Jump to content

Amaravati


Recommended Posts

రూపురేఖలు మారిన రాజధాని గ్రామాలు
16-05-2018 07:27:43
 
636620524639757325.jpg
  • విస్తరణకు నోచుకున్న రహదారులు
  • పెరిగిన బహుళ అంతస్థులు
  • ఆదాయం పెరిగిన పంచాయతీలు
ఉండవల్లి: రాజధాని రాకతో తాడేపల్లి మండలంలోని రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాకల రూపురేఖలు మారిపోయాయి. మూడేళ్ళ క్రితం వరకు ఇరుకు రోడ్లు చిన్న చిన్న ఇళ్లతో ఉండే ప్రాంతం మెత్తం మారిపోయి పట్టణానికి తీసిపోకుండా అభివృద్ధి చెందాయి. గతంలో ఉండవల్లి కూడలి చాలా ఇరుకుగా కూడలి మొదటిలో ఆర్చితో ఉండి కనిపిస్తు ఉండేది. రాజధాని అనంతరం రహదారి విస్తరణతో ఉండవల్లి కూడలి అత్యంత విశాలంగా రూపుదిద్దుకుంది. ట్రాఫిక్‌ ఇక్కట్లు కూడా తప్పాయి. సచివాలయానికి వెళ్లేందుకు ఉండవల్లి ప్రధానమార్గం కావడంతో ఉండవల్లి, పెనుమాక గ్రామ రహదారులను సైతం విస్తరించారు.
 
   ఉండవల్లి కూడలి నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారికి ఇరువైపుల పెద్ద సంఖ్యలో బహుళ అంతస్థుల భవానాలు వెలిశాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఉండవల్లి పంచాయతీ పరిదిలో రాజధాని రాక ముందు సుమారు 9,700 జనాభా ఉండేది. రాజధాని రాక అనంతరం నేటికి మరో నాలుగు వేలకు పైగా జనాభా పెరిగింది. గతంలో పంచాయతీ ఆదాయం ఇంటిపన్నులు రూపేణా రూ.15 లక్షలు సుమారుగా వచ్చేది. నేడు ఇంటిపన్నులు రూపేణా సుమారు రూ.40 లక్షలు వస్తుంది. గతంలో సీనరేజి, ఆర్‌ఎస్‌ చార్జీలు కలిపి సుమారు రూ.70 లక్షల వరకు ఆదాయం ఉండేది. నేడు ఇంకా ఆర్‌ ఎస్‌ చార్జీలు కలవకుండానే సుమారు రూ.1 కోటి ఆదాయం వస్తుంది. గ్రామంలో 14 వార్డులు ఉన్నాయి.
 
   కాగా పెనుమాక గ్రామం కూడా రాజధాని రాకతో అభివృద్ధి చెందింది. ప్రధాన రహధారి సువిశాలంగా మారింది. భారీగా భవంతులు వెలిశాయి. పెనుమాక గ్రామంలో 14 వార్డులు ఉన్నాయి. రాజధాని రాక ముందు సుమారు 40 లక్షలుగా ఉండే పంచాయతీ ఆదాయం నేడు ఇంటిపన్నులు, నీటి పన్నులు, వివిధ గ్రాంటులు విరాళలతో కలిసి రూ.70 లక్షలకు చేరుకుంది. రాజధాని రాకముందు ఏడు వేల నుంచి 8 వేలకు ఉండే జనాభా నేడు 10 వేల పైకి చేరుకుంది.
 
 
నిధుల లేమితో ఇబ్బంది
ఉండవల్లి పంచాయతీకి రావలసిన గ్రాంటులు, నిధులు పూర్తిస్ధాయిలో అందకపోవడంతో నిధుల లేమితో ఇబ్బందులు ఉన్నాయి. అభివృద్దికి ఆటంకంగా మారింది. ప్రభుత్వం గ్రాంటులు వెంటనే విడుదల చేస్తే ఉండవల్లి గ్రామం ప్రగతి పధంలో పయనిస్తుంది.
- మన్నెం సుజాత, ఉండవల్లి సర్పంచ్‌
 
