Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 308
  • Created
  • Last Reply
On 8/9/2018 at 9:50 PM, Yaswanth526 said:

Phase 1 likely to complete by january antunnaru

Total enni phases? Motham eppudu complete avvochu?

2 flyovers (one in each direction) kattali. Oka direction (Kolkata-->Chennai) lo flyover ye start chesaru. 2nd flyover asalu start ye avvaledhu

Link to comment
Share on other sites

Guest Urban Legend
16 minutes ago, Dravidict said:

2 flyovers (one in each direction) kattali. Oka direction (Kolkata-->Chennai) lo flyover ye start chesaru. 2nd flyover asalu start ye avvaledhu

tenders pilavaledhemo ?

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 hour ago, Yaswanth526 said:

November kadhu January present target so easy ga march april avvudhi

Aithey ayyindhi 

E flyover varaku chaala speed ga ayyayi works start chesina tarvatha 

Dilip buildcon track record chudu

 

Link to comment
Share on other sites

డెడ్‌లైన్ మూడు నెలలే!
28-08-2018 10:44:20
 
636710498612137233.jpg
  • బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ 65 శాతం పూర్తి
  • విజయవాడ - మచిలీపట్నం రోడ్డు 80 శాతం పూర్తి
  • క్షేత్రస్థాయిలో పనుల్లో పురోగతి
పూర్తి చేస్తామంటున్న ఎన్‌హెచ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు
 
బెజవాడ నగరానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఒకటైన బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌, విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తి కావటానికి కేవలం ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. క్షేత్ర స్థాయిలో పనులు చూస్తుంటే ఈ మూడు నెలల్లో పూర్తి కాగలవా అన్న సందేహం నెలకొంటున్నా.. డెడ్‌లైన లోపే పూర్తికాగలవని ఎనహెచ అధికారులతో పాటు, కాంట్రాక్టు సంస్థకు చెందిన ప్రతినిధులు ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు.. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనుల తీరును ఆంధ్రజ్యోతి పరిశీలించింది. పురోగతిలో ఉన్న పనుల వివరాలపై ప్రత్యేక కథనం...
 
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి నాలుగు వరసల విస్తరణతో పాటు, బెంజిసర్కిల్‌ మీదుగా నిర్మించే ఫ్లైఓవర్‌ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో అంతర్భాగం. దిలీప్‌ బిల్డ్‌కాన సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ ప్రాజెక్టును నవంబర్‌, 2018 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. రెండేళ్ల కాల పరిమితిగా నిర్దేశించటం జరిగింది. ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడానికి అపాయింట్‌మెంట్‌ డేట్‌ తీసుకున్న వెంటనే కొన్ని ఇబ్బందులు రావటంతో మూడు, నాలుగు నెలల ఆలస్యంగా పనులు పూర్తయినా.. తర్వాత ఈ సమయాన్ని కాంట్రాక్టు సంస్థ వేగవంతమైన పనుల ద్వారా సద్వినియోగం చేసుకుంది. భూ సేకరణతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.740 కోట్లు. ఇందులో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ విలువ రూ.80 కోట్లు. అర్థ సంవత్సరం కిందటి వరకు క్షేత్ర స్థాయిలో పురోగతిగా నిలిచిన వీటి పనులు చూస్తే నిర్ణీత డెడ్‌లైనలోపు పనులు పూర్తి కావటం ఖాయమనుకున్నారు. ఇటీవల కాలంలో పనుల్లో జాప్యం జరుగుతుండటంతో నిర్ణీత సమయానికి పూర్తి కావేమోనన్న పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో పనులను ఆంధ్రజ్యోతి పరిశీలించింది. మూ డునెలల్లో పనులు పూర్తి చేయగలిగే పరిస్థి తులు కనిపి స్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులలో కూడా ఆ ధైర్యం కనిపిస్తోంది.
 
