Jump to content

Amaravati


Recommended Posts

నిరాశ్రయులకు నీడ నైట్‌షెల్టర్‌
02-09-2018 08:01:02
 
636714720615182554.jpg
ఫుట్‌పాత్‌లు, బస్‌స్టాప్‌లలోని నిరాశ్రయులకు ప్రత్యేకంగా ఒక గూడును కల్పించడంతో పాటు బెజవాడను సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విజయవాడ నగర పాలక సంస్థ ‘నైట్‌ షెల్టర్‌’ను అందు బాటులోకి తీసుకొచ్చింది. రైల్వేస్టేషన్‌కు సమీపాన వెహికల్‌ డిపో వద్ద ఒక భవనాన్ని, కబేళా ప్రాంతంలో వేరొక భవనాన్ని కార్పొరేషన్‌ అధికారులు నిర్మించారు. ఫుట్‌పాత్‌లు, బస్‌ షెల్టర్లలో ఉన్న వాళ్లందరినీ ఇప్పడు ఈ షెల్డర్లలోకి తరలిస్తున్నారు. ఇక్కడే వారికి ఆవాసం కల్పించి ఆహారం సైతం అందజేస్తున్నారు.
 
విజయవాడ: విజయవాడలో ప్రస్తుతం 2500 మంది వరకు యాచకులు ఉన్నారని నగర పాలక సంస్థ అధికారుల అంచనా. వారు కాకుండా వేలల్లో దినసరి కూలీలు ఉంటున్నారు. ఇంటి అద్దెలు భరించలేని వారంతా బస్‌షెల్టర్లు, ఫుట్‌ పాత్‌లపైనే తలదాచుకుంటున్నారు. బెంజిసర్కిల్‌, ప్రకాశం బ్యారేజీ, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, ఏలూరు రోడ్డులో ఏ బస్‌స్టాప్‌ను చూసినా ఇదే పరిస్థితి. ప్రదేశమంతా దుర్వా సన వస్తోంది. ప్రస్తుతం విజయవాడ పాల నా కేంద్రంగా మారింది. వలసలు పెరిగాయి. వాణిజ్య సముదా యా లు వచ్చి వాలుతు న్నాయి. ప్రముఖులు, పర్యాటకుల రాకపో కలు పెరిగాయి. ఈ తరుణంలో ఫుట్‌పాత్‌లు, బస్‌స్టాప్‌లను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంచాలనేది కార్పొరేషన్‌ అధికా రుల ఆలోచన. దీనిలో భంగా గూడు లేని దినసరి కూలీలు, యాచకులకు నీడను కల్పిం చడానికి రూ.కోటి20లక్షలతో జాతీయ పట్టణ జీవనోపాధి పఽథకం కింద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు నైట్‌షెల్టర్లను ఏర్పా టు చేశారు. వాటి నిర్వహణ బాధ్యతలను రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌, వాసు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు.
 
సకల సదుపాయాలు
వివిధ ఫుట్‌పాత్‌లు, బస్‌షెల్టర్లలో ఉన్న వారిని ఈ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్తించి నైట్‌షెల్టర్లకు తరలి స్తారు. వారి ఆధార్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకుని లోపల ఆశ్ర యం ఇస్తారు. వారికి పడుకోవడానికి పరుపులను కేటాయిస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన సదుపాయం కల్పించారు. ఒక్కో షెల్డర్‌లో వంద మంది నిరాశ్రయులు ఉం టారు. ఒక్కో భవనాన్ని రెండంతస్తుల్లో నిర్మిం చారు. ఇందులో పై అంతస్తును అనారో గ్యంతో ఉన్న వారికి కేటాయించారు. ఎవరెవరు ఏయే సమయాల్లో బయటకు వెళ్తున్నారు, మళ్లీ తిరిగి ఏయే సమయాల్లో తిరిగి వచ్చేదీ నమోదుకు ఒక రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నారు. ఆధార్‌ కార్డు లేని వారికి ఇక్కడి సిబ్బందే ఆధార్‌ నమోదు చేయిస్తున్నారు. రాత్రివేళలో రూట్స్‌ సభ్యులు, పోలీసుల సహకారంతో నగరం లో డ్రైవ్‌ నిర్వహించి నిరాశ్రయులను బస్సుల ద్వారా ఇక్కడకు తరలిస్తారు. వినోదం కోసం టీవీ లను ఏర్పాటు చేశారు. వారి సంరక్షణకు ఉదయం ముగ్గురు, సాయంత్రం ముగ్గురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఆహారం తయారీకి ఒక వంట మనిషి, శుభ్రం చేయ డానికి స్వీపర్‌, ఆయాలు విధులు నిర్వర్తి స్తారు. ప్రతి 15 రోజులకొకసారి రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌కు చెందిన వైద్యులు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేస్తారు.
 