 
అభివృద్ధి కనిపిస్తోంది..
రాజధాని రాకతో ఈ ప్రాంతం కచ్చితంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థలు, ఐటీకంపెనీలు వచ్చేశాయి. పెనుమాక పంచాయతీ ఆదాయం కూడా గతం కంటే కొంత పెరిగింది. సీఆర్డీయే నుంచి అనుమతి పొంది పలు పనులకు సంబందించి, రహదారుల ఏర్పాటులకు సంబంధించి అనుమతి పొందితే మరింత అభివృద్ధి చేయవచ్చునని భావిస్తున్నా.
- కళ్ళం పానకాలరెడ్డి, పెనుమాక సర్పంచ్‌
Link to comment
Share on other sites

‘అమరావతి పర్యావరణ అనుమతుల’పై నోటీసులు జారీ

ఈనాడు, దిల్లీ: అమరావతి నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతుల్లో లోపాలపై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఈ నెల 30కు వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని బొలిశెట్టి సత్యనారాయణ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈఏఎస్‌ శర్మ కేసు... ఇదీ ఒకే అంశమైనందున కలిపి విచారించనున్నట్లు జస్టిస్‌ జావేద్‌ రహీమ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యావరణశాఖ, సీఆర్డీఏ, పీసీబీలకు నోటీసులు జారీ చేసింది.

Link to comment
Share on other sites

On 4/28/2018 at 11:27 AM, sonykongara said:

90g9Tsq.jpg

అదేవిధంగా రాజధాని అమరావతిలో 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం ఏడీపీకి ఏపీ సీఆర్‌డీఏ పవరాఫ్‌ అటార్నీ ఇచ్చెందుకు కూడా బుధవారం ఆమోదం తెలిపింది.

Link to comment
Share on other sites

రాజధానిలో మరో మణిహారం.. ‘నిర్మాణ నగరం’
18-05-2018 07:44:35
 
636622262765694092.jpg
  • ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు
  • బ్రిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌, యంత్ర పరికరాలు ఇక్కడే..
  • నిడమర్రు దగ్గర 500 ఎకరాల్లో ‘టిడ్కో’ ప్రణాళికలు
  • 250 ఎకరాల్లో బిల్డింగ్‌ మెటిరీయల్‌ ఎగ్జిబిట్స్‌, హౌసింగ్‌
  • మిగిలిన ప్రాంతంలో ప్రీకాస్ట్‌ మెటీరియల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్స్‌
 
రాజధాని అమరావతి ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ సిటీని నిర్మించేందుకు టిడ్కో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచస్థాయి బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ మెటీరియల్స్‌, యంత్ర పరికరాలు ఒకే గొడుగు కింద ప్రదర్శించేలా రాజధాని ప్రాంతంలోని నిడమర్రు దగ్గర 500 ఎకరాల స్థలంలో కన్‌స్ట్రక్షన్‌ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు పూర్తయ్యాయి. నిర్మాణ రంగానికి ఇదొక అద్భుత అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.
 
 
విజయవాడ: భవన నిర్మాణ రంగానికి కావలసిన మెటీరియల్స్‌, యంత్ర పరికరాలు, సాంకేతిక సహకారాన్ని అంతటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా టౌన్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిడ్కో) అధికారులు అమరావతి రాజధాని ప్రాంతంలో ‘ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ సిటీ’ని నిర్మించటానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రపంచ స్థాయి బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ మెటీరియల్స్‌ - మెషీన్స్‌ ఒకే గొడుగు కింద ప్రదర్శించేలా రాజధాని ప్రాంతంలోని నిడమర్రు దగ్గర 500 ఎకరాల స్థలంలో కన్‌స్ట్రక్షన్‌ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు పూర్తయ్యాయి. గృహ నిర్మాణం, ప్రీ ప్యాబ్రికేటెడ్‌ పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఈ కన్‌స్ట్రక్షన్‌ సిటీలో చోటు కల్పిస్తున్నారు. రాజధానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కన్‌స్ట్రక్షన్‌ సిటీలకు టిడ్కో శ్రీకారం చుడుతున్నా.. అమరావతి కన్‌స్ట్రక్షన్‌ సిటీ మొట్టమొదటిది కాబోతోంది. అమరావతిలో నిర్మించబోయే కన్‌స్ట్రక్షన్‌ సిటీలో ఎలాంటి ప్రత్యేకకతలు ఉన్నాయో తెలుసుకుందాం...
 
అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కలిసే ప్రాంతంలో నిడమర్రు దగ్గర దీనిని ఏర్పాటు చేయటానికి టిడ్కో అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ 500 ఎకరాల స్థలంలో కన్‌స్ట్రక్షన్‌ సిటీని ఏర్పాటు చేయనున్నారు. కన్‌స్ట్రక్షన్‌ సిటీ రెండు పార్టులుగా ఉంటుంది. మొదటి పార్ట్‌ను 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రధానంగా 24 లక్షల చదరపు అడుగుల స్థలంలో బిల్డింగ్‌ మెటీరియల్స్‌, మెషినరీ ఎగ్జిబిట్స్‌ చేయటానికి వీలుగా షాప్స్‌ ఏర్పాటు చేస్తారు. మొత్తం 8 వేల షాపులు ఇందులో నిర్మాణం చేస్తారు.
 
 జాతీయంగా, అంతర్జాతీయంగా భవన నిర్మాణానికి సంబంధించి చిన్న స్ర్కూ దగ్గర నుంచి పెద్ద భారీ యంత్రాల వరకు మెటీరియల్స్‌, మెషినరీని ప్రదర్శించటానికి అనుమతిస్తారు. తయారీకి ఇక్కడ అనుమతి ఉండదు. ఎగ్జిబిట్‌ చేయటం ద్వారా ఆర్డర్స్‌ వస్తే.. అమ్మకాలు చేసుకోవచ్చు! దేశీయంగా గ్రానైట్‌, రాజస్థాన్‌ మార్బుల్‌లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని బ్రాండెడ్‌ స్టోన్స్‌, ఫ్లోర్స్‌ మెటీరియల్‌, బాత్‌రూమ్‌, శానిటరీ, భారీ క్రేన్లు, లారీలు, టిప్పర్లు, కాంక్రీట్‌ మిక్సర్స్‌, పంప్స్‌ వంటివి ఇలా అన్ని రకాలైన వాటిని ప్రదర్శించటానికి ఔత్సాహిక సంస్థలకు కేటాయిస్తారు. ఈ షాపుల మధ్యనే లారీల పార్కింగ్‌ ఏరియా ఉంటుంది. లాజిస్టిక్స్‌, ప్యాకింగ్‌, రవాణా వ్యవస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఒక హోటల్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు.
 
మొదటి పార్ట్‌లో ఎగ్జిబిట్‌ ఏరియా పోను కొంత భాగం ఫ్యూచర్‌ ఎక్స్‌పాన్షన్‌కు ఉంచారు. మిగిలిన స్థలంలో 8 వేల గృహ నిర్మాణాన్ని జీ ప్లస్‌ 4 విధానంలో నిర్మించనున్నారు. ఎగ్జిబిట్‌ స్టాల్స్‌లో పనిచేసేవారంతా ఇక్కడ ఉండటానికి వీలుగా ఈ గృహ నిర్మాణాన్ని చేపడతారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. రెండవ పార్ట్‌లోని 250 ఎకరాల్లో ప్రీ కాస్ట్‌ మెటీరియల్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమల ఏర్పాటు కేటాయిస్తారు. మెజారిటీ ఇలాంటి పరిశ్రమలకే కేటాయిస్తారు. మిగిలిన స్థలంలో గ్రీన్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ పరిశ్రమలకు కేటాయిస్తారు.
 
 
ఆదాయం పెరుగుతుంది...
కన్‌స్ట్రక్షన్‌ సిటీ ఏర్పడితే ఎకానమీ పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కన్‌స్ట్రక్షన్స్‌ సిటీ లు నిర్మించటానికి అప్‌కాన్‌ సిటీ నినాదంతో ముందుకు వెళుతున్నాం. రాజధానిలో ప్రపంచ స్థాయి కన్‌స్ట్రక్షన్‌ సిటీని నిర్మించబోతున్నాం. ప్రపంచ స్థాయి బిల్డింగ్‌ మెటీరియల్స్‌ , మెచినరీ అంతటిని ఇక్కడ ప్రదర్శించుకునేలా ఏర్పాట్లు చేయనున్నాం. తయారీ కాకుండా అసెంబ్లింగ్‌ వంటి వాటికి అనుమతిస్తాం. నిర్మాణరంగం పరిఢవిల్లటానికి ఇదొక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం. కన్‌స్ట్రక్షన్‌ సిటీకి సంస్థల నుంచి చాలా మంచి ఆసక్తి వస్తోంది. అతి త్వరలోనే దీనిని కార్యారూపంలోకి తీసుకు వస్తాం.
- వీ రామ్‌నాథ్‌, ఏపీ టిడ్కో వైస్‌ చైర్మన్‌
Link to comment
Share on other sites

