Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
Guest Urban Legend
అరకు అద్దాల రైలు నేడు ప్రారంభం

విశాఖపట్నం: అరకు పర్యాటకుల కోసం విశాఖ నుంచి నడపనున్న అద్దాల రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. రైలు ప్రారంభోత్సవాన్ని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ పరిశీలించారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

భవానీ ద్వీపం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక..!

ఈనాడు, అమరావతి

kri-gen1a.jpg

నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విజయవాడలోని భవానీ ద్వీపం ఇక అంతర్జాతీయ స్థాయిని అందుకోబోతోంది. ఈ మేరకు బృహత్తర ప్రణాళిక రూపొందుతోంది. ఈ భవానీద్వీపం పర్యటక కార్పొరేషన్‌ సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే రెండేళ్లలో ద్వీపాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ఆధ్వర్యంలో డిస్నీల్యాండ్‌ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. షికాగోకు చెందిన సీబీటీ ఆర్కిటెక్ట్స్‌, భారత్‌కు చెందిన స్టూడియో పాడ్‌ కన్సార్టియంకు బృహత్‌ ప్రణాళిక బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలల్లో దీని ప్రణాళికలు సమర్పించాల్సి ఉంటుంది.

ద్వీపంలో రూ.12 కోట్లు వెచ్చించి మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లాస్‌వెగాస్‌ తరహాలో అత్యంత సాంకేతికతతో దీన్ని రూపొందిస్తారు. భవానీ సహా ఏడు ద్వీపాలను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. నాలుగు నెలల్లో బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సమర్పించనున్నారు. భవానీ ద్వీపం విస్తీర్ణం దాదాపు 150 ఎకరాలు. కృష్ణానది ఒడ్డునే ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం భవానీ ద్వీపంలో స్పైడర్‌ నెట్‌, వాటర్‌ స్పోర్ట్సు, బోటింగ్‌ రెస్టారెంటు, ఏపీటీడీసీ కాన్ఫరెన్సు హాలు, కాటేజీలు 24వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ద్వారా నెలకు రూ.15 లక్షల ఆదాయం వరకు వస్తోంది.

భవానీ ద్వీపంలో రోప్‌వేను ఏర్పాటు చేయనున్నారు.

డిస్నీ లాండ్‌ తరహాలో కొత్త క్రీడలు రూపొందిస్తారు. వినోదాత్మక కార్యక్రమాలు, ఎమ్యూజ్‌మెంటు పార్కులు ఉంటాయి. కాటేజీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 24ను 100 వరకు పెంచాలనేది ప్రణాళిక. అంతర్గతంగా రహదారులు ఏర్పాటు చేస్తారు.

ప్రకాశం బ్యారేజీలో రివర్‌ కాటేజీలు కృష్ణానది వరదలను దృష్టిలో ఉంచుకొని నిర్మించనున్నారు.

15 మాస్టర్‌ బైక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

నదీ ముఖద్వారాల అభివృద్ధిలో భాగంగా ప్రతి 50 మీటర్లు చొప్పున ఒక గేమింగ్‌ ఉండాలని నిర్ణయించారు. పద్మావతి ఘాట్‌, దుర్గాఘాట్‌, పున్నమి, భవానీ ఘాట్‌ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. సంగీత ప్రియులకు వివిధరకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Today while on the way to my office saw a advertisement of Vizag tourism in Bangalore

 

 

 

 

 

Good promotion

 

 

2 weeks nunchi twitter lo campaign run chesaru share ur summer vacations pics with us and win free all exprenses paid trip to vizag with ur family ani

very good response vachindhi

Link to comment
Share on other sites

కొత్తదనమే పర్యాటకానికి ప్రత్యేక ఆకర్షణ
 
  • నూతన ఆలోచనలతో అభివృద్ధి చేయాలి
  • తిరుపతిని లేక్‌ సిటీగానూ మలచాలి
  • అంతర్జాతీయ ఈవెంట్స్‌కు ఏపీనే వేదిక: సీఎం
  • మంత్రి అఖిలప్రియకు అభినందన
అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): వాటర్‌ స్ర్కీన్లు, ఫ్లోటింగ్‌ కాటేజీలు వంటి వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్రణాళికలతో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. పర్యాటక రంగ అభివృద్ధికి కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులు, తెలుగు భాష-సంస్కృతి ఉన్నతిపై ఆయన మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తదనంతోనే పర్యాటక రంగానికి ప్రత్యేక ఆకర్షణ వస్తుందని, ఆ దిశగా అధికారులు దృష్టిసారించాలని సూచించారు. ఇంటర్నేషనల్‌ ఈవెంట్లకు ఏపీ వేదిక కావాలని అభిలషించారు.
 
రాజమండ్రి, విశాఖ, విజయవాడల్లో జలక్రీడలు త్వరిగతిన కార్యరూపం దాల్చేలా చూడాలన్నారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా మలచాలని సూచించారు. క్రీడలు, అడవులు, చెరువులు, నదులు, సుదీర్ఘతీరం.. కోనసీమ నుంచి తలకోన వరకూ ఇలా ఏపీలో అన్ని పర్యాటక ఆక్షరణలే ఉన్నాయన్నారు. తిరుపతిలో ట్రెక్కింగ్‌ వసతులు ఏర్పాటు చేయాలని, దానిని కేవలం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగానే పరిమితం చేయకుండా.. లేక్‌ సిటీగానూ అభివృద్ధి చేసేందుకు వీలుందని చెప్పారు. భవానీద్వీపాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని భావిస్తున్న సీఎం.. రూ.10 కోట్లతో వాటర్‌ స్ర్కీన్లు ఏర్పాటు, మ్యూజికల్‌-మల్టీమీడియా షో నిర్వహణకు అంగీకారం తెలిపారు.
 
రూ.300 కోట్లతో విశాఖపట్నంలో ఓషియనేరియంను ఆనందా గ్రూప్‌ ఏర్పాటు చేయనుందని పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ముఖే్‌షకుమార్‌ మీనా సీఎంకు వివరించారు. విశాఖలోనే టీయు 142 ఎయిర్‌క్రాఫ్ట్‌, స్నాక్‌ బార్‌, మ్యూజియం, సౌండ్‌ - లైట్‌ షోతో కొలువుదీరేలా చర్యలు వేగవంతం చేశామన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో పర్యాటకరంగం ప్రస్తుత వాటా 7.03 శాతం ఉందని అధికారులు వివరించగా, దీనికి 2020 కల్లా 9 శాతానికి, 2029 కల్లా 15 శాతానికి తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.
 
ఈ ఏడాది 2200 కోట్ల పెట్టుబడులు
పర్యాటక రంగాన్ని మొత్తం ఐదు హబ్‌లుగా విభజించి మార్కెటింగ్‌ - ప్రమోషన్‌, టూరిస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌, మౌలికవసతుల కల్పన చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలికవసతుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2200 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు రాబట్టాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలో రాజమండ్రిలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో ఓ భారీ కార్యక్రమం, విశాఖలో నేషనల్‌ కుకింగ్‌ ఒలింపియాడ్‌, శాండ్‌ మారథాన్‌, యూచ్‌ పెంటాగోనల్‌, విశాఖ ఉత్సవ్‌, సౌండ్‌ క్లౌడ్‌, అరకు బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్రంలో సరికొత్తగా సీ్ట్రట్‌ థియేటర్ల నిర్వహణ గురించి మంత్రి అఖిలప్రియ సీఎంకు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే పర్యాటకశాఖపై పట్టు సాధించినందుకు చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఏడాదంతా పర్యాటక పండగలే

రాష్ట్రంలో మొత్తం 24 భారీ కార్యక్రమాలకు సిద్ధం

రెహమాన్‌తో త్వరలో రాజమహేంద్రవరంలో...

