Jump to content

Amaravati


Recommended Posts

రాజధానిలో తుది దశకు పేదల భవనాలు
06-05-2018 07:38:39
 
636611891182008323.jpg
  • 1,100మంది లబ్ధిదారుల గుర్తింపు
  • నవులూరులో ఇదే ప్రాంతంలో మరో 600 మందికి బహుళ అంతస్థులు
మంగళగిరి: రాజధాని గ్రామాల్లోని ఇళ్లు లేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం బహుళ అంతస్థుల విధానంలో ఇళ్లు నిర్మిస్తోంది. మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామంలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొదటిదశలో 500 గృహాలను నిర్మించి అర్హులైన పేదలకు అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు సీఆర్డీయే డిప్యూటీ కలెక్టర్‌ కె.లలిత తెలిపారు. నవులూరు, యెర్రబాలెం, బేతపూడి గ్రామాలకు చెందిన ఇళ్లులేని నిరుపేదలు 1,500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా 1,100 మందిని అర్హత గల వారిని గుర్తించినట్లు తెలిపారు. రాజధాని గ్రామాల్లో అర్హులైన పేదల కోసం ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌, మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. టిడ్కో ఆధ్వర్యంలో డాక్యుమెంటేషన్‌ కార్యక్రమాలను పూర్తి చేయవలసి ఉందని తెలిపారు. మరో 600 మందికి ఈ ప్రాంతంలోనే బహుళ అంతస్థులను త్వరలో నిర్మించనున్నట్లు లలిత తెలిపారు.
Link to comment
Share on other sites

Ball set rolling for 35 ‘smart’ facilities in Amaravati 

The Capital Region Development Authority (CRDA) is gearing up to provide 'smart' facilities in Amaravati under the Smart Cities Mission.

Published: 19th April 2018 04:49 AM  |   Last Updated: 19th April 2018 08:21 AM   |  A+A-

Ball.jpg

CM holds a review meet with CRDA officials at Secretariat on Wednesday| EXPRESS

By Express News Service

VIJAYAWADA: The Capital Region Development Authority (CRDA) is gearing up to provide 'smart' facilities in Amaravati under the Smart Cities Mission. With the State government providing a matching grant to the Central assistance of Rs 800 crore for Amaravati, Visakhapatnam, Tirupati and Kakinada, the CRDA has decided to hire a project management consultant (PMC) for the purpose.

According to CRDA officials, 35 facilities would be provided to help Amaravati become a smart city. "We have invited the Request for Proposal (RFP) for identifying the PMC for design, development, management and implementation of the smart city project. The PMC will work with the Special Purpose Vehicle (SPV), called Amaravati Smart and Sustainable City Corporation Limited, formed six months ago, to conceptualise and execute about 35 smart projects," a senior official said.

The proposed 35 projects are categorised into two sections - area-based development and pan-city. "There will be 23 pan-city projects and 12 area-based development projects. They will be executed across segments like information and communication technology, urban transportation and mobility, micro-climate and tourism," the official added.

While the area-based development means upgrading the existing infrastructure through retrofitting, redevelopment and greenfield development, pan-city is where smart solutions are applied to larger parts of the city.

Another CRDA official said the projects would be implemented in a phased manner. "These projects will not be taken up immediately. Since Amaravati is still in the making, the proposed smart facilities would be developed over the next three to five years," the official observed, adding that conceptualising smart facilities itself will take a significant amount of time. "Once the consulting firm is hired, we will also have to study the feasibility of the proposed projects besides drafting the plan for development. We might get a clearer picture by the end of 2018. But, once all the facilities are ready, Amaravati will be truly futuristic," the official concluded.