రాజధాని రైతులకు నేడు రెండో విడత ప్లాట్ల కేటాయింపు
18-05-2018 09:05:13
 
636622311144917573.jpg
తుళ్లూరు: రాయపూడి రైతులకు రెండో విడత ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నట్లు డీసీ ఉమారాణి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో కంఫ్యూటర్‌లో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ కారణాలరీత్యా మొదట విడత ప్లాట్లు కేటాయింపు కాని రైతులకు రెండో విడతలో కేటాయింపులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సీఆర్డీయే భూవ్యవహారాల డైరెక్టర్‌ చెన్నకేశవరావు, జాయింటు కలెక్టర్‌ ఇంతియాజ్‌ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
Link to comment
Share on other sites

నెలాఖరుకి ‘అమరావతి బాండ్లు’
19-05-2018 07:18:03
 
636623110846476267.jpg
  • రూ.2వేల కోట్ల బాండ్లు మార్కెట్‌లోకి
  • ప్రవాసుల కోసం ప్రత్యేకంగా జారీ
  • రాజధాని నిర్మాణాలపై సీఎం సమీక్ష
అమరావతి: రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్న ‘అమరావతి బాండ్లు’ ఈ నెలాఖరుకు మార్కెట్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన క్రెడిట్‌ రేటింగ్‌ ప్రక్రియ ఈనెల 22లోపు పూర్తికానుంది. ఆ వెంటనే ప్రభుత్వ అనుమతులు పొంది నెలాఖర్లోగా వీటిని జారీ చేయనున్నారు. అమరావతికి కావాల్సిన నిధుల్లో ప్రాథమికంగా రూ.2వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చే బాండ్ల ద్వారా సేకరించాలని నిర్ణయించిన సంగతి విదితమే. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఏపీసీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ విషయాన్ని తెలిపారు.
 
ఈ బాండ్లకు ఏ, ఏ+, ఏఏ క్యాటగిరీల్లో క్రెడిట్‌ రేటింగ్‌ వచ్చే అవకాశముందని, రాజధానిలో వివిధ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు, ఇతర అభివృద్ధి పనులకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ‘అమరావతి బాండ్లు’ జారీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాజధాని నిర్మాణానికి విరాళాలు అందించేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్న దృష్ట్యా ఆ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది చివరినాటికి రాజధానికి మరో 50వేల మంది జనాభా రానున్నారని, వారికోసం అవసరమయ్యే 12వేల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్‌ తెలిపారు. పీపీపీ విధానంలో అతిపెద్ద మాల్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
 
పేరొందిన సంస్థల ద్వారా మధ్య, చిన్నతరహా మాల్స్‌ను నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పరిపాలన నగరంలో చేపట్టే అన్ని భవంతుల నిర్మాణాల టెండర్ల ప్రక్రియ జూన్‌ 16కు పూర్తవుతుందని, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం నెలాఖరుకల్లా పునాదుల స్థాయికి చేరుకుంటుందని శ్రీధర్‌ వివరించారు. ఉండవల్లి-తాడేపల్లి రహదారి విస్తరణకు అడ్డంకులను త్వరగా తొలగించాలని సీఎం ఆదేశించారు. ఏడీసీ ఆధ్వర్యంలోని నర్సరీ, రహదారుల పనుల పురోగతిని శనివారం ఉదయం పరిశీలిస్తానన్నారు. రాజధాని రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Link to comment
Share on other sites

రాజధాని కోసం 60.11 ఎకరాల డీనోటిఫై
19-05-2018 07:15:12
 
636623109135852972.jpg
  • కురగల్లు, నవులూరు గ్రామాల్లో
  • రాజధాని ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నిర్ణయం
గుంటూరు: అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు కోసం మంగళగిరి మండలంలోని కురగల్లు, నవులూరు గ్రామాల్లో అసైన్డ్‌ భూములను డీ నోటిఫై చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూములు గతంలో 22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. ఇందుకు కారణం ఇవి 1954కు ముందు అసైన్‌మెంట్‌ చేసి ఉండటమే. రాజధాని నగరంలో నిర్మాణ పనులు జోరం దు కొన్న నేపథ్యంలో ఈ కురగల్లు, నవులూరులో భారీ ప్రాజెక్టులు రానున్న దృ ష్ట్యా డీనోటిఫై చేయాల్సిందిగా సీఆర్‌డీఏ ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలను పంపింది. దీనిని పరిశీలించిన రెవెన్యూ శాఖ రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టుకు ఆ భూములు అవ సర మని నిర్ధారించుకొని గజిట్‌ విడుదల చేసింది.
 
