Jump to content

AP fibre Grid project


Recommended Posts

  • Replies 610
  • Created
  • Last Reply

అన్నా @ysjagan మారవేరా ఇక తూర్పుగోదావరి లో 6 చోట్ల fibergrid కేబుల్ కోపిచ్చావ్ ఎందుకన్నా?

నువ్వు కోస్తావని ఆయన ముందే పసిగట్టి అక్కడ wifi ఏర్పాట్లు చేసాడు?

https://pbs.twimg.com/media/DSDpeQ5UQAAlsoe.jpg

Link to comment
Share on other sites

1 hour ago, Yaswanth526 said:

అన్నా @ysjagan మారవేరా ఇక తూర్పుగోదావరి లో 6 చోట్ల fibergrid కేబుల్ కోపిచ్చావ్ ఎందుకన్నా?

నువ్వు కోస్తావని ఆయన ముందే పసిగట్టి అక్కడ wifi ఏర్పాట్లు చేసాడు?

https://pbs.twimg.com/media/DSDpeQ5UQAAlsoe.jpg

ilaga public utilites ni damage chese valla meeda POTA lanti act petti permanent ga museyyali vedhavalni.

Link to comment
Share on other sites

ఫైబర్‌నెట్‌ ఓ రికార్డు!
28-12-2017 02:38:49

149కే ఫోన్‌, కేబుల్‌, నెట్‌
2018కి కోటి మందికి ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు
4700 కోట్ల ప్రాజెక్టు.. 330 కోట్లకు పూర్తి
టెక్నాలజీలో ప్రపంచానికే ఏపీ ఓ నమూనా
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా తెలివైనోళ్లు
ఇంటర్నెట్‌ ఇస్తే అభివృద్ధికి వినియోగిస్తారు
జీడీపీకి 1 శాతం వృద్ధిని జోడిస్తారు: సీఎం
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేవలం రూ.149కే టెలిఫోన్‌ కనెక్షన్‌, 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, 250 టీవీ చానళ్లు అందించడం ఏపీలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని, ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు ఓ రికార్డు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీలో భారత్‌కే కాకుండా మొత్తం ప్రపంచానికే ఏపీ ఒక నమూనాలా నిలుస్తుందన్నారు.
 
ఫైబర్‌నెట్‌తోపాటు మరో మూడు ప్రాజెక్టులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా తెలివైనవారని, ఇంటర్నెట్‌ను ఇస్తే దాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారని తెలిపారు.
 
రాష్ట్ర ప్రజలందరికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తే జీడీపీలో ఒక శాతం వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీలో ప్రపంచంలోనే ఏపీ ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, దీంతో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
 
తెలుగువాడైన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా ఎదిగారని, అమెరికాలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులుగా కాగా.. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఏపీకి చెందినవారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఐటీ-ఐవోటీలను కలిసి ఉపయోగించే విప్లవం నడుస్తోందని, ఇందులో ఏపీ ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఇంట్లో కూర్చుని హాయిగా కాఫీ తాగుతూ రాష్ట్రపతితో మాట్లాడే సౌకర్యం ఫైబర్‌నెట్‌తో వచ్చిందని, అదీ టెక్నాలజీతో ప్రయోజనం అని సీఎం వ్యాఖ్యానించారు.
 
డబ్బుల్లేవు.. ఎలా అని ఆలోచించా!
ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు వాస్తవ వ్యయం రూ.4,700 కోట్లు అని చంద్రబాబు తెలిపారు. ‘ఫైబర్‌ కేబుల్‌ను భూగర్భంలో వేసేందుకు వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.
 
అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఆ దశలో ఏం చేయాలా? అని ఆలోచించి వినూత్న మార్గం సూచించా. అప్పటికే ఉన్న విద్యుత్తుస్తంభాలను ఉపయోగించుకుని వాటిపైన ఫైబర్‌నెట్‌ తీగలు లాగేస్తే.. అన్న ఆలోచనను అమలు చేశాం. ఉపాధి హామీ కూలీల సాయంతో ఆ పనిని వేగంగా పూర్తిచేశాం. దీంతో రూ.330 కోట్లకే ప్రాజెక్టు పూర్తయింది.’ అని సీఎం వివరించారు. ప్రతి గ్రామ పంచాయతీకి నెట్‌ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.860 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. ప్రతి గ్రామంలో హాట్‌ స్పాట్‌ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు.
 
పాడేరు, అరకులో కూడా నెట్‌
ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు గూగుల్‌ ఎక్స్‌తో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం చేసుకుందని చంద్రబాబు గుర్తుచేశారు. ఎఫ్‌ఎ్‌సవోసీ టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలోని పాడేరు, అరకు లాంటి మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామన్నారు. విద్య, వినోదం, ఆటలు ఏది కావాలంటే అది ఫైబర్‌నెట్‌లో అందుబాటులో ఉంటుందన్నారు.

