Jump to content

Amaravati


Recommended Posts

‘అమరావతి’తో రైల్వే అనుసంధానం
06-09-2018 03:33:29
 
636718016086344063.jpg
  •  ఈ బడ్జెట్‌లోనే నిధులొచ్చే అవకాశం
  •  తొలుత సింగిల్‌ లైన్‌..రద్దీని బట్టి రెండోది నిర్మాణం
  •  తెనాలి-గుంటూరు డబ్లింగ్‌ పనులు
  • త్వరలోనే పూర్తి: రైల్వే జీఎం
గుంటూరు (సంగడిగుంట), సెప్టెంబరు 5: ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్‌ను అనుసంధానించే ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నంబూ రు, ఎర్రబాలెం మధ్య సింగిల్‌ లైన్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. ఆతర్వాత రద్దీని బట్టి రెండో ట్రాక్‌ నిర్మిస్తామని చెప్పారు. గుంటూరు, మంగళగిరి స్టేషన్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు నగరం పశ్చిమం వైపు అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా రైల్వే స్టేషన్‌ను అటువైపు ఆధు నీకరిస్తున్నామన్నారు.
 
తెనాలి-గుంటూరు డబ్లింగ్‌ ట్రాక్‌ పనులు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామన్నారు. గుంటూరు-గుంతకల్లు విద్యుదీకరణ పూర్తయిందని, త్వరలోనే డబ్లింగ్‌ ట్రాక్‌ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. నల్లపాడు-పగిడిపల్లి డబ్లింగ్‌కు సర్వే పూర్తయిందన్నారు. నడికుడి-కాళహస్తి ట్రాక్‌ నిర్మాణ పనులు 70 కిలోమీటర్లు పూర్తయ్యాయన్నారు.
Link to comment
Share on other sites

అమరావతిలో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
06-09-2018 07:27:35
 
636718156548460434.jpg
అమరావతి: రాజధానికి భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ జోన్ల భావిస్వరూపం ఏ విధంగా ఉండబోతోందో కళ్లకు కట్టే ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. ఈ జోన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతామంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్న మాటలను మాత్రమే ఇప్పటి వరకూ వింటున్న ప్రజలకు నిజంగానే అభివృద్ధి పనులన్నీ పూర్తయిన తర్వాత అవి ఎలా ఉంటాయనేది ఈ కేంద్రాలు చూపబోతున్నాయి. తద్వారా వీటి అభి వృద్ధిపై కొన్ని వర్గాల్లో నెలకొన్న అను మానాలు తొలగిపోవడంతోపాటు రాజ ధానిలోని ప్రభుత్వ ప్రాజెక్టులే కాకుం డా ఎల్పీఎస్‌ జోన్ల సత్వర అభివృద్ధికి సీఆర్డీయే కృషి చేస్తోందనే సందేశం ప్రజా బాహుళ్యంలోకి వెళ్తుందని అధి కారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూలింగ్‌ సమయంలో వాగ్దానాలిచ్చిన విధంగా ఎల్పీఎస్‌ జోన్లను అభివృద్ధి పరచేందుకు సీఆర్డీయే కట్టుబడి ఉందని, కాస్త వెనుకా ముందూ అయినప్పటికీ చెప్పినట్లుగానే వాటిని తీర్చిదిద్దడం తథ్యమన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించడమే పరమార్ధంగా ఈ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు ఏర్పాటవబోతున్నాయి.
 
3 కేంద్రాలు..
రాజధానిలో మొత్తం 13 ఎల్పీఎస్‌ జోన్లను ఏర్పాటు చేయగా, వీటిల్లో జోన్‌ 1,7,10లలో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను నెలకొల్పనున్నారు. ఒక్కొక్క దానిని రూ.3.33 కోట్ల వ్యయంతో ఏర్పా టు చేయనున్నారు. ప్రణాళికలకు అను గుణంగా ఆయా జోన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులే కాకుండా వాటిల్లో రాబోయే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలను ఈ కేంద్రాలు చూపుతాయి. వీటిల్లోని రహదారులు, వంతెనలు, భ వంతులు, ఉద్యానవనాలు ఇత్యాదివన్నీ ఈ సెంటర్లలో ఏర్పాటు చేసే 3-డీ మోడల్స్‌ ద్వారా సుస్పష్టంగా గోచరించ నున్నాయి. ఆయా జోన్లలోని నివాస, వాణిజ్య తదితర ప్లాట్లను సులభంగా గుర్తించేందుకు దోహదపడే క్లస్టర్‌, టౌన్‌షిప్‌ ఇత్యాది వివరాలను కూడా ఈ కేంద్రాల్లో పొందుపరుస్తారు. ఈ సెంటర్లను సందర్శించిన వారికి రాజధానిలోని ఎల్పీఎస్‌ జోన్లు ఎంతటి ప్రణాళికాబద్ధంగా, ప్రమాణాలతో రూపుదిద్దుకోబోతున్నాయన్న విషయం సూటిగా అవగతమవుతుందన్న మాట. ఈ అంశాలన్నీ రాజధాని ప్లాట్ల క్రయవిక్రయాలకు కూడా ఇతోధికంగా తోడ్పడనున్నాయి.
 
