Jump to content

Amaravati


Recommended Posts

పచ్చదనానికి పెద్దపీట
03-05-2018 08:57:21
 
636609346453724815.jpg
  • రాజధాని రోడ్లలో గ్రావెల్‌ దశలోనే నాటిన పొడవాటి మొక్కలు
  • వినియోగంలోకి వచ్చేసరికి చల్లదనం, ఆహ్లాదం
 
తుళ్ళూరు: రాజధాని ప్రాంతంలో నూతనంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్న ప్రధాన రహదారుల పక్కన పచ్చదనం పరచుకోవటానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గ్రావెల్‌దశలో ఉన్న రోడ్లకు ఒకవైపున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అవసరమైతే రెండోవైపు కూడా మొక్కలు నాటటానికి చర్యలు తీసుకుంటామని ఏడీసీ అధికారులు చెపుతున్నారు. దీంతో సుందరంగా రాజధాని రహదారులు రూపుదిద్దుకోన్నాయి. రోడ్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చే సరికి చల్లటి నీడనిచ్చే చెట్లుగా ఇప్పుడు నాటిన మొక్కలు ఎదుగుతాయని ఏడీసీ అధికారులు చెపుతున్నారు. రాజధానిలో ఏడు ప్రధాన రహదారులు వాటికి అనుసంధానంగా ఉండే ముఖ్యమైన 24రోడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
 
గ్రావెల్‌ దశలో ఉండగానే రాజధాని నర్సరీలలో పెరుగుతున్న పొడవాటి మొక్కలను తీసుకొచ్చి ఈ రోడ్ల వెంట నాటుతున్నారు. ప్రస్తుతం 15 వేల మొక్కలను నాటుతున్నట్లు ఏడీసీ అధికారులు తెలిపారు. వర్షాకాల ప్రారంభ దశలో ఇంకా ముమ్మరంగా మొక్కలు నాటే అవకాశం ఉందని అప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు. మొక్కలు నాటే దానితో పాటు అండర్‌ గ్రౌండు డ్రైనేజీ, కేబుల్‌ కోసం పైపుల వేస్తున్నారు. అందుకు లోతైన కందకాలను రోడ్ల మధ్యలో పక్కన తవ్వుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి శ్రీ పైపుల కంపెనీ ద్వారా నాణ్యమైన పైపులను రాజధానిలోకి వస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే రాజధాని ప్రాధాన్యత రోడ్లు, 2019 జనవరి నాటికి పూర్తి అవుతాయని టెండర్లు దిక్కంచుకొని పనులు చేస్తున్న కంపెనీలు చెపుతున్నాయి. మళ్లీ మళ్లీ తవ్వకుండా ముందుగానే అండర్‌ గ్రౌండుకు సంబంధించిన కేబుల్‌ డ్రైనేజీ వ్యవస్థ కోసం లోతైన తవ్వకాలు చేసి పైపులను అందులోకి దింపుతున్నారు. దీంతో భవిషత్తులో ఎటువంటి అండర్‌ గ్రౌండు సమస్య వచ్చినా మనిషి వెళ్ళి ఫ్రీగా మరమ్మతులు చేయటానికి అవకాశం ఉండే విధంగా పెద్ద పెద్ద పైపులను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లు పూర్తి అయితే రాజధాని స్వరూపమే మారిపోనుంది.
Link to comment
Share on other sites

సీఆర్‌డీఏ పరిధిలో సీబీఐకి మూడున్నరెకరాలు, ఇగ్నోకు 80 సెంట్లు, భారతీయ వాతావరణశాఖకు శాఖకు ఎకరా, విదేశీ వ్యవహారాలశాఖ విదేశీ భవన్‌ కోసం రెండెకరాల భూమి ఎకరా రూ.కోటికి కేటాయింపు. యూనియన్‌ బ్యాంకుకు 1.57 ఎకరాలు, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు 1.55 ఎకరాలు, ఇండియన్‌ బ్యాంకుకు 1.50 ఎకరాలను ఎకరా రూ.4 కోట్ల చొప్పున కేటాయింపు. సెంట్రల్‌ చిన్మయ్‌ ట్రస్టుకు 3 ఎకరాలు, రూప్‌టెక్‌ ఎడ్యుకేషనల్‌ ఇండియాకు 4 ఎకరాలు, ఏపీ ట్రాన్స్‌కోకు 2.59 ఎకరాలు, ఏపీఈడీబీకి రెండెకరాలు, ఏపీ పోలీసు నిఘా విభాగానికి 2వేల చదరపు గజాలు, రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు రెండెకరాలు, ఎన్‌లెర్న్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మూడెకరాలు, సెయింట్‌ లారెన్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకి నాలుగెకరాలు, సద్భావన నాలెడ్జ్‌ ఫౌండేషన్‌కు నాలుగెకరాలు, ఆనందిలాల్‌ గణేష్‌ పొడార్‌ సొసైటీకి మూడెకరాలు, హైదరాబాద్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీకి 8 ఎకరాలు, గ్లోబల్‌ స్కూల్స్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నాలుగెకరాల కేటాయింపు. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి, డీప్‌వాటర్‌ పోర్టు-ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌, ఉత్పత్తి జోన్‌ ఏర్పాటుకు అవసరమైన రూ.1092 కోట్ల రుణానికి రాష్ట్రప్రభుత్వమే గ్యారెంటీగా ఉండేందుకు ఆమోదం.