Link to comment
Share on other sites

ఇంటింటా టెక్నాలజీ 
రాష్ట్రంలో సాంకేతిక శ‌కం 
ఇంటర్నెట్‌ ఇప్పుడో నిత్యావసరం 
  ఆలస్యాన్ని సహించని ఆధునిక సమాజాలివి 
  నేటి ప్రభుత్వాలను సాంకేతికతే నడిపిస్తోంది 
  వినూత్న ఆవిష్కరణల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజ 
  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యలు 
  ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు జాతికి అంకితం 
  అట్టహాసంగా కార్యక్రమం 
ఈనాడు - అమరావతి 

‘ఒకప్పుడు పాలనా వ్యవహారాల్లో టెక్నాలజీ ఒక సాధనమే. ఇప్పుడు ఆధునిక ప్రభుత్వాలను అదే నడుపుతోంది. ఈ అత్యాధునిక సాంకేతిక యుగంలో ప్రభుత్వాలు ఆలస్యంగా స్పందిస్తే కుదరదు. ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండాలి. ఆన్‌టైం (తక్షణం) స్పందించాలి. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ప్రభుత్వ నిర్వహణలో టెక్నాలజీని గరిష్ఠంగా వినియోగించుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నా అభినందనలు. వినూత్న ప్రాజెక్టుల రూపకల్పన, అమల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది’
          - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
‘నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు వచ్చా. అవి ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌ గ్రిడ్‌, నిఘా కెమెరాలు, డ్రోన్లు, ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ ప్రాజెక్టులు. ఈ నాలుగూ పరస్పర సంబంధం ఉండటంతోపాటు దేశానికి మార్గదర్శకంగా నిలిచేవే. పాలనా వ్యవహారాల్లో,  ప్రజల దైనందిన జీవితాలను మెరుగు పరచడంలో టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చో చెప్పే ప్రాజెక్టులే’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ను ఆయన బుధవారం జాతికి అంకితం చేశారు. వెలగపూడిలోని సచివాలయం పక్కనే ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఇళ్లకు, వ్యాపార సంస్థలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ  ఇవ్వడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘డిజిటల్‌ ఏపీ లక్ష్యాన్ని, తద్వారా డిజిటల్‌ ఇండియా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇదో కీలకమైన ముందడుగు’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ దశాబ్దం క్రితం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విలాసమని, ఇప్పుడు అది నీరు, వంటగ్యాస్‌, కరెంటులాగే నిత్యావసరంగా మారిందని ఆయన చెప్పారు. ‘ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటే చాలా ప్రయోజనాలు చేకూరతాయి. చిన్న, సన్నకారు రైతులూ తమ ఉత్పత్తులకు మంచి ధర ఎక్కుడ దొరుకుతుందో తెలుసుకుని అక్కడే అమ్ముకోవచ్చు. డిజిటల్‌ తరగతి గదులు, టెలీ మెడిసిన్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించవచ్చు. ప్రజా సాధికారత, సామాజిక మార్పునకు ఇది కీలకమైన సాధనం. నగరాల్లో అన్ని వసతులూ ఉండే విద్యార్థులతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు తెలివితేటలున్నా వసతుల్లేక వెనుకబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లౌడ్‌ ఆధారిత వర్చువల్‌ క్లాస్‌రూంల ప్రాజెక్టు వంటివి ఈ అసమానతలను తొలగిస్తాయి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా తండ్రీకొడుకులిద్దరూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్‌లను తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్‌ కొనియాడారు. టెక్నాలజీ ప్రజల జీవితాల్లో సంతోషం పెరగడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్‌ వంటి వసతులన్నీ కల్పించడం మంచిదేనని, అదే సమయంలో పెద్దలు, పిల్లలకు టీవీ చూడటం వ్యసనంగా మారకుండా జాగ్రత్తపడాలని సూచించారు.
ఏడాదిలో కోటి మందితో వీడియో కాన్ఫరెన్స్‌.. 
టెక్నాలజీని వాడుకోవడంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచానికే ఆదర్శంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ఒకేసారి కొన్ని వేల మందితో వీడియో కాన్ఫరెన్స్‌ జరిపే సదుపాయం కల్పించామని, 2018 డిసెంబరు నాటికి కోటి మందితో వీడియో కాన్ఫరెన్స్‌ జరపగలమని తెలిపారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుని 15శాతం వృద్ధి రేటు సాధిస్తున్నామని, జాతీయాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ‘టెక్నాలజీని, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌తో అనుసంధానం చేయడం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నాయి. ఇది నాలుగో పారిశ్రామిక విప్లవం. ఈ రోజు కొందరు తమ ఇంటి దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ ఏకంగా రాష్ట్రపతితోనే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడే పరిస్థితి వచ్చింది. అదే టెక్నాలజీకి ఉండే ప్రత్యేకత’ అని పేర్కొన్నారు.

