేసింది. రూ.473.89 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల సవివర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) కూడా రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రంలోని బౌద్ధమత ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను రూ.114.53 కోట్లతో మహాయాన బౌద్ధ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనుంది. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, శాలిహుండం, విశాఖ జిల్లాలోని బావికొండ, తొట్లకొండ, బొజ్జన్నకొండ, గుంటూరు జిల్లాలోని అమరావతి, అనుపు ప్రాంతాల్ని ఒక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తారు. ఒక్కో ప్రాంతానికి రూ.15 కోట్ల నుంచి రూ.23-24 కోట్ల వరకు వెచ్చిస్తామని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ గిరిజాశంకర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఆ ప్రాంతాల్లో ధ్యాన మందిరాలు, బహుళ ప్రయోజన కేంద్రాలు, పర్యాటక సమాచార కేంద్రాలు నిర్మిస్తామని వెల్లడించారు. రాయలసీమలోని పెనుకొండ, గుత్తి, లేపాక్షి, బెలుంగుహలు, గండికోట, తాడిపత్రిలోని చింతల వేంకటరమణమూర్తి దేవాలయాలను రాయలసీమ ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌ పేరుతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి రూ.104.53 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేసింది. అఖండ గోదావరి ప్రాజెక్టును రెండుగా విభజించింది. అఖండ గోదావరి ఆధ్యాత్మిక ప్రాజెక్టులో భాగంగా ఉభయగోదావరి జిల్లాలలో ఉన్న పంచారామ క్షేత్రాల్లోని నాలుగు శివాలయాలు, పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయం, శక్తిపీఠాలను అభివృద్ధి చేస్తుంది. అఖండ గోదావరి పర్యావరణ, పర్యాటక ప్రాజెక్టులో భాగంగా మారేడుమిల్లి, కడియం, కోనసీమలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.98.92 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ప్రసాద్‌ పథకంలో భాగంగా శ్రీశైలం, తిరుపతి టెంపుల్‌సర్క్యూట్ల అభివృద్ధికి రూ.88.03 కోట్లు, రూ.67.88 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపింది. ప్రసాద్‌ పథకం కింద గుంటూరు జిల్లాలోని అమరావతి అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ రూ.28.364 కోట్లు, హృదయ్‌ పథకం కింద మరో రూ.12.34 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. స్వదేశ్‌దర్శన్‌ పథకంలో భాగంగా కాకినాడ హోప్‌ఐలాండ్‌, కోనసీమ ప్రాంతాల అభివృద్ధికి రూ.69.83 కోట్లు, నెల్లూరు జిల్లాలో తీర పర్యాటకాభివృద్ధికి రూ.60.38 కోట్లు మంజూరు చేసింది.

Link to comment
Share on other sites

లంబసింగిలో భూముల ధరలకు రెక్కలు

చిత్ర పరిశ్రమనూ ఆకర్షిస్తున్న ఆంధ్రా కశ్మీర్‌

vsp-gen5a.jpg

లంబసింగి: అతిశీతల ప్రాంతంగా పేరొందిన ఆంధ్రా కశ్మీర్‌ లంబసింగికి వచ్చే పర్యటకుల రద్దీ ఏటికేడు పెరుగుతోంది. ఇక్కడి భూములను కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతుండటంతో లంబసింగి పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండు పెరిగింది. ప్రస్తుతం సాగులో లేని ఉన్న వ్యవసాయ భూములను బినామీల పేరిట పలువురు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. లంబసింగి, తాజంగి, జల్లూరిమెట్ట, రాజుపాకలు గ్రామాలకు వెళ్లే రహదారిని ఆనుకుని ఉన్న భూములను రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారుల మధ్య పోటీ అధికంగా ఉండటంతో ఇక్కడి భూములకు అధిక ధరలు పలుకుతున్నాయి. పూర్తిగా షెడ్యూల్డ్‌ ప్రాంతమైన లంబసింగిలో గిరిజనేతరులు, ప్రైవేటు వ్యక్తులు ఇక్కడి భూములను అధికారికంగా కొనుగోలు చేయడానికి వీల్లేదు. పెట్టుబడిదారులు తమకు అనుకూలంగా ఉన్న గిరిజనులను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకుని వారి సాయంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరికొందరు డీఫాం భూములను కొనుగోలు చేస్తున్నారు. తాజంగి సమీపంలో కొంత భూమిని ప్రభుత్వం అక్కడి గిరిజనులకు డీఫాం పట్టాలుగా కేటాయించింది. పట్టణ ప్రాంతానికి చెందిన ప్రైవేటు వ్యక్తి ఒకరు ఈ భూమిలో రిసార్టులు నిర్మించేందుకు పావులు కదిపి భూములున్న గిరిజనులకు కొంత మొత్తం చెల్లించి నిర్మాణాలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. పునాదుల స్థాయిలో అభిప్రాయ భేదాలు తలెత్తి వివాదం చోటుచేసుకోవడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వం సాగు నిమిత్తం గిరిజనులకు కేటాయించిన డీఫాం భూములను ఇతరులకు ఇచ్చేందుకు హక్కులూ లేవంటూ సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. తాజంగి, లంబసింగి పరిసర ప్రాంతాల్లోనూ భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భవిష్యత్తులో లంబసింగికి పర్యటకంగా మరింత ఆదరణ వస్తుందన్న ముందుచూపుతో ఇక్కడ లాడ్జిలు, హోటళ్లు, రిసార్టులు వంటి నిర్మాణాలు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు లంబసింగిలో ఖాళీ స్థలాల అన్వేషణలో ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Natural world heritage status for Borra Caves sought

