Jump to content

Amaravati


Recommended Posts

అమరావతి రియల్టీకి హోటళ్ల కిక్కు
28-04-2018 00:21:13
 
636604716727785352.jpg
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చెరో వైపున ఉన్న విజయవాడ, గుంటూరులతోపాటు వాటి మధ్య ఉన్న మంగళగిరి ప్రాంతంలో 2, 3 నెలలకో కొత్త
హోటల్‌ ప్రారంభమతోంది. బడ్జెట్‌ హోటళ్లు, సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌, గెస్ట్‌హౌజ్‌లు, స్టార్‌ హోటళ్లు.. ఇలా ప్రతి విభాగంలోనూ కొత్త ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ఆతిథ్య రంగంలోని ఈ జోరుతో రియల్టీ కూడా దూసుకుపోతున్నది. విజయవాడ, గుంటూరు, మంగళగిరితో పాటు రాజధాని పరిధిలోని పలు గ్రామాల్లో కొత్త హోటల్స్‌ వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో రియల్టీ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఫార్చూన్‌ మురళి గ్రూప్‌ అధినేత, ఆంధ్రా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ ముఖ్యనేతల్లో ఒకరైన ముత్తవరపు మురళీకృష్ణ అమరావతి ప్రాంతంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఆతిథ్య రంగం విశేషాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఆ వివరాలు..
 
032.jpg 
 
  •  విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో హాస్పిటాలిటీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ పరిశ్రమ ఆరోగ్యానికి గీటురాళ్లుగా భావించే ఎఆర్‌ఆర్‌ (యావరేజ్‌ రూమ్‌ రెవెన్యూ), రెవ్‌పార్‌ (రెవెన్యూ అవైలేబుల్‌ పర్‌ రూమ్‌)లు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
  • ఐదేళ్ల క్రితం విజయవాడలోని స్టార్‌ హోటళ్లన్నింట్లో కలిపి 2,500 గదులు, బడ్జెట్‌ హోటళ్లు, చిన్న సైజు లాడ్జీల్లో సుమారు 1,500 గదులు ఉండగా గత మూడునాలుగేళ్లలో సుమారు 3,000 వరకూ కొత్త హోటల్‌ గదులు అందుబాటులోకి వచ్చాయి. గుంటూరులో అన్ని కేటగిరీల హోటళ్లలోనూ మొత్తం గదుల సంఖ్య 850 వరకూ ఉండగా కొత్తగా దాదాపు అదే సంఖ్యలో అందుబాటులోకి వస్తున్నాయి.
  • విజయవాడలో తొలి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ‘నోవోటెల్‌’ 200 రూములతో త్వరలో ప్రారంభంకాబోతోంది. రామవరప్పాడు రింగ్‌ సెంటర్‌- కరెన్సీనగర్‌లో ఫార్చూన్‌ మురళీ గ్రూప్‌ ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను 150 గదులతో ప్లాన్‌ చేసింది. ఒకప్పటి బాట్లింగ్‌ ప్లాంట్‌ ప్రాంగణంలో భారీ హోటల్‌ కమ్‌ మాల్‌ రాబోతోంది. గురునానక్‌నగర్‌కు సమీపంలో షెరటన్‌ గ్రూప్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ప్రతిపాదించింది. గొల్లపూడి వద్ద టూ స్టార్‌ హోటళ్లు మూడు ఏర్పాటుకానున్నాయి. విజయవాడ- కంకిపాడుల మధ్య మరో మూడు స్టార్‌ హోటళ్లురానున్నాయి. ఫెయిర్‌మౌంట్‌, రమడ గ్రూపులు వీటిని నిర్మిస్తున్నాయి. రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోనూ ఒక టూ స్టార్‌ హోటల్‌ వస్తోంది.
  • గుంటూరులో.. ఐటిసి గ్రూపు ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను నిర్మిస్తుండగా, బొమ్మిడాల గ్రూప్‌, జనచైతన్య గ్రూప్‌ చెరొక ఫోర్‌ స్టార్‌ హోటల్‌ను నిర్మిస్తున్నాయి. మంగళగిరి పరిసరాల్లో.. మంజీరా గ్రూపు రాడిసన్‌ గ్రూప్‌, ఎల్‌ఇపిఎల్‌లో మారియట్‌ గ్రూప్‌ ఒక్కొక్కటి 150 గదులతో నాలుగు స్టార్‌ హోటళ్లను నిర్మించనున్నాయి. కనకదుర్గమ్మ వారిధి వద్ద 100 రూమ్‌లతో రమడ గ్రూపు త్రీ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేయనుంది. హాలీడే ఇన్‌ వంటి పలు ఇతర గ్రూపులు కూడా రాజధాని ప్రాంతంలో హోటళ్ల స్థాపనపై ఆసక్తిని కనబరుస్తున్నాయి.
  • గతంలో కోర్‌ సిటీలో ఉన్న హోటళ్లకే బిజినెస్‌ బాగుండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌ బుకింగ్స్‌తోపాటు, మొబైల్‌ యాప్స్‌ కూడా రావడంతో దూరంగా ఉన్న హోటళ్లకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో పలువురు స్థలాల ధరలు తక్కువగా ఉండే ప్రదేశాల్లో భూములను కొనుగోలు చేసి, హోటళ్లను నిర్మిస్తుండటంతో ఈ రంగానికి ఊపు వచ్చింది.
                                                                                 - ఆంధ్రజ్యోతి (అమరావతి)
Link to comment
Share on other sites

బీఆర్‌ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టులో కదలిక!
నేల చదును కార్యక్రమం ప్రారంభం
త్వరలో ఐయూఐహెచ్‌ మెడిసిటీ పనులూ
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఎట్టకేలకు కొంత కదలిక వచ్చింది. అబుదాబీకి చెందిన బీఆర్‌షెట్టి, బ్రిటన్‌కు చెందిన ఇండోయూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌) సంస్థలు అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బిఆర్‌ షెట్టి సంస్థకు మెడిసిటీ ప్రాజెక్టు కోసం దొండపాడు వద్ద సీఆర్‌డీఏ 100 ఎకరాలు కేటాయించింది. ప్రాజెక్టుకి 2017 ఆగస్టులోనే శంకుస్థాపన జరిగింది. వివిధ కారణాల వల్ల ప్రాజెక్టులో జాప్యం చోటుచేసుకుంది. ఈ నెల 13న సీఆర్‌డీఏకి, బీఆర్‌ షెట్టి సంస్థకు మధ్య భూముల అమ్మకపు ఒప్పందం (అగ్రిమెంట్‌ ఫర్‌ సేల్‌) జరిగింది. ఆ సంస్థకు సీఆర్‌డీఏ భూమి ఇది వరకే అప్పగించింది. ఆ ప్రదేశంలో నేల చదును చేసే పనుల్ని సంస్థ ప్రారంభించింది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. అమరావతి మెడిసిటీ ప్రాజెక్టుకి సంబంధించి వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలతో బీఆర్‌ షెట్టి సంస్థ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రాజెక్టుపై తొలి దశలో ఆ సంస్థ రూ.6,500 కోట్లు వెచ్చించనుంది. బీఆర్‌ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టులో భాగంగా 11 విభాగాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. వాటిలో వైద్య విశ్వవిద్యాలయం, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థ, స్టెమ్‌ సెల్‌ విభాగం, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్కూల్‌, క్వాంటమ్‌ అనలిటిక్స్‌, నాచురోపతి-యోగా, 3నక్షత్రాల హోటల్‌, సర్వీసు అపార్ట్‌మెంట్లు వంటివి ఉన్నాయి. ఆ సంస్థ మొదట ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయనుంది.

