Jump to content

కోస్తాంధ్రపై ‘పెథాయ్’ తుపాన్ పంజా..


sonykongara

Recommended Posts

కోస్తాంధ్రపై ‘పెథాయ్’ తుపాన్ పంజా..
14-12-2018 22:18:02
 
636804227636665145.jpg
విశాఖ: కోస్తా ఆంధ్రపై పంజా విసిరేందుకు ‘పెథాయ్’ తుపాన్ రెడీ అవుతోందని వాతావారణ శాఖ అధికారి మూర్తి తెలిపారు. అయితే రాబోయే 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొదని మూర్తి హెచ్చరించారు.
 
 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం ప్రసుత్తం ఉత్తర వాయువ్యంగా ప్రమాణిస్తోందన్నారు. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1090 కిలోమీటర్ల దూరంలో.. ప్రసుత్తం ఆగ్నేయ బంగాళఖాతంలో కేంద్రీకృతం అయి ఉందని చెప్పారు. 17న సాయంత్రం ఒంగోలు- కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు.. రానున్న 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారి మూర్తి చెప్పారు. 
Link to comment
Share on other sites

  • Replies 118
  • Created
  • Last Reply
తుఫాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం
15-12-2018 15:27:44
 
636804844621652567.jpg
అమరావతి: తీవ్ర వాయుగుండంగా పెథాయ్‌ తుఫాన్‌ మరిందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీహ‌రికోట‌కు 720 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 17న రాత్రి తూర్పుగోదావ‌రి- విశాఖ‌ మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉందని వెల్లడించింది. గంట‌కు 16 కిలోమీట‌ర్ల వేగంతో పెథాయ్‌ తుఫాన్‌ క‌దులుతుందని తెలిపింది. తుఫాన్‌ గమనాన్ని ఆర్టీజీఎస్‌ అనుక్షణం గ‌మ‌నిస్తుంది. దీంతో ఆర్టీజీఎస్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు నిరంత‌రం హెచ్చరికలు జారీ
అవుతున్నట్లు తెలిపింది.
Link to comment
Share on other sites

సోమ, మంగళవారం పాఠశాలలకు సెలవు: కలెక్టర్
15-12-2018 16:47:36
 
తూర్పుగోదావరి: తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశామని కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో 110 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకుంటాం. ప్రత్యేక అధికారులుగా నలుగురు ఐఏఎస్‌లు. ప్రజలకు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాం. సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా సెల్ టవర్స్ వద్ద జనరేటర్లు ఏర్పాటు చేశాం. 10 వేల విద్యుత్ స్తంభాలు సిద్ధంగా ఉన్నాయి. సోమ, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించాం’’మని కలెక్టర్ వివరించారు.
Link to comment
Share on other sites

ఏపీలో పలుచోట్లు ఎగిసిపడుతున్న అలలు
15-12-2018 17:03:45
 
636804905813669176.jpg
పశ్చిమగోదావరి: జిల్లాలోని పేరుపాలెం బీచ్ వద్ద 30 అడుగులు సముద్రం ముందుకొచ్చింది. దీంతో బీచ్‌లోకి సందర్శకులను అధికారులు అనుమతించడం లేదు. అలాగే నెల్లూరు జిల్లాలోని సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగింది. మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల 50 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది.
Link to comment
Share on other sites

