Jump to content

AP fibre Grid project

Recommended Posts

Ila vasthe kastam

...

Give them some time to iron out some technical issues. 

I ordered Google fiber 3-4 months ago ... still trying to workout some issues with them. 

These things are new ... give time.

Link to comment
Share on other sites

  • Replies 610
  • Created
  • Last Reply

Give them some time to iron out some technical issues.

I ordered Google fiber 3-4 months ago ... still trying to workout some issues with them.

These things are new ... give time.

Yes bro.. Hoping for best..
Link to comment
Share on other sites

Guest Urban Legend

Ila vasthe kastam

initial issues will be there in some areas it will take some time

ah video recommended videos lo idhi vundhi

Link to comment
Share on other sites

Guest Urban Legend

MSO laki training video anukunta for installation,wiring and all other technical process

users ki from 18.50

Link to comment
Share on other sites

AP Fiber grid Project కనెక్షన్లు ఒంగోలు లో ఇవ్వడం మొదలు పెట్టారు.... చానల్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంటర్నెట్ స్పీడ్ 21 Mbps up to 5 GB data limit. 5 GB limit దాటినా తర్వాత 3 mb Speed unlimited ఇస్తాం అంటున్నారు. APPs చాలా ఉన్నాయి....whatsapp, Facebook, vlc, govt apps,Viber, Skype , ms office, Adobe reader, YouTube ఇంకా బొచ్చెడు. Zee చానల్స్ తప్ప అన్నీ వస్తున్నాయి..... సాక్షి కూడా.full entertainment.wifi on చేసుకుని laptap లో ఫోన్ లో కూడా వాడుకోవచ్చు ....lan connection తో కంప్యూటర్ కి కనెక్ట్ చేసుకొచ్చు....Landline phone connection kooda ichharu ( Device maname konukkovali) .. కుమ్ముకోండిక

18892947_10209749571157808_5977199239515

18813424_10209749573717872_5860719127751

18921962_10209749571637820_6277828186270

18814116_10209749573197859_4090373876933

Link to comment
Share on other sites

AP Fiber grid Project కనెక్షన్లు ఒంగోలు లో ఇవ్వడం మొదలు పెట్టారు.... చానల్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంటర్నెట్ స్పీడ్ 21 Mbps up to 5 GB data limit. 5 GB limit దాటినా తర్వాత 3 mb Speed unlimited ఇస్తాం అంటున్నారు. APPs చాలా ఉన్నాయి....whatsapp, Facebook, vlc, govt apps,Viber, Skype , ms office, Adobe reader, YouTube ఇంకా బొచ్చెడు. Zee చానల్స్ తప్ప అన్నీ వస్తున్నాయి..... సాక్షి కూడా.full entertainment.wifi on చేసుకుని laptap లో ఫోన్ లో కూడా వాడుకోవచ్చు ....lan connection తో కంప్యూటర్ కి కనెక్ట్ చేసుకొచ్చు....Landline phone connection kooda ichharu ( Device maname konukkovali) .. కుమ్ముకోండిక

...

Fantastic  :terrific:

Link to comment
Share on other sites

  • 2 weeks later...

అంతర్జాలం ఎంతటి దూరం

ప్రజల్లోకి వెళ్లని ప్రతిష్టాత్మక పథకం

మందకొడిగా సాగుతున్న ‘ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌’ కనెక్షన్లు

జూన్‌-2 నాటికి పూర్తిచేస్తామన్న లక్ష్యం నీరుగారింది

జిల్లాలో 6లక్షలకు గాను 3వేల మందికే కనెక్షన్లు

సమస్యల పదనిసలతో భారమవుతోన్న మూడు సేవలు

కర్నూలు

knl-top1a.jpg

డిజిటల్‌ భారతదేశం కలగా చేపట్టిన పథకం... ప్రజల జీవన నాణ్యత మెరుగుపర్చడానికి ఇదొక సాధనం. 2018 నాటికి ప్రతి ఇంటికి అంతర్జాలం లక్ష్యం. విద్య, ఆరోగ్యం, వ్యవసాయంలో సేవలకు సులభతరం.. ఇలా ‘ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌’ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ ఏడాది జూన్‌-2 నాటికి పూర్తిచేస్తామన్న గ్రిడ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ముచ్చటగా మూడు సేవలు అందుబాటులో ఉన్నా...ప్రజల్లోకి పథకం చేరలేదనేది అక్షర సత్యం. చైతన్యం కల్గించాల్సిన బాధ్యత పూర్తిగా మరిచారు అధికార యంత్రాంగం. మరోవైపు కొందరు ఆసక్తి చూపిస్తున్నా... కనెక్షన్‌ ఇవ్వడానికి ఆపరేటర్ల అదనపు వ్యయంతో జంకుతున్న దుస్థితి. పథక రచన ఇదీ...

రాష్ట్రవ్యాప్తంగా 22,500 కి.మీ. వైమానిక ఆప్టికల్‌ కేబుల్ని లక్ష్యంగా చేసుకుని ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ప్రారంభించారు. దీనికి విశాఖపట్నంలో ఒక నెట్‌వర్క్‌ ఆపరేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఓసీ)ని ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది జూన్‌ నాటికి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. తదనంతరం ట్రిపుల్‌ (మూడు) (కేబుల్‌, అంతర్జాలం, టెలిఫోన్‌) సేవలు దశల వారీగా బట్వాడా చేయాలన్నది లక్ష్యం. ప్రాజెక్టులో రూ.149కే మూడు సేవలు అందిస్తారు. దీనికి రెండు సెటప్‌ బాక్సులు వినియోగదారుడు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. వీటి ధర రూ.4,200 వినియోగదారుడు చెల్లించి ఈ బాక్సులు అమర్చుకోవాలి.

అమలుకు.. అగచాట్లు

జిల్లాలో సుమారు 6లక్షల కేబుల్‌ కనెక్షన్లు ఉన్నాయని

అంచనా. ఇప్పటికి జిల్లాలో ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్లు మూడువేలలోపే అందించినట్లు తెలుస్తోంది. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కోడుమూరు ఇలా 30 ప్రాంతాల్లోనే ఈ అరకొర ఇవ్వగల్గారు. జూన్‌ నాటికి పూర్తిగా గ్రామాల్లో ఏపీ గ్రిడ్‌ సేవలందించాలన్న లక్ష్యం అమలుకు ఆమడ దూరంలో ఉంది. దీనికి కారణాలు అనేకం.

తొలుత ఫోన్‌, ఇంటర్నెట్‌(అంతర్జాలం)కు ఒక సెట్‌టాప్‌బాక్సు, కేబుల్‌కు మరో సెట్‌టాప్‌ బాక్సు ఏర్పాటుచేసుకోవాలి. దీని ధర ప్రజలకు భారమైంది. దీంతో ప్రభుత్వం మరో ఆఫర్‌ని వినియోగదారుల ముందుంచింది. సెట్‌టాప్‌బాక్సులు తొలుత ఉచితంగా అందిస్తారు. దాని నగదును ప్రతినెలా చెల్లించే రూ.149తోపాటే అదనంగా రూ.99 చొప్పున 50 వాయిదాల్లో కట్టాలని సూచించింది. దీనికీ ఎలాంటి స్పందన రాలేదు. కొంత మంది ముందుకొస్తున్నా.. సెటప్‌బాక్సుల ధరతోపాటు వీటిని అమర్చడానికి లోకల్‌(స్థానిక) కేబుల్‌ ఆపరేటర్లకు రూ.1500-2000 చెల్లించాల్సి రావడంతో వెనకడుగు వేస్తున్నారు.

ఎక్కువ మంది ప్రజలకు కంప్యూటర్లు అందుబాటులో లేవు. దీంతో వారు మాకు అంతర్జాలం వద్దంటున్నారు. పైగా అందరికీ సెల్‌ఫోన్లు ఉండటంతో ల్యాండ్‌లైన్‌ అవసరం లేదని భావనే ఉంది.

మరోవైపు ఆపరేటర్లకు ఏ విధంగా, ఎంత మొత్తం చెల్లిస్తారో తేలలేదని, అందుకే వారు ఆసక్తి చేపడం లేదని తెలుస్తోంది.

ప్రచారం శూన్యం... : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంపై ప్రజల్లో ప్రచారం కరవైంది. జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నోడల్‌ అధికారులు సైతం చైతన్యం కల్గించే విషయాన్నే మరిచారు. పథకం విస్తరించేందుకు ఆసక్తి ఉన్న ఎంఎస్‌వో, ఎల్‌సీవోలను భాగస్వామ్యం చేశారు. అయితే వీరు తమ సొంత సర్వీసులు ఇవ్వడానికే మొగ్గుచూపుతున్నారు. కేబుల్‌ ఆపరేటర్లు ఎస్‌డీ, హెచ్‌డీ సెటప్‌బాక్సులను సరాసరిన రూ.2వేలు లోపే అందిస్తున్నారు. నెలకు రూ.150తో సుమారు 250 ఛానల్స్‌ ప్రసారాలు వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అందిస్తున్న రూ.149, ఇన్‌స్టాల్‌మెంట్‌ ఆఫర్‌ రూ.99 కలిపి రూ.248 ఖర్చు భారంగా భావిస్తుండటంతో ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఇచ్చిన అరకొర కనెక్షన్‌లలో సైతం గ్రామీణులు నెట్‌, ఫోన్‌ అసలు వినియోగించుకోవడంలేదు. ఇప్పటికైనా ఫైబర్‌ గ్రిడ్‌ త్వరతిగతిన పూర్తిచేయడంతోపాటు....ప్రజల్లో మున్ముందు కలిగే లాభాలను, ఉపయోగాలను వివరిస్తూ చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Link to comment
Share on other sites