 

Archaeological Survey of India asks State government to present documents to Unesco

VISAKHAPATNAM: The Borra Caves located on the Eastern Ghats in Ananthagiri hills of Araku Valley in Visakhapatnam agency, has been recommended by the Archaeological Survey of India, to be included as a natural World Heritage site under the United Nations Educational, Scientific and Cultural Organization (Unesco).

In a letter to the Secretary of Tourism Department, Andhra Pradesh Government, the Director of World Heritage of ASI, K. Lourdusamy, has asked the departments concerned to prepare documents to be presented to the Unesco, to consider the Archean Age (4,000 to 2,500 million years) caves as a natural world heritage site.

The cave was discovered by the Geological Survey of India in 1807, and since then extensive research has been done by different departments.

According to Prof. D. Rajasekhar Reddy, Adviser to Geo Heritage Cell of the Indian National Trust for Art and Cultural Heritage (Intach) and former professor of Geology, Andhra University, the proposal should have been made long ago.

Geo-Heritage list

“Borra Caves should not only be included into the natural world heritage sites but also in the Geo-Heritage list, as it is one of its kinds in the world and has lots of material to study the evolution of the world,” he said.

The cave created millions of years ago by water activity, mainly by the Gosthani river, is a rare geological formation and is a case study for geo-chemistry. The caves are basically karstic limestone structures extending to a depth of 80 metres and are considered the deepest caves in India, said Prof. Subba Rao from the Department of Geology, Andhra University.

Legends galore

There are many tribal legends associated with the caves and some of the tribals such as the Valmikis associate it with the Ramayana mythology.

But the poplar legend is that the cave was discovered when a cow grazing on the top of the cave dropped through a hole in the roof and the cowherd searching for the cow came across the cave. He found the cow alive at a depth of 60 metres below the surface and also found a Shiva lingam shaped limestone, which is still worshipped.

However, scientists have a different version. According to Prof. P.D. Satyapal from the Department of Anthropology, Andhra University, the caves were formed by water activity cutting through rich limestone and many shapes of stalagmites and stalactites have been formed over the years.

The cave is highly valuable for anthropological research, as excavations carried out earlier have unearthed stone tools of middle Paleolithic culture dating between 30,000 and 50,000 years, which confirm human habitation in that area.

It is time that the cave be listed under world heritage sites and protected sites, he said.

Apart from the Borra Caves, the ASI has also suggested the listing of the Venna Mudda Venugopala Swamy in Guntur.

 

source : http://www.thehindu.com/news/cities/Visakhapatnam/Natural-world-heritage-status-for-Borra-Caves-sought/article17041900.ece

Link to comment
Share on other sites

స్పెయిన్‌లో.. ఏపీ పర్యాటక రథం!
 