పడగెత్తిన పెథాయ్‌
నేడు తీవ్ర తుపానుగా మార్పు
5 జిల్లాలకు హెచ్చరికలు
రేపు మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం తాకొచ్చని అంచనాలు
గంటకు 90 కి.మీ.నుంచి 110 కి.మీ. వేగంతో వీయనున్న గాలులు
భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం
అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
సహాయ, పునరావాస ఏర్పాట్లపై దృష్టి
అధికారులతో చంద్రబాబు సమీక్ష
ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాల మోహరింపు
25 డ్రోన్లతో బృందాల ఏర్పాటు
1100 పరిష్కార వేదికకు రైతుల ఫోన్లు
15ap-main1a.jpg
తిత్లీ తుపాను కలిగించిన నష్ట ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే రాష్ట్రంపై పెథాయ్‌ పేరిట మరో తుపాను పడగ విప్పి బుసలుకొడుతోంది. తీరప్రాంత జిల్లాల్లోని ప్రజలను ముఖ్యంగా రైతులను అత్యంత కలవరపరుస్తోంది. ఆరుగాలం కష్టించిన ఖరీఫ్‌ పంట చేతికందే సమయంలో విరుచుకుపడుతున్న తుపానుతో కలిగే నష్టాన్ని ఊహిస్తుంటే కర్షకుల గుండెల్లోంచి ఆవేదన తన్నుకొస్తోంది. పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే తపన పొంగుకొస్తోంది. ‘పెథాయ్‌’ బారి నుంచి పంటలను రక్షించేందుకు ప్రభుత్వమూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. అవసరమైన సహాయపునరావాస చర్యలు చేపట్టేందుకు సర్వసన్నద్ధతను  ప్రకటించింది. నష్టతీవ్రతను తగ్గించి, బాధితులను ఆదుకునేందుకు సహాయబృందాలను అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఈనాడు - విశాఖపట్నం, ఈనాడు- అమరావతి

బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తీవ్ర వాయుగుండం శనివారం తుపానుగా బలపడిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది మరింత బలోపేతమై 17వ తేదీ మధ్యాహ్నం ప్రాంతంలో మచిలీపట్నం - కాకినాడ మధ్య తీరం దాటొచ్చని, అనంతరం భూమార్గంలో విశాఖ జిల్లా వైపుగా పయనించొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీవ్రత తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాలపై ఉంటుందని హెచ్చరించారు. అధికారులు శనివారం రాత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ తుపాను ట్రికోమలీ (శ్రీలంక)కి 440 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం తీవ్ర తుపానుగా బలపడుతుంది. సోమవారం కూడా అదే తీవ్రతతో కొనసాగి మధ్యాహ్నం ఉత్తరవాయవ్య దిశగా ప్రయాణించి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం తాకొచ్చు. అదే తీవ్రతతో విశాఖవైపుగా దిశ మార్చుకునే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గంటకి 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. అమెరికాకు చెందిన జేటీడబ్ల్యుసీ సంస్థ మాత్రం.. కాకినాడ - విశాఖ జిల్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది.

20సెం.మీ పైనే వర్షాలు
తీవ్ర తుపాను ప్రభావం 5 జిల్లాలపై ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ప్రత్యేకించి తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో నష్టతీవ్రత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. విద్యుత్తు, సమాచార సంబంధాలు, పూరిల్లు, రోడ్లు దెబ్బతినే అవకాశాలుంటాయని, పంటలకు తీవ్రనష్టం వాటిల్లవచ్చని పేర్కొన్నారు. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. సోమవారం కొన్నిచోట్ల అతితీవ్రతతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటాయని తెలిపారు. కోస్తాంధ్ర తీరంలో తుపాను ఉప్పెన ప్రభావం 0.5 మీటర్ల నుంచి ఒక మీటరు ఎత్తు వరకు ఉంటుందని తెలిపారు. కాకినాడ సమీపంలో ఉన్న యానాం ప్రాంతానికి అధికారులు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. అంటే ముప్పు తప్పదని, అప్రమత్తంగా ఉండాలన్నది దాని అర్ధం. తమిళనాడు, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌ ప్రాంతాలపైనా ప్రభావం ఉంటుందని వివరించారు.

నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం
పెథాయ్‌ తుపాను సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ, పునరావాస చర్యలపై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు, వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. తిత్లీ అనుభవాల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్‌ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం నష్టనివారణ చర్యలపై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

15ap-main1b.jpg

పునరావాస కేంద్రాల ఏర్పాటు
జిల్లాల కలెక్టర్లు సహాయ పునరావాస చర్యలపై దృష్టి పెట్టారు. మండలాల వారీగా తహసీల్దార్లను అప్రమత్తం చేయడంతోపాటు ప్రత్యేక అధికారులను నియమించారు. తూర్పుగోదావరి జిల్లాలో 8 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ, అమలాపురం, కోనంగిలో కంట్రోల్‌రూమ్‌లు తెరిచారు. ఇక్కడ 9.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. 4.74 లక్షల టన్నులే ఇప్పటి వరకు సేకరించారు. మిగిలిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు.

* పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు మండలాలకు నిత్యావసరాల సరఫరా పూర్తి చేశారు. మరో ఆరు మండలాలకు ఆదివారం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

* విశాఖపట్నంలోని 5 మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

* కృష్ణా జిల్లాలోని 9 మండలాల్లో 181 గ్రామాలపై ప్రభావం పడొచ్చని అంచనా వేశారు. గుంటూరు జిల్లాలో అలల ఉద్థృతి పెరగడంతో సూర్యలంక బీచ్‌కు రాకపోకలు నిలిపేశారు.

* తూర్పుగోదావరి జిల్లాలోని 8 మండలాల్లోని పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. తుపాను 17వ తేదీ మధ్యాహ్నం ఓడలరేవు-ఆదుర్రు మధ్య తీరం దాటే అవకాశం ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ శనివారం రాత్రి తెలిపారు.

5.7 మీటర్ల ఎత్తులో అలలు
తుపాను నేపథ్యంలో సముద్రతీరంలో అలలు 3 మీటర్ల నుంచి 5.7 మీటర్ల వరకు ఎగసిపడతాయని ఇన్‌కాయిస్‌ స్పష్టం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

జిల్లాకు 170 మంది
గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు కేంద్ర, రాష్ట్ర విపత్తు సహాయ బృందాల(ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌)ను తరలించారు. ఒక్కో జిల్లాలో 140 మంది నుంచి 170 మంది వరకు ఉంటారు. తుపాను తీరం దాటే సమయంలో సహాయ చర్యలు అందించేందుకు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అగ్నిమాపక బృందాలను సిద్ధం చేశారు. పడిపోయిన చెట్లను తొలగించేందుకు, పడవల ద్వారా రక్షణ చర్యలు చేపట్టడానికి వీలుగా ప్రత్యేక బృందాలను నియమించారు. వీరికి లైఫ్‌ జాకెట్లు, పోర్టబుల్‌ పంప్‌సెట్లు, లైట్లు, కోత యంత్రాలు అందుబాటులో ఉంచారు.

వాహనాల రాకపోకలు ఆపేయండి
తుపాను నేపథ్యంలో 25 డ్రోన్లతో ఆర్టీజీఎస్‌ ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి. రహదారులపై పడిపోయిన చెట్లు, కూలిపోయిన విద్యుత్తు స్తంభాలను గుర్తించేందుకు వీటిని వినియోగించనున్నారు. తుపాను తీరం దాటే సమయంలో, భారీ వర్షాలు కురిసే సమయంలో రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ఆర్టీజీఎస్‌ సంబంధిత శాఖలకు సూచించింది. జనరేటర్లను అందుబాటులో ఉంచాలని, తాగునీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు నిర్దేశించింది. సముద్రంలో వేటకు వెళ్లిన 88 పడవలు సురక్షిత ప్రాంతాలకు చేరినట్లు ఆర్టీజీఎస్‌ వర్గాలు తెలిపాయి. తూర్పుగోదావరిలో 9, ప్రకాశంలో 4 పడవలు ఇంకా చేరుకోవాల్సి ఉన్నట్లు వెల్లడించింది.

15ap-main1c.jpg

70 వేల విద్యుత్తు స్తంభాలు అవసరం?
అధిక వేగంతో వీచే గాలుల కారణంగా విద్యుత్తు సరఫరా వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో 50 వేల నుంచి 70 వేల వరకు విద్యుత్తు స్తంభాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. నష్టాన్ని తగ్గించడంతోపాటు త్వరగా విద్యుత్తు పునరుద్ధరించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 33, 11 కేవీ లైన్ల పర్యవేక్షణకు ఈఈ, డీఈ స్థాయి అధికారులను నియమించాలన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి వెంటనే స్తంభాల తరలింపునకు ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

పెథాయ్‌ అంటే
తుపానుకు పెథాయ్‌ అనే పేరును థాయ్‌లాండ్‌ సూచించింది. ఆ దేశంలో గింజ (మన చిక్కుడు గింజలా) పేరిది