భారీ స్థాయిలో ఇండో-యూకే ప్రాజెక్టు
లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్‌ కళాశాల ఆసుపత్రి భాగస్వామ్యంతో ఐయూఐహెచ్‌ సంస్థ అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టుని చేపట్టనుంది. యర్రబాలెం గ్రామానికి సమీపంలో ఈ ప్రాజెక్టుకి సీఆర్‌డీఏ స్థలం కేటాయించింది. తొలి దశలో 50 ఎకరాలు ఇచ్చింది. తొలి దశ ప్రాజెక్టు పూర్తయితే, మరో 100 ఎకరాలు కేటాయించనుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి త్వరలోనే అమ్మకపు ఒప్పందం జరగనుంది. అవసరమైన పత్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకీ 2017 ఆగస్టులోనే శంకుస్థాపన జరిగింది. ప్రాజెక్టులో జాప్యం జరుగుతుండడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్‌ వెళ్లినప్పుడు ఆ సంస్థ సీఈఓ అజయ్‌ రాజన్‌గుప్తాతో చర్చించారు. మొదట ఒక క్లినిక్‌ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు ప్రారంభించాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టులో తొలిదశలో ఐయూఐహెచ్‌ సంస్థ రూ.వెయ్యి కోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు వల్ల 10 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా వేయి పడకల కింగ్స్‌ కళాశాల ఆసుపత్రి, నర్సింగ్‌ స్కూల్‌, పారామెడికల్‌ శిక్షణ కేంద్రం, క్యాన్సర్‌ యూనిట్‌ వంటివి ఏర్పాటవుతాయి. ఐదు నక్షత్రాల హోటల్‌నూ నిర్మిస్తారు.

Link to comment
Share on other sites

సీఆర్‌డీఏలో వివిధ సంస్థలు, కార్యాలయాలకు 51.92 ఎకరాలను అమరావతిలో కేటాయించేందుకు అంగీకారం తెలిపారు.
 
 
సీబీఐకి ఎకరానికి రూ. కోటి చొప్పున మూడున్నర ఎకరాలు.. విదేశీ వ్యవహారాల శాఖకు రెండు ఎకరాలు.. ఇగ్నోకు 80 సెంట్లు.. ఇండియన్ మెటరోలాజికల్ శాఖకు ఎకరా రూ. కోటి చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా యూనియన్ బ్యాంకు 1.57 ఎకరాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 1.55 ఎకరాలు, ఇండియన్ బ్యాంకుకు 1.50 ఎకారాలను ఎకరానికి రూ. 4 కోట్లు చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:
సీఆర్‌డీఏలో వివిధ సంస్థలు, కార్యాలయాలకు 51.92 ఎకరాలను అమరావతిలో కేటాయించేందుకు అంగీకారం తెలిపారు.
 
 
సీబీఐకి ఎకరానికి రూ. కోటి చొప్పున మూడున్నర ఎకరాలు.. విదేశీ వ్యవహారాల శాఖకు రెండు ఎకరాలు.. ఇగ్నోకు 80 సెంట్లు.. ఇండియన్ మెటరోలాజికల్ శాఖకు ఎకరా రూ. కోటి చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా యూనియన్ బ్యాంకు 1.57 ఎకరాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 1.55 ఎకరాలు, ఇండియన్ బ్యాంకుకు 1.50 ఎకారాలను ఎకరానికి రూ. 4 కోట్లు చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

Amaravati is finding most of the funds itlsef....:super:....GOvt 10K acres is valued 45,000 crores....best economical city building

 

Modi gadi edupu ade asalu...anduke minimum ivvalsinavi koda ivvakunda tokkutunnadu

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

19 minutes ago, mahesh1987 said:

 

 

enti ninna malle leak ayyaya water :(

ekkada news ledani check chesthe idi last year di ani telisindi

 tuesday ani vundi ani last year news ni ninnati news laaga tipputunnaru mana it cell em chestunnaro ento

 

 

Edited by mahesh1987
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...