ఘనంగా కార్యక్రమం.. 
ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. రాష్ట్రపతి కోవింద్‌ వేదికపై ఏర్పాటు చేసిన ఫలకాన్ని ఆవిష్కరించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణ్యం, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, శాసన మండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు గురించి ఐటీ మంత్రి లోకేష్‌ వివరించారు. ఈ ప్రాజెక్టుపై రూపొందించిన వీడియో చిత్రాన్ని రాష్ట్రపతి తిలకించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని పలు పంచాయతీలు, అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వారితో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించాలని మొదట అనుకున్నారు. కానీ కార్యక్రమం మొదలయ్యేసరికే కొంత ఆలస్యమవడంతో... వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించలేదు. వేదిక సమీపంలో రాజధాని అమరావతిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాష్ట్రపతి తిలకించారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన పరిపాలనా నగరం, హైకోర్టు, శాసనసభ భవనాల నమూనాల్ని, చిత్రాల్ని ఆయన చూశారు.

Link to comment
Share on other sites

నిర్మించుకుంటూనే చరిత్ర సృష్టిస్తున్నాం 
సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకున్నాం 
ఐటీ మంత్రి లోకేశ్‌ వెల్లడి 
ఏపీ ఫైబర్‌పై ఆకట్టుకున్న ప్రజంటేషన్‌
ఈనాడు అమరావతి: ‘మేం సంక్షోభాల్ని అవకాశంగా మార్చుకున్నాం. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో చరిత్రనూ సృష్టిస్తున్నాం. ప్రజల్లో తలసరి ఇంటర్నెట్‌ డేటా వినియోగం 10 శాతం పెరిగితే జీడీపీ ఒక శాతం వృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్‌గ్రిడ్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు’ అని ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. బుధవారం ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతికి అంకితం చేసిన తర్వాత.... ఈ ప్రాజెక్టు గురించి లోకేశ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ప్రాజెక్టులోని ముఖ్యమైన అంశాలు, దీనివల్ల ప్రజలకు జరిగే మేలు గురించి వివరిస్తూ సాగిన లోకేశ్‌ ప్రసంగం ఆకట్టుకుంది. రాష్ట్రపతి సహా ప్రముఖులంతా సావధానంగా విన్నారు. ‘చేతిలో డబ్బుల్లేని పరిస్థితుల్లో ఒక అంకుర ప్రాజెక్టులా ఫైబర్‌గ్రిడ్‌ను చేపట్టాం. బస్సే మాకు కార్యస్థానమైంది. 3.75 లక్షల కరెంటు స్తంభాల్ని మూడు రోజుల్లో ట్యాగ్‌ చేశాం. 9 నెలల్లో 24వేల కి.మీ. ఓఎఫ్‌సీ లైన్లు వేశాం. ఇది దేశంలోనే కాదు. ప్రపంచంలోనే రికార్డు. కరెంటు స్తంభాలకు ఓఎఫ్‌సీ వైర్లు అమర్చడానికి వినూత్న క్లాంపింగ్‌ విధానం వాడాం. పేటెంట్‌కు దరఖాస్తు చేశాం. రూ.333 కోట్లతోనే ఓఎఫ్‌సీ లైన్లు వేశాం’ అని లోకేశ్‌ తెలిపారు. 2018 డిసెంబరు నాటికి ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామని, ఏపీ ఫైబర్‌ ద్వారా కోటి కనెక్షన్లు ఇస్తామని లోకేశ్‌ తెలిపారు. ఏపీ ఫైబర్‌ ప్రాజెక్టు ఎలా పనిచేసేదీ ఆయన భారీ తెరపై రాష్ట్రపతికి వివరించారు. 250 టీవీ ఛానళ్లను అందజేస్తున్నామని చెబుతూ... ఈటీవీ ప్రసారాలను చూపించారు. ఈటీవీ రాష్ట్రంలో అధిక ప్రాచుర్యం ఉన్న టీవీ ఛానల్‌ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రజలు లైవ్‌లో చూడొచ్చు. పిల్లలు తరగతులు ముగిశాక ఇంట్లో టీవీ ద్వారా మరింత నేర్చుకోవచ్చు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించవచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అవసరమైన విజ్ఞానం, వినోదం పొందవచ్చు’ అని లోకేశ్‌ వివరించారు. కార్యక్రమం ముగిశాక రాష్ట్రపతి లోకేష్‌తో కరచాలనం చేసి ప్రత్యేకంగా అభినందించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...