రైతులకే కాదు.. సందర్శకులకూ అవగాహన
ఈ సెంటర్లు రాజధాని రైతులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అమరావతి సందర్శనకు తమంతట తాము వచ్చే వారితోపాటు వచ్చే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించ బోతున్న అమరావతి యాత్రల్లో భాగంగా వచ్చే సందర్శకులకు కూడా ఎల్పీఎస్‌ జోన్లకు సంబంధించిన అవగాహనను పెంపొందించడంలో గణనీయపాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఎంతగా వివరించినా, మరెంతగా కాగితాల్లో చూపినా కలుగనంతటి అవగాహనను ఆకట్టుకునే 3-డీ డిజైన్లతో ఏర్పాటయ్యే ఈ కేంద్రాలు కలిగించడం తథ్యమ నుకుంటున్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను.. రాజధానిలోని అతి సూక్ష్మ వివరాలు కూడా సుస్పష్టంగా కని పించేలా, ఆకర్షణీయంగా తాము రూపొందింపజేసిన 3-డీ నమూనా (ఉద్ధండరాయునిపాలెంలో ప్రధా నమంత్రి నరేంద్రమోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఉంది) కు లభిస్తున్న స్పందనను ప్రస్తావిస్తు న్నారు. ఎల్పీఎస్‌ జోన్లలో ఏర్పాటు చేయబోయే 3 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు కూడా రూపుదిద్దుకుని, తాము ఆశిం చిన ప్రయోజనాన్ని నెరవేరుస్తాయని ఆశిస్తున్నారు.
 
ఈ కేంద్రాల్లో కొంత భాగాన్ని ఆయా ప్రదేశాల్లో పని చేసే సీఆర్డీయే సిబ్బంది కోసం కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. తద్వారా వారికి సౌకర్యంగా ఉండడమే కాకుండా ఆయా కేంద్రాల సందర్శనకు వచ్చే వారికి సంబంధిత వివరాలను తెలియజేయడం, సందర్శకుల అను మానాలు, సందేహాలను నివృత్తి చేసేం దుకు అవకాశం ఉంటుందన్నది అధి కారుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ సెంటర్లకు టెండర్లను సమ ర్పించేందుకు ఈ నెల 25 వరకు సీ ఆర్డీయే అవకాశమిచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత టెండర్ల పరిశీలనను చేపట్టి, సాధ్యమైనంత త్వరగా అర్హులను ఎంపిక చేసి, పనులు ప్రారంభమయ్యేలా చూడాలను కుంటోంది. మొత్తంమీద రానున్న 4 నుంచి 6 నెలల్లో ఈ కేంద్రాలు పూర్త యి, ప్రజల సందర్శనకు అనువుగా సిద్ధమవుతాయని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

ah amount edo state govt ye pettukoni state/private railway lines vesukuntey better emo (if there is any legal possibility) 

vaallu ichey ah dabbulu kantey costly land kottestunnaru dead cheap ga ....