Categorisation of proposed projects

Pan-city projects

Intelligent transport system

ICT-based projects

e-Governance and citizen service app-people's precinct

Integrated command control centre

Appliance-level monitoring of power usage

Smart education

Smart and integrated healthcare system

Amaravati citizen card

Smart poles

Bus rapid transit system

Smart bus shelters

e-Vehicles and charging infrastructure

Smart parking

Public bicycle sharing

Public spaces

Roller-skates friendly pathways

Interactive smart street furniture,

Solar energy generation and implementation strategy

Bio-toilets

Smart municipal solid waste management

Renewable energy strategy

Smart gas distribution network

Information, Education & Communication project

Area-based development projects

Personal rapid transit system

Ferry service across inland canals

Smart/renewable energy park

Holistic wellness centre

Street vending zone

Floating markets

Craft bazaar (Delhi Haat model)

Riverfront tourism

Dakshinachitra (Chennai model)

Senior citizen/retirement home

Amaravati transnational skilling centre

Link to comment
Share on other sites

పనులు చూసిన తరువాత వారు మాట్లాడాలి: మంత్రి
06-05-2018 19:58:34
 
కర్నూలు: రాజధానిలో పనులు చూసిన తరువాత విపక్ష నేతలు ప్రభుత్వం పనితీరు గురించి మాట్లాడాలని మంత్రి నారయణ అన్నారు. అధికారుల కోసం షేర్‌వాల్ టెక్నాలజీతో 3840 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఆదివారం కర్నూలులో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు డిజైన్ పూర్తయిందని, జూన్ మొదటివారంలో టెండర్లు పిలుస్తామని చెప్పారు.
Link to comment
Share on other sites

అమరావతికి పంచ సూత్రాలు
07-05-2018 01:47:00
 
636612544195762311.jpg
  • నిర్మాణంలో పాటించాల్సిన అంశాలపై సూచన
  • రాజధాని కోసం జనం ఆత్రంగా చూస్తున్నారు
  • నెలవారీ ప్రగతిని ప్రకటించండి
  • నాణ్యతా పర్యవేక్షణకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయండి
  • టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఆదేశాలు
అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని మరింత సమర్థవంతంగా, నాణ్యతతో, పారదర్శకంగా చేపట్టేందుకు ఐదు సూత్రాల వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ప్రజల భాగస్వామ్యం, తక్కువ వ్యయం, వేగం, ఉత్తమ విధానాలపై నిరంతర అఽధ్యయనం, నాణ్యత’’ అనే ఐదు సూత్రాలను రాజధాని నిర్మాణంలో తప్పనిసరిగా అనుసరించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల కాలంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన కట్టడాలను పరిశీలించి వాటిని ప్రపంచశ్రేణి హరిత రాజధాని అమరావతిలో అనుసరించాలని సూచించారు. 8న జరగనున్న కలెక్టర్ల సదస్సుకు ‘నేటికి... రేపటి అమరావతి’ అనే అంశంపై ప్రజంటేషన్‌ సిద్దం చేయాలని, అమరావతి నిర్మాణ పురోగతిని వివరించాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీఐటీ-ఏపీ, ఎస్‌ఆర్‌ఎం అమరావతి, అమృత విశ్వవిద్యాలయాల నిర్మాణ పురోగతి, 2018-19 విద్యా సంవత్సరంలో ఆయా విశ్వవిద్యాలయాలలో తీసుకోనున్న అడ్మిషన్ల సంఖ్యను సీఆర్‌డీఏ కమిషనర్‌ వివరించారు. మౌలిక సదుపాయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ను ఆదేశించారు. ‘‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆంధ్రుల ఉమ్మడి ఆస్తి. నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనం ప్రజలకు సమాధానం చెప్పాలి. నిర్మాణ ప్రక్రియ మొత్తం తక్కువ ఖర్చుతో పూర్తి చేసేలా, పారదర్శకంగా ఉండేలా చూడాలి. అమరావతిలో నిర్మాణాలకు నిధులను అతి తక్కువ వడ్డీలకు తీసుకోవాలి. నాణ్యతను పరిశీలించేందుకు సీఆర్‌డీఏ ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేయాలి. పనుల పురోగతిపై నెలవారీ నివేదిక ప్రజలకు సమర్పించాలి.
 Untitled-11sss.jpg
కొన్ని ప్రధాన నిర్మాణాలకు ఆరు నెలలు, ఏడాది గడువు నిర్దేశించుకుని పూర్తి చేయాలి. అమరావతి నా కల. ప్రజలు కూడా ప్రపంచ శ్రేణి హరిత రాజధాని నగరాన్ని చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పనుల్లో జాప్యాన్ని సహించే ప్రసక్తే లేదు. అమరావతి అభివృద్ధి ఫలాలు స్థానిక రైతులతో పాటు, రాష్ట్ర ప్రజలందరికీ అందాలి’’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీ్‌షచంద్ర, సాయిప్రసాద్‌, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారధి, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అద్భుతం..అమరావతి నిర్మాణం!
08-05-2018 02:37:22
 