 
సుందర నగరమే లక్ష్యం
విజయవాడ రాజధాని అయ్యాక ప్రముఖుల రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. వాళ్లలో చాలా మంది తలదాచుకోవడానికి గూడు లేక ఫుట్‌పాత్‌లు, బస్‌షెల్డర్లను ఉప యోగించుకుంటున్నారు. యాచకుల వల్ల అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి వాళ్లకు ఆశ్రయం కల్పించడానికే నైట్‌ షెల్డర్‌లను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌ భావించారు. ఇక్కడ 24 గంటల పాటు రూట్స్‌ ఫౌండేషన్‌, వాసు సంస్థలు సేవలందిస్తాయి.
-ఎం.వి.సత్యనారాయణ, కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌
 
 
ఆరోగ్యకర జీవనం కల్పిస్తాం
జీవనోపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దినసరి కూలీలు అద్దెలను భరించలేక ఫుట్‌పాత్‌లు, బస్‌షెల్టర్లలోనూ పడుకుంటున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నా యి. వారితో పాటు అనాఽథలకు నీడ ఇవ్వడానికి ప్రత్యేకంగా నైట్‌ షెల్టర్‌ ను ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ బాధ్యత మాకు అప్పగించారు. నైట్‌ షెల్డర్‌లో ఉంటున్న వారికి ఆరోగ్యకర జీవనం కల్పించడమే లక్ష్యం. వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తాం. నిరాశ్రయులకు భోజన సదుపాయాలను కల్పించే బాధ్యత మేమే నిర్వహిస్తున్నాం.
- డాక్టర్‌ పి.వి.ఎస్‌. విజయభాస్కర్‌, చైర్మన్‌, రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌
Link to comment
Share on other sites

టీటీడీ ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం
04-09-2018 07:28:49
 
636716429288806545.jpg
  • వెంకటపాలెం వద్ద కేటాయించిన స్థలంలో భూమి చదును
  • ఐదు ఎకరాల్లో రూ.150 కోట్లతో ఆలయ నిర్మాణం
  • 25 ఎకరాలు కేటాయింపు
తుళ్లూరు: రాజధాని అమరావతిలో వెంకటపాలెం సమీపంలో వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మించేందుకు పనులకు శ్రీకారం చుట్టారు. సోమవారం టీటీ డీకి కేటాయించిన ప్రదేశంలో భూమి చదును చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రాజధాని ప్రకటించిన మొదట్లోనే రూ.400 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మించటానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనంతవరం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో రాజధానిలో కాకుండా అభిముఖంగా ఉన్న ప్రాంతం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ సమీపంలో నిర్మించాలని టీటీడీ ఆలోచన చేసింది. తర్జన భర్జనల అనంతరం రాజధానిలోనే శ్రీవారి ఆలయం నిర్మించటానికి టీటీడీ నిర్ణయించుకుంది.
 
