Jump to content

Amaravati


Recommended Posts

రాజధానిలో పచ్చదనానికి ప్రణాళిక
12-05-2018 09:35:26
 
636617145267133852.jpg
  • రాజధాని హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో ల్యాండ్‌స్కేపింగ్‌ డిజైన్లపై చర్చ
అమరావతి: రాజధానిలోని ప్రభుత్వ నగరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాల్లో అభివృద్ధి పరచాలనుకుంటున్న పచ్చ దనం(ల్యాండ్‌ స్కేపింగ్‌) ప్రాజెక్టులకు సంబంధించిన ముసాయిదా డిజైన్లపై సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఉన్నతాధికారులు శుక్రవారం నిపు ణులతో చర్చించారు. విజయవాడలోని సీఆర్డీ యే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గవర్నమెంట్‌ హౌసింగ్‌ ఆర్కి టెక్ట్స్‌ కన్సల్టెంట్‌ అయిన ఆర్కాప్‌ అసోసియేట్స్‌ ప్రతినిధి, ల్యాండ్‌స్కేపింగ్‌ నిపుణులు, డిజైన్‌ ఎకార్డ్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ మధూప్‌ మజుందార్‌ మూడు ప్యాకేజీల పోడియం ల్యాండ్‌స్కేపింగ్‌ డిజైన్ల ప్రతిపాదనలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.
 
   గవర్నమెంట్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులోని మూడు ప్యాకేజీలను నిర్మిస్తున్న ఎన్‌.సి.సి., ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లోంజీలకు సంబంధించిన ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్ట్‌లు డిజైన్లను చూపారు. ఒకటో ప్యాకేజీకి టీం వన్‌ ప్రతినిధి సోనీ జార్జ్‌, ప్యాకేజ్‌ రెండుకు ల్యాండ్‌స్కేపింగ్‌ నిపుణుడు రఘురామన్‌, మూడో ప్యాకేజీకి మరొక ల్యాండ్‌స్కేపింగ్‌ ఆర్కిటెక్ట్‌ భక్తి ఠాకూర్‌ ఆయా డిజైన్ల గురించి ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. భవంతుల మధ్య రకరకాల పూలమొక్కలు, నీడనిచ్చే చెట్లు, పచ్చికతో కూడిన పచ్చదనం, నడక మార్గాలు, పిల్లల ఆటస్థలాలు, చిన్నచిన్న కొలనులు, ఆటస్థలాలు, ఎండ పడని గ్యాలరీలు, విశ్రాంతిగా కూర్చునే వీలు కల్పించే సిట్టింగ్‌ ఏరియాలు, ఆకట్టుకునే లైటింగ్‌ ఇత్యాది విశేషాలతో ఈ డిజైన్లు రూపొందాయి.
 
  వాటన్నింటి గురించి సవివరంగా తెలుసుకున్న శ్రీధర్‌ డిజైన్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సిందిగా నిపుణులకు సూచించారు. ప్రవేశ ద్వారాలను ఇంకా ఆకట్టుకునేలా రూపొందించాలన్నారు. 3 హౌసింగ్‌ ప్యాకేజీల్లోనూ తగినంత ఖాళీ స్థలం ఉందని, దాన్నంతటినీ పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు అనువైన డిజైన్లను సిద్ధం చేయాలని సూచించారు. ఎటువంటి వివక్షకూ ఆస్కారం లేని రీతిలో అన్ని స్థాయిల నివాస సముదాయాలకూ ఒకే స్థాయి అనువైన, సుందరమైన ల్యాండ్‌స్కేపింగ్‌ ఆకృతులను రూపొందించాల్సిందిగా కోరారు.
Link to comment
Share on other sites

అభివృద్ధి పనులకు సీఆర్డీయే టెండర్లు
12-05-2018 09:41:21
 
636617148816820378.jpg
అమరావతి: అమరావతి రాజధాని నగరంతోసహా తన పరిధిలోని పెదపరిమిలో వివిధ అభివృద్ధి పనుల కోసం సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. మొత్తం సుమారు రూ.4.95 కోట్ల అంచనా వ్యయంతో వీటికి ప్రతిపాదనలు రూపొందించిన ఈ సంస్థ ఆయా పథకాలను చేపట్టే ఆసక్తి ఉన్న వారి నుంచి ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను స్వీకరించనుంది. వీటి దాఖలుకు ఈ నెల 23వ తేదీ వరకు గడువునిచ్చిన సీఆర్డీయే అదే రోజు సాయంత్రం వాటిని తెరవనుంది. పనుల వివరాలు..
 