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఏపీ పర్యాటక రథం స్పెయిన్‌ వీధుల్లో పరుగు తీసింది. ఈ నెల 18 నుంచి స్పెయిన్‌లో జరుగుతున్న ‘ఫితూర్‌ ఎగ్జిబిషన్‌’లో ఏపీ పర్యాటక శాఖ పాల్గొంది. ఈ ఎగ్జిబిషన్‌లో పర్యాట శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసి రాజధాని అమరావతితో పాటు ఏపీలోని పర్యాటక ప్రదేశాలకు ప్రచారం కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో భాగంగా స్పెయిన్‌ వీధుల్లో ప్రత్యేకంగా ఒక రోడ్‌షో నిర్వహించారు. దీనిలో ఏపీ పర్యాటక అధికారులు కూడా ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీనిని స్పెయిన్‌లోని భారత అంబాసిడర్‌ డీబీ వేంకటేష్‌ వర్మ, కేంద్ర పర్యాటక శాఖ సెక్రటరీ వినోద్‌ ప్రారంభించారు.
Link to comment
Share on other sites

100 కోట్ల పెట్టుబడి.. 2 వేల మందికి ఉపాధి
 
  • 7 పర్యాటక ప్రాజెక్టులకు ఉపసంఘం ఆమోదం
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 7 పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ మంత్రివర్గం ఉప సంఘ ఆమోదం తెలిపింది. సోమవారం వెలగపూడిలో ఉప సంఘం భేటీ అయింది. ఉప సంఘంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు సభ్యులుగా ఉన్నారు. 7 ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్ల పెట్టుబడులతో పాటు సుమారు 2 వేల మందికి ఉపాధి లభించనుంది. తిరుపతిలో ఫ్యామీలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ఎస్‌పీఐ సినిమా్‌సకు, విశాఖలోని నక్కపల్లిలో వే సైడ్‌ ఎమ్యూనిటీ నిర్మాణానికి సదరన ట్రావెల్స్‌కు, తూర్పుగోదావరి జిల్లా తేటగుంటలో వే సైడ్‌ ఎమ్యూనిటీ నిర్మాణానికి అంబికా అగరబత్తీ సంస్థకు, పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనులో మరో వే సూడ్‌ ఎమ్యూనిటీ నిర్మాణానికి సదర్‌ ట్రావెల్స్‌కు, మంత్రాలయంలో త్రీ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి శ్రీ వేంకటేశ్వరాలాడ్జ్‌కు అనుమతిచ్చింది. మరో రెండు ప్రాజెక్టుల నిర్వహణను రాజమండ్రికి చెందిన కేఈఐ సంస్థకు అప్పగించింది.
100 కోట్ల పెట్టుబడి.. 2 వేల మందికి ఉపాధి
24-01-2017 02:24:52
  • 7 పర్యాటక ప్రాజెక్టులకు ఉపసంఘం ఆమోదం
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 7 పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ మంత్రివర్గం ఉప సంఘ ఆమోదం తెలిపింది. సోమవారం వెలగపూడిలో ఉప సంఘం భేటీ అయింది. ఉప సంఘంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు సభ్యులుగా ఉన్నారు. 7 ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్ల పెట్టుబడులతో పాటు సుమారు 2 వేల మందికి ఉపాధి లభించనుంది. తిరుపతిలో ఫ్యామీలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ఎస్‌పీఐ సినిమా్‌సకు, విశాఖలోని నక్కపల్లిలో వే సైడ్‌ ఎమ్యూనిటీ నిర్మాణానికి సదరన ట్రావెల్స్‌కు, తూర్పుగోదావరి జిల్లా తేటగుంటలో వే సైడ్‌ ఎమ్యూనిటీ నిర్మాణానికి అంబికా అగరబత్తీ సంస్థకు, పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనులో మరో వే సూడ్‌ ఎమ్యూనిటీ నిర్మాణానికి సదర్‌ ట్రావెల్స్‌కు, మంత్రాలయంలో త్రీ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి శ్రీ వేంకటేశ్వరాలాడ్జ్‌కు అనుమతిచ్చింది. మరో రెండు ప్రాజెక్టుల నిర్వహణను రాజమండ్రికి చెందిన కేఈఐ సంస్థకు అప్పగించింది.
Link to comment
Share on other sites

10 కోట్లతో అరకులో అడ్వెంచర్‌ ఇన్‌స్టిట్యూట్‌
 
636211658844278928.jpg
విశాఖపట్నం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): విశాఖ ఏజెన్సీలోని అరకులోయలో నేషనల్‌ అడ్వెంచర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాన్సవరల్డ్‌ కనెక్ట్‌’ ప్రతినిధి భజరంగ్‌ షా ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఆయన శుక్రవారం సదస్సులో మాట్లాడుతూ అరకులోయలో పది ఎకరాల స్థలం కేటాయిస్తే అక్కడ 100 మంది గిరిజన యువతను తీసుకొని వారికి ఆయా క్రీడాంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. జలపాతాల నుంచి జాలువారే (వాటర్‌ ఫాల్‌ రాపెలింగ్‌) క్రీడలో ప్రపంచకప్‌ పోటీలను జూనలో అరకులోయలో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వంతో దీనిపై శనివారం ఒప్పందం జరుగుతుందన్నారు.
Link to comment
Share on other sites