ఈ మేరకు సీఆర్డీయే 25 ఎకరాలు కేటాయించినట్టు తెలిసింది. ముందుగా ఐదు ఎకరాల్లో ఆలయ నిర్మాణ పనులు తలపెట్టి మిగిలిన 20 ఎకరాల్లో విడతల వారీగా అభివృద్ధి చేయటానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఆర్థిక సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్మిక, విజ్ఞాన, ప్రజా రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇప్పటికే విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక పరంగా నెక్కల్లులో బ్రహ్మకుమారి అంతర్జాతీ ఆధ్యాత్మిక కేంద్రానికి పది ఎకరాలను గతంలో కేటాయించి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయటం జరింగింది. త్వరలోనే టీటీడీ ఆలయ నిర్మాణం రూపుద్దిద్దుకోనుంది
Link to comment
Share on other sites

వైకుంఠపురం రిజర్వాయర్‌.. దసరాకు ముహూర్తం?
04-09-2018 10:10:45
 
636716526442319894.jpg
గుంటూరు: అమరావతి రాజధాని నగరానికి భవిష్యత్తులో నీటి ప్రదాయిని కానున్న వైకుంఠపురం రిజర్వాయర్‌కు దసరా రోజున శంకుస్థాపన నిర్వహించేందుకు జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. విజయదశమి పర్వదినాన ఏ కార్యక్రమం చేపట్టినా అది దిగ్విజయంగా కొనసాగుతుందన్న సెంటిమెంట్‌ ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. అమరావతి రాజధాని శంకుస్థాపన కూడా ఇదే పర్వదినాన జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్టోబర్‌ నెలలో ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియని గుంటూరు అధికారులు వేగవంతం చేశారు. వచ్చేవారంలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ ఎం బాబూరావు తెలిపారు.
 
పులిచింతల ప్రాజెక్టు దిగువున కృష్ణానదికి వచ్చే వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నుంచి వృథాగా దిగువకు విడుదల చేయాల్సి వస్తోన్నది. ఈ సంవత్సరం కూడా సుమారు 30 టీఎంసీల పైగా నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిగా నిండి ఉన్నది. ఇక ఏమాత్రం వరద నీరు వచ్చినా దిగువకు విడుదల చేయక తప్పదు. ఆ నీరంతా వృధాగా దిగువకు వెళ్లిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో అమరావతి పుణ్యక్షేత్రానికి సమీపంలోని వైకుంఠపురం వద్ద ఒక రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
 
ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువున 23వ కిలోమీటర్‌ వద్ద దీని నిర్మాణం చేపడతారు. సుమారుగా 10 టీఎంసీల నీటిని ఇక్కడ నిల్వ చేసే విధంగా బ్యారేజ్‌ డిజైన్‌ చేస్తోన్నారు. ఇందుకోసం రూ.2,247.57 కోట్ల నిధులు అవసరమౌతాయని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం రూ.2,169 కోట్లకు పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. ఏ-ప్రాథమిక అంశాలకు రూ.6.50 కోట్లు, బీ-ల్యాండ్‌కు రూ.77,194.11 టక్షలు, సీ-వర్కులకు రూ.1,08,859.12 లక్షలు, జీ-బ్రిడ్జీలకు రూ.69.70 లక్షలు, ఐ-నేవిగేషన్‌ వర్కులకు రూ.8,800.00 లక్షలు, కే-బిల్డింగ్‌లకు రూ.1,119.52 లక్షలు, ఎల్‌1-మట్టిపనికి రూ.549.50 లక్షలు, ఎల్‌3-సర్వీసు రోడ్లకు రూ.102.44 లక్షలు, ఎం-ప్లాంటేషన్‌కి రూ.500 లక్షలు, ఇతరత్రా ఖర్చులకు రూ.942.50 లక్షలు, ఆర్‌-కమ్యూనికేషన్‌కి రూ.415 లక్షలు, ఎక్స్‌-ఎన్విరాన్‌మెంట్‌, ఎకాలజీకి రూ.100 లక్షలు, ఒక శాతం చొప్పున లేబర్‌ సెస్సు రూ.1,214.58 లక్షలు, జీఎస్‌టీ రూ.14,572.93 లక్షలు, సీనరేజ్‌ ఛార్జీలు రూ.1,677.512 లక్షలు, ఎన్‌ఏసీ 0.1 శాతం చొప్పున రూ.121.43 లోలు, టెండర్‌ పబ్లికేషన్‌కి రూ. 10 లక్షలు కలిపి మొత్తం రూ.2,169 కోట్లుగా ప్రభుత్వం అంచనాలు వేసింది.
 