Link to comment
Share on other sites

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పనులకు టెండర్లు
07-09-2018 06:57:19
 
636719002393121923.jpg
  • రూ.64 కోట్లతో ప్యాకేజ్‌-2
  • కోర్టు హాళ్లు, ఇతర వసతుల కల్పన
  • ఈ ఏడాది డిసెంబరు 15 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యం
అమరావతి: రాష్ట్రంలో హైకోర్టు నిర్వహణకు వీలుగా కొద్దినెలల క్రితం ప్రారంభమై చురుగ్గా నిర్మాణం జరుపుకుంటున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన పలు అంతర్గత పనులు, పార్కింగ్‌, కాంపౌండ్‌ వాల్‌ కోసం సీఆర్డీయే టెండర్లు పిలిచింది. ప్యాకేజ్‌-2గా పేర్కొంటున్న ఈ టెండర్‌ అంచనా విలువ రూ.64 కోట్లు. ఆసక్తి ఉన్న సంస్థలు తమ బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువునిచ్చింది. టెక్నికల్‌ బిడ్‌ను అదే రోజున, అందులో అర్హత సాధించిన సంస్థల ప్రైస్‌ బిడ్లను 29వ తేదీన తెరవనుంది.
 
4.50 ఎకరాల్లో..
అమరావతిలో హైకోర్టు కోసం స్థూపాకారంలో, ఐకానిక్‌గా నిర్మించబోతున్న శాశ్వత భవనాలు పూర్తయ్యేంతవరకూ జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నడుస్తుంది. శాశ్వత భవనాలు పూర్తయి, హైకోర్టు అందులోకి తరలిపోయిన తర్వాత ఈ భవంతి సిటీ సివిల్‌ కోర్టుగా రూపాంతరం చెందుతుంది. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లోని సూపర్‌ బ్లాక్‌ ‘ఎఫ్‌’లో భాగంగా 4.50 ఎకరాల్లో నిర్మితమవుతున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ జి ప్లస్‌2 అంతస్థులతో రూపుదిద్దుకుంటోంది. దీని మొత్తం విస్తీర్ణం 2.25 లక్షల చదరపుటడుగులు. ప్రధాన న్యాయమూర్తి ఆసీనులయ్యే కోర్టు హాలుతోపాటు మరో 22 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల ఛాంబర్లు, కక్షిదారులు, న్యాయవాదులకు అవసరమైన వసతులు ఇత్యాదివన్నీ ఇందులో ఏర్పాటు కానున్నాయి.
 
ఈ భవంతి నిర్మాణానికి ప్యాకేజ్‌-1గా కొన్ని నెలల క్రితం సీఆర్డీయే పిలిచిన టెండర్‌ను రూ.108 కోట్లకు ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుని, పనులు చేపట్టింది. సత్వరం పూర్తయ్యేందుకు వీలుగా ఈ కాంప్లెక్స్‌ను ప్రి ఫ్యాబ్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది డిసెంబర్‌ 15 నాటికి పనులన్నింటినీ పూర్తిచేసి, భవంతిని హైకోర్టు నిర్వహణకు వీలుగా సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశానుసారం ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మాణ పనులను 6 భాగాలుగా విభజించి, ఏకకాలంలో అవన్నీ వేగంగా జరిగేలా చూస్తోంది. ఇవన్నీ దాదాపుగా ఒక కొలిక్కి వస్తుండడంతో సీఆర్డీయే ఈ కాంప్లెక్స్‌లో కల్పించాల్సిన ఇతర వసతులపై దృష్టి సారించింది. ఇందుకోసమే రూ.64 కోట్ల అంచనా వ్యయంతో ప్యాకేజీ-2గా పేర్కొంటున్న తాజా టెండర్లను పిలిచింది.
 
 
ప్యాకేజ్‌-2లో పనులు..
ఈ ప్యాకేజ్‌-2లో భాగంగా జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ ప్రధాన భవనంలో రాబోయే ఛీఫ్‌ జస్టిస్‌ కోర్టు హాలుతోపాటు మరొక 22 కోర్టు హాళ్లను నిర్దేశిత ప్రత్యేక ఫర్నిచర్‌తో తీర్చిదిద్దనున్నారు. వాటికి వాల్‌ క్లాడింగ్‌, సౌండ్‌ ప్రూఫింగ్‌ ఇత్యాది హంగులను కల్పిస్తారు. లిఫ్ట్‌లు, అంతర్గత ఫినిషింగ్‌ పనులతోపాటు కక్షిదారులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తారు. పైన పేర్కొన్న వాటితోపాటు క్యాంటీన్‌, వంటశాల, సెక్యూరిటీ భవంతి, స్థలం మొత్తానికీ రిటైనింగ్‌ (కాంపౌండ్‌) వాల్‌, స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్లు, అంతర్గత రహదారులు (రిజిడ్‌ పేవ్‌మెంట్‌ మరియు పేవర్‌ బ్లాక్‌లతో సహా), భూగర్భ సంపులు, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మిస్తారు. వీటితోపాటు ఉపరితల పార్కింగ్‌ ప్రదేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. ఇవే కాకుండా ఇంకొన్ని చిన్నాచితకా పనులను కూడా ఈ ప్యాకేజీని దక్కించుకున్న సంస్థ చేయాల్సి ఉంటుందని టెండర్‌ డాక్యుమెంట్‌లో సీఆర్డీయే పేర్కొంది.
Link to comment
Share on other sites

హౌసింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో ఘనత
07-09-2018 07:00:09
 
636719004086694208.jpg
  • 85 రోజులు.. 12 శ్లాబ్‌లు
  • షియర్‌వాల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో పూర్తి
  • కాంట్రాక్ట్‌ సంస్థ అధికారులకు సీఆర్డీయే సత్కారం
 
అమరావతి: అఖిల భారత సర్వీస్‌(ఏఐఎస్‌) అధికారుల నివాసం కోసం రాజధానిలో నిర్మి స్తున్న టవర్లలో 1వ దాని 12 శ్లాబ్‌లు కేవలం 85 రోజుల్లోనే పూర్తయ్యాయి! ఈ ఏడాది జూన్‌ 12న ఇందులోని తొలి శ్లాబ్‌ వేయగా, ఆ తర్వాతి నుంచి వారానికొకటి చొప్పున 12శ్లాబ్‌లూ గురువారంతో వేసేశారు. కేవలం 85రోజుల రికార్డు సమ య ంలో ఈ ఘనత సాధించడంతో సీఆర్డీయే ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ ఎన్‌.సి.సి. అధికారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆ టవర్‌ వద్ద గురువారం నాడు పండుగ వాతావరణం నెలకొంది. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అక్కడికి వెళ్లి, ఇంత వేగంగా పనులు జరిగేలా చూసిన ఎన్‌.సి.సి. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రీహరిరాజును, ప్రాజెక్ట్‌ మేనేజ్‌ మెంట్‌ కన్సల్టెంట్‌ (పీఎంసీ) సీవీఆర్‌ఐ ప్రతినిధి శ్రీకృష్ణ, సీఆర్డీయే ఈఈ శ్రీనివాస్‌ లను శాలువాలతో సత్కరించా రు.
 
సమష్టి కృషికి ఇది నిదర్శన మని, ఇదే స్ఫూర్తితో మిగిలిన నిర్మాణాలన్నీ కూడా నిర్దిష్ట గడువులోగా పూర్తయ్యేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం అక్కడ నిర్మాణంలో ఉన్న మోడల్‌ ఫ్లాట్‌ అంతర్గత పనులను పరిశీలించి, తగు సూచనలిచ్చారు. ఆ తర్వాత నేలపాడులో నిర్మాణంలో ఉన్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పనులను కూడా శ్రీధర్‌ పరిశీలించి, మరింత వేగంగా పనులు సాగేలా చూడాలని సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థ ఎల్‌ అండ్‌ టి కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ కాంప్లెక్స్‌లోని 6 భాగాల్లో ఒకటి శ్లాబ్‌ దశకు వచ్చిందని, ఈ నెల 10వ తేదీనాటికి శ్లాబ్‌ పూర్తవుతుందని వారు ఆయనకు చెప్పారు. కార్యక్రమాల్లో సీఆర్డీయే అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, సీఈ ఎం.జక్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

4న పవన విశ్లేషణ నివేదిక?
08-09-2018 07:37:38
 
636719890580684586.jpg
  • సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణానికి అన్ని జాగ్రత్తలు
అమరావతి: రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మించనున్న శాశ్వత సచివాలయ సముదాయానికి విండ్‌ అనాలిసిస్‌ పరీక్ష నివేదిక ఈ నెల 14వ తేదీన అందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐదు టవర్లతో కూడిన ఈ కాంప్లెక్స్‌లో నాలుగు ఒక్కొక్కటి 40 అంతస్థులతోనూ, ఒకటి మాత్రం 50 అంతస్థులతోనూ నిర్మితమవనున్న సంగతి విదితమే. ఇప్పటివరకు ఇన్ని ఫ్లోర్లతో నిర్మించిన భవంతులేమీ లేకపోవడంతోపాటు నదీతీరానికి సమీపంలో ఈ టవర్లు రానున్న దృష్ట్యా సీఆర్డీయే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. మట్టి పరీక్షల దగ్గర్నుంచి ఫౌండేషన్‌, స్ట్రక్చరల్‌, ఇంటీరియర్‌ డిజైన్లు ఇత్యాది అన్ని అంశాలకు ఆయా రంగాల్లోని నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తోంది.
 