పర్యాటకంలో ఏపీకి పెట్టుబడుల వెల్లువ
28-01-2017 20:44:50
636212330886669497.jpg
విశాఖపట్నం: పర్యాటక రంగంలో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. హోటళ్లు, అమ్యూజ్‌మెంట్‌, అడ్వెంచర్స్‌, ఇతర రంగాల్లో మొత్తం రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 89 ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలకు సంబంధించి భాగస్వామ్య సదస్సులో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్‌లు శనివారం తొలుత పెట్టుబడిదారులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. తరువాత ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రంగాలవారీగా చూస్తే హోటళ్ల నిర్మాణంలో 2300 కోట్లు, అమ్యూజ్‌మెంట్స్‌ రంగంలో 5700 కోట్లు, అడ్వెంచర్స్‌ విభాగంలో 834 కోట్లు, ఇతర రంగాల్లో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ప్రధానంగా అమరావతి, విజయవాడ భవానీ ద్వీపం, విశాఖలో స్టార్‌హోటళ్లు, తిరుపతిలో వసతులపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తరువాత స్టార్‌హోటళ్ల రూమ్‌లు కొరత వున్న నేపథ్యంలో 700 గదులు నిర్మించనున్నారు. ఇక రెండు వేల కోట్లతో అమరావతిలో బుద్ధ స్క్వేర్‌ నెలకొల్పనున్నారు.
Link to comment
Share on other sites

పర్యాటకంలో పెట్టుబడుల వెల్లువ
 
636212480251560090.jpg
  • 89 ఒప్పందాలు.. 12 వేల కోట్లు పెట్టుబడులు 
విశాఖపట్నం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఆతిథ్యం(హోటళ్లు), ఆహ్లాదం(అమ్యూజ్‌మెంట్‌), సాహస పర్యాటకం(అడ్వెంచర్‌ టూరిజం) సహా ఇతర రంగాల్లో మొత్తం రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 89 ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలకు సంబంధించి భాగస్వామ్య సదస్సులో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి, కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌లు శనివారం తొలుత పెట్టుబడిదారులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నారు. రంగాలవారీగా చూస్తే హోటళ్ల నిర్మాణంలో రూ.2,300 కోట్లు, అమ్యూజ్‌మెంట్స్‌ రంగంలో రూ.5,700 కోట్లు, అడ్వెంచర్స్‌ విభాగంలో రూ.834 కోట్లు, ఇతర రంగాల్లో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. రెండు వేల కోట్లతో అమరావతిలో బుద్ధ స్క్వేర్‌ నెలకొల్పుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా 45 వేల మందికి నేరుగా ఉపాధి లభించనున్నదని జయరామిరెడ్డి తెలిపారు.
 
