Jump to content
Sign in to follow this  
sonykongara

dwcra మహిళలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ

Recommended Posts

డ్వాక్రా మహిళలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ 

 

ఫిబ్రవరి మొదటి వారంలో చెల్లించనున్న ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డ్వాక్రా మహిళలకు బ్యాంక్‌ లింకేజీ రుణాల వడ్డీ మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2016 ఆగస్టు నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన రూ.2200 కోట్ల మొత్తాన్ని ఫిబ్రవరి మొదటివారంలో అందజేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 94 లక్షల మంది స్వయం సహాయ సంఘ మహిళలు గ్రామీణ, పట్టణ పరిధిలో ఉన్నారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలను మంజూరు చేయిస్తోంది. అయితే నెల వారీగా కంతుల చెల్లింపులో భాగంగా మహిళలు అసలుతోపాటు తీసుకున్న మొత్తంపై వడ్డీ కూడా బ్యాంకులకు చెల్లిస్తారు. సభ్యులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం నెల వారీగా డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా ప్రతి నెలా రూ. 75 కోట్ల వరకు చెల్లించాల్సిన ప్రభుత్వం విడతల వారీగా చెల్లింపులు చేస్తోంది. తెదేపా అధికారం చేపట్టిన నాటి నుంచి 2016 జులై వరకు వడ్డీ రాయితీ కింద రూ.2,514 కోట్లు మేర చెల్లించింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా 2016 ఆగస్టు నుంచి చెల్లింపులు జరగలేదు. అప్పటినుంచి చెల్లించాల్సిన మొత్తం రూ.2200 కోట్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Edited by sonykongara

Share this post


Link to post
Share on other sites
2 hours ago, sonykongara said:

డ్వాక్రా మహిళలకు ఒక స్మార్ట్ ఫోన్ ప్రకటించిన ముఖ్యమంత్రి

Jio sim కూడా ఇస్తే poddi ga.. 

Share this post


Link to post
Share on other sites
డ్వాక్రా చెల్లెమ్మలకు.. 10వేలు, స్మార్ట్‌ ఫోన్‌ 

 

26న ఆ సంఘాల   మహిళలతో బహిరంగసభ 
అప్పుడే విధివిధానాల ప్రకటన 
ముఖ్యమంత్రి నిర్ణయం 
ఈనాడు - అమరావతి

19ap-main3a_4.jpg

స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా గ్రూపుల) మహిళలు ఒక్కొక్కరికీ పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వీరికి స్మార్ట్‌ ఫోన్‌ కూడా అందించనున్నారు. రూ.10వేల ఆర్థిక సాయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈనెల 26న స్వయం సహాయక సంఘాల మహిళలతో బహిరంగ సభ ఏర్పాటుచేసి అందులోనే ఈ నిర్ణయాల్ని ప్రకటించాలని సీఎం సూత్రప్రాయంగా నిర్ణయించారు. మొదటి నుంచీ తెలుగుదేశం హయాంలో మహిళా సంఘాలకు అమిత ప్రాధాన్యం లభిస్తోంది. 2014లో అధికారంలోకొచ్చాక సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ పేరుతో ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున అందించారు. ఒకేసారి కాకుండా నాలుగు విడతల్లో పంపిణీ చేశారు. సకాలంలో రుణం చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కింద నిధులు విడుదల చేస్తున్నా... 2016 ఆగస్టు నుంచి ఆ మొత్తం పెండింగ్‌లో ఉంది. ఈనెల వరకు ఇది రూ.2,300కోట్లకు చేరుకుంది. ఇది కూడా ఒకేసారి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కూడా 26వ తేదీన నిర్వహించే బహిరంగ సభలోనే వెల్లడించనున్నారు.

తాజాగా ఒక్కొక్కరికీ అందించే  రూ.10వేలు... రెండు విడతల్లో ఇవ్వాలా, మూడు విడతల్లోనా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఆర్థిక వనరుల లభ్యతనుబట్టి ఇది ఆధారపడుతుంది. కనీసం రెండు విడతలు, గరిష్ఠంగా మూడు విడతల్లో పంపిణీ చేసే అవకాశం  కనిపిస్తోంది. రెట్టింపు చేసిన పింఛన్ల మొత్తంతోపాటు మహిళా సంఘాలకు తొలివిడత    మొత్తాన్ని కూడా ఫిబ్రవరిలోనే అందించనున్నారు.

స్మార్ట్‌ ఫోన్‌తో సమాచార విప్లవం 
సమాచార మార్పిడికి, విషయ సేకరణకు స్మార్ట్‌ ఫోన్‌ అత్యున్నత సాధనంగా మారిన నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ స్మార్ట్‌ ఫోన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనప్రాయంగా వివిధ వేదికలపై వెల్లడించారు. ఎలా ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో కూడా ఇప్పుడు స్పష్టత వస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలుకి టెండర్లు పిలిచినట్లు సమాచారం. రెండు సంస్థలతో ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయి. సెల్‌ఫోన్‌ ఇవ్వడంతోపాటు మూడేళ్లపాటు దాన్ని రీఛార్జ్‌ కూడా చేయించాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై కూడా 26వ తేదీ సమావేశం నాటికి స్పష్టత రానుంది.