 
ఫ్లై ఓవర్‌ 65 శాతం పూర్తి
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనుల పురోగతి 65 శాతం మేర ఉంది. ముప్పేట సమాంతరంగా పనులు ప్రారంభించటం వల్ల త్వరగా పూర్తవుతాయని అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిథులు చెబుతున్నారు. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి క్షేత్ర స్థాయి పనులను పరిశీలిస్తే 49 పిల్లర్ల నిర్మా ణం చేపట్టవలసి ఉండగా.. ఇప్పటివరకు 35 పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇంకా 14 పిల్లర్ల నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఇటీవల బెంజిసర్కిల్‌ కూడలి దగ్గర 9, 10 పిల్లర్లకు సంబంధించి అండర్‌ గ్రౌండ్‌ పిల్లర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం బేస్‌మెంట్‌ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రధాన పిల్లర్లను లేపుతారు. ఇవి మినహా మిగిలిన 12 ప్రధాన పిల్లర్లలో 10 పిల్లర్ల వరకు పూర్తి స్థాయిలో భూగర్భ పని ముగిసింది. గడ్డర్ల నిర్మాణానికి సంబంధించి చూస్తే .. మొత్తం 240 గడ్డర్లను రూపొందించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 215 గడ్డర్లను తయారు చేశారు. ఇంకా 25 గడ్డర్లను తయారు చేయాల్సి ఉంది. వీటి పనులు కూడా క్యాస్టింగ్‌ డిపోలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు 130 గడ్డర్లను పిల్లర్లపై ఏర్పాటు చేశారు.
 
 
రూపొందించిన వాటిలో ఇంకా 85 పిల్లర్లను పైన లాంచ్ చేయాల్సి ఉంది. రోజుకు రెండు చొప్పున గడ్డర్లను లాంచ్ చేస్తున్నందున, ఈ విషయంలో ఇబ్బందులు లేవు. పిల్లర్లపై గడ్డర్లను లాంచ చేసినంతవరకు చూస్తే.. శ్లాబ్‌వర్క్‌ పనులను కూడా ప్రారంభించారు. మొత్తం ఆరుచోట్ల గడ్డర్లపై శ్లాబ్‌ వర్క్‌ పనులు చేపట్టారు. వీటిలో మూడు చోట్ల శ్లాబ్‌వర్క్‌ పూర్తయింది. గడ్డర్ల నిర్మాణం, శ్లాబ్‌ వర్క్‌ వేగంగా జరుగుతోంది. బ్యాలెన్స్ పిల్లర్ల నిర్మాణం, అప్రోచ పనులు ఎంతవేగంగా జరిగితే అంతత్వరగా ఫ్లై ఓవర్‌ను అందు బాటులోకి తీసుకు రావాల్సి ఉంటుంది. అప్రోచ్ పనులకు సంబంధించి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎస్‌వీఎస్‌ కల్యాణమండ పం దగ్గర అప్రోచ కోసం భూ సేకరణ జరపాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రక్రియే ప్రారంభం కాలేదు. రెండోవైపు రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన దిగువున అప్రోచ పనులు ప్రారంభించటానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ పనులు ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు.
 
 
రహదారి విస్తరణ 80 శాతం పూర్తి
విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు చాలా పురోగతిలో ఉన్నాయి. ఇంకా 20శాతం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నాలుగు లేన్ల విస్తరణ పనులు 95 శాతం మేర పూర్తయ్యాయి. సెంట్రల్‌ డివైడర్‌తో సహా అన్ని పనులు పూర్తి చేశారు. బ్యాలెన్స ఐదుశాతం పనుల్లో కూడా బైపాస్‌లకు అనుసంధానం, కల్వర్టుల దగ్గర అనుసంధానం మాత్రమే మిగిలి ఉంది. నాలుగు లైన్ల విస్తరణ పనులు దాదాపుగా రెండు నెలల కిందటే పురోగతిలో ఉన్నాయి. నాలుగు లేన్ల విస్తరణ పనులు పురోగతిలోనే ఉన్నా.. ప్రాజెక్టులో అతిముఖ్యమైన బైపాస్‌ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కంకిపాడు, వుయ్యూరు (మంటాడ), పామర్రు, సుల్తాన నగర్‌ల దగ్గర నాలుగు బైపాస్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 
కంకిపాడు బైపాస్‌ నిర్మాణం 78 శాతం పూర్తయింది. కోర్టు కేసుల వల్ల అనుసంధానం జాప్యం జరుగుతోంది. ఉయ్యూరు బైపాస్‌ చివరిదశకు చేరుకుంది. మంటాడ దగ్గర అనుసంధాన పనులు మిగిలి ఉన్నాయి. పామర్రు దగ్గర బైపాస్‌ నిర్మాణం నిదానంగా జరుగుతోంది. భూ సేకరణ ఇబ్బందులు ఉన్నాయి. సుల్తాననగర్‌ దగ్గర బైపాస్‌ నిర్మా ణ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. ప్రధానంగా కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు బైపాస్‌లే నిదానంగా నడుస్తున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తే మూడు నెలల్లోపే విజయవాడ - మచిలీపట్నం నాలుగు లేన్ల ప్రాజెక్టు పూర్తి చేయవచ్చు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
బెంజిసర్కిల్‌ పిల్లర్ల దూరం ఖరారు!
9-10 పిల్లర్ల మధ్య 42 మీటర్లు
మూడు జంక్షన్ల ఆకృతులు ఖరారు
నవంబరు నెలాఖరుకు నిర్మాణం
ఈనాడు, విజయవాడ
amr-top1a.jpg

విజయవాడ నగరం నడిబొడ్డున ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణంలో కీలక దశ దాటింది. బందరు రహదారి వెళ్లే బెంజిసర్కిల్‌ వద్ద పిల్లర్ల మధ్య దూరం ఖరారైంది. సాధారణ దూరం కన్నా.. అధికంగా ఉండేవిధంగా ఆకృతులను రూపకల్పన చేశారు. బెంజిసర్కిల్‌ కూడలిలో రెండు పిల్లర్ల మధ్య దూరం 42 మీటర్లుగా ఖరారు చేశారు. ఆ విధంగా స్పాన్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం మూడు కూడళ్ల వద్ద ఈ సమస్యను అధిగమించినట్లు జాతీయ రహదారుల సంస్థ పథక సంచాలకుడు విద్యాసాగర్‌ ‘ఈనాడు’తో చెప్పారు. ఈ పరిస్థితిలో బెంజి సర్కిల్‌ పైవంతెన పనులు రాత్రిబంవళ్లు చేస్తున్నారు.

* మొత్తం 1450 మీటర్ల దూరం పైవంతెనలో 49 పిల్లర్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గడ్డర్ల నిర్మాణం జరుగుతోంది.
* సాధారణ ఆకృతుల ప్రకారం పిల్లర్ల మధ్య నిడివి సుమారు 30 మీటర్లు ఉండాల్సి ఉంది. సాధారణ పిల్లర్ల నిర్మాణం ఆ విధంగా చేశారు. కానీ బెంజి సర్కిల్‌ జంక్షన్‌ వద్ద 30 మీటర్ల నిడివి సరిపోవడంలేదు. దీంతో దీని ఆకృతులు ఇక్కడ మార్చారు. 9, 10 పిల్లర్ల మద్య దూరం 42 మీటర్లు ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఇటీవల పునాదులు ప్రారంభం అయ్యాయి.
* రెండు పిల్లర్ల మధ్య దూరం 42 మీటర్లు ఉండటం వల్ల వాహనాలు తిరిగే అవకాశం ఉంది. ఎంజీ రోడ్డు నుంచి నేరుగా బందరు రహదారికి, చెన్నై నుంచి వచ్చే వాహనాలు బందరు రహదారికి మళ్లాల్సి ఉంటుంది. దీంతో రెండు పిల్లర్ల మధ్య దూరంపెంచారు. దీంతో స్పాన్ల దూరం కూడా పెరగనుంది.
* బెంజి సర్కిల్‌ తరహాలోనే నిర్మాలా కాన్వెంట్‌, రమేష్‌ ఆసుపత్రి వద్ద పిల్లర్ల మధ్య దూరం పెంచాల్సి ఉంది. సాధారణంగా ఎక్కడైనా పిల్లర్ల మధ్య సమాన దూరం ఉంటుంది. కానీ ఈ వంతెనకు మాత్రం మూడు ప్రాంతాల్లో వ్యత్యాసం ఉంది.
* మొత్తం 240 గడ్డర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే 100గడ్డర్లను ఏర్పాటు చేశారు. రాత్రిపూట ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కంకిపాడు సమీపంలో ఫ్యాబ్రికేటెడ్‌ పనులు చేస్తున్నారు. స్పాన్లు, గడ్డర్లను అక్కడ నిర్మాణం చేసి భారీ వాహనాలు, క్రేన్లతో వాటిని తరలించి నిర్మాణం చేస్తున్నారు.

రెండోదశపై వివరణ కోరిన కేంద్రం..!
బెంజి సర్కిల్‌ పైవంతెన రెండోదశ ప్రతిపాదనలు, అంచనాలపై కేంద్ర ప్రభుత్వం కొన్ని వివరణలు కోరినట్లు తెలిసింది. ఎన్‌హెచ్‌ఏఐ పంపిన ప్రతిపాదనలపై రిమార్కుల దస్త్రం తిప్పి పంపారు. దీనికి స్పష్టత ఇస్తూ మళ్లీ వివరణలతో దస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి అధికారులు పంపారు. అంచనా వ్యయం, ఆకృతులు తదితర అంశాలపై వివరణలు కోరినట్లు తెలిసింది. రెండు సార్లు సర్వే చేసి రూ.110 కోట్లు అంచనాలు వేశామని పీడీ విద్యాసాగర్‌ ‘ఈనాడు’తో చెప్పారు. త్వరలో అనుమతులు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం బెంజి సర్కిల్‌ పనులు 65శాతం పూర్తయ్యాయని నవంబరు నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. బందరు రహదారి విస్తరణ పనులు 85 శాతం పూర్తయ్యాయని వివరించారు. రహదారి పగుళ్లపై స్పందిస్తూ దానిపై మరో పొర వేయాల్సి ఉందని, ఒకవైపు వాహనాలు వెళ్లాల్సి ఉన్నందున ఆ విధంగా జరిగిందని వివరణ ఇచ్చారు.

Link to comment
Share on other sites

August 28 article lo ఇప్పటి వరకు 130 గడ్డర్లను పిల్లర్లపై ఏర్పాటు చేశారు.

Ee roju article lo ఇప్పటికే100గడ్డర్లను ఏర్పాటు చేశారు.

:thinking:

Link to comment
Share on other sites

17 hours ago, Dravidict said:

August 28 article lo ఇప్పటి వరకు 130 గడ్డర్లను పిల్లర్లపై ఏర్పాటు చేశారు.

Ee roju article lo ఇప్పటికే100గడ్డర్లను ఏర్పాటు చేశారు.

:thinking:

August 28, AndhraJyothy, latest di Eenadu. It is safe to go with Eenadu.

Link to comment
Share on other sites

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పొడిగింపు
30-09-2018 07:13:36
 
636738884153088423.jpg
  • ప్రతిపాదనలకు సీఎం సానుకూలం
  • తదుపరి చర్యలకు ఆదేశాలు
  • మొత్తం ఫ్లై ఓవర్‌ పొడవు 5 కిలోమీటర్లు
  • తాత్కాలిక అంచనా రూ.500- రూ.550 కోట్లు
  • సీఎంవో నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి ఫోన్‌
 
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను నిడ మానూరు వరకు పొడిగించటానికి అడుగు ముందుకు పడింది! పొడి గింపునకు సంబంధించి సవివర నివే దికను అందించాల్సిందిగా ముఖ్య మంత్రి చంద్రబాబు, జిల్లా యం త్రాంగాన్ని నిర్దేశించారు. ఎన్‌హెచ్‌ ఎంతవరకు భరించగలదో చూసి, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం భరిం చటానికి ముఖ్యమంత్రి సంసిద్ధతను వ్యక్తం చేశారు. సాయంత్రమే ము ఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ ప్రతిపాదనకు సంబంధించి జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు జరు పుతుండటంతో నూతన సంవత్సరం లోపే దీనికి కార్యరూపం కలిగే అవ కా శం కనిపిస్తోంది. సీఎం నివాసానికి వె ళ్ళిన కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంతో ము ఖ్యమంత్రి బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పొ డిగింపుపై తన సుముఖతను తెలి యచేశారు.
 
విజయవాడ: బెజవాడలో అంతర్గతంగా ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకుని బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను నిడమానూరు వరకు పొడిగించటం అవసరమని భావించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పొడిగింపునకు ప్రతిపాదిం చారు. విజయవాడ నగరంలో సీఎం చంద్ర బాబు ఆకస్మికంగా తనిఖీలు చేసిన సందర్భంలో ఎన్‌హెచ్‌ - 16 ను విస్తరించటా నికి సర్వే చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాం గం ఎన్‌హెచ్‌- 16 విస్తరణకు సంబంధించి సర్వే చేపట్టింది. భూ సేకరణ కంటే ఫ్లై ఓవర్‌ పొడిగించటం ద్వారానే ప్రభుత్వంపై భారం తక్కువుగా ఉంటుందని భావించిన జిల్లా యంత్రాంగం ఈ మేరకు ముఖ్యమంత్రి దృష్టికి ప్రతిపాదన తీసుకు వెళ్లారు. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. అమెరికా నుంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సీఎం నివాసానికి వెళ్లిన కలెక్టర్‌ దీనిపై ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించారు.
 
సీఎం దీనిపై సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లాలని మౌఖికంగా కలెక్టర్‌కు సూచించారు. జాతీయ రహదారుల సంస్థ ఎంత వరకు భరించగలదో చూసి, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం భరించటానికి తన సంసిద్ధతను కలెక్టర్‌కు ముఖ్యమంత్రి తెలిపినట్టు సమాచారం. వెంటనే దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను పంపవలసిందిగా సీఎం కోరినట్టు సమాచారం. బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ ఎస్‌వీఎస్‌ జంక్షన్‌దగ్గర ప్రారంభమై నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌దగ్గర 1.4 కిలోమీటర్ల దూరంలో ఎండ్‌ అవుతుంది. ఇక్కడి నుంచి నిడమానూరు వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఐదు కిలోమీటర్ల దూరానికి దాదాపుగా రూ. 500 కోట్ల మేర అంచనా వ్యయం అవుతుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ప్రస్తుత మొదటి వరుసను 1.4 కిలోమీటర్ల దూరానికి రూ. 75 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు.
 
రెండో వరుస నిర్మాణానికి సంబంధించి రూ. 110 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, ఈ ప్రాతిపదికన చూస్తే దాదాపుగా 5 కిలోమీటర్ల దూరానికి రూ. 500 నుంచి రూ. 550 కోట్ల వ్యయం అవుతుంది. జిల్లా యంత్రాంగం ప్రస్తుతం తాత్కాలిక అంచనాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. ప్రభుత్వం దీనిపై జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌), రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) లకు అంచనాలు తయారు చేసేందుకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
 
రెండుగానా .. ఒకటిగానా ?
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి రమేష్‌ హాస్పిటల్స్‌ నుంచి నిడమానూరు వరకు ఫ్లై ఓవర్‌ను ఈ విధంగా నిర్మిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ అధికారులు ఇచ్చే డిజైన్లు, అంచనాల ప్రకారం ఈ ఫ్లై ఓవర్‌ ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను రెండు భాగాలుగా సమాంతరంగా చెరో వైపున చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో మొదటి వరస పనులు పురోగతిలో ఉన్నాయి. రెండవ దానికి టెండర్‌ పిలవాల్సి ఉంది. ఈ దశలో రమేష్‌ హాస్పిటల్స్‌ నుంచి రెండు భాగాలుగా నిర్మిస్తారా? ఒకటిగానే నిర్మిస్తారా అన్న ఆసక్తి ఏర్పడింది.
 
రమేష్‌ హాస్పిటల్‌ దగ్గర వై డిజైన్‌ తీసుకుని సెంట్రల్‌ డివైడర్‌ మీదుగా ఆరు వరసల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి సంబంధించి డిజైన్‌ ఇస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రామవరప్పాడు ప్రాంతంలో రెండు భాగాలలో ఫ్లై ఓవర్‌ చేపట్టాలంటే ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రభుత్వంపై పరిహారం రూపంలో భారం పడే అవకాశాలు ఉండటంతో రమేష్‌ హాస్పిటల్స్‌ నుంచి సెంట్రల్‌ డివైడర్‌ మీదుగా ఒకటిగానే ఫ్లై ఓవర్‌ నిర్మించటం ద్వారా అదనపు భారం ఏమీ పడదన్న నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
14 hours ago, ravikia said:

Need some info; What is the current situation between Tadigadapa and Vuyyuru on the Bandar highway stretch. Is Kankipadu bypass finished?

As of Aug - almost done

just approach roads to bypass remaining

and one small one way stretch pending - the other way completed

we went thru that bypass -

but vuyyuru bypass is not completed on Mantada side

Link to comment
Share on other sites

బెంజిసర్కిల్‌ రెండో వరుసకు.. ముహూర్తం..!
30-10-2018 08:02:21
 
636764833421168310.jpg
  • ఫ్లై ఓవర్‌ టెండర్లపై కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ కేశినేని నాని
  • తక్షణం టెండర్లు పిలవాలని కేంద్రమంత్రి ఆదేశం
  • ఎన్‌హెచ్‌ టెక్నికల్‌ మెంబర్‌ ఆర్‌కే పాండేకు బాధ్యతలు
  • రూ.110కోట్ల వ్యయంతో అంచనాలు
విజయవాడ(ఆంధ్రజ్యోతి): బెంజిసర్కిల్‌ రెండోవరుస ఫ్లైఓవర్‌ పనుల టెండర్లుకు రంగం సిద్ధమౌతోంది. తక్షణం టెండర్లు పిల వాలని జాతీయ రహదారుల సంస్థ టెక్నికల్‌ మెంబర్‌ ఆర్‌కే పాండేను, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మం త్రి నితిన్‌ గడ్కరీ ఆదేశించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించటానికి దోహదపడే బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి తూర్పు వైపు ఒక వరుస ప నులు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నా యి. పశ్చిమం వైపు రెండో వరుస పనులకు సంబంధించి ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. ఈ నేపథ్యంలో, విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి సమస్య వివరించారు. పదహారో నెంబర్‌ జాతీయ రహదారిపై అత్యంత రద్దీ కూడళ్లు అయిన బెంజిసర్కిల్‌, నిర్మల స్కూల్‌, రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్ల వద్ద ట్రాఫి క్‌ సమస్య నియంత్రణకు తక్షణం రెండో వరుస ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు కూడా పూర్తిచేయాల్సి ఉందని విన్నవించారు. ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌) విజయవాడ అధికారులు సంవత్సరం క్రితమే రూ.110 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపారు.
 
అప్పటినుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలిచే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత ఫ్లైఓవర్‌ నవంబర్‌ నాటికి పూర్తి కావాల్సి ఉంది. అనుకోని కారణాలతో మూడునెలల జాప్యమౌతోం ది. ఇప్పటికే 68నుంచి 70శాతం మేర మొదటి వరుస పనులు పూర్తయ్యా యి. భూ సేకరణకు సంబంధించి కూ డా త్వరగా ముగించటానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో దీనిని ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరిలో ప్రారంభోత్సవంతో పాటు రెండో వరుస ఫ్లై ఓవర్‌కు కూడా ఈలోపే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం భావిస్తోంది.
 
నిధుల భారం కాకముందే...
dfasdfadfg.jpgబెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌కు సంబంధించి సకాలంలో టెండర్లు పిలవకపోవటం వల్ల భారమౌతోంది. మొదటివరుసలో పిలిచిన బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను రూ.85 కోట్ల వ్యయంతో చేపడుతుంటే.. రెండో వరుసలో చేపట్టే బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు మాత్రం రూ.110 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దాదాపుగా రూ.25 కోట్ల భారం అదనంగా ఇప్పటికే పడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మరింత భారం కాకముందే పనులకు నిధులు విడుదల చేయాలని ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. నిధులను తక్షణం విడుదల చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. టెండర్లు పిలిస్తే ఈ ప్రభుత్వ హయాంలోనే భూమిపూజతో పాటు, పనులు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంటుంది.
 
 
 

Adv

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...