ఇదే క్రమంలో భాగంగా.. ఈ టవర్లు ఎంతటి పెనుగాలులనైనా తట్టుకుని, నిలిచేలా కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన ఆర్‌.డబ్ల్యు.డి.ఐ. అనే ప్రఖ్యాత సంస్థ తోడ్పాటును తీసుకుంటోంది. ‘విండ్‌ అనాలిసిస్‌’గా వ్యవహరించే ఈ ప్రక్రియలో ప్రపంచంలోనే పేరొందిన తొలి మూడు సంస్థల్లో ఇదొకటి కావడం గమనార్హం. ఈ సంస్థ నిపుణులు మన సెక్రటేరియట్‌ టవర్ల నమూనాల (ప్రొటోటైప్స్‌)ను రూపొందించి, వాటిపైకి వేగంగా, ఉధృతంగా వీచే గాలులను వివిధ దిశల నుంచి పంపుతూ, ఆయా సందర్భాల్లో అవి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాయన్న విషయాన్ని నిశితంగా గమనిస్తారు. ఇంచుమించుగా మన వాతావరణాన్ని పోలిన ప్రదేశాన్ని వారి ప్రయోగశాలల్లో సృష్టించి, విండ్‌ అనాలిసిస్‌ టెస్ట్‌లుగా వ్యవహరించే ఈ పరీక్షలను జరుపుతారు.
 
ఈ టవర్లలో ప్రతిదానికి ఏదిశగా బలమైన గాలులు వీచే అవకాశముంది, వాటిని తట్టుకునేందుకు ఆయా దిశల్లో ఎంత పటిష్టమైన నిర్మాణ సామగ్రిని వాడాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తించేందుకు వీలుంటుంది. సెక్రటేరియట్‌ టవర్ల స్ట్రక్చరల్‌ డిజైన్లను రూపొందించేందుకు ఈ టవర్ల నిర్మాణ కాంట్రాక్ట్‌లు పొందిన మూడు సంస్థలూ నియమించుకున్న స్ట్ర్ట్రక్చరల్‌ డిజైనింగ్‌ సంస్థ బ్యూరో హెపార్ట్‌ సంస్థ (లండన్‌) ఆయా డిజైన్లను మరింత పటిష్టంగా, లోపరహితంగా తయారు చేసేందుకు పైన పేర్కొన్న విండ్‌ అనాలిసిస్‌ టెస్ట్‌ రిపోర్టులు ఎంతో దోహదపడతాయి. ఈ పరీక్షల ప్రాతిపదికగా 5 టవర్లలో దేనిలో, ఏవైపున, ఎలాంటి నిర్మాణ సామగ్రిని, ఎంతెంత పరిమాణంలో వినియోగించాలో తెలిపే స్ట్రక్చరల్‌ డిజైన్లను బ్యూరో హెపార్ట్‌ అందజేయనుంది.
 
 
12న విండ్‌ అనాలిసిస్‌ టెస్ట్‌.. 14న నిపుణుల భేటీ
తిరువనంతపురంలోని అధునాతన ప్రయోగశాలలో ఈ నెల 12న విండ్‌ అనాలిసిస్‌ టెస్ట్‌లను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ పరీక్షల్లో వారు గుర్తించిన అంశాలపై ఈ నెల 14న తిరువనంతపురంలోనే బ్యూరో హెపార్ట్‌ నిపుణులు, సీఆర్డీయే అధికారులతో విస్తృతంగా చర్చించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ టవర్ల స్ట్రక్చరల్‌ డిజైన్ల రూపకల్పనకు కొంతకాలంగా ముమ్మర కసరత్తు సాగిస్తున్న బ్యూరో హెపార్ట్‌ సంస్థ విండ్‌ అనాలిసిస్‌ పరీక్షల ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుని, మార్పుచేర్పులతో త్వరలోనే పకడ్బందీ డిజైన్‌ను ఇవ్వ నున్నట్లు సమాచారం. ఇప్పటికే మట్టి పనులు, ఫౌండేషన్‌ పనులు చురుగ్గా సాగుతున్న సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణం స్ట్రక్చరల్‌ డిజైన్ల సిద్ధంతో మరింత వేగంకానుంది.
Link to comment
Share on other sites