  • రూ.1.98 కోట్లతో తుళ్లూరు తాగునీటి పథకాన్ని అభివృద్ధి పరచనున్నారు. నీటి కోసం దీనిపై ఆధారపడిన రాజధాని నగర ప్రాంత అవసరాలు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ఈ పథకం మెరుగుదల అవసరమైంది.
  • రూ.29.50 లక్షల వ్యయంతో ఉండవల్లి కరకట్టపై ఉన్న ముఖ్యమంత్రి నివాసం వద్ద నిర్మించిన గ్రీవెన్స్‌ హాలులో చిన్నపాటి భోజనమందిరాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ తరచుగా నిర్వహించే అధికారిక సమావేశాల్లో పాల్గొనే ప్రజా ప్రతినిధులు, అధికారుల సౌకర్యార్ధం ఈ మినీ డైనింగ్‌ హాలును ప్రతిపాదించారు.
  • రూ.55 లక్షలతో రాజధానిలోని అబ్బరాజుపాలెంలో సీసీ రహదారులు, మురుగుకాల్వలను నిర్మించనున్నారు.
  • రూ.70 లక్షల అంచనా వ్యయంతో రాజధానిలోని వెంకటపాలెంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలోని వసతులను అభివృద్ధి పరచనున్నారు. అదనపు తరగతి గదులు, వంటశాల- భోజన మందిరం, ప్రహరీ గోడ, టాయ్‌లెట్లను నిర్మించడం ద్వారా ఇక్కడ విద్యనభ్యసించే చిన్నారులతో పాటు వారికి బోధన జరిపే ఉపాధ్యాయులు, పని చేసే సిబ్బందికి ఇప్పటి వరకూ ఇవన్నీ లేక వారు పడుతున్న అవస్థల నుంచి విముక్తి కలిగించనున్నారు.
  • రూ.1.38 కోట్లతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని పెదపరిమి గ్రామంలో సీసీ రహదారులు, మురుగుకాల్వలను నిర్మించనున్నారు.
Link to comment
Share on other sites

సీఆర్డీఏలో స్థలాలు పొందిన సంస్థలకు డబ్బు చెల్లించాలని ఆదేశం
13-05-2018 15:20:24
 
అమరావతి: సీఆర్డీఏలో స్థలాలు పొందిన సంస్థలకు డబ్బు చెల్లించాలని అధికారులు సమాచారం పంపారు. స్థలాల కేటాయింపుపై కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా ఇప్పటి వరకు 67 సంస్థలు డబ్బు చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. డబ్బు చెల్లించని వాటిలో కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయన్నారు. డబ్బు చెల్లించిన తర్వాత ఆరు నెలల్లోగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిబంధన విధించారు.
Link to comment
Share on other sites