Link to comment
Share on other sites

ఇబ్రహీంపట్నం-లింగాయపాలెం మధ్య తాత్కాలిక జెట్టీల ఏర్పాటుకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టరు జీటీ రామారావుకు అనుమతి. సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకూ రోల్‌ ఆన్‌, రోల్‌ ఆఫ్‌ సర్వీసుల నిర్వహణకు అనుమతి.

Link to comment
Share on other sites

  •  అమరావతి పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు 51.92 ఎకరాలు కేటాయింపు. సీబీఐకి 30 సెంట్లు, ఇగ్నోకు 80 సెంట్లు, భారత వాతావరణ శాఖకు రెండెకరాలు, విదేశీ వ్యవహారాల శాఖకు రెండెకరాలు కేటాయించారు. వీటికి ఎకరం రూ.కోటి చొప్పున విలువ వసూలు చేస్తారు. ఇక... యూనియన్‌ బ్యాంకుకు 1.57 ఎకరాలు, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు 1.55 ఎకరాలు, ఇండియన్‌ బ్యాంకుకు 1.5 ఎకరాలు కేటాయించారు. వీటికి ఇచ్చే భూమిని ఎకరాకు రూ.4 కోట్ల చొప్పున విలువ కట్టారు. సెంట్రల్‌ చిన్మయి ట్రస్ట్‌కు మూడు ఎకరాలు, రూప్‌టెక్‌ ఎడ్యుకేషనల్‌ ఇండియాకు 4ఎకరాలు, ఏపీ ట్రాన్స్‌కోకు సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు 2.59ఎకరాలు, ఏపీఈడీబీకి రెండెకరాలు, ఏపీ పోలీస్‌ శాఖ నిఘా విభాగానికి రెండువేల చదరపు గజాలు, స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబలేటరీకి రెండెకరాలు, ఎన్‌లెర్న్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మూడు, లారెన్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ట్రస్టుకు నాలుగు, సద్భావన నాలెడ్జ్‌ ఫౌండేషన్‌కు నాలుగు, ఆనందిలాల్‌ గణేశ్‌ పొద్దార్‌ సొసైటీకి మూడు, హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీకి 8, గ్లోబల్‌ స్కూల్స్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నాలుగెకరాలు కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం.
  •  గతంలో బ్రహ్మకుమారీస్‌ సొసైటీ పేరుతో ఇచ్చిన 10ఎకరాలను బ్రహ్మకుమారీస్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ పేరుకు మార్చుకునేందుకు అంగీకరించింది.
  •  సీఆర్‌డీఏ పరిధిలో గతంలో జేవియర్‌ స్కూల్‌ ఆప్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో కేటాయించిన 50ఎకరాల భూమిని జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేరుకు మార్చుకునేందుకు అంగీకరించింది.
Link to comment
Share on other sites

సీఆర్డీఏపై చంద్రబాబు సమీక్ష
03-05-2018 14:51:57
 
636609559217473284.jpg
అమరావతి: సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో సంస్థల వారీగా నిర్మాణాల పురోగతిపై... అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్మాణాలు చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణంపై వర్చువల్ సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి పనుల పురోగతిని సమీక్షిస్తానన్నామని సీఎం చెప్పారు. భూముల కేటాయింపు, టెండర్ షెడ్యూల్స్.. ప్రాజెక్టుల తాజా సమాచారం, వాటర్ ఫ్రంట్ ఇంజనీరింగ్‌పై చంద్రబాబు చర్చించారు.
Link to comment
Share on other sites

రాజధానిలోఐటీ పార్క్ టవర్‌పై ప్రజెంటేషన్
03-05-2018 16:16:04
 
అమరావతి: రాజధానిలోఐటీ పార్క్ టవర్‌పై షాపూర్‌జి గ్రూప్ ప్రజెంటేషన్ ఇచ్చింది. షాపూర్‌జి గ్రూప్ ప్రజెంటేషన్‌ను చూసి సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఐటీ టవర్‌ రాజధాని నిర్మాణాలతో కలిసి పోయేలా ఉండాలని, ఎస్‌ఆర్ఎం వర్సిటీ ఇండస్ట్రియల్ రిసెర్చ్ పార్క్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్సిటీ విస్తరణ ప్రతిపాదనలను సీఎంకు ఎస్ఆర్ఎం అందజేసింది. అమృత యూనివర్సిటీ ప్రత్యేకతలను ప్రతినిధులు వివరించారు.
Link to comment
Share on other sites

జాప్యాన్ని సహించను
భూ కేటాయింపుల్ని పునఃసమీక్షించాల్సి వస్తుంది
  అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
  ఐయూఐహెచ్‌ ఉదాసీనతపై అసహనం
ఈనాడు - అమరావతి
3ap-main4a.jpg

రాజధాని అమరావతిలో భూములు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చెప్పిన గడువులోగా నిర్మాణాలు మొదలు పెట్టకుండా తాత్సారం చేస్తే భూ కేటాయింపులను సమీక్షించాల్సి వస్తుందని హెచ్చరించారు. బ్రిటన్‌కు చెందిన ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌) సంస్థ అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టు చేపట్టడంలో చేస్తున్న జాప్యంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజధాని పనుల పురోగతిపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతికి ఎల్‌పీజీ, పెట్రోలు, ఎల్‌ఎన్‌జీ, డీజిల్‌, సీఎన్జీ, బ్యాటరీలు, బస్సులకు సోలార్‌ పవర్‌సెల్స్‌ వంటివి అందజేసేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ సంసిద్ధత తెలియ జేసింది. రాజధాని ఇంధన అవసరాలు తీర్చేందుకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నామని ఆ సంస్థ డైరెక్టరు (ఆర్‌ అండ్‌ డీ) ఎస్‌.ఎస్‌.వి.రామ్‌ కుమార్‌,  మార్కెటింగ్‌ విభాగం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ జి.ఎస్‌.పి.సింగ్‌ ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతిలో వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తమ సంస్థ అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఆధునిక ఇంధన సరఫరా కేంద్రాలు, కంపెనీ అవుట్‌లెట్‌లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలు, పైప్‌లైన్ల నమూనాల్ని ఐవోసీ అధికారులు ఆడియో విజువల్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఐవోసీ ప్రణాళికపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘అమరావతిని కార్బన్‌ డయాక్సైడ్‌ న్యూట్రల్‌ నగరంగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. మీ కార్యక్రమాల్ని మా విజన్‌కు తగ్గట్లుగా రూపొందించండి’ అని ఐవోసీ అధికారులకు సీఎం సూచించారు.

అమరావతిలో ఇంతవరకూ భూములు తీసుకున్న సంస్థలు, వాటి తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీలు, ఎన్‌ఐడీ, ఐయూఐహెచ్‌, ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, బ్రహ్మకుమారీస్‌ వంటి సంస్థల తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ‘అమరావతి నిర్మాణంలో మీది కీలక పాత్ర. మేం ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నాం. మీరు వేగంగా, సమర్థంగా పనిచేయాలి’ అని సూచించారు. ఈ నెలాఖరుకు శంకుస్థాపన చేసి ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎల్‌వీ ప్రసాద్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమరావతిలో తాము ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ పార్కుపై ఎస్‌ఆర్‌ఎం- అమరావతి యూనివర్సిటీ ప్రొ వైస్‌ఛాన్స్‌లర్‌ నారాయణరావు ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాజధానిలో రోడ్లు, ఇతర ప్రధాన మౌలిక వసతుల పనులు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతున్నాయని, వర్షాకాలం ప్రారంభయ్యే నాటికి రోడ్లు సిద్ధమవుతాయని ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి తెలిపారు.

* రాజధానిలో తదుపరి దశ పనులకు అవసరమైన నిధుల్ని ఈ నెలాఖరుకు సమకూర్చుకోగలమని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఆంధ్రాబ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, విజయా బ్యాంకులతో ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. హడ్కో, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకుల ప్రతినిధులనూ కలిశామని, వారు త్వరలోనే నిధులు విడుదల చేస్తారని వివరించారు.
* రాజధానిలో నిర్మింటే ఐటీ టవర్‌, ఐటీ పార్కు ఆకృతుల్ని షాపూర్జీ గ్రూపు ప్రతినిధులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వాటిలో కొన్ని మార్పులు సూచించారు. ఆకృతి నవ్యతకు ప్రతిబింబంగా ఉండాలని తెలిపారు.
* కృష్ణా నదీ తీరంలో చేపట్టే నిర్మాణాలు పర్యావరణానికి హాని కలగని రీతిలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అమరావతిని వరద నుంచి కాపాడే రైట్‌ ఫ్లడ్‌ బ్యాంక్‌ రీ అలైన్‌మెంట్‌ పనుల్ని అధికారులు వివరించారు. 12.36 కి.మీ. పొడవైన ఈ నిర్మాణం అత్యంత కీలకమైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నదీ తీరంలో సైకిల్‌ ట్రాక్‌లు, నడకదారులు, ఇ-టాయిలెట్స్‌తో కూడిన పార్కులు, యాంఫీ థియేటర్‌, బోటింగ్‌, ఘాట్స్‌ తదితర సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి సూచనలిచ్చారు.

148 అన్న క్యాంటీన్లు
రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు జరుగుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు 148 స్థలాలు ఇప్పటికే గుర్తించామని, వాటిలో 100 స్థలాల్ని ఏజెన్సీలకు అప్పగించామని పురపాలకశాఖ సంచాలకుడు కె.కన్నబాబు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి పి.నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్‌, అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

నిర్మాణాల్లో వేగం పెరగాలి
04-05-2018 02:53:05
 
636609991893880122.jpg
  • భూములు పొందిన సంస్థలకు సీఎం స్పష్టీకరణ..
  • సీఆర్‌డీఏపై సమీక్ష.. ఐటీ టవర్‌పై సూచనలు
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల పనులు, ఇతర ప్రాజెక్టులను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు... అధికారులను ఆదేశించారు. ఇది చాలా కీలక సమయమని, ప్రారంభించిన పనులు పూర్తిచేయకుంటే కొత్త సమస్యలు వస్తాయన్నారు. సీఆర్‌డీఏ ప్రాజెక్టులు, రాజధానిలో స్థలాలు పొందిన యూనివర్సిటీలు, వైద్య ఆరోగ్య సంస్థల నిర్మాణ పురోగతిని గురువారం సచివాలయంలో సమీక్షించారు. హ్యాపీ సిటీస్‌ సదస్సు నిర్వహణ తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలు, భూముల కేటాయింపులు, టెండర్ల షెడ్యూళ్లు, ప్రాజెక్టుల పురోగతి, వాటర్‌ ఫ్రంట్‌ ఇంజినీరింగ్‌ తదితర అంశాలపై చర్చించారు. భూములు పొంది ఇంకా నిర్మాణాలు ప్రారంభించని సంస్థల ఉదాసీనత వైఖరిపై తిరిగి సమీక్ష చేయాలన్నారు. విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, ఎల్‌వీ ప్రసాద్‌, జేవీఎల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, బ్రహ్మకుమారీస్‌ ఆధ్యాత్మిక యూనివర్సిటీలు ఏ మేరకు నిర్మాణాలు పూర్తిచేశాయో, ఏయే దశాల్లో ఉన్నాయో వివరించే వీడియోలను సీఎం పరిశీలించారు. అలక్ష్యం సరికాదని, చాలా ఆలస్యం చేస్తున్నారని ఇండో-యూకే హెల్త్‌ యూనివర్సిటీని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాలు, ఎన్జీవోల గృహాల పథకాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వాటర్‌ ఫ్రంట్‌ ఇంజనీరింగ్‌ పనులను సమీక్షిస్తూ... పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నిర్మాణాలు అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అన్న క్యాంటీన్లు ఆకర్షణీయంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఐటీ పార్క్‌ టవర్‌ నిర్మాణానికి సంబంధించి షాపూర్‌జీ ఇచ్చిన గ్రూప్‌ ప్రజెంటేషన్‌ను సీఎం వీక్షించి, కొన్ని సూచనలు చేశారు. నిర్మాణ డిజైన్‌ నవ్యతను ప్రతిబింబించాలని, అయితే రాజధాని నగర నిర్మాణాల డిజైన్లతో వైరుధ్యం ఉండకూడదని స్పష్టంచేశారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎం ఇండస్ర్టియల్‌ రిసెర్చ్‌ పార్కుపై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రతినిధి బృందం ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అమృత యూనివర్సిటీ ప్రతినిధులు వారి క్యాంపస్‌ నిర్మాణాల పురోగతిని సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, సీఎంవో అధికారులు సతీశ్‌చంద్ర, సాయిప్రసాద్‌, గిరిజాశంకర్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సీసీఎండీసీ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

2నెలల్లో హైకోర్టు ఆకృతి పూర్తి: మంత్రి నారాయణ

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధానిలో మరో రెండు నెలల్లో హైకోర్టు నిర్మాణాల ఆకృతి పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ముగిస్తామని పురపాలకశాఖ మంత్రి డా.పి.నారాయణ తెలిపారు. రాజధాని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో రహదారులు పూర్తి చేస్తామన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో జరుగుతున్న రాజధాని పనులను మంత్రి నారాయణ, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి గురువారం పరిశీలించారు.అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాజధానిలో నిర్మించే అన్ని రహదారులు వచ్చే డిసెంబరు-మార్చినాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

ఏపీ సర్కార్ సంకల్పాన్ని నెరవేర్చడంలో సీఆర్డీఏ ఫెయిలయిందా?
04-05-2018 08:56:35
 
636610209991073834.jpg
  • అలసత్వంపై అసంతృప్తి!
  • రాజధానిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై పెదవివిరుపు
  • సీఆర్డీయే అధికారుల ప్రకటనలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు
  • సచివాలయ నిర్వహణ, గ్రీనరీ పనుల్లో సైతం స్థానికులకు మొండిచెయ్యే..
  • నిర్మాణ కార్యకలాపాల్లోనూ స్థానం లేదు..
  • సమావేశాల్లో సీఆర్డీయే అధికారులను ప్రశ్నిస్తున్న వైనం
అమరావతి: రాజధాని గ్రామాల్లోని రైతులతోపాటు అన్ని వర్గాల శ్రేయస్సుకు అవసరమైన సకల చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడంలో సీఆర్డీయే అనుకున్నంతగా సఫలీకృతమవడం లేదన్న వ్యాఖ్యలు విస్తృతంగా వినవస్తున్నాయి. రాజధానిలో అంతకంతకూ పెరిగే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తమకు సముచిత ప్రాధాన్యం లభించేలా చూస్తామని ఈ సంస్థ అధికారులు తరచుగా చేసే ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడం లేదని పలువురు రాజధాని వాసులు ఆరోపిస్తున్నారు.
 
అమరావతి నిర్మాణ ప్రక్రియలో రాజధానివాసులు ముమ్మరంగా నిమగ్నమయ్యేందుకు అవసర మైన శిక్షణను సైతం ఇప్పించడమే కాకుండా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించేందుకంటూ సీఆర్డీయే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సామాజికా భివృద్ధి ఇత్యాది విభాగాలు ఆ దిశగా కొంత కృషి చేస్తున్నప్పటికీ అది చాలదంటున్నారు. దీంతోపా టు పూలింగ్‌ సమయంలో ఇచ్చిన వాగ్దానాలమేరకు తమకు అందజేసిన ఆరోగ్యకార్డుల వల్ల కూడా ఆశించిన ప్రయో జనం ఉండడం లేదని వాపోతు న్నారు. పైన పేర్కొన్న సమస్యలను సీఆర్డీయే ఉన్నతాధి కారులకు పలు పర్యాయాలు తెలిపినప్పటికీ తగిన స్పందన లేదని భావిస్తున్న వీరు రాజధానిలోని వివిధ గ్రామాల్లో ఈ సంస్థ నిర్వహించే సమావేశాల్లో వాటిని ప్రస్తావిస్తుండడం పరిపాటైంది.
 
 
తాజాగా.. తుళ్లూరు మండలంలోని నేల పాడులో రాజధాని వాసుల జీవనోపా ధుల మెరుగుదలపై సీఆర్డీయే మంగళవారం నాడు నిర్వహించిన సమావేశంలో సైతం స్థానిక యువత, మహిళలు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇకనైనా తమకు అమరావతిలో జరుగుతున్న పనుల్లో సముచిత ప్రాధాన్యం కల్పించడం ద్వారా మెరుగైన ఉపాధి కల్పించాలని కోరిన వారు నిర్మాణ సంస్థల్లో క్యాంటీన్లు, దుకాణాలు పెట్టుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిర్దిష్ట విద్యార్హతలు, నైపుణ్యం అవసరం లేని ఉద్యోగాలను సైతం తమకు ఇవ్వకుండా, స్థానికేతరులకు కొన్ని కాంట్రాక్ట్‌ సంస్థలు పెద్దపీట వేస్తున్నా సీఆర్డీయే అధికారులు స్పందించరేమిటని గట్టిగా ప్రశ్నించారు.
 
 
హౌస్‌ కీపింగ్‌, గార్డెనింగ్‌ పనుల్లోనూ...
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్వహణ (హౌస్‌ కీపింగ్‌), వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న పచ్చదనం అభివృద్ధి, నిర్వహణ ఇత్యాది పనుల్లోనూ స్థానికులకు కల్పిస్తున్న అవకాశాలు స్వల్పమేనన్నది రాజధాని వాసుల ఆరోపణ. వీటిల్లో కాంట్రాక్ట్‌ తీసుకున్న కొన్ని కంపెనీలు వాటిల్లో పనులు చేసేందుకు స్థానికేతరులకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలాంటి సాధారణమైన పనులకు సైతం రాజధాని మహిళలు, ఇతరులను తీసుకోకుంటే వారికి ఉపాధి ఎలా లభిస్తుందంటున్నారు. అమరావతి నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం కనుమరుగ వడంతో నిన్నమొన్నటి వరకూ ఆ పనుల ద్వారా జీవనం సాగించిన పలువురు ఉపాధి కరవై ఇక్కట్లు పడుతున్నప్పటికీ సీఆర్డీయే అధికారులు వారికి మెరుగైన ప్రత్యామ్నాయ జీవనోపాధిని చూపడంలో ఎందువల్లనో అలసత్వం ప్రదర్శిస్తున్నారని వాపోతున్నారు.
 
 
క్యాంటీన్లు, దుకాణాలు
ఇప్పించాలి..రాజధాని ప్రాంతంలో రోజురోజుకూ మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగు పరచుకోవడమే కాకుండా ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా సైతం రూపాంతరం చెందాలంటూ చెప్పే సీఆర్డీయే ఆ దిశగా తాను చేస్తున్న చర్యలు అంత సంతృప్తికరంగా లేవని పలువురు గ్రామీణ యువత, మహిళలు ఆరోపిస్తున్నారు. అమరావతిలోని పలు ప్రదేశాల్లో వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారులు, భవన సదుపాయాల నిర్మాణ పనుల్లో వేలాదిమంది పని చేస్తున్నారని, ఆయా కంపెనీల్లో అల్పాహారశాలలు, దుకాణాల వంటి వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని తమకు కల్పిస్తే చక్కటి ఉపాధి పొందుతామని, కార్మికులకూ సౌకర్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.
 
 
ఆరోగ్య కార్డులు, విద్య రీయింబర్స్‌మెంట్‌లో సైతం..
పలు వ్యాధుల చికిత్స పొందేందుకంటూ తమకు అందజేసిన ఆరోగ్య కార్డుల వల్ల కూడా అధికారులు చెప్పినంత ప్రయోజనం కలుగడం లేదని రాజధాని వాసులు ఉదాహరణలతో సహా పేర్కొంటున్నారు. చాలా ఆస్పత్రులు ఈ కార్డులను పరిగణనలోకి తీసుకోకుండా తమ నుంచి పెద్దమొత్తాలను వసూలు చేస్తున్నాయని, ఈ విషయాన్ని వివిధ సందర్భాల్లో సీఆర్డీయేకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం శూన్యమని ఆరోపిస్తున్నారు. తమ పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం ఇస్తామన్న రీయింబర్స్‌మెంట్‌ పథకం కూడా సజావుగా అమలవడం లేదని విమర్శిస్తున్నారు. ఇకనైనా.. పైన పేర్కొన్న సమస్యల సత్వర పరిష్కారానికి సీఆర్డీయే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రాజధానిలోని వివిధ వర్గాల వారు కోరుతున్నారు.
Link to comment
Share on other sites

కృష్ణా నదిలో భారీ రవాణా
04-05-2018 08:15:28
 
636610185322319005.jpg
  • రాష్ట్రంలో తొలిసారిగా రోరో కార్గో
  • ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి జలరవాణా
  • ఇప్పటికే పూర్తయిన ట్రయల్‌ రన్‌
  • 500 టన్నుల బరువు గల వాహనాలను తరలించే అవకాశం
  • ఫెర్రీలో ర్యాంపులు, స్టీలు బార్జి సిద్ధం
ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి మధ్య దూరం సుమారు 60 కిలోమీటర్లు. ఇక్కడి ఫెర్రీ నుంచి అక్కడికి ఇసుక లారీ వెళ్లాలంటే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ పరిస్థితుల్లో రెండు, మూడు గంటలు పడుతుంది. ఈ దూరాన్ని, కాలుష్యాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎక్కువ సరుకును జల రవాణా చేయడానికి రోరో కార్గో (రోల్‌ ఆన్‌ - రోల్‌ ఆఫ్‌) రవాణా విధానం విజయవాడలో త్వరలో రాబోతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా రవాణాను ఆరంభించడానికి సర్కారు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోరో కార్గో రవాణా మనదేశంలో కోల్‌కతా, పట్నా, కేరళ రాష్ట్రల్లో నడుస్తోంది. అంతర్గత జలరవాణా అభివృద్ధిలో భాగంగా దీనికి విజయవాడ నుంచి శ్రీకారం చుట్టబోతోంది.
 
 
విజయవాడ: తక్కువ సమయంలో ఎక్కువ సరుకును రవాణా చేయడానికి రోరో కార్గో (రోల్‌ ఆన్‌ - రోల్‌ ఆఫ్‌) రవాణా విధానం త్వరలో రాబోతోంది. ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి మధ్య సుమారు 60 కిలోమీటర్లు దీనిని అమలు చేయనున్నారు. అంతర్గత జలరవాణా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా జల రవాణాకు వంతెనలు లేని చోట్ల పంట్లును నడుపుతుంటారు. నదికి ఓ వైపున ఉన్న వాళ్లు రెండో వైపునకు దీనిపైనే వెళ్తారు. ఈ పంట్లను కర్రల సహాయంతో నలుగురైదుగురు వ్యక్తులు ముందుకు తోసుకెళ్లారు. వీటిపై వివిధ రకాల వస్తువులతోపాటు ప్రజలను తీసుకెళ్లేవారు. రోరో కార్గో రవాణా విధానం పంట్లు మాదిరిగానే ఉంటుంది. పూర్తిగా యంత్రాల సహాయంతో నడుస్తోంది.
 
 
రోరో విధానంలో పూర్తిగా సరుకును మాత్రమే రవాణా చేస్తారు. ఇది నదులు, సముద్రలపై సాగుతోంది. ట్రక్‌లు, లారీలను తీసుకెళ్లే సామర్థ్యంతో స్టీలు బార్జిలను తయారు ఉపయోగిస్తారు. ఇది పంటి మాదిరిగా ఉంటుంది. ఉదాహరణకు అమరావతిలో ఉన్న ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి 15 టిప్పర్ల ఇసుక అవసరమైతే, ఆ మొత్తాన్ని రోరో విధానం ఒకేసారి తక్కువ సమయంలో తీసుకెళ్లవచ్చు. విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి గడచిన నెలలో ఈ బార్జిపై 15 టిప్పర్లను ఎక్కించి ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు. ఒక్కో టిప్పర్‌ బరువు 15 టన్నులు. ఈ బార్జి మొత్తం 225 టన్నుల బరువు గల వాహనాలను లింగాయపాలెం రేవుకు తీసుకెళ్లగలిగింది.
 
ఇబ్రహీంపట్నం నుంచి లింగాయపాలెం ఉన్న రెండు కి.మీ దూరాన్ని ఈ బార్జి అరగంటలో చేరుకుంది. టన్నును బట్టి సరుకుకు ధర నిర్ణయిస్తారు. ఈ రోరో కార్గో రవాణాను ఎక్కువగా రైళ్లు, రహదారులపై తీసుకెళ్లడానికి వీల్లేని ఓడీసీ(ఓవర్‌ డైమెన్షనల్‌ కార్గో)ని తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. ధర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమయ్యే భారీ యంత్ర సామగ్రిని కార్గో ఓడల్లో సముద్ర మార్గాన తరలిస్తారు. కోల్‌కతాలో ఈ తరహా కార్గోను తరలిస్తుంటారు. రోరో రవాణాను నదులపై అమలు చేయాలంటే నీటి అడుగున లోతు రెండు మీటర్లు ఉండాలి. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది లోతు రెండు మీటర్లకు పైబడి ఉండడంతో అంతర్గత జలరవాణా శాఖ అధికారులు రోరో కార్గో రవాణాకు అనుమతి ఇచ్చారు.
 
 
ఇలా పనిచేస్తుంది..
పెద్ద పరిమాణంలో ఉండే స్టీలు బార్జి నది ఒడ్డున ఉన్న ర్యాంపు వద్ద ఆగి ఉంటుంది. ఇటుక, ఇటుక, కంకర వంటి లోడ్‌తో ఉన్న ట్రక్‌లు గానీ, ఇతర సరుకులు ఉన్న లారీలు గానీ నేరుగా ఈ బార్జిపైకి తీసుకెళ్లారు. ఇవన్నీ బార్జిపై వరుసగా ఒకదాని వెనుక మరొకటి ఉంటాయి. ఇబ్రహీంపట్నంలో కొత్తగా తయారు చేయించిన బార్జిపై ఒకేసారి 15 టిప్పర్లను తీసుకెళ్లవచ్చు. బార్జికి కుడి, ఎడమ వైపున రెండు టగ్‌లు ఉంటాయి. ఈ రెండూ బార్జిను తోసుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న ర్యాంపు దగ్గరకు చేర్చుతాయు. అక్కడి నుంచి డ్రైవర్లను నేరుగా బార్జిపై నుంచి టిప్పర్లను కిందికి దింపుకోవచ్చు. ఈ రోరో రవాణా వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. దీనితోపాటు వాహన, ధ్వని కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది.
roro-cargo-issue.jpg
Link to comment
Share on other sites

3ZSvrHB.jpg
ఏబీఎన్ ఎఫెక్ట్: లాంచీలు.. రైట్‌ రైట్‌..
04-05-2018 08:23:56
 
636610190402160638.jpg
  • ఫెర్రి, రాయపూడి రేవుల్లో ప్రయాణికుల సందడి
 
ఇబ్రహీంపట్నం/ అమరావతి: అనుమతులు సకాలంలో మంజూరు కాకపోవటంతో గత పదిరోజులుగా కృష్ణానదిలో లాంచీలు తిరగకుండా ఆగిపోయాయి. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు నదిలో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. నదిలో వివిధ రేవుల ద్వారా మొత్తం ఎనిమిది లాంచీలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇరిగేషన్‌ శాఖ నుంచి కాకినాడ పోర్టుకు అనుమతులు బదలాయించడంలో తిరిగి అనుమతులు పొందేందుకు యజమానులకు కష్టతరంగా మారింది.
 
 
ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి’ పరిశీలన చేసి కథనంను రెండురోజుల క్రితం ప్రచురించింది. దీంతో స్పందించిన కాకినాడ పోర్టు అధికారులు ఫెర్రి టూ రాయపూడి తిరిగే లాంచీలకు అనుమతులు మంజూరు చేయటంతో గురువారం రాకపోకలు సాగించాయి. రాయపూడి, ఫెర్రి రేవుల్లో ప్రయాణికులతో సందడి నెలకొంది. రోజూ రాయపూడి నుంచి ఫెర్రి కి సుమారు 700 నుంచి వెయ్యి మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. పదిరోజులుగా విజయవాడ వైపు నుంచి తిరిగి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరిగి లాంచీలు ప్రారంభమవటంతో ఊపిరి పీల్చుకున్నారు.
Edited by sonykongara
Link to comment
Share on other sites

అమరావతిలో హైపర్‌లూప్‌!
05-05-2018 03:21:55
 
636610873193882460.jpg
  • సాధ్యాసాధ్యాలపై చర్చ.. ఏపీలో 900 కి.మీకి ఆస్కారం
  • హైపర్‌లూప్‌ సంస్థ ప్రతిపాదన
  • 8 గంటల ప్రయాణం 35 నిమిషాల్లోనే
  • పూర్తి నివేదిక కోరిన ఏపీసీఆర్డీఏ
అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంతవేగవంతమైన ప్రతిపాదిత రవాణా వ్యవస్థ హైపర్‌లూప్‌ ఏర్పాటు అవకాశాలపై హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీస్‌ (హెచ్‌టీటీ) సంస్థ ప్రతినిధులతో ఏపీసీఆర్డీఏ ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చించారు. విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఇతర రవాణా వ్యవస్థలతో పోల్చితే తక్కువ ఖర్చుతోనే నిర్మించవచ్చని భావిస్తున్న హైపర్‌లూప్‌ వ్యవస్థను తొలుత అమరావతిలో, ఆ తర్వాత దశలవారీగా అనంతపురం, విశాఖపట్నాలకు విస్తరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో సుమారు 900 కిలోమీటర్ల పొడవున ఈ వ్యవస్థ ఏర్పాటుకు అవకాశాలున్నాయని హైపర్‌లూప్‌ సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించారు. హెచ్‌టీటీ సంస్థ చైర్మన్‌ బిబాప్‌ గ్రెస్టా మాట్లాడుతూ.. ప్రస్తుతం రైళ్ల ద్వారా 8 గంటలు, కార్లలో 6 గంటలు, హైస్పీడ్‌ ట్రెయిన్‌ ద్వారా 3 గంటలు, విమానం ద్వారా గంటన్నరలో చేరుకోగలిగిన దూరాన్ని తాము ప్రతిపాదిస్తున్న హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ ద్వారా 35 నిమిషాల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. ప్రపంచ రవాణా వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చివేసే ఈ వ్యవస్థను అమెరికా, ఫ్రాన్స్‌, స్లొవేకియా, అబుదాబి తదితర దేశాల్లో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హైస్పీడ్‌, మెట్రో రైళ్లతో పోల్చితే హైపర్‌లూప్‌ వ్యవస్థను అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయవచ్చన్నారు. వాటికయ్యే ఖర్చులో దీన్ని మూడు నుంచి నాలుగొంతుల తక్కువతోనే నిర్మించొచ్చని పేర్కొన్నారు. విద్యుదయస్కాంత శక్తితో పనిచేసే ఈ వ్యవస్థ కాలుష్యం రహితం, సురక్షితమని చెప్పారు. పైపుల్లాంటి నిర్మాణాల్లో గంటకు సుమారు 1223 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైపర్‌లూప్‌ 30 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వ్యాసార్థ్యం, 20 టన్నుల బరువు ఉంటుందని పేర్కొన్నారు. 2050 కల్లా అమరావతిలో ఉండబోయే 35 లక్షలమందితోపాటు నిత్యం ఆ నగరానికి వివిధ పనులపై వచ్చే లక్షలాదిమంది రవాణా అవసరాలను ఈ వ్యవస్థ తీర్చగలదని అన్నారు. తొలిదశలో ఈ వ్యవస్థను అమరావతిలో 10 కిలోమీటర్ల పొడవున ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయవచ్చని, ఆ తర్వాత విజయవాడ-అమరావతి మధ్య వాణిజ్య ప్రాతిపదికన దీన్ని విస్తరించవచ్చునని, 3వ దశలో అనంతపురం-అమరావతి, విజయవాడ-విశాఖపట్నం మధ్య నిర్మించవచ్చని ప్రతిపాదించారు. ఏపీసీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌.. హైపర్‌లూప్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను వివరించే నివేదికను సమర్పించాల్సిందిగా ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో జె.కృష్ణకిశోర్‌, సీఆర్డీఏ ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌ ఆర్‌.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...