గత కొద్ది రోజులుగా జిల్లా అధికారులు టెండర్‌ డాక్యుమెంట్లని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోన్నారు. ఈ వారంలోనే టెండర్లు పిలవాలని భావించిననప్పటికీ అనివార్య కారణాల వలన వచ్చే వారానికి వాయిదా వేసినట్లు ఎస్‌ఈ వెల్లడించారు.
Link to comment
Share on other sites

అమరావతిలో ఐదెకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌
పీపీపీ విధానంలో నిర్మాణం

ఈనాడు, అమరావతి: అమరావతిలో వివిధ రకాల వాణిజ్య, పారిశ్రామిక సమావేశాలు, పెట్టుబడిదారుల సదస్సులు వంటివి పెద్దస్థాయిలో నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో(పీపీపీ) రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనుంది. ఐదెకరాలలో రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 12 నెలల్లో నిర్మించాలన్నది ఆలోచన. స్థలాన్ని సీఆర్‌డీఏ 33 ఏళ్లపాటు లీజుకిస్తుంది.
సదుపాయాలు: రెండువేల మంది కూర్చునే సామర్థ్యంతో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మిస్తారు. 900 మంది కూర్చునేందుకు వీలుగా బాంక్వెట్‌ హాల్‌, మూడు సమావేశ మందిరాలు, పది గదులు, రెండు వీఐపీ గదులు, వంటశాలవంటి సదుపాయాలు ఉంటాయి. అవసరానికి తగ్గట్టు మార్చుకునేలా నిర్మాణాలుంటాయి.

విధానం: కన్వెన్షన్‌ సెంటర్‌ను డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) విధానంలో చేపడతారు. ఐదెకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించగా మిగిలిన ప్రదేశంలో అనుమతించిన మేరకు నిర్మాణదారు వాణిజ్య కార్యకలాపాలు చేపట్టవచ్చు. స్థలానికి మొదటి నాలుగేళ్లు ఎకరానికి రూ.లక్ష చొప్పున, ఐదో సంవత్సరం నుంచి ఎకరానికి రూ.ఐదు లక్షల (ఏటా 5శాతం పెరిగేలా) చొప్పున సీఆర్‌డీఏకు లీజు చెల్లించాల్సి ఉంటుంది. స్థూల ఆదాయంలో సీఆర్‌డీఏకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువవాటా ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారిని సీఆర్‌డీఏ ఎంపిక చేస్తుంది. బిడ్‌ డాక్యుమెంట్‌లో సీఆర్‌డీఏకు ఇచ్చే వాటా కనీసం మూడు శాతానికి తగ్గకుండా కోట్‌ చేయాలి. అలాంటి బిడ్‌లనే పరిశీలనకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఏడెకరాల్లో కమర్షియల్‌ మాల్‌.. అమరావతిలో ఏడెకరాల్లో వాణిజ్యమాల్‌- వినోద కేంద్రాన్ని సీఆర్‌డీఏ నిర్మించనుంది. ఓపెన్‌మాల్‌ విధానంలో దీన్ని నిర్మిస్తారు. ఎంపికైన అభివృద్ధిదారుకు సీఆర్‌డీఏ 60 ఏళ్లపాటు స్థలాన్ని లీజుకిస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇటీవలే సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

Link to comment
Share on other sites

అమరావతికి హరిత శోభ
05-09-2018 09:22:53
 
636717361725672097.jpg
అమరావతి: మరింత హరితశోభను చేకూర్చడం ద్వారా అమరావతి రమ ణీయతను ఇనుమడింపజేసేందుకుగాను రాజధానిలోని వివిధ రహదారులు, ఉద్యా నవనాల్లో దేవగన్నేరు చెట్లను నాటేందుకు ఏడీసీ నిర్ణయించింది. ఆంగ్లంలో ప్లుమేరియాగా వ్యవహరించే ఈ వృక్షం నేత్రపర్వం చేసే ఆకర్షణీయమైన పువ్వులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వస్తుతః మెక్సికో దేశానికి చెంది, కాలక్రమంలో ఎన్నెన్నో దేశాలకు వ్యాపించిన ఈ చెట్లకు పూచే పువ్వులను పూజకు కూడా వాడుతుంటారు. మన దేశ వాతావరణ పరిస్థితులకు చక్కగా సరిపోయే ఈ చెట్లు త్వరగా ఎదుగుతాయి కూడా. ఈ లక్షణాల దృష్ట్యా ఇప్పటికే ఈ చెట్లు మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ విరివిగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాజధానిలోని పలు చోట్ల వీటిని పెంచాలని ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి తదితర ఉన్నతాధికారులు భావించారు.
 
ముచ్చటైన మూడు రంగుల పువ్వులతో..
దేవగన్నేరు చెట్లకు పలు రంగుల పువ్వులు పూస్తాయి. అయితే వాటిల్లో ఎరుపు, పసుపు, తెలుపు రంగు పుష్పాలు మిగిలిన రంగులతో పోల్చితే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. దీంతో ఈ మూడు రంగుల పువ్వులుండే చెట్లనే రాజధానిలో నాటాలని ఏడీసీ నిర్ణయించింది. ఒక్కో రంగు పువ్వుల చెట్లు రెండేసి వేల చొప్పున మొత్తం 6,000 చెట్లను అమరావతిలోని పలు ప్రదేశాల్లో నాటనున్నారు.
 
రాజధానికి జీవరేఖగా అభివర్ణించే సీడ్‌ యాక్సెస్‌ రహదారితోపాటు వివిధ ప్రాధాన్య రోడ్లకు పక్కన, డివైడర్లపైన, ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద వీటిని పెంచనున్నారు. వీటితోపాటు అమరావతి సెంట్రల్‌ పార్క్‌, అనంతవరం, మల్కాపురం తదితర ఉద్యానవనాల్లోనూ ఈ చెట్లను నాటనున్నారు. 6,000 దేవగన్నేరు మొక్కల సేకరణ కోసం ఏడీసీ టెండర్లను ఆహ్వానించింది. వీటి మొత్తం ధర రూ.1.68 కోట్లుగా అంచనా వేసిన ఈ సంస్థ ఆసక్తి ఉన్న వారు తమ టెండర్లను దాఖలు చేసేందుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువునిచ్చింది.
Link to comment
Share on other sites

అడవికి ఆ అడ్డూ తొలగింది!
05-09-2018 03:24:01
 
  • ‘వెంకటాయపాలెం’ డైవర్షన్‌కు ఓకే
  • అమరావతికి మరింతగా భూసంపద
  • నిర్ణీత మొత్తం చెల్లించిన సీఆర్డీయే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతికి చేరువగా కొలువు దీరాల్సిన పోలీస్‌, అనుబంధ విభాగాలతోపాటు భారత సైన్య కార్యాలయాల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌ మళ్లింపు (డైవర్షన్‌) ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు చెల్లించాల్సిన నిధులను సీఆర్డీయే పూర్తిగా చెల్లించి.. ఈ మళ్లింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌ మళ్లింపునకు అడ్డంకిగా ఉన్న ఈ ఒక్క అంశం కూడా తొలగిపోయింది. రాజధాని అమరావతికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, అచ్చంపేటకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌ ఉంది. ఈ బ్లాక్‌లోని 1,835 హెక్టార్ల (4,532.45 ఎకరాలు) భూమిని పోలీస్‌, సైన్యం సంబంధిత విభాగాల కార్యాలయాల స్థాపన కోసం తనకు ఇవ్వాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను సీఆర్డీయే కోరింది. దీనిపై గత కొన్ని నెలలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. సీఆర్డీయే ఉన్నతాధికారులు కొర్రీలకు ఎప్పటికప్పుడు సంతృప్తికరమైన సమాధానాలివ్వడంతో కేంద్రం సమ్మతించింది. ఒకదశలో మళ్లింపు సాధ్యం కాదేమోనన్న అనుమానాలు వ్యక్తమవగా, స్వయానా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి, సంబంధిత మంత్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
 
వెంటాడిన నిధుల కొరత..
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నిబంధనల ప్రకారం డైవర్షన్‌ చేసే అటవీ భూమికి సమానంగా అటవీ శాఖకు ఇవ్వాల్సిన ప్రత్యామ్నాయ భూముల్లో అడవులను పెంచడంతోపాటు పదేళ్లపాటు సంరక్షించేందుకు ‘క్యాంపా’(కాంపెన్సీటరీ అఫోరెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌)’కు చెల్లించాల్సిన రూ.219.92 కోట్ల విషయంలోనే ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ మొత్తంలోని రూ.204.26 కోట్లను ఈ ఏడాది మార్చిలోనే చెల్లించినప్పటికీ మిగిలిన రూ.15.66 కోట్లను జమ చేయలేకపోయింది. ఎట్టకేలకు ఆ మొత్తాన్ని సీఆర్డీయే కొద్దిరోజుల క్రితం చెల్లించడంతో నిధుల చెల్లింపు పూర్తయి, ఈ అటవీ భూముల మళ్లింపు ప్రక్రియకు ఉన్న అవరోధం తొలగిపోయింది. అయితే, ఇతర అధికారిక ప్రక్రియలు, నివేదికల సమర్పణలు ముగిసి, భూములు సీఆర్డీయే చేతికి వచ్చేందుకు 3, 4 నెలలు పట్టవచ్చునని తెలుస్తోంది.
 
పచ్చదనం తరగదు
డైవర్షన్‌ ప్రక్రియ ద్వారా సీఆర్డీయేకు దఖలు పడబోతున్న 4,532.45 ఎకరాల్లో 40 శాతం (సుమారు 1813 ఎకరాలు) భూముల్లో మాత్రమే నిర్మాణాలను అనుమతిస్తారు. మళ్లించే అటవీ భూముల్లో 60 శాతం విస్తీర్ణంలో పచ్చదనం ఉండాలి. ఈ దృష్ట్యా వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌లో పచ్చదనానికి అంతగా ఢోకా లేనట్లేనని చెప్పుకోవాలి. మరొకపక్క.. ఈ భూములకు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలో కేటాయించిన 4532.45 ఎకరాల్లో పెద్దసంఖ్యలో వివిధ జాతుల మొక్కలను నాటి, వాటిని జాగ్రత్తగా సంరక్షించడం ద్వారా వాటిల్లో అడవులను రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి పరుస్తుంది.
 
కొండవీడుకు కేంద్ర బృందం
అమరావతికి సమీపాన ఉన్న కొండవీడు అటవీ బ్లాక్‌లోని 2,156 ఎకరాలను మళ్లించి, తనకు అప్పగించాలంటూ సీఆర్డీయే సమర్పించిన ప్రతిపాదనలపై ప్రత్యక్ష పరిశీలన నిమిత్తం కేంద్ర బృందం త్వరలోనే ఇక్కడకు రానున్నట్లు తెలిసింది. ఈ ఫారెస్ట్‌ భూముల్లో అటవీ శాఖ ప్రధాన కార్యాలయం, ఫారెస్ట్‌ అకాడమీ, అటవీ అభివృద్ధి సంస్థ, నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌, కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఇత్యాది అటవీ, పర్యావరణ సంబంధిత కార్యాలయాలన్నింటినీ నెలకొల్పాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగానే కొండవీడు బ్లాక్‌లోని 2,156 ఎకరాల కోసం సీఆర్డీయే.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు నాలుగు ప్రతిపాదనలను పంపింది. వీటిని పరిశీలించిన ఆ శాఖ.. చెన్నై ప్రాంతీయ కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని త్వరలోనే కొండవీడు పంపనున్నట్టు తెలిసింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...