Jump to content

subbarayudu


Recommended Posts

Career nasanam chesukunnadu. 2009 lo tdp lone undi unte manchi position lo undevadu. Malli ippudu same mistake chestunnadu. Okkasari ticket rakapote aagalera. Kap corporation chairman kuda icharuga. Kavalsina vallaki panulu chesipettukuni cadre kapadukune chance kuda undhi..

As some one said, too many jumping japangs. Janalaki kuda clarity ledhu evadu e party o ani. CBN vs Jagan matrame chustaru

Link to comment
Share on other sites

టీడీపీకి షాక్.. వైసీపీలోకి కీలకనేత
23-03-2019 22:31:52
 
636889771099079979.jpg
 
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ కీలకనేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కార్యకర్తలు, అనుచరులు, కుటుంబీకులతో నిశితంగా చర్చించిన ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేపు అనగా ఆదివారం నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో కొత్తపల్లి వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
 
 
కాగా.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన ఆయన.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం టికెట్‌ను కొత్తపల్లి ఆశించారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. నరసాపురం నుంచి 2004లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన కొత్తపల్లి.. 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమిచెందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకుని కార్పొరేషన్ పదవి దక్కించుకున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...