కేంద్ర సంస్థలకిచ్చిన భూముల ధరలు తగ్గింపు!
  ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి
  రాజధాని నుంచి త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించేందుకే ఈ నిర్ణయం
  పనులు చేపట్టని సంస్థలకు సీఆర్‌డీఏ ద్వారా లేఖలు
13ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు కోసం రాజధాని అమరావతిలో ఇచ్చిన భూముల ధరలను తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఈ సంస్థలు వేగంగా భవనాల నిర్మాణం పూర్తి చేసి ఇక్కడి నుంచే కార్యకలాపాలను ప్రారంభించేలా చూడాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వీటితోపాటే అమరావతిలో భూములు కేటాయించినా ఇంకా నిర్మాణాలు ప్రారంభించని సంస్థలకు సీఆర్‌డీఏ లేఖలు రాస్తోంది. భూములు కేటాయించి చాలా రోజులైనా నిర్మాణాలు ప్రారంభించని విషయాన్ని గుర్తు (రిమైండర్స్‌) చేస్తోంది. తదుపరి ప్రక్రియ పూర్తి చేసి వెంటనే అక్కడ భవనాల నిర్మాణం చేపట్టేలా చూడాలని కోరుతోంది. గతవారం మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో భూముల కేటాయింపు, నిర్మాణాలపై సమీక్ష జరిగింది. ఎన్ని సంస్థలకు భూములిచ్చారు? నిర్మాణాలు ప్రారంభించాల్సినవి ఎన్ని? అని లెక్కలు తీశారు. మొత్తంగా 67 సంస్థల వరకూ ఇంకా ముందుకు రాని విషయం గుర్తించారు. దీంతో భూములు కేటాయించిన విషయాన్ని మరోమారు గుర్తు చేస్తూ వారికి లేఖలు రాయాలని అప్పుడే నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వారందరితో సమావేశం నిర్వహించి ఆలస్యానికి కారణాలు, ఎప్పటి నుంచి పనులు ప్రారంభిస్తారో స్పష్టత తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సీఆర్‌డీఏ అధికారులు సంబంధిత సంస్థలకు లేఖలు రాస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారతీయ రిజర్వు బ్యాంకు, నాబార్డు, సీపీడబ్ల్యూడీ, హెచ్‌పీసీఎల్‌, సీఐటీడీ తదితర సంస్థలకు భూముల ధరలు తగ్గనున్నాయి. నావికాదళం తమకు భూమి అవసరం లేదని లేఖ ఇచ్చింది.

అనుమతుల కోసం ప్రతిపాదనలు: కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలంటే అనేక అనుమతులు అవసరమని పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వాటి నుంచి సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు అందాయని గుర్తు చేశారు. పలు ప్రైవేటు సంస్థలు పనులు ప్రారంభిస్తున్నాయని వెల్లడించారు.

Link to comment
Share on other sites

రాజధానిలో ప్రజలకు వెయ్యి ఫ్లాట్లు
మార్కెట్‌ ధర కంటే తక్కువకే..!
సర్వే పూర్తి చేసిన సీఆర్‌డీఏ
త్వరలో నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు
ఈనాడు - అమరావతి

ప్రజలకు విక్రయించేందుకు రాజధాని అమరావతిలో 1000 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సన్నాహాలు చేస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ఉత్ప్రేరక పాత్ర పోషించడం, తనకంటూ ఒక ‘బ్రాండ్‌ఇమేజ్‌’ ఏర్పాటు చేసుకోవడం, లాభాపేక్ష లేకుండా ప్రజలకు నాణ్యమైన ఫ్లాట్ల నిర్మాణం లక్ష్యంగా సీఆర్‌డీఏ సొంతంగా అపార్ట్‌మెంట్లు నిర్మించనుంది. మరో ఒకటి రెండు నెలల్లో ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉంది. అపార్ట్‌మెంట్ల ఆకృతుల రూపకల్పన ప్రక్రియ జరుగుతోంది. సీఆర్‌డీఏ ఫ్లాట్లు నిర్మిస్తే కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎంతవరకు ఆసక్తి చూపుతారన్న అంశంపై ‘నైట్‌ ఫ్రాంక్‌’ అన్న సంస్థతో డిమాండ్‌ సర్వే చేయించింది. మంచి స్పందనే ఉంటుందని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. రాజధానిలో ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు అపార్ట్‌మెంట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అల్పాదాయ వర్గాలకు గృహనిర్మాణ ప్రాజెక్టులు మొదలయ్యాయి. ప్రజలకు ఫ్లాట్లు విక్రయించేందుకు ఉద్దేశించిన తొలి గృహ నిర్మాణ ప్రాజెక్టు సీఆర్‌డీఏ చేపట్టేదే అవుతుంది.

10-15 శాతం తక్కువ ధరకే..!
సీఆర్‌డీఏ అపార్ట్‌మెంట్లను 14-15 ఎకరాల్లో అన్ని వసతులతో నిర్మించనున్నారు. ప్రాథమికంగా శాఖమూరు సమీపంలో దీనికి స్థలం గుర్తించినట్టు తెలిసింది. సీఆర్‌డీఏ జీ+11 విధానంలో అపార్ట్‌మెంట్లు నిర్మించనుంది. ప్రైవేటు నిర్మాణ సంస్థలు విక్రయిస్తున్న ధర కంటే 10-15 శాతం తక్కువ ధరకే ఈ ఫ్లాట్లు విక్రయించాలన్నది సీఆర్‌డీఏ ఆలోచన. 1200, 1500, 1800 చ.అడుగుల విస్తీర్ణంలో మూడు విభాగాలుగా ఫ్లాట్లు నిర్మిస్తారు. వీటిలో రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లు ఉంటాయి. బయట సంస్థలు ఇచ్చే కార్పెట్‌ఏరియా కంటే తాము నిర్మించే ఫ్లాట్లలో ఎక్కువ విస్తీర్ణం ఉంటుందని సీఆర్‌డీఏ అధికారులు చెబతున్నారు. సీఆర్‌డీఏ వేయి ఫ్లాట్లను దశలవారీగా నిర్మిస్తుంది. మొదట 250 ఫ్లాట్లు నిర్మిస్తుంది. ఆ తర్వాత దశలవారీగా మిగతా ఫ్లాట్లను నిర్మిస్తుంది. ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో రూపొందిస్తున్న ఆకృతులు  మరో నెలలో కొలిక్కి రానున్నాయి. దానికి సమాంతరంగా ఇతర ఏర్పాట్లూ చేస్తోంది. ప్రాజెక్టు నిర్వహణ, మార్కెటింగ్‌ తదితర వ్యవహారాలు చూసేందుకు మరో కన్సల్టెన్సీని నియమించనుంది. సింగపూర్‌ హౌసింగ్‌ బోర్డు వంటి సంస్థల తరహాలో బ్రాండ్‌ఇమేజ్‌ కలిగిన నిర్మాణ సంస్థగాను పేరు తెచ్చుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా, ప్రజలకు మార్కెట్‌కంటే తక్కువ ధరలో, వీలైనన్ని ఎక్కువ వసతులతో ఫ్లాట్లను నిర్మించనున్నట్లు సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..: రాజధానిలో నిర్మించే ఫ్లాట్లను కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నవారి నుంచి త్వరలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆకృతులపై స్పష్టత వచ్చాక వాటన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఇదే సమయంలో ప్రజల నుంచి దరఖాస్తులూ ఆహ్వానిస్తారు. ప్రజల్లో డిమాండ్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకూ ఈ ప్రక్రియ దోహదపడుతుందని సీఆర్‌డీఏ భావిస్తోంది.

షాపింగ్‌మాల్‌ నిర్మాణం..: ఒక పక్క గృహనిర్మాణ ప్రాజెక్టులు మొదలవడం, వివిధ విద్యాసంస్థలు నిర్మాణాలు ప్రారంభించడం, రాజధానిలో జనాభా కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో షాపింగ్‌మాల్‌ నిర్మించాలన్న ఆలోచనలో సీఆర్‌డీఏ ఉంది. దీనిలో ఫుడ్‌కోర్టులు, మల్టీఫ్లెక్స్‌లువంటివీ ఉంటాయి. ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

ఆ భూములు వెనక్కి తీసుకోలేదు!
14-05-2018 02:00:19
 
  • కేంద్ర సంస్థలకు కేటాయించిన స్థలాలపై మంత్రి నారాయణ
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములను ఎట్టిపరిస్థితిలోనూ వెనక్కి తీసుకునే ఆలోచన లేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సదరు భూముల ను స్వాధీనం చేసుకుంటామంటూ తన పేరుతో వివిధ చానెళ్లలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కేంద్ర సంస్థలు కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని, అయితే, వివిధ అనుమతులు రావాల్సి ఉన్నందునే ఆలస్యం జరుగుతోందని వివరించారు. అదేసమయంలో ఈ భూములకు నిర్ణయించిన ధరలను తగ్గించేందుకు సీఎం చంద్రబాబు యోచిస్తున్నారని తెలిపారు.
Link to comment
Share on other sites

రాజధానిలో మరో 350 ఎకరాలకు అవార్డులు జారీ
15-05-2018 09:10:47
 
636619722481162195.jpg
  • మరో 1,650 ఎకరాలు దశలవారీగా సేకరణ
  • రోడ్ల నిర్మాణంలో అడ్డుగా ఉన్న కట్టడాలకు నష్టపరిహారం లెక్కించాలి
  • దేవదాయ శాఖ భూములపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి
  • జేసీ ఇంతియాజ్‌ ఆదేశాలు
గుంటూరు: ‘అమరావతి రాజధాని నగరానికి భూసమీ కరణ కింద సమకూరిన 34 వేల ఎకరాలకు పోను భూసేకరణ కింద ఇప్పటి వరకు 350 ఎకరాలకు అవార్డుల జారీ పూర్తి చేశాం. కొంతమంది భూయజమానులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొన్నారు. ఆయా కేసుల్లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకొంటున్నాం. ఇంకా భూసేకరణ కింద మరో 1,650 ఎకరాలు రావాల్సి ఉంది..’ అని జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీయే ల్యాండ్‌ డైరెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో రాజధాని గ్రామాల కాంపిటెంట్‌ అథారిటీలతో సమావేశం నిర్వహించారు.
 
అనంతరం జేసీ ఇంతియాజ్‌ మీడియాకు సమావేశం వివరాలు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో కొత్తగా మరి కొంతమంది రైతులు 20 ఎకరాల భూమిని భూసమీకరణ కింద ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అవి ఎల్‌పీఎస్‌ కింద తీసుకొంటున్నామని చెప్పారు. మిగతా రైతులు కూడా ఎల్‌పీఎస్‌ కింద భూములు రాజధానికి ఇవ్వాలన్నారు. భూసేకరణ అయితే ఒకేసారి మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారం అందుతుందని, అదే భూసమీకరణ అయితే వాణిజ్య, నివాస ప్లాట్లతో పాటు పదేళ్ల పాటు కౌలు చెల్లింపులు, ఇతర సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు.
 
‘రాజధాని నగరంలో మొత్తం 20 రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డుగా ఉన్న కట్టడాలను నెగోషియేటెడ్‌ సెటిల్‌మెంట్‌ పాలసీ కింద నష్టపరిహారం చెల్లించబో తున్నాం. ఇందుకు గాను అన్ని కట్టడాలను ప్రభుత్వ ధరల ప్రకారం అంచనా వేయాల్సింది గా ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించాం’ అన్నారు. నష్టపరిహారం అంచనా పూర్తి కాగానే సంబంధిత భవన యజమానులతో చర్చలు జరిపి ఆ మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. అలానే దేవదాయ శాఖ భూములపై రాజధాని గ్రామాల్లో వివాదాలు నెలకొని ఉన్నాయి. దేవదాయ శాఖ మొత్తం 26 గ్రామాల్లో 173 ఎకరాలు క్లెయిమ్‌ చేస్తోంది. అయితే కొంతమంది రైతులు వాటిల్లో కొన్ని భూములు తమవని చెబుతున్నారు. నవులూరులోని నాగేంద్ర స్వామి దేవస్థానం వద్ద కూడా ఇలాంటి సమస్య ఉన్నది. నెక్కల్లులోనూ వివాదం ఉన్నది. దీనికి సంబంధించి రికార్డుల న్నింటిని నివేదించాల్సిందిగా దేవదాయ శాఖ అధికారులను ఆదేశించామని జేసీ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో సీఆర్డీయే అదనపు కమిషనర్‌ చెన్నకేశవులు, పరిపాలన అధికారి శ్రీధర్‌, దేవదాయ శాఖ ఏసీ కేబీ శ్రీనివాసరావు, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, సీఆర్డీయే డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...