Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply

గోదావరి విహారం... అఖండ హారం

రాజమహేంద్రవరంలో విదేశీ లగ్జరీ బోట్లు

eag-top2a.jpg

 రాజమహేంద్రవరం: ప్రకృతి అందాలకు నెలవైన గోదారమ్మకు ప్రభుత్వం పర్యాటక హంగులు అద్దుతోంది. పుష్కరాల సమయంలో అంకురార్పణ చేసుకున్న అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రతిపాదనల స్థాయి నుంచి కార్యాచరణ దిశగా అడుగులేస్తోంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు జల విహారానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ విదేశీ బోట్లను అందుబాటులో ఉంచుతోంది.

సరస్వతీ స్నానఘట్టం కేంద్రంగా లగ్జరీ బోట్లు

గోదావరిలో సరదగా కాసేపు విహారం చేసేందుకు పలు బోట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ‘వాటర్‌స్పోర్ట్స్‌ సింపిల్‌’ అనే సంస్థ ముందుకు రావడంతో వారికి జిల్లా యంత్రాంగం అనుమతులిచ్చింది. అమెరికా నుంచి పలు బోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారు. తొలి విడతగా ‘పున్‌టన్‌ లగ్జరీ బోటు’ ‘హాబీకయాక్‌’ అనే తెరచాపతో కూడిన ఫెడల్‌, తెడ్లు ఉన్న బోట్లను తీసుకొచ్చారు. 14మంది కూర్చుని వెళ్లేందుకు వీలుగా లగ్జరీ బోటు అందుబాటులో ఉంది. దీనిలో విహారంతోపాటు, పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తారు. తెరచాపతో కూడిన బోటులో నలుగురు విహారం చేయవచ్చు. ఇది యువతను ఆకర్షించేలా ఉంది. దీంట్లో ఒకరు ఫెడలింగ్‌, మరో ఇద్దరు తెడ్డు సహాయంతో ముందుకు నడపవచ్చు. దీనికి అదనంగా తెరచాప ఉంటుంది. ఈ బోట్లలో ప్రయాణికులతో పాటు శిక్షణ పొందిన నిర్వాహకుడు ఉంటారు. ప్రతి పర్యాటకునికి లైఫ్‌జాకెట్‌ తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం నదిలో 20 నిమిషాల విహారానికి ఒక్కొ్కరికి రూ. 100 చొప్పున వసూలు చేసేందుకు నిర్ణయించారు. నెల వ్యవధిలో జెట్‌కీ, స్పీడ్‌ బోట్లు మరో 10 వస్తాయని నిర్వాహక ప్రతినిధి అశోక్‌ తెలిపారు.

భూపతిపాలెంలో ఫెడల్‌ బోట్లు

రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయర్‌లో రూ. ఎనిమిది లక్షల వ్యయంతో నాలుగు ఫెడల్‌బోట్లు, ఒక జెట్టీని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసి స్థానిక గిరిజన యువకులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో మరో రెండు ఫెడల్‌బోట్లు, ఒక మోటారు బోటు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించడంతో ఆ మేరకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాజెక్టు విలువ రూ. 15 లక్షలు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. స్థానిక యువతకు శిక్షణనిచ్చి వారితోనే నిర్వహణ చేయిస్తున్నారు. 20 నిమిషాల విహారానికి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో తాకిడి అధికంగా ఉంటోందని అక్కడి నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని చోట్ల...

అఖండ గోదావరి, భూపతిపాలెంలోనే కాకుండా జిల్లాలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ జలవిహారానికి అససరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అప్పన్నపల్లి, పాశర్లపూడి, ఆదుర్రు కేంద్రంగా కేరళ తరహాలో హౌస్‌బోట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పర్యాటకపరంగా ప్రైవేటు భాగస్వామాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచిస్తున్న నేపథ్యంలో అనుమతులకు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కేరళలో పరిస్థితులను అధ్యయనం చేసి జిల్లాలో ఏవిధంగా మరింత అభివృద్ధి చేపట్టాలో నిర్ణయం తీసుకుంటాం.

- భీమశంకర్‌, ప్రత్యేక అధికారి, అఖండ గోదావరి ప్రాజెక్టు
Link to comment
Share on other sites

Guest Urban Legend

finally the legendary INS Virat for AP :terrific: :terrific:

 

Thank you CBN for ur continuous push for it :yourock:

Thank you central govt

INS Viraat Coming to Bheemili Beach

INS-Viraat-.jpgRecently Retired INS Viraat is finally coming to Andhra Pradesh. Viraat is currently in Kochi where all the valuable equipment on board like engines, radars, guns will be dismantled to prepare it for the decommissioning. Defence Ministry has agreed to give it to AP where it will be turning into a tourist spot.

The Ship will be stationed at Bheemili Beach and the government had to spend about 200 Crore to prepare its resting place. The state government has asked the defense ministry to bear the expense of its decommissioning in the wake of the financial constraints of the state. A decision will be taken in a week’s time.

AP government is looking to convert the ship into a star hotel and floating museum to attract tourists from across the world. Tourism activities like sea sports, yachting, sailing, gliding and cruising will also be made available on the warship. A five-star luxury hotel with about 1,500 rooms is also part of the plan. Heli-tourism will also be encouraged. All that is likely to cost 700 Crore.

 

http://www.nandamurifans.com/forum/index.php?/topic/361117-floating-hotel-ga-ins-viraat-ship/page-3

Link to comment
Share on other sites

విశాఖకే విరాట్‌
 
636097598940544055.jpg
  • 2017లో ఏపీకి రాక
  • మ్యూజియం, హోటల్‌గా మార్పు
  • రూపాయికే ఇస్తున్న రక్షణ శాఖ
  • బెర్తింగ్‌ స్థలంపై తర్జనభర్జన
విశాఖపట్నం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): పురాతన యుద్ధ విమాన వాహక నౌక(ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌) ఐఎనఎ్‌స విరాట్‌.. ఆంధ్రప్రదేశకు తలమానికం కానుంది. వచ్చే ఏడాది ఈ నౌక విశాఖకు రానుంది. దీనిని ఏపీకి తీసుకు రావాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి! దీని ని మ్యూజియంగా మలిచి.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే బాధ్యతను విశాఖ నగరాభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటక శాఖకు సీఎం చంద్రబాబు అప్పగించారు. భారత నౌకాదళం సేవల నుంచి విరమించిన సబ్‌మెరైన ఐఎనఎ్‌స కురుసురను ఇలాగే విశాఖపట్నం తీసుకొచ్చి ఆర్‌కే బీచ రోడ్డులో మ్యూజియంగా మార్చారు. ఈ తరహా మ్యూజియం ఆసియాలో ఇదొక్కటే కావడం విశేషం!
 
ఇదీ విరాట్‌ సామర్థ్యం
ఐఎనఎ్‌స విరాట్‌ భారీ యుద్ధనౌక. సీ హారియర్స్‌, సీ కింగ్స్‌, చేతక్‌ తదితర 26 హెలికాప్టర్లను ఇందులో నిలపవచ్చు! తొలుత బ్రిటీష్‌ రాయల్‌ నేవీలో 27 ఏళ్లు పనిచేసింది. 1982 మేలో నౌకాదళంలోకి ప్రవేశించింది. 28 ఏళ్లు భారత నేవీకి సేవలందించింది. ఈ ఏడాది జూలైలో సేవల నుంచి విరమించింది. దీని బరువు 29 వేల టన్నులు. 227 మీటర్ల పొడవు, 46 మీటర్ల వెడల్పు.
 