జులైకల్లా లక్ష ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు

ప్రజలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు తగ్గట్టుగా ఏర్పాట్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జులై నెలాఖరులోపు లక్ష గృహాలకు ఫైబర్‌ నెట్‌ కెనక్షన్లు ఇవ్వాలని ఏపీ ఫైబర్‌ నెట్‌ నిర్ణయించింది. వచ్చే నెలాఖరు నుంచి ప్రజలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖాముఖి సంభాషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో సీఎం ఆలోచనలకు అనుగుణంగా లక్ష గృహాలకు ఫైబర్‌ నెట్‌ సేవలు కల్పించే దిశగా అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ‘ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌’ (ఓఎఫ్‌సీ) నెట్‌వర్కు ద్వారా కేబుల్‌ టీవీ ప్రసారాలు, అంతర్జాలం, వైఫై ప్రసారాలు, టెలిఫోన్‌ కనెక్షన్‌ సదుపాయాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ కార్యక్రమాలను ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ పర్యవేక్షిస్తోంది. వాస్తవానికి రాష్ట్ర మొత్తం మే నెలాఖరులోపే ఈ కనెక్షన్లు ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయించినా సాంకేతికపరమైన కారణాలతో అది ఆలస్యమవుతోంది. జులై నుంచి ఫైబర్‌నెట్‌ ద్వారా ప్రజలతో మాట్లాడడానికి ముఖ్యమంత్రి నిర్ణయించడంతో ఆ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ముందు లక్ష కనెక్షన్లను యుద్ధ ప్రాతిపదికపైన ఇవ్వాలని ఫైబర్‌ నెట్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఫైబర్‌గ్రిడ్‌తో పోలీస్ స్టేషన్లు అనుసంధానం
30-06-2017 02:18:41
 
  • ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు
 
అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఫైబర్‌గ్రిడ్‌తో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసుశాఖ ఆధునికీకరణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి కార్యనిర్వాహక కమిటీ సమావేశం సచివాలయంలో గురువారం జరిగింది. డీజీపీ సాంబశివరావు, హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ, ఆర్థికశాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రహదారి భద్రతపైనా చర్చించారు. జాతీయ రహదారులపై భద్రత కల్పించేందుకు వాహనాలను అందుబాటులో ఉంచాలని సీఎస్‌ ఆదేశించారు. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు ప్రతిపాదనలు అందించామని.. నిధులు మంజూరు చేయాలని డీజీపీ కోరారు. జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు అమర్చి ప్రమాదాలు, ఇతర సంఘటనలపై సకాలంలో స్పందించే ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. మరిన్ని సీసీ కెమెరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలన్నారు. పండుగలు, జాతరల సమయంలో డ్రోన్లు వినియోగించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామన్నారు.
Link to comment
Share on other sites

తీగ లేకుండానే నెట్‌, టీవీ, టెలిఫోన్‌
 
636348177863303005.jpg
  • 200 ఏజెన్సీ గ్రామాల్లో ఫైబర్‌ సేవలు!
  • నేడు భవానీ ద్వీపంలో ప్రయోగాత్మక పరిశీలన
 
అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఎటువంటి తీగలు లేకుండానే ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, టీవీ ప్రసారాలు ఊహించగలమా? అయితే ‘స్పేస్‌ ఆఫ్‌ ఆప్టిక్‌’ సాంకేతికతతో అది సాధ్యమేనని రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ చెబుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు అమెరికా పర్యటలో భాగంగా గూగుల్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గూగుల్‌ సంస్థ కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని ఓ ప్రయోగశాలకుగా చేసుకుని అధునాతన సాంకేతిక విధానాలకు రూపకల్పన చేయాలని కోరారు. దీనికి గూగుల్‌ సంస్థ సమ్మతించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌) గూగుల్‌ సంస్థతో సంప్రదింపులు జరిపి ఒప్పందాన్ని చేసుకుంది. రాష్ట్రంలో అతి చౌకగా రూ.149కే టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ , టెలివిజన్‌ ప్రసారాలు అందించేందుకు ఫైబర్‌ గ్రిడ్‌ సిద్ధమైంది. ఇందుకోసం విద్యుత్‌ స్తంభాలపై ఫైబర్‌ ఆప్టిక్‌ తీగలను వేస్తోంది. కానీ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ సౌకర్యం లేదు. దీంతో అక్కడకు ఫైబర్‌ గ్రిడ్‌ తీగలను వేయడం సాధ్యం కావడం లేదు. ఈ సమస్యను అధిగమిస్తూ రాష్ట్రంలోని 200 ఏజెన్సీ గ్రామాలకు తీగలు అవసరం లేకుండానే టీవీ, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవలను అందించేందుకు ‘స్పేస్‌ ఆఫ్‌ ఆప్టిక్‌’ సాంకేతికతను ఉపయోగించుకోబోతున్నారు. ఈ సాంకేతికతను అందించేందుకు గూగుల్‌ ముందుకొచ్చింది. దీని ద్వారా 20 కిలో మీటర్ల పరిధి వరకు తీగలు లేకుండానే ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, టెలివిజన్‌ ప్రసారాలు అందించవచ్చు. దీనిని బుధవారం విజయవాడ భవానీ ద్వీపంలో ప్రయోగాత్మకంగా గూగుల్‌ పరిశీలించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఏజెన్సీ గ్రామాలన్నింటిలోనూ ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు అందించాలని ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ నిర్ణయించింది.

:super:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...