కొండవీటి వాగు ఎత్తిపోతలకు ట్రయల్‌రన్‌
08-09-2018 07:23:37
 
636719882173452980.jpg
తాడేపల్లి: కొండవీటివాగు ఎత్తిపోతల పథకానికి శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు డ్రై ట్రయల్‌రన్‌ను నిర్వహించారు. మొత్తం 16 మోటార్లు ఏర్పాటు చేయగా ఆరు మోటార్లను నడిపి పనితీరును పరిశీలించారు. ఈ నెల 10న ఈ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్ర బాబు చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కార్య క్రమంలో నీటిపారుదల శాఖ సీఈ సతీష్‌, ఎస్‌ఈలు చౌదరి, బాబూరావు, ఈఈ రమేష్‌బాబు, మెగా ప్రతినిధి రంగరాజన్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అంబకుమార్‌, అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి కొండవీటి రక్ష
రాజధానికి వరద ముప్పు తప్పించేందుకు సిద్ధమైన కొండవీటి ఎత్తిపోతల
10 లేదా 14న సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఈనాడు - అమరావతి
8ap-main5a.jpg

16 పంపులు, 16 మోటార్లతో నిర్మాణం



పనులు ప్రారంభం: 2017 జనవరి 1


గడువు:గత ఏడాదే వర్షాకాలం సమయానికే ఈ పని పూర్తి చేయాలని భావించినా ఎత్తిపోతల నిర్మాణంలో   ఆలస్యమయింది.


* పథకంలో భాగంగా పంపుహౌస్‌, డెలివరీ సిస్టర్న్‌, సర్‌ప్లస్‌ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌, సబ్‌ స్టేషన్లు నిర్మించారు.


ఒప్పందం విలువ: రూ.222 కోట్లు


రాజధాని అమరావతి ప్రాంతాన్ని వరద ముంపు నుంచి రక్షించే ప్రణాళికలో భాగంగా చేపట్టిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం సిద్ధమయింది. ప్రకాశం బ్యారేజిని ఆనుకుని గుంటూరు జిల్లా ఉండవల్లిలో కృష్ణా కరకట్ట సమీపంలోనే ఎత్తిపోతల నిర్మించారు. డ్రై రన్‌ కూడా విజయవంతమవడంతో సెప్టెంబర్‌ 10 లేదా సెప్టెంబర్‌ 14న ఈ ఎత్తిపోతలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు శనివారం ఈ పథకం పనులు   పరిశీలించారు. మొత్తం 16 పంపులతో, 16 మోటార్లతో సిద్ధమయిన ఈ ఎత్తిపోతల... కొండవీటి వాగు వరదలో  5000 క్యూసెక్కులను కృష్ణా నదిలోకి ఎత్తిపోయనుంది.

ఏమిటీ కొండవీటి వాగు?
అమరావతికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం 29.5 కిలోమీటర్ల మేర కొండవీటి వాగు ద్వారా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర వాగులు, వంకల నీరు కూడా ఇందులోనే చేరుతుంది. లామ్‌ ఆనకట్ట వద్ద ప్రారంభమైన ఈ కొండవీటి వాగు మేడికొండూరు, తాడికొండ, మంగళగిరి తాడేపల్లి మండలాల్లో ప్రవహిస్తూ ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ ద్వారా కృష్ణానదిలోకి చేరుతుంది. ప్రవాహాలు కొద్దిగా ఉన్నప్పుడు, వరద లేనప్పుడూ సమస్య లేదు. కృష్ణా లో వరద ఉన్న సమయంలో... ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణానదిలో కొండవీటి ప్రవాహం కలవకుండా వెనక్కి ఎగబాకుతుంది.

కృష్ణానది (+21.50 మీటర్లు), కొండవీటి వాగు (+17.5 మీటర్లు) వరద గరిష్ఠ మట్టాల్లో తేడా ఎక్కువగా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ కారణంగా నీరుకొండ, కురగళ్లు, పెదపరిమి, నిడమర్రు, ఎర్రబాలెం, ఐనవోలు, పెనుమాక, కృష్ణాయపాలెం, ఉండవల్లి గ్రామాల్లో దాదాపు 13,500 ఎకరాలు ముంపులో చిక్కుకుంటూ ఉంటుంది. అయిదు నుంచి ఏడు రోజుల పాటు ఈ ముంపు ఉంటుంది. ఈ ప్రాంతాలన్నీ ప్రస్తుతం రాజధానిలో ఉన్నాయి. ప్రతిసారి భారీ వర్షాల సమయంలో ఇలా ముంపు ఏర్పడుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ ముంపు ఎన్నడూ ఏర్పడలేదు.

16,240 క్యూసెక్కుల వరద!
* కొండవీటి వరదపై రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ఆర్‌కే అసోసియేట్స్‌తో అధ్యయనం చేయించింది. 100 సంవత్సరాల లెక్కలు పరిశీలించి గరిష్ఠ వరదను 16,240 క్యూసెక్కులుగా లెక్కించారు.
* ప్రస్తుతం ఉన్న ఎస్కేప్‌ ఛానల్‌ ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టాకు కాలువకు 4000 క్యూసెక్కుల వరకు మళ్లించవచ్చు.
* తొలిదశ ప్రణాళికలో భాగంగా కొత్త ఎత్తిపోతల ద్వారా 5000 క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి ఎత్తిపోస్తారు.
* రెండో దశ ప్రణాళికలో భాగంగా సీఆర్‌డీఏ మిగిలిన నీరు మళ్లించే ఏర్పాట్లు చేస్తుంది.
* ఇప్పటికే కొండవీటి వాగును 100 మీటర్ల వెడల్పు చేసేందుకు వీలుగా సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. భవిష్యత్తులో అవసరాలను బట్టి మరో 6000 క్యూసెక్కులు ఎత్తిపోసేలా మరో పథకం ఏర్పాటు చేసే ఆలోచన ఉంది.

Link to comment
Share on other sites

అమరావతిలో ఆనంద నిలయం
25 ఎకరాల్లో రూ.140 కోట్లతో నిర్మాణం
చోళ, పల్లవ, చాళుక్య రీతుల మేళవింపు
రాష్ట్రంలో రెండో తిరుమలగా నవ్యనగరి
amr-sty1a.jpg

కోరికలు తీర్చే కోనేటిరాయడు, తిరుమల సార్వభౌముడైన వేంకటేశ్వరస్వామి ఏడుకొండలు దిగి అమరావతికి రానున్నాడు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో తిరుమలగా రూపుదిద్దుకోనుంది. పవిత్ర కృష్ణానదీ తీరంలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.140 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం అమరావతిలో నిర్మాణం కానుంది. ప్రాచీన శిల్పకళా నిలయంగా, అపురూప ప్రకృతి సౌందర్యాన్ని ప్రకటించేలా నిర్మాణాన్ని తీర్చిదిద్దేందుకు ఇప్పటికే స్థపతులు తగిన ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఆంధ్రులకే కాదు.. దేశానికే కొంగుబంగారమైన దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. వేలాది సంవత్సరాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న తిరుమలలోని శిల్పకళ, అక్కడి ప్రకృతి రమణీయత చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇంతటి మధురానుభూతి కలిగించే శ్రీవారిని దర్శించుకోవాలంటే... నిజంగా ఓ సాహసయాత్ర చేయాల్సిందే.. కానీ, ఈ ఇబ్బందులేమీ లేకుండా ఎంతో ప్రశాంతంగా శ్రీవారి దర్శనభాగ్యం అమరావతివాసులకు త్వరలో కలగనుంది. పూర్తిగా తిరుమల తరహాలోనే శ్రీవారి ఆలయాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించేందుకు తితిదే శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