పరీకర్‌ గట్టిగా ప్రయత్నించినా
విరాట్‌ను డీ కమిషనింగ్‌ చేసేందుకు ముంబై నుంచి కోచీకి గత జూలైలో తీసుకువెళ్లారు. అక్కడ ప్రొపల్షన్లు, ఇంజన్లు ఇతర భాగాలను ఈ ఏడాది చివరిలోగా తొలగిస్తారు. 2017 ప్రథమార్థంలో విశాఖకు తీసుకొస్తారు. విరాట్‌ నిర్వహణను ఏ రాష్ట్ర తీసుకుంటే.. కేవలం రూపాయికే నౌకను అప్పగిస్తామని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ గతంలో ప్రకటించారు. ఈ నౌకను తన సొంత రాష్ట్రమైన గోవాకు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అయితే సీఎం చంద్రబాబు విశాఖకే దానిని పంపాలనడంతో అధికారులు అంగీకరించారు.
 
బెర్తింగ్‌తో మూడేళ్లకోసారి రీఫిట్‌
విరాట్‌ను మ్యూజియం, హోటల్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీన్ని ఎక్కడ నిలపాలనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సముద్రంలోనే యాంకరింగ్‌ చేసి ఫ్లోటింగ్‌ (నీటిలో తేలియాడ్‌) హోటల్‌గా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీని వద్దకు సందర్శకులను, పర్యాటకులను తీరం నుంచి చిన్నచిన్న బోట్ల ద్వారా అక్కడికి తీసుకెళ్లాలనేది యోచన.

భీమిలి అనుకూలం
ఐఎనఎ్‌స విరాట్‌ను ఎక్కడ మ్యూజియంగా ఏర్పాటుచేయాలనే దానిపై చర్చిస్తున్నాం. వనటౌన ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి భీమిలిలో కొత్తగా జెట్టీ నిర్మించి అక్కడ పెట్టాలని భావిస్తున్నాం. విశాఖపట్నం-భీమిలి బీచ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నందున ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుంది. విరాట్‌లో హోటల్‌తోపాటు, కన్వెన్షన సెంటర్‌, షాపింగ్‌ మాల్‌ కూడా ఏర్పాటుచేసే యోచనలో ఉన్నాం.

-గంటా శ్రీనివాసరావు, మంత్రి

సాంకేతిక సహకారం అందిస్తాం
యుద్ధనౌక విరాట్‌ను విశాఖలో మ్యూజియంగా ఏర్పాటుచేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం తూర్పు నౌకదళం అందిస్తుంది. వచ్చే ఏడాది ఆ నౌక విశాఖకు వస్తుంది. ఆ తరువాత కొన్ని రోజులు నేవీ ఆధీనంలో ఉంటుంది. రక్షణ శాఖకు చెందిన నౌక కాబట్టి అందులో అన్నీ పూర్తిగా తొలగించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తాం.

-తూర్పు నౌకాదళం ప్రధానాధికారి హెచసీఎ్‌స బిస్త్‌
Link to comment
Share on other sites

60 konchem ekkuva...40 ithe better...inka crowd perugutadi..

60 ki antha crowd vasthundi.. 40 chesthe crowd management mallee problem authundi kada..

 

Better to add more entertaining stuff around this place before crowd stops coming.

 

Oka sari chooska locals thaggipotharu

Link to comment
Share on other sites

తీర ప్రాంత పర్యటకకు.. నిబంధనల మెలిక

ప్రతిపాదనల దశలోనే పనులు

నేడు ముఖ్య అధికారుల సమావేశం

న్యూస్‌టుడే, సూళ్లూరుపేట

nlr-gen6a.jpg

జిల్లాలోని పర్యటక రంగానికి నూతన శోభ తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కుమ్మరిస్తున్నాయి. దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కాకమునుపే నిబంధనలు అడ్డువస్తున్నాయి. దాంతో పనులన్ని ప్రతిపాదనల దశ దాటటంలేదు. దీనిపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్‌లో సంబంధిత శాఖల అధికారులు సమావేశం కానున్నారు.

జిల్లాలోని ముఖ్యమైన పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌ పేరుతో కోస్టల్‌ టూరిజం సెక్యూరిటీ ద్వారా 11 ప్రాజెక్టులకు రూ.60.38 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇందులో మైపాడు, రామతీర్థం, ఇసకపల్లి, కొత్తకోడూరు, నెల్లూరు చెరువు, భీమునివారిపాళెం ఓడల రేవు, నేలపట్టు, ఇరకం, అటకానితిప్ప, వేనాడు, తదితర ప్రాంతాలు ఉన్నాయి.

* పులికాట్‌ పక్షుల రక్షిత కేంద్రం, నేలపట్టు పక్షుల సంతానోత్పత్తి కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తేవాలన్న తలంపుతో ఎప్పటి ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం పులికాట్‌, నేలపట్టు, అటకానితిప్ప, భీమునివారిపాళెం, వేనాడు, ఇరకం చిత్తూరు జిల్లాలోని ఉబ్బలమడుగు ప్రాంతాలను కలిపి కోస్టల్‌ టూరిజం సర్యూ్కట్‌ కింద చేర్చింది. ఈ ప్రాంతాల అభివృద్ధికి స్వదేశీ దర్శన్‌ పథకం కింద రూ.21 కోట్ల నిధులు మంజూరు చేశారు.

* ఈ ప్రాంతాల్లో పర్యటకులను ఆకర్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి.. నూతనంగా చేయాల్సిన అభివృద్ధి పనులు గురించి అధ్యయనం చేసేందుకు గత మే నెలలో పర్యటక, అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించారు. దాంతోపాటు అప్పటి జిల్లా పాలనాధికారిణి జానకితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర పర్యటక శాఖ అధికారులతోపాటుగా ఓ కన్సల్‌టెంట్‌ కూడ ఈ ప్రాంతాల్లో పర్యటించారు.

* పులికాట్‌, నేలపట్టులో పర్యటించిన పర్యటక శాఖాధికారులకు అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో చేయదగిన, ఎలాంటి పనులకు నిబంధనలు అడ్డు వస్తోయో.. విశదీకరించారు. అప్పట్లో అధికారులు అన్నింటికి ఒప్పుకుని వెళ్లారు.

* నేలపట్టు, భీమునివారిపాళెం, వేనాడు, అటకానితిప్ప, ఇరకవ దీవిల్లో చేయదగిన కట్టడాల గురించి, వాటి డిజైన్లను అటవీశాఖకు పంపారు. ఇందులో భారీగా మార్పులు ఉండటంతో ఇందుకు అటవీ అధికారులు కొర్రి పెట్టినట్టు తెలుస్తోంది. అటవీశాఖ డిజైన్లకు, పర్యటక శాఖ వారి ప్రతిపాదనలకు పొంతన కుదరలేదు. దాంతో వారు ఇలాంటి కట్టడాలు తమ పరిధిలో నిర్మాణం చేపట్టేందుకు వీలులేదని, ఇందుకు నిబంధనలు ఒప్పుకోవని చెప్పినట్లు తెలిసింది.

నిబంధనలు ఏమీ చెబుతున్నాయ్‌..

తీర ప్రాంత రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత నియంత్రణ మండలి( కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌) పేరిట గతంలో చట్టం చేసి ఉంది. దీని ప్రకారం తీరం నుంచి 500 మీటర్ల వరకు ఎలాంటి కట్టడాలకు అనుమతి లేదు. ఈ నిబంధనలు పులికాట్‌ సరస్సుకు, నేలపట్టుకు వర్తించనున్నాయి. ఒకవేళ అనుమతి తీసుకోవాలంటే సుప్రీంకోర్టు నుంచి రావల్సిందే. ఇది కష్టసాధ్యమయిన పనే. దాంతోపాటు రోజులు, నెలల్లో జరిగే పనికాదు. ఇది కాస్తా ఇరకం, వేనాడు, అటకానితిప్ప, భీమునివారిపాళెం, నేలపట్టు ప్రాంతాలల్లో పర్యటక శాఖ అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.

పర్యటక శాఖ డిజైన్లు ఇలా..