19ap-main3b_1.jpg

 

Share this post


Link to post
Share on other sites
డ్వాక్రాకు భారీ నజరానా
20-01-2019 02:45:04
 
  • ఆడపడుచులకు రూ.9 వేల కోట్ల వరం
  • పసుపు కుంకుమ కింద మరో పది వేలు
  • 93 లక్షల మంది మహిళలకు తక్షణ లబ్ధి
  • కీలక నిర్ణయం తీసుకొన్న రాష్ట్ర సర్కార్‌
  • 1,2, 3 తేదీల్లో చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు రూ.9 వేల కోట్ల భారీ నజరానా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఘాలకు మరింత ఆర్థిక పరిపుష్టి చేకూర్చి వాటిని బలోపేతం చేసే నిమిత్తం ఈ సాయం ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10 వేలు వంతున పసుపు కుంకుమ పథకం కింద ఈ సాయం అందనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం 93 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 9లక్షల పైచిలుకు సంఘాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7.25లక్షల సంఘాలు, పట్టణ ప్రాంతాల్లో 2లక్షల సంఘాలు ఉన్నాయి.
 
 
వీటన్నింటిలో సభ్యులకు ఈ సాయం ఇస్తారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘పసుపు కుంకుమ’ కింద చెక్కులను ఆడపడుచులకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పసుపు కుంకుమ కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలకు ఇంతకుముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం తలకు రూ.10 వేలు ఇచ్చింది. ఆ మొత్తాన్ని మూడు విడతలు చేసి ఏడాదికి ఒక విడత చొప్పున ఇచ్చారు. ఆ రకంగా ఇంతకు ముందు రూ.11వేల కోట్లు చెల్లించారు. ఇప్పుడు అదే మొత్తాన్ని రెండు నెలల వ్యవధిలోనే ఇవ్వనున్నారు. ఈ మొత్తం రూ.9వేల కోట్ల పై చిలుకు ఉంటోంది. అంటే నాలుగేళ్ల వ్యవధిలో డ్వాక్రా సంఘాలకు రూ.20వేల కోట్ల సాయం అందుతుందన్నమాట! ఈ స్థాయిలో మహిళా సంఘాలకు సాయం అందించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
 
 
వందల్లోంచి వేలల్లోకి...
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉండగా ఈ సంఘాలకు రూ.250 కోట్లు సాయం ఇచ్చారు. ఇప్పుడు ఈ సాయం మొత్తాన్ని ఏకంగా 20 వేల కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే డ్వాక్రా సంఘాలు బలోపేతం అయ్యాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సాయం వాటిని మరింత బలపడేలా చేస్తుందని అంటున్నారు. తొలి విడత పసుపు కుంకుమ సాయం నిద్రాణంగా ఉన్న చాలా సంఘాలను క్రియాశీలం చేసింది. ఆ డబ్బును ఆసరాగా చేసుకొని అనేక సంఘాలు మళ్లీ రుణాలు తీసుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాయు. ఈ సంఘాల నుంచి చెల్లింపులు కూడా పక్కాగా ఉండటంతో బ్యాంకులు కూడా తేలిగ్గానే రుణ సహాయం చేస్తున్నాయి. రెండో విడత సాయం ఈ సంఘాల సభ్యుల్లో టీడీపీ ప్రభుత్వంపై సానుకూలతను బాగా పెంచుతుందని, రానున్న ఎన్నికల్లో దీని ఫలితం కనిపిస్తుందని ప్రభుత్వ పక్షం ఆశిస్తోంది.
 
 
మూడు విడతలుగా..
మూడు విడతలుగా చెల్లింపులు జరిగేలా చెక్కులు అందిస్తారు. ఒక చెక్కుకు సంబంధించిన డబ్బు ఇప్పుడు వెంటనే అందుతుంది. మిగిలిన రెండు విడతల చెక్కులపై ముందుగానే తేదీలు ముద్రించి ఉంటాయి. రెండు నెలల్లో అంటే మార్చి నెలాఖరులోపు ఈ డబ్బు పూర్తిగా డ్వాక్రా మహిళలకు అందుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రెండు సార్లు బ్యాంకుల అధికారులతో ఈ అంశంపై చర్చించారు.
 
 
ఆ స్వేచ్ఛ సంఘాలకే..
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ డబ్బును ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛను ఆయా సంఘాలకే వదిలేయనున్నారు. దీనిని సీడ్‌ మనీగా పెట్టుకొని దానికి ఐదింతల వరకూ కొత్త రుణాలు తీసుకొనే అవకాశం కూడా ఆయా సంఘాలకు ఉంది. అలా తీసుకోవాలా లేక సభ్యుల మధ్య ఎవరి డబ్బు వారికి పంపిణీ చేసుకోవాలా అన్నది ఎక్కడికక్కడ సంఘాలే నిర్ణయించుకొంటాయి.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×