సమన్వయం కోసం ఆర్టీజీలో సిబ్బంది
వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమన్వయం కోసం ఆర్టీజీలో ఎంఎస్‌ఈలను నియమించినట్లు ప్రభుత్వం వివరించింది. వీరంతా కోస్తా జిల్లాల్లోని అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ.. రైతులు, జాలర్లు, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూస్తారని పేర్కొంది. సహాయ కోసం ఎవరైనా 1100 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించింది. పలువురు రైతులు 1100 పరిష్కార వేదికకు ఫోన్‌ చేసి వరికోత యంత్రాలు కావాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లాల అధికారులకు చేరవేస్తున్నారు. ధాన్యం కాపాడుకోవడానికి అవసరమైన టార్పాలిన్ల కోసం కూడా రైతుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.
 
Link to comment
Share on other sites

15 minutes ago, Naren_EGDT said:

Any update on this no heavy winds reported n it's raining there and freezing temperatures

Winds will pickup from tomorrow but not heavy

 

se4_b13_1420.jpg

 

The cloud band [western disturbance] over Gujarat is the the saviour for us, it it drifts further south it will stop the movement of cyclone towards ap coast and drive it to north/northeasty direction

Link to comment
Share on other sites

పెథాయ్ తుఫాన్‌‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు పూర్తి: లోకేశ్
16-12-2018 23:20:03
 
636805992710633760.jpg
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పెథాయ్ తుపాను ఉగ్రరూపం దాల్చి తీరం దాటే సమయంలో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలను రంగంలోకి దింపింది. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెం. 1100ను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే కాకినాడలో పెథాయ్ తుపాను ప్రభావంతో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. ఈ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నది ట్విట్టర్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
 
 
మొదటి ట్వీట్..
"పెథాయ్ తుఫాను గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నాం. గ్రామీణ నీటిసరఫరా, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల‌లో ఎటువంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించడం జరిగింది.
 
 
రెండో ట్వీట్..
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ లేక‌పోయినా మంచినీటి ప‌థ‌కాలు నిర్వ‌హించేందుకు ఇప్పటికే 816 జ‌న‌రేట‌ర్లు, 622 ట్యాంక‌ర్లను సిద్ధం చేశాం. పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను పున‌రావాస కేంద్రాలుగా ఉప‌యోగించుకునేందుకు వీలుగా సిద్ధం చేయమని అధికారులకు సూచించాను.
 
 
మూడో ట్వీట్..
వంద కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశం ఉన్నందున చెట్లు కూలిపోయినా, ఎటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితి ఎదురైనా ప్ర‌జ‌ల‌కు అన్నివిధాలుగా సాయం చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది" అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:
పెథాయ్ తుఫాన్‌‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు పూర్తి: లోకేశ్
16-12-2018 23:20:03
 
636805992710633760.jpg
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పెథాయ్ తుపాను ఉగ్రరూపం దాల్చి తీరం దాటే సమయంలో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలను రంగంలోకి దింపింది. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెం. 1100ను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే కాకినాడలో పెథాయ్ తుపాను ప్రభావంతో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. ఈ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నది ట్విట్టర్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
 
 
మొదటి ట్వీట్..
"పెథాయ్ తుఫాను గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నాం. గ్రామీణ నీటిసరఫరా, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల‌లో ఎటువంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించడం జరిగింది.
 
 
రెండో ట్వీట్..
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ లేక‌పోయినా మంచినీటి ప‌థ‌కాలు నిర్వ‌హించేందుకు ఇప్పటికే 816 జ‌న‌రేట‌ర్లు, 622 ట్యాంక‌ర్లను సిద్ధం చేశాం. పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను పున‌రావాస కేంద్రాలుగా ఉప‌యోగించుకునేందుకు వీలుగా సిద్ధం చేయమని అధికారులకు సూచించాను.
 
 
మూడో ట్వీట్..
వంద కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశం ఉన్నందున చెట్లు కూలిపోయినా, ఎటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితి ఎదురైనా ప్ర‌జ‌ల‌కు అన్నివిధాలుగా సాయం చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది" అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

H abt cattle care, farmer ki main loss avuddi incase of tree falling

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...