పర్యటక శాఖ దిల్లీలోని ఓ సలహాదారు సంస్థ ద్వారా నేలపట్టు, పులికాట్‌, భీమునివారిపాళెం, తదితర ప్రాంతాల్లో నిర్మాణాలకు సంబంధించి డిజైన్లు రూపొందించారు. వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. నేలపట్టులో వాచ్‌ టవర్‌ను రూ.30 లక్షలతో నిర్మించాలని, అలాగే నేలపట్టు కట్టపై చైన్‌ లింగ్‌ మెస్‌ ఏర్పాటుకు రూ.5 లక్షలు, ఎలక్ట్రికల్‌ పనులకు రూ.5 లక్షలు వంతున ఖర్చు చేయాలని డిజైన్‌ చేశారు. ఇది కాస్తా వన్యప్రాణి నిబంధనలకు అడ్డు తగులుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతోపాటు, వలస పక్షులకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఆ తరహాలో అయితే అటవీశాఖ డిజైన్‌ మేరకు రూ.8 లక్షలతో వాచ్‌టవర్‌, కట్టపై చైన్‌ లింగ్‌మెస్‌ కాకుండా సాధారణ పెన్సింగ్‌ వేసేందుకు రూ.లక్ష లోపు ఖర్చు పెడితే సరిపోతుంది. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని అటవీశాఖ అధికారులు శాశ్వత నిర్మాణాలకు అడ్డుచెప్పినట్లు తెలిసింది. దాంతోపాటుగా భీమునివారిపాళెం ఓడ రేవులో భారీ కట్టడాలు నిర్మించేందుకు వీలులేదు. ఇరకం దీవిలో పర్యటక శాఖకు 80 ఎకరాలకు వరకు ఉంది. అక్కడ కొన్ని పర్యటకులకు కావల్సిన వసతులను ఏర్పాటు చేసేందుకు పర్యటక శాఖ సిద్ధమైంది. ఇక పర్యటకులను బోటుల ద్వారా తీసుకెళ్లాలన్నది పర్యటక శాఖ ఆలోచన. అయితే ఇందుకు అటవీశాఖ అధికారులు అడ్డు చెబుతున్నారు. ఎందుకంటే బోటుల్లో వెళ్లే పర్యటకులు తాగునీటి సీసాలను, తినుబండారాలను తిని పులికాట్‌ సరస్సుల్లో వేసే వీలుందని, ఇది కాస్తా పక్షులకు, పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుందని అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు నివేదిక తయారు చేసి, పర్యటక శాఖకు పంపినట్లు తెలుస్తోంది.

సమావేశంలో పలు అంశాలపై చర్చ

హైదరాబాద్‌లో సోమవారం జరిగే సమావేశంలో పర్యటక, అటవీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. ఇందులో ముఖ్యంగా పులికాట్‌, నేలపట్టులో పర్యటక ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నారు. ఇందులో పలు అంశాలకు చర్చకు అవకాశం ఉంది. అయితే ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. వేచి చూడాల్సిందే.

Link to comment
Share on other sites

* జిల్లా స్థాయి పర్యాటక మండళ్ల ఏర్పాటు. అమరావతి(విజయవాడ), విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిల్లో నగర పర్యాటక మండళ్ల ఏర్పాటు. ఏడాదికి ఎకరా రూ.5 కోట్ల చొప్పున లీజు విలువకు లోబడి గాని, 2.5ఎకరాల వరకు ప్రభుత్వ భూమి... వీటిల్లో ఏది తక్కువుంటే దానిని పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించే అధికారం ఈ మండళ్లకు అప్పగింత.

* గోల్ఫ్‌ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు విశాఖపట్నంలోని ముడసర్లోవలో 12.72ఎకరాల భూమిని ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు కేటాయింపు. 18 హోల్స్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి.

Link to comment
Share on other sites

పర్యాటకం జోరు
 
636105394992411935.jpg
  • నేడు పర్యాటక దినోత్సవం 
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో పర్యాటక రంగం ఊపందుకుంది. సాగర తీరం విశాఖ, ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల నవ్యాంధ్ర పర్యాటకానికి తలమానికంగా మారాయి. గతంతో పోల్చితే ఈ రెండు ప్రాంతాలను రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. 2014లో 63 లక్షల మంది విశాఖను సందర్శించారు. కాగా 2015లో ఆ సంఖ్య 1.15 కోట్ల పెరిగింది. ఈ ఏడాదిలో జూలై చివరి నాటికి పర్యాటకుల సంఖ్య 1.11 కోట్లు దాటింది. మొత్తంగా 2 కోట్లు దాటవచ్చని అంచనా. పారిశ్రామికంగా, ఎడ్యుకేషన హబ్‌గా, టూరిజం స్పాట్‌గా విశాఖను తీర్చిదిద్దడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. అలాగే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి పర్యాటకుల సంఖ్య ఏటా నాలుగు కోట్ల పైగా ఉంటుంది. గత ఏడాది వేంక టేశ్వరస్వామిని నాలుగు కోట్ల మంది సందర్శించారు. ఈ ఏడాది జూలై నాటికి 2.36 కోట్ల మందిపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రెండు నగరాలతోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం టూరిజం మిషన్‌ 2014, టూరిజం పాలసీ 2015ని రూపొందించింది. 
 
ఇతర ప్రాంతాల్లోనూ..
రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. 2014లో 9.33 కోట్ల మంది రాష్ట్రంలో పర్యటించారు. వారిలో 66.333 శాతం విదేశీ పర్యాటకులే! 2015లో 12.18 కోట్ల మంది రాష్ట్రానికి వచ్చారు. దీంతోపాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా రెండింతలైంది. ఈ ఏడాది జూలై వరకూ రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుల సంఖ్య 7.95 కోట్లుగా ఉంది. ఈ లెక్కన సగటున నెలకు 1.13 లక్షల మంది పర్యటిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ సీఎం చంద్రబాబు ప్రపంచ దేశాలను కోరారు. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం నగరాలను పర్యాటక హబ్‌లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఐ.ఎ్‌స.బి తరహాలో అమరావతిలో ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, పలు టూరిజం ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉంది.
Link to comment
Share on other sites

భవానీ ద్వీపంలో..పర్యాటక వేడుకలు
 
636105563560739240.jpg
ఆంధ్రజ్యోతి-అమరావతి: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను మంగళవారం విజయవాడలో నిర్వహించేందుకు భారీ ఏర్పాటు చేశారు. ’అందరికి పర్యాటకం’ నినాదంతో ఈ ఏడాది పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసింది. 200 మంది వికలాంగ విద్యార్థులను విజయవాడ నుంచి ఐదు బస్సుల్లో తీసుకువెళ్లి కొండపల్లి ఫారె్‌స్టతో పాటు కొండపల్లి ఖిల్లాను చూపించనున్నారు. అనంతరం వారిని పవిత్ర సంగమం వద్దకు తీసుకువెళతారు. కృష్ణా - గోదావరి పవిత్ర సంగమం విశిష్టత, రెండు నదులు చరిత్రను విద్యార్థులకు వివరిస్తారు. అనంతరం భవానీ ద్వీపంలో ఏర్పాటు చేసి కార్యక్రమానికి విద్యార్థులను తరలిస్తారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి సీఎం అవార్డులను అందిస్తారు.
తుమ్మలపల్లి నుంచి భవానీ ద్వీపానికి..
పర్యాటక దినోత్సవ వేడుకలను మొదట విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహించాలని పర్యాటక శాఖ అధికారులు నిర్ణయుంచారు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం పర్యాటకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీకాంతతో పాటు మరికొంత మంది అధికారులు తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేదికను భవానీ ద్వీపానికి మార్చాల్సిందిగా సీఎం చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చారు. సీఎం ఆదేశాల మేరకు వేడుకలను భవానీ ద్వీపంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...