636613508520579139.jpg
  • కొనియాడిన నార్మన్‌ ఫోస్టర్‌
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్తంగా ప లు నగరాలు, పేరొందిన ఎన్నో కట్టడాల నిర్మాణాలను చూశా ను గానీ అమరావతి అంత అద్భుతంగా రూపుదిద్దుకుంటు న్న నగరాన్ని మాత్రం చూడలేదని అంతర్జాతీయ సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ కొనియాడారు. ఇంగ్లండ్‌కు చెందిన ఈ రూపశిల్పికి చెందిన సంస్థ పలు దేశాల్లో ఎన్నెన్నో నిర్మాణాలకు డిజైన్లను రూపొందించింది. అమరావతిలోని పరిపాలనా నగరానికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తూ దాని మాస్టర్‌ప్లాన్‌తో పాటు అసెంబ్లీ, హై కోర్టు సహా సచివాలయ సముదాయానికి డిజైన్లను అందజేసింది. అమరావతి విశిష్టత, దానికిగల పలు ప్రత్యేకతల దృష్ట్యా సుమారు 70 ఏళ్ల వయసున్న ఈ ఆర్కిటెక్ట్‌ సతీసమేతంగా రాజధానికి విచ్చేశారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకు న్న ఫోస్టర్‌ దంపతులకు సీఆర్డీ యే కమిషనర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ షణ్మోహన్‌ స్వాగతం పలికారు.
 
అనంతరం హెలికాప్టర్‌లో అమరావతి సందర్శనకు బయల్దేరిన వారికి రాజధానిలో చేపట్టిన వివిధ రహదారులు, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లోని నిర్మాణాలను చూపి, వాటి ప్రత్యేకతల గురించి వివరించారు. ఆ తర్వాత సీఎంతో భేటీ అయిన ఫోస్టర్‌... అమరావతి రూపుదిద్దుకుంటున్న తీరును ప్రశంసించారు. కచ్చితంగా ఇది సీఎం ఆకాంక్షిస్తున్న విధంగా ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి రాజధానుల్లో ఒకటవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణం నిమి త్తం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఫోస్టర్‌ దంపతులను సీఎం చంద్రబాబు వీడ్కోలు పలికారు.
Link to comment
Share on other sites

అమరావతిలో 19 సంస్థలకు భూమి కేటాయింపు
09-05-2018 07:47:18
 
636614488380420212.jpg
అమరావతి: అమరావతిలో మరొక 19 సంస్థలకు మొత్తం 51.92 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల బృందం సిఫార్సుతోపాటు సీఆర్డీయే కమిషనర్‌ పంపిన ప్రతిపాదనల ఆధారంగా వివిధ సంస్థలు, విద్యాసంస్థలకు ఈ భూమిని కేటాయించారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు 3.50 ఎకరాలను, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)కు 0.80 ఎకరాలను, భారత వాతావరణ శాఖకు ఎకరం, విదేశ్‌ భవన్‌ నిర్మాణార్థం విదేశీ వ్యవహారాల శాఖకు 2 ఎకరాలను (ఎకరం రూ.కోటి చొప్పున) కేటాయించారు. ఆర్‌అండ్‌డీ కేంద్రం, టెక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి 2 ఎకరాలు, రాష్ట్ర పోలీస్‌ శాఖ ఇంటెలిజెంట్‌ వింగ్‌కు 2,000 చదరపు గజాలు, ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు 2 ఎకరాలు, లింగాయపాలెంలో ఏపీ ట్రాన్స్‌కో 2201132- 33 కేవీ జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి 2.59 ఎకరాలను నామమాత్ర ధరకు ఇచ్చారు.
 
   యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 1.57 ఎకరాలను, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు 1.55 ఎకరాలను, ఇండియన్‌ బ్యాంక్‌కు 1.50 ఎకరాలను ఎకరం రూ.4 కోట్లకు కేటాయించారు. సెంట్రల్‌ చిన్మయ మిషన్‌ ట్రస్ట్‌కు 3 ఎకరాలు, రూప్‌టెక్‌ ఎడ్యుకేషనల్‌ ఇండియాకు 4 ఎకరాలు, ఎన్‌లెర్న్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 3 ఎకరాలు, సెయింట్‌ లారెన్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ట్రస్ట్‌కు 4 ఎకరాలు, సద్భావన నాలెడ్జ్‌ ఫౌండేషన్‌కు 4 ఎకరాలు, ఆనందీలాల్‌ గణేష్‌ పొదార్‌ సొసైటీకి 3 ఎకరాలు, హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీకి 8 ఎకరాలు, గ్లోబల్‌ స్కూల్స్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 4 ఎకరాలను ఎకరం రూ.50 లక్షల లెక్కన కేటాయించారు.
 
సంస్థల పేర్లు మార్పు
కాగా, గతంలో అమరావతిలో భూములను కేటాయించిన కొన్ని సంస్థల పేర్లలో మార్పులు చోటుచేసుకున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది. రాజధానిలో 10 ఎకరాలను పొందిన బ్రహ్మ కుమారీస్‌ సొసైటీ పేరును ఇకపై ‘బ్రహ్మ కుమారీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ’గానూ, 50 ఎకరాలను పొందిన గ్జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పేరును ‘గ్జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’గానూ మార్చినట్లు తెలిపింది.
Link to comment
Share on other sites

టీడీపీ కేంద్ర కార్యాలయం జనవరికి రెడీ..!
09-05-2018 08:42:14
 
636614521333858269.jpg
  • జనవరికి రెడీ..!
  • నిర్మాణమవుతున్న టీడీపీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి(గుంటూరు జిల్లా): మంగళగిరి వద్ద నిర్మాణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వచ్చే జనవరి నాటికి సిద్ధం కానుంది. జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశానికి ఇది కేంద్ర కార్యాలయంగా పనిచేయనుంది. మంగళగిరి పట్టణానికి చేరువలో 16వ నెంబరు జాతీయ రహదారి వెంబడి హ్యాపీ రిసార్ట్స్‌ ఎదురుగా 3.60 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. హైవే వెంబడి ఓ రెండు భారీ గేటెడ్‌ కమ్యూనిటీల మధ్య కేంద్ర కార్యాలయం రూపుదిద్దుకుంటోంది. గతేడాది నవంబరు 26న పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబరు నాటికి దీనిని పూర్తిచేయాలని సంకల్పించినప్పటికీ... అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో నిర్మాణ పనులను మరో నెలపాటు పొడిగించుకుంటూ జనవరి మాసాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.
 
 
బహుశా ఇది అటుఇటుగా ఉగాది నాటికి ప్రారంభోత్సవం జరుపుకొని సార్వత్రిక ఎన్నికల నాటికి కోలాహలంగా మారనుంది. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రెండు బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఒక బ్లాకును అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాకుగా పరిగణిస్తున్నారు. రెండో బ్లాకును సమావేశ మందిరాలు, డార్మెటరీలకు కేటాయిస్తారు. ప్రస్తుతానికి ఈ భవనాలను పార్కింగ్‌తోపాటు రెండంతస్తులుగా నిర్మిస్తున్నట్టు సమాచారం. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Link to comment
Share on other sites

ఏపీలోని అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు: చంద్రబాబు
09-05-2018 12:03:21
 
636614642008546016.jpg
అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రెండో రోజు కలెక్టర్‌ సదస్సులో మాట్లాడుతూ శిల్పారామాల ఏర్పాటే కాదు... వాటి నిర్వహణ ఉత్తమంగా ఉండాలని సూచించారు. అమరావతిలో శిల్పారామం ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయించాలన్నారు. 9 జిల్లాల్లో చేపట్టిన శిల్పారామం పనులను త్వరతగతిన పూర్తి చేయండని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