అపురూప శిల్పకళా నిలయం
* ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆగమశాస్త్రాలు చెబుతున్న నిబంధనల్ని పూర్తిగా అమలుచేస్తున్నారు. కాశ్యప శిల్పశాస్త్రం, మానససరం స్ఫూర్తిగా తీసుకుని, ఎక్కడెక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలనే విషయంలో ఇప్పటికే ఆగమపండితులు స్పష్టమైన నిర్ణయం చేశారు.
* స్వామి వారి విగ్రహం పడుకుని ఉన్నట్లు భావిస్తే గర్భాలయం శిరస్సుగా, అంతరాలయం మెడభాగంగా, మహామంటపం భుజాలుగా, తర్వాతి దిగువ భాగంగా; స్వామి వారి పాదాలు ఉండే ప్రాంతం నంది, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ గోపురం ఉండే ప్రాంతాలుగా ఉండేట్లు నిర్మించనున్నారు.
* తమిళనాడులోని కాంచీపురం కైలాసనాథ ఆలయం, వైకుంఠ పెరుమాళ్‌ ఆలయాలకు దీటుగా ఉండేలా నవీన ఆలయం రూపుదిద్దుకుంటుంది. తంజావూరులోని ద్రవిడ తరహా నిర్మాణాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.  శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన హంపి విఠలాలయం, ఇతర ఆలయాల తీరు కూడా మేళవించి, ఇతర ప్రాకారాలను నిర్మింస్తారు. మొత్తంగా విభిన్న భారతీయ శిల్పకళా సంస్కృతుల నిలయంగా అమరావతి ఆలయం నిర్మాణం జరుపుకుంటుంది. యోగశాస్త్రపరంగా మనిషిలో ఉండే మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలను పోలిఉండేలా నూతన ఆలయంలో నిర్మాణాలు ఉంటాయి. ఆధ్మాత్మికపరంగా, యోగశాస్త్రపరంగా భక్తులకు ఉత్తేజాన్ని కల్పించేలా శ్రీవారి నూతన ఆలయాన్ని నిర్మిస్తారు.
* ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే స్థల నిర్ణయం జరిగింది. ప్రస్తుతం స్థలాన్ని చదునుచేసి, వ్యర్థాలు తొలగించే పనులు జరుగుతున్నాయి. అవసరమైన అనుమతులు, ఇతర వ్యవస్థాపరమైన పనులు పూర్తిచేసి, నవంబరులో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్‌సింఘాల్‌ ప్రకటించారు. రెండేళ్ల కాలవ్యవధిలో నిర్మాణం పూర్తవుతుంది.

Link to comment
Share on other sites

నివాసయోగ్య అమరావతి!
10-09-2018 03:23:34
 
  •  ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దేలా కృషి
  •  టీఈఆర్‌ఐ లాంటి సంస్థలతో పనిచేయాలి
  • 19న విజయవాడలో అంతర్జాతీయ సదస్సు: సీఎం
అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఐదు అత్యుత్తమ ప్రపంచశ్రేణి నివాసయోగ్య నగరాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ... అందుకోసం ‘ద ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (టీఈఆర్‌ఐ) లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో సుస్థిర పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన అత్యాధునిక సాంకేతికతను అమలు చేయడానికి కావాల్సిన విధానాలను రూపొందించాలని ఆయన సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జీవనయోగ్య నగరాల రూపకల్పనకు ఉద్దేశించిన ప్రాంతీయ విధాన చర్చల తొలి సదస్సును అమరావతిలో నిర్వహించాలని టీఈఆర్‌ఐ నిర్ణయించింది.
 
భారత్‌లోని డెన్మార్క్‌ ఎంబసీ, నెట్‌వర్క్‌ ఆఫ్‌ ద ఇంటర్నేషనల్‌ అర్బన్‌ కో-ఆపరేషన్‌/గ్లోబల్‌ కాంపాక్ట్‌ ఆఫ్‌ మేయర్స్‌, దక్షిణాసియా ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిసా, పుదుచ్చేరి, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల ప్రతినిధులతో పాటు అంతర్జాతీయ నిపుణులు దీనిలో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా టీఈఆర్‌ఐ డీజీ అజయ్‌ మాథూర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. అమరావతిని ప్రపంచంలోనే స్మార్ట్‌, అత్యంత జీవనయోగ్య నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఈ సదస్సును ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. భారత్‌లోని నగరాలను అత్యంత నివాసయోగ్య నగరాలుగా తీర్చిదిద్దేందుకు విధానాల రూపకల్పన, అమలుకు సంబంధించిన ప్రణాళికను తయారుచేయడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
 
నివాసయోగ్య నగరాలపై నిర్వహిస్తున్న వర్క్‌షాపును ఒక అవకాశంగా మలచుకొని, అంతర్జాతీయ నిపుణుల సలహాలను, సూచనలను స్వీకరించాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. రాజధానిని బ్లూ, గ్రీన్‌ సిటీగా మార్చాలన్న లక్ష్యానికి అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులు, ఇంధన సామర్థ్యం, ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఎస్‌ దినేశ్‌కుమార్‌, సీఎం పేషీ అధికారులు సతీశ్‌చంద్ర, సాయిప్రసాద్‌, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారధి, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...