ప్రధాన పర్యాటక ఆకర్షణగా భవానీ ద్వీపం

పర్యాటకశాఖపై సీఎం సమీక్ష

ఈనాడు - అమరావతి

25ap-state1a.jpg

ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో ఉమ్మడి పర్యాటక ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని పర్యాటకశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తేలియాడే కాటేజీలు, నీటి తెరల వంటి సరికొత్త ప్రణాళికలతో పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరచాలని సూచించారు. విజయవాడలోని భవానీ ద్వీపాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నీటి తెరలు, మ్యూజికల్‌ మల్టీమీడియా ప్రదర్శనకు ఆయన ఆమోదం తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలు గ్రామీణ పర్యాటక రంగానికి ఉత్తమ కేంద్రాలని అక్కడ జంతు, పక్షుల ప్రదర్శనశాలలను అభివృద్ధి చేయడంతోపాటు చందనం మొక్కలను చూసేందుకు పర్యాటకులను అనుమతించాలని, ఆయుర్వేద వైద్య పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. తిరుపతిలో ట్రెక్కింగ్‌ వంటి కొత్త ఏర్పాట్లు చేయాలని, లేక్‌సిటీగా తిరుపతిని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పర్యాటకశాఖ పనితీరును మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆ శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. కొత్తగా ‘‘స్ట్రీట్‌ థియేటర్ల’’ ప్రాజెక్టు ఏర్పాటు ఆలోచనను మంత్రి అఖిల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగానే కొత్త ప్రాజెక్టుల గురించి చర్చ జరిగింది. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే శాఖపై పట్టు సాధించారంటూ మంత్రిని ముఖ్యమంత్రి అభినందించారు. పర్యాటకులను ఆకర్షించేలా ఈ ఏడాది 6 ప్రత్యేక కార్యక్రమాలతోపాటు ఈ ఏడాదిలో 76 రోజుల కాల వ్యవధిలో మొత్తం 24 భారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో త్వరలో రాజమహేంద్రవరంలో ఓ భారీ కార్యక్రమం, విశాఖలో జాతీయస్థాయి కుకింగ్‌ ఒలింపియాడ్‌, శాండ్‌ మారథాన్‌, విశాఖ ఉత్సవ్‌, సౌండ్‌క్లౌడ్‌, అరకు బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

*  తిరుపతిలో ప్రపంచ ఆధ్యాత్మిక వారం: ధ్యానం, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, యోగాకు ప్రాధాన్యమిస్తూ ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పండిట్‌ రవిశంకర్‌ ప్రత్యేక అతిథిగా 10వేల మందితో నిర్వహణ.

*  తిరుపతిలో ధూల్‌: కుస్తీ, కబడ్డీ, ఎద్దుల పోటీల వంటి గ్రామీణ క్రీడలను నిర్వహించడంతోపాటు సెలబ్రిటీలను ఆహ్వానించడం.

*  క్రాఫ్ట్స్‌ మేళా తిరుపతిలో: చేతివృత్తులు, కళాకారులను ప్రోత్సహించడంతోపాటు పర్యాటకులను ఆకట్టుకునేలా వచ్చే జూన్‌లో క్రాఫ్ట్స్‌ మేళా ఏర్పాటు.

*  నెల్లూరులో ఫ్లెమింగ్‌ ఉత్సవాలు: డిసెంబరులో భారీ స్థాయిలో ఫ్లెమింగో ఉత్సవాల నిర్వహణతోపాటు విదేశీ పర్యాటకులకు ఎక్కువ సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయడం. పులికాట్‌ సరస్సును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో వాటర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి.

*విశాఖలో ప్రో కబడ్డీ: జులైలో విశాఖలో ప్రో కబడ్డీ పోటీలను నిర్వహించడం.

*  విశాఖలో యూ ట్యూబ్‌ అవార్డులు: నవంబరులో యూట్యూబ్‌ అవార్డుల కార్యక్రమం నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా సినీతారలను ఆహ్వానించడం.

Link to comment
Share on other sites

Guest Urban Legend

18194764_1659795127367405_55314221562003

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ పనితీరును సమీక్షించిన ముఖ్యమంత్రి... విజయవాడలోని భవానీ ద్వీపాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నీటి తెరలు, మ్యూజికల్‌ మల్టీమీడియా ప్రదర్శనకు ఆయన ఆమోదం తెలిపారు.
పర్యాటకులను ఆకర్షించేలా ఈ ఏడాది 6 ప్రత్యేక కార్యక్రమాలతోపాటు 76 రోజుల కాల వ్యవధిలో మొత్తం 24 భారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో త్వరలో రాజమహేంద్రవరంలో ఓ భారీ కార్యక్రమం
విశాఖలో జాతీయస్థాయి కుకింగ్‌ ఒలింపియాడ్‌, శాండ్‌ మారథాన్‌, విశాఖ ఉత్సవ్‌, సౌండ్‌క్లౌడ్‌, అరకు బెలూన్‌ ఫెస్టివల్‌
ధ్యానం, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, యోగాకు ప్రాధాన్యమిస్తూ ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పండిట్‌ రవిశంకర్‌ ప్రత్యేక అతిథిగా 10వేల మందితో తిరుపతిలో ప్రపంచ ఆధ్యాత్మిక వారం నిర్వహణ.
తిరుపతిలో కుస్తీ, కబడ్డీ, ఎద్దుల పోటీల వంటి గ్రామీణ క్రీడల నిర్వహణ
చేతివృత్తులు, కళాకారులను ప్రోత్సహించేలా వచ్చే జూన్‌లో తిరుపతిలో క్రాఫ్ట్స్‌ మేళా
నెల్లూరులో ఫ్లెమింగ్‌ ఉత్సవాలు... పర్యాటక కేంద్రంగా పులికాట్‌ సరస్సులో వాటర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి.
జులైలో విశాఖలో ప్రో కబడ్డీ పోటీలు
విశాఖలో నవంబరులో యూట్యూబ్‌ అవార్డుల కార్యక్రమం