ఆ సంస్థలకు నోటీసులిచ్చాం: నారాయణ
10-05-2018 17:15:59
 
636615693587138683.jpg
అమరావతి: జ‌గ్జీవ‌న్‌రాం స్మృతివనానికి 10 ఎక‌రాలు, ఆర్మీకి 4 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్ సబ్‌కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వ‌ర‌కు 65 సంస్థల‌కు 1312 ఎక‌రాలు కేటాయించినట్లు వెల్లడించారు. 65 సంస్ధల్లో 7 సంస్ధలు మాత్రమే నిర్మాణాలు చేపట్టాయని స్పష్టం చేశారు. ప‌నులు ప్రారంభించని ప్రైవేట్‌ సంస్థలకు నోటీసులు ఇచ్చామన్నారు. 8 సంస్ధల‌కు 56 ఎక‌రాలు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. విట్, ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృత‌మ‌యి లాంటి సంస్థల‌కు మ‌రో 100 ఎక‌రాల చొప్పున కేటాయించాలని కేబినెట్‌కు ప్రతిపాదించామన్నారు. చండ్ర రాజేశ్వర‌రావు ట్రస్ట్‌కు 3 ఎక‌రాలు, ఇషా ఫౌండేష‌న్‌కు 10 ఎక‌రాలు కేటాయించనున్నట్లు నారాయణ తెలిపారు.
Link to comment
Share on other sites

కలెక్టర్ల సమావేశం రెండో రోజు మొదటి సెషన్స్ ముగింపు సమావేశం ముఖ్యమంత్రిగారు తన ఛాంబర్ లోకి వెళ్లబోతున్నారు.

ఆయన్ని కలుసుకోవడానికి అంతకుముందే వేచి వున్నారు న్యూజెర్సీలో ఉంటున్న చావా పద్మ గారు.

రాజధాని అమరావతి అభివృద్ధి నిధికి తనవంతు విరాళంగా ₹10లక్షల చెక్‌ను పద్మ CMకి అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రవాసాంధ్రులమైన తాము గమనిస్తున్నామని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఎన్నారైలు సిద్ధంగా ఉన్నారని పద్మ అన్నారు.

అమెరికాలో ఉన్నా జన్మభూమి మీద మమకారంతో ఈ సాయాన్ని అందించిన పద్మను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

ఆనాడు హైటెక్ సిటీ నిర్మించి ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంతో తాము ఉన్నత స్థితిలో ఉన్నామని పద్మ ధన్యవాదాలు తెలిపారు.

https://pbs.twimg.com/media/DcwHEQOXUAAgSNF.jpg

Link to comment
Share on other sites

పనులు ప్రారంభించని సంస్థలకు తాఖీదులు
అన్ని కోణాల్లో పరిశీలించాకే రాజధానిలో భూకేటాయింపులు
  విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృతకు మరో వందెకరాల చొప్పున రిజర్వు
  పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి
ఈనాడు - అమరావతి
10ap-main4a.jpg

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో స్థలాలు కేటాయించినా ఇప్పటికీ పనులు ప్రారంభించని సంస్థలకు తాఖీదులు జారీ చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం అనంతరం నారాయణ విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు 65 సంస్థలకు 1312 ఎకరాలు కేటాయించామని, వీటిలో విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థల్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అన్నారు. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృతకు వంద ఎకరాల చొప్పున లోగడ కేటాయించామని, మరో వంద ఎకరాలు రిజర్వులో ఉంచుతున్నామని  చెప్పారు. ఇండో-యూకే విశ్వవిద్యాలయానికి 150 ఎకరాలు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌కు 50 ఎకరాలు, బీఎస్‌ఆర్‌ శెట్టి ఆఫ్‌ మెడికల్‌ పరిశోధన కేంద్రానికి 150 ఎకరాలు, మరికొన్ని చిన్న సంస్థలకు భూములు కేటాయించామని తెలిపారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న సంస్థలకు మాత్రమే సీఆర్‌డీఏ పరిధిలో భూములు కేటాయిస్తున్నామని తెలిపారు.

మరో 13 సంస్థలకు 54.33 ఎకరాలు..
రాజధాని ప్రాంతంలో మరో 13 సంస్థలకు 54.33 ఎకరాల భూములు కేటాయించాలని నిర్ణయించి మంత్రిమండలి ఆమోదానికి పంపుతున్నామని మంత్రి చెప్పారు. ఏయే సంస్థలకు ఎంతెంత భూములను కేటాయించేందుకు సిఫారసు చేస్తున్నారో వివరించారు.

పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల మరమ్మతుకు రూ.10 వేల సాయం
గ్రామీణ తరహాలో పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వసాయంతో పేదలు నిర్మించుకుని, ప్రస్తుతం పాడైన ఇళ్ల మరమ్మతుకు రూ.10వేల చొప్పున సాయం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించి ముఖ్యమంత్రి ఆమోదానికి ప్రతిపాదనలు పంపుతోందని మంత్రి నారాయణ తెలిపారు. 2006కు ముందు ప్రభుత్వ సాయంతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఇదివరకే ఇళ్లు కేటాయించాక మరోసారి మంజూరు చేసే అవకాశం లేనందున మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చించి నిబంధనలు సడలించేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పేదలకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, గృహకల్ప కింద చేపట్టిన గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి రూ.25 వేల నుంచి రూ.50 వేలు పెంచాలని నిర్ణయించామన్నారు. కుప్పం మాదిరి మిగిలిన ప్రాంతాల్లో జీ+3 తరహాలో పేదలకు ఇళ్ల నిర్మాణ ప్రతిపాదనలు పరిశీలించాలని ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేస్తుందని చెప్పారు.

10ap-main4b.jpg
Link to comment
Share on other sites

  •  
 

Lord Foster met Chief Minister N Chandrababu Naidu and his team on his visit to Andhra Pradesh to oversee the next stage of design development of the governmental complex of the new state capital, Amaravati. Foster + Partners is designing the central focus of the 217-square-kilometre city, including the design of two key buildings: Legislature Assembly and High Court Complex, along with several secretariat buildings.

Norman Foster, Founder and Executive Chairman, Foster + Partners, said: “We are delighted to be working with the Chief Minister and the Government of Andhra Pradesh to help them realise their vision of the People’s Capital and team to build a clear and inspiring vision for the governmental complex at Amaravati. The design brings together our decades-long research into sustainable cities, incorporating the latest technologies that are currently being developed in India.”

The new administrative capital of the Indian state of Andhra Pradesh, Amaravati was born following the redefinition of state boundaries between Andhra Pradesh and the newly created state of Telangana. Situated on the banks of the River Krishna, the new city is strategically positioned to benefit from an abundant supply of fresh water, and will be one of the most sustainable in the world. Measuring 5.5 kilometres x 1 kilometre, the governmental complex occupies the heart of the city, defined by the strong urban grid that structures it. A clearly defined green spine runs through its length, providing the foundation of the masterplan’s environmental strategy, where at least 60% of the area is occupied by greenery or water. The city has been designed to the highest standards of sustainability, including the widespread use of solar energy. The transportation strategy includes electric vehicles, water taxis, and dedicated cycle routes, along with shaded streets and squares that will encourage people to walk through the city.

Travelling south from the river’s edge, there is a mixed-use quarter structured around 13 urban plazas, signifying the 13 state districts in Andhra Pradesh. At the centre of the green spine is the Legislative Assembly building, a democratic and cultural symbol for the people of Andhra Pradesh, which sits within a large freshwater lake, and is framed by the Secretariat and cultural buildings. The High Court Complex is located off the central axis, with a stepped roof form inspired by India’s ancient stupas.

Press Release PDF: https://www.fosterandpartners.com/news/archive/2018/05/norman-foster-visits-amaravati/?altTemplate=NewsItemToPDF

Edited by sonykongara
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...