గత ఏడాది ఏప్రిల్‌ నెలలో జిల్లా కలెక్టర్‌ రెండు లేఖలను స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అండ్‌ చీఫ్‌ కమిషనర్‌ భూపరిపాలనకు, రాష్ట్రస్థాయి గ్రీవియన్స్‌ పరిష్కార కమిటీకి రాశారు. నవులూరు, కురగల్లులో మొత్తం 34 కేసులకు సంబంధించి సమాచారం పంపారు. ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం అవి అటవీ రిజర్వుడు భూములని పేర్కొన్నారు. ఆ భూములను గతంలోనే డీరిజర్వు చేసి ఏడబ్లూడీగా మా ర్చారు. ఆ తర్వాత సబ్‌ డివిజన్‌ చేసి సిపా యిలు, నిమ్నవర్గాలు, సాధారణ ప్రజలకు పం పిణీ చేశారు. ఎప్పుడో 1922లో అసైన్‌మెంట్‌ జరిగినట్లుగా పేర్కొన్నారు. అయితే ఇవి 1954కు ముందు అసై న్‌మెంట్‌ చేసిన దృష్ట్యా నిషేధిత భూముల జాబితాలో చేర్చబడ్డాయి. ఆయా భూముల నిషేధిత జాబితాలో ఉండటంతో సంబంధిత అసైన్డ్‌దారులు హైకోర్టుని ఆశ్రయించారు.
 
తమకు దశాబ్ధాల క్రితమే భూములు అసై న్‌మెంట్‌ చేసినందున వాటిని పట్టా భూములుగా పరిగణించాలని అభ్యర్థించారు. ఈ విషయంలో భూపరిపాలన శాఖ అభ్యం తరాలు పెట్టినప్పటికీ హైకోర్టు పిటీషనర్ల వాదనను సమర్ధించింది. అలానే ప్భఉత్వం కూడా 2016 ఫిబ్రవరి 17వ తేదీన జీవో విడుదల చేసింది. 1954కు ముందు అసైన్డ్‌ చే సిన భూములను పట్టాభూములగా పరి గణిస్తామని పేర్కొంది. ఈ ఉత్తర్వులన్నింటిని పరిగణనలోకి తీసుకొన్న రెవెన్యూ శాఖ ఎట్టలకేలకు 60.11 ఎకరాల భూములను డీనోటిఫై చేసింది. వీటి విస్తీర్ణం 0.14 ఎకరాల నుంచి 5.11 ఎకరాల వరకు వివిధ సైజుల్లో ఉన్నాయి. కురగల్లులో 18 మంది రైతులు, నవులూరు(యర్రబాలెం) కలిపి మరో 16 మంది రైతులు ఆధీనంలో ఈ భూములున్నాయి. ఇవి డీ నోటిఫై చేయడం వలన ఆయా రైతులకు మేలు జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

రాయపూడి రైతులకు ప్లాట్ల కేటాయింపు
19-05-2018 07:16:04
 
636623109656005511.jpg
తుళ్ళూరు: తుళ్ళూరు సీఆర్డీయే కార్యాలయంలో శుక్రవారం రాయపూడి రైతులకు రెండో విడతలో ప్లాట్ల కేటాయింపు చేశారు. కంఫ్యూటర్‌లో లాటరీ తీసి ప్లాట్లను కేటాయించారు. వివిధ కారణాల చేత మొదట విడత ప్లాట్లు కేటాయింపు జరగని వారికి రెండో విడతలో కేటాయింపు చేసినట్టు సీఆర్డీయే భూవ్యవహారాల డైరెక్టర్‌ చెన్నకేశవరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యకమ్రానికి ముఖ్యఅతిథిగా గుంటూరు జేసