Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

  • Replies 443
  • Created
  • Last Reply

 

ఎన్టీఆర్ కలను చంద్రబాబు ఇలా సాకారం చేశాడు చూడండి !

కరువు సీమపైకి కురిసేమేఘం వచ్చి ఆగినట్టు… ఎన్నాళ్ల నుంచో ఎదురుచూపుల దగ్గరే ఆగిపోయిన బంధం… పెళ్లి పీటల వరకూ వెళ్లినట్టు… ఆశలు విత్తులు మొలకెత్తుతున్నట్టు… పట్టలేనన్ని సంతోషాలు ఒక్కసారిగా నెత్తికెత్తినట్టు అనంతలో హంద్రీనీవా రెండో విడత మొదలైంది. ఎప్పుడూ హంద్రీ-నీవా నీవా అనడమే తప్ప అదేంటో… ఎందుకో ఎలాంటి ప్రాజెక్టో ఎంతటిప్రయత్నమో మనలో చాలామందికి తెలియదు. అందుకే ఆర్థర్ కాటన్ డిజైన్ నుంచి అటు తర్వాత ఎన్టీఆర్ ఆలోచన మొదలు ఇపుడు బాబు ప్రారంభించిన రెండో దశ వరకూ అసలు ఏం జరిగిందో చూస్తే కళ్లు చెమరుస్తాయ్. కాళ్ల కిందన గంగపొంగిన అనుభూతి కల్గుతుంది.

సీమ కలల హంద్రీనీవా…

అనంతపై అభిమానం చూపించిన ఎన్టీఆర్ పరితపించిన ప్రాజెక్టు హంద్రీనీవా ! బ్రదర్ పూర్తిచేద్దాం. రాళ్లు రప్పల ముళ్ల దిబ్బల సీమ కాదు రతనాల్లాంటి పంటలు ఇక్కడ కావాలంటూ అన్నగారు అని సరిగ్గా ముప్ఫై ఏళ్లు. తర్వాత వైఎస్ హయాంలో పనులు మొదలుపెట్టామని చెప్పినా…పునాది రాయి ఒంటరిగా ఎదురుచూసింది ఎనిమిదేళ్లపాటు. ఇటు గత రెండేళ్లలో పనులు పరవళ్లలా సాగాయ్. తొలి విడతే కాదు ఆ వెంటే ఇపుడు రెండో విడత కూడా పూర్తయ్యింది.

హంద్రీనీవా అంటేనే అద్భుతానికి ఆనవాలు. ఇపుడు కొలిక్కివచ్చిన రెండో విడతే దాదాపు 450 కిలోమీటర్ల పొడవున్న కాలువ. మూడు జిల్లాల్ని కలుపుతూ… శ్రీశైలం రిజర్వాయర్ క్రిష్ణా జలాల్ని మళ్లిస్తున్న ఈ దశతో దాదాపు 5 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయ్. రాప్తాడు, పెనుగొండ ప్రాంతాల కరువు దాదాపుగా తీరిపోయినట్టే ఇక ! తీరా వాడుతున్నది మాత్రం ఒకటిన్నర టీఎంసీనే ! హంద్రీ, పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య, బహుదా, చెయ్యేరు, గార్గేయ, వేదవతి, పాలార్ లాంటినదులన్నీ దండగుచ్చినట్టు ఇపుడు హంద్రీనీవాతో ఏకమవుతున్నాయ్. సీమను జలసిరితో పునీతం చేస్తున్నాయ్. ఇక మూడో విడత కూడా కొలిక్కి వస్తే హంద్రీనీవాతో సస్యశ్యామలం అవుతున్న భూమి దాదాపు 16 లక్షలవుతుంది. సీమ చిత్రపటంపై పచ్చబొట్టులా నిలిచి ఉంటుంది సాగువైభవం.

ఇక రాజకీయం లెక్క చూద్దాం ! సీమలో సమీకరణాలు అనూహ్యంగా మారబోతున్న ఘడియలివి. అనంతలో టీడీపీ ఇప్పటికే పట్టుగట్టిగా బిగించింది. ఇక మిగతా జిల్లాల్లోనూ నీళ్లే రాజకీయాన్ని కూడా మార్చబోతున్నాయ్. ఇన్నాళ్లూ నీళ్లు ఇస్తాం ఇస్తాం మంటూ జరిగిన రాజకీయ ప్రచారం ఇక తుడిచిపెట్టుకుపోయింది. ఇచ్చేశారు. అంటే ఆ ఆయుధం లేదింకా ! ఎవరు ఇచ్చారు… ఎలా ఇచ్చారన్నది మాత్రం పాయింట్. ఇపుడు అదే పాయింట్ రాత మార్చబోతోంది. అందుకే ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన అధ్యాయం వేరు. ఇక ముందు జరగబోతున్నది వేరు అని అర్థం అవుతోంది క్లియర్ గా !

 

Link to comment
Share on other sites

జిల్లా పెనుగొండ సమీపంలో నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గంగపూజ నిర్వహించి... జలాశయాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. దీంతో ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న అనంత ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్టు అయ్యింది. ఈ జలాశయం ద్వారా పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని చెరువులకు నీరు లభించనుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరుతాయి.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్‌ ద్వారా తాము ఉరవకొండ, గుంతకల్లు, రాప్తాడు నియోజకవర్గాల మీదుగా పెనుకొండ నియోజకవర్గానికి నీటిని తీసుకొచ్చామన్నారు. గొల్లపల్లి నుంచి మారాల, చెర్లోపల్లి ద్వారా అడవిపల్లికి నీరు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. పీఏబీఆర్‌, ఎంపీఆర్‌, చిత్రావతికి పుష్కలంగా నీరందితే జిల్లాలో నీటి సమస్య దాదాపుగా తీరుతుందన్నారు. పేరూరు, బైరవానితిప్ప రిజర్వాయర్లకు నీరందిస్తే జిల్లాలోని మారుమూల గ్రామాలకు నీరందించినట్టేనన్నారు.

నాడు ఎన్టీఆర్‌ తెలుగుగంగ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, జీఎన్‌ఎస్‌ఎస్‌ పథకాలకు శ్రీకారం చుట్టగా, ఇప్పుడు వాటిని పూర్తిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. హంద్రీనీవా ప్రధాన కాల్వలను కర్నూలు జిల్లాలోని మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి వరకు విస్తరించి వచ్చే ఏడాదిలో తక్కువ సమయంలో మరింత ఎక్కువ కృష్ణా జలాలను తరలిస్తామన్నారు. ఈ రోజు నీరు చూసిన ఈ ప్రాంత ప్రజలు మున్ముందు మరింత అభివృద్ధి ఫలాలు అందుకోనున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
గొల్లపల్లి జలాశయానికి ఎన్టీఆర్‌ జలాశయంగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు.15338817_1492760444070875_58947084161210

Link to comment
Share on other sites

చంద్రబాబు మాట నిలుపుకున్నారు’

 

అనంతపురం: చెరువులు నింపుతామని సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలుపుకున్నారని మంత్రి పరిటాల సునీత అన్నారు. సోమబారం రామగిరి మండలం కుంటిమద్ది చెరువులో తెప్పోత్సం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పార్థసారథి, కలెక్టర్‌ శశిధర్‌, తదితరులు హాజరయ్యారు. హంద్రీ-నీవా జలాలతో కుంటిమద్ది చెరువును నింపారు. ఈ సందర్భంగా తెప్పోత్సవం నిర్వహించారు. అంతేకాకుండా రాప్తాడు నియోజకవర్గంలో 27 చెరువులు, 150 చెక్‌డ్యాంల్లో జళకళ సంతరించుకుంది.
Link to comment
Share on other sites

కరువుజిల్లాను పలుకరించిన కృష్ణమ్మ

అనంతపురం : కరువు జిల్లా అనంతను కృష్ణమ్మ పలుకరించింది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు వందల మైళ్ల నుంచి వచ్చి కుంటిమద్ది చెరువుకు చేరింది. జిల్లాకు హంద్రీనీవా నీటి రాకతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. మొత్తం 59 చెరువులకు నీరందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ జిల్లా మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో కుంటిమద్ది చెరువులో తెప్పొత్సవం నిర్వహించారు. చెరువులో రంగనాథస్వామిని ఊరేగించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు నీళ్లలో దీపాలు వదిలారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...