Link to comment
Share on other sites

Enni chesina waste ee Internet evolution lo 

 

http://www.aptdc.gov.in/dailytours.html

 

ilanti website with no data updations leka pothe enduku enni chesina

 

Even in this website vizag tours gurinchi basic information ledu

 

see this website

http://www.telanganatourism.gov.in/partials/packages/tour-packages.html

 

Anni clear ga undali minimum thing people can know akada packages unayi ani telustundi people ki

Link to comment
Share on other sites

Guest Urban Legend

Enni chesina waste ee Internet evolution lo 

http://www.aptdc.gov.in/dailytours.html

ilanti website with no data updations leka pothe enduku enni chesina

Even in this website vizag tours gurinchi basic information ledu

see this website

http://www.telanganatourism.gov.in/partials/packages/tour-packages.html

Anni clear ga undali minimum thing people can know akada packages unayi ani telustundi people ki

 

bro,

if u have suggestions like this please write to aptourism aptdc in social media pages

or just give the complete info here.

i will pass on this info to them

mana website lo kuda info vunnayi but organized ga levu anthey redesign cheyyali ..http://www.aptdc.gov.in/special-tours/

 

note: evarikaina ilanti suggestions vuntey plz share it with govt through social media or directly call to the tourism office.

Link to comment
Share on other sites

bro,

if u have suggestions like this please write to aptourism aptdc in social media pages

or just give the complete info here.

i will pass on this info to them

mana website lo kuda info vunnayi but organized ga levu anthey redesign cheyyali ..http://www.aptdc.gov.in/special-tours/

 

note: evarikaina ilanti suggestions vuntey plz share it with govt through social media or directly call to the tourism office.

Lokesh mee friend antaga

 

Meeru cheppandi ul uncle lokesh ki :peepwall:

Link to comment
Share on other sites

Guest Urban Legend

Lokesh mee friend antaga

 

Meeru cheppandi ul uncle lokesh ki :peepwall:

 

inka nayam chandra babu garu na friend analedhu santhosham

mana AP kosam na vanthu responsibility ga info send chestha annanu

Link to comment
Share on other sites

Guest Urban Legend

swas brother oka sari website malli chudandi ....more than enough info vundhi

plz click on the slides on home page

destination details, complete details and price anni vunnayi

Link to comment
Share on other sites

Be ready to witness breathtaking views of thick forest cover, waterfalls and wildlife and get the opportunity to sleep over in comfy government cottages as a camper right in the middle of the forest. Deputy CM KE Krishnamurthy inaugurated the Nallamala Jungle Camp, a community-based eco-tourism initiative by the Department of Forests, at Bairluty in Kurnool district. Built at a cost of Rs. 2.17 crore, the 10-acre camp includes four semi-permanent cottages, six semi-permanent tented accommodation cottages, reception, a yoga centre, a library and dormitory. Nestled in the Nallamala Ranges of Eastern Ghats, the Nagarjunasagar Srisailam Tiger Reserve (NSTR) is a repository of Modiversity and an abode for endangered flora and fauna. The Largest Tiger Reserve in India with an area of 3727.82 Sqkms (Core and Buffer) spread over Prakasam, Kurnool and Guntur Districts of Andhra Pradesh falls in this region.

Minister for Forests Sidda Raghavarao said, “We have introduced jungle safari, jungle camp, nature trails, trekking, bird and butterfly watching, tribal archery and heritage walk to create awareness about nature conservation, and empower local tribal communities with livelihood opportunities – an objective very close to the heart of Hon’ble CM Nara Chandrababu Naidu Garu.”

Members of Chenchu tribe will teach interested campers how to trek the hilly regions that dot the landscape and introduce them to the flora and fauna of the region. The government has also announced permanent houses, loans and roads for members of Chenchu community.

You can make your booking online on:

www.nallamalaijunglecamps.com

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...