Unt.jpg 
Link to comment
Share on other sites

ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఏపీ
 
  • 100కోట్లతో ‘రాయలసీమ హెరిటేజ్‌’
  • 100కోట్లతో బుద్ధా ప్రాజెక్టు
  • 250 కోట్లతో అఖండ గోదావరి
  • 130 కోట్లతో స్వదేశీ దర్శనం
  • విశాఖ సదస్సులో 100 ఎంఓయూలు
  • టూరిజం ఎండీ గిరిజాశంకర్‌
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ఇక ప్రపంచానికి పర్యాటక కేంద్రంగా మారనుందని పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ గిరిజాశంకర్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)విధానంలో అనేక ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. రాజహేంద్రవరం టూరిజం హబ్‌ పరిధిలోని ఉభయగోదావరి జిల్లాలో ఔత్సాహికులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయ న విశాఖ పెట్టుబడి దారుల సదస్సులో పర్యాటకానికి సంబంధించి 100 ఎంఓయూలు వచ్చాయని తెలిపారు. అందులో రాష్ట్ర పర్యాటక శాఖకు సంబంధించినవి 66 ఉన్నాయన్నారు. వాటిమీద తాము వారందరికీ అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. 4న విజయవాడ, 7న విశాఖపట్నం, 8న హైదరాబాద్‌, 9న తిరుపతిలో సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. కాకినాడ కేంద్రం గా రూ.70కోట్లతో స్వదేశీదర్శనం పనులు ప్రారంభించామని చెప్పారు. బీచ్‌ ఫ్రంట్‌, హోప్‌ఐలాండ్‌, కోరంగితోపాటు మరో 30 కోట్లతో కోనసీమ, కోటిపల్లి, జొన్నాడ ప్రాంతాలు అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. రాజమహేంద్రవరంలో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహిస్తామన్నారు. రూ.250 కోట్లతో అఖండగోదావరి ప్రాజెక్టు ప్రతిపాదించగా కేంద్రం సూచనలతో ఆధ్యాత్మిక, ఎకో టూరిజంగా దీనిని విభజించామని చెప్పారు. రూ.130కోట్లతో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఆరామాలు, గోదావరి ఘాట్లు అభివృద్ధి చేయనున్నామన్నారు. రాయలసీమ హెరిటేజ్‌ సర్క్యూట్‌ కింద లేపాక్షి, పెనుగొండ, గుత్తి, తాటిపర్తి, చింతల వెంకన్న ప్రాచీన ఆలయం, బెలూమ్‌ గుహలను రూ.100కోట్లతో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. అమరావతి కేంద్రంగా సాలిహుండ, బాలిగుండ, తొట్టకొండ, బొజ్జనకొండ, ఆదర్రు,అనువు ప్రాంతాలను బుద్ధా ప్రాజెక్టు కింద రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ఆయన చెప్పారు.
Link to comment
Share on other sites

ఇక మారేడుమిల్లి లోనూ 5 స్టార్ ఎకో రిసార్ట్స్ కను”విందు” చేయనున్నాయి.Written by kostaLife 
4-2-17-7-copy-2.png
0
SHARES

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న మారేడుమిల్లి దట్టమైన అడవి ప్రాంతం,ఇక్కడ అడవి దున్నలు, జింకలు,నెమళ్ళు,అడవి కోళ్ళు ఇంకా చాలా రకాల పక్షులు కనిపిస్తాయి.అయితే పులులు చాలా తక్కువ.ఈ అడవిలో ఒక 7 కిలోమీటర్లు లోపలకి వెళ్తే టైగర్ స్పాట్ ఉంది, అక్కడ పులి గాండ్రింపులు వినిపిస్తూ ఉంటాయి.మారేడుమిల్లిలో నాలుగు వ్యూపాయింట్స్ ఉన్నాయి.చుట్టూ చెట్లు, సెలయేరు,పాములేరువాగు ఇవన్నీ మారేడుమిల్లి లో చూడాల్సిన ప్రదేశాలు,ఇక్కడే క్రోకడైల్ స్పాట్ కూడా ఉంది.
మారేడుమిల్లిలోనే వెదురుబొంగులల్లో వండే బేంబూ చికెన్ చాలా ఫేమస్.పర్యాటక ప్రాంతం గా ఎంతో పేరు తెచ్చుకున్న మారేడుమిల్లి వచ్చే పర్యాటకులకోసం ఇప్పుడు మారేడుమిల్లి లో 5 స్టార్ ఎకో రిసార్ట్స్ రడీఅవుతున్నాయి.

మారేడుమిల్లిలో 5 కోట్ల రూపాయల నిధులతో తో 5 స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేయనున్నట్టు తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్ చెప్తున్నారు,పచ్చని ప్రకృతి అందాలనడుమ ఉన్న మారేడుమిల్లిలో ఈ ఎకో రిసార్ట్స్ నిర్మించడానికి స్థలం గుర్తించామని దశలవారీగా ఈ రిసార్ట్స్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు.గిరిజనుల ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

పాలకొల్లు.. చించినాడ, దగ్గరున్న దిండి రిసార్ట్స్ లాగే ఈ రిసార్ట్స్ కూడా పర్యాటకులని అలరిస్తాయని భావిస్తున్నారు అధికారులు..పర్యాటకులకి మెరుగైన సౌకర్యాలని అందించాలనే ఉద్దేశం తో మారేడుమిల్లిలో ఎకో రిసార్ట్స్ నిర్మాణం జరుగుతోందని జిల్లా పర్యాటక అభివృద్ధిమండలితో జరిగిన సమావేశం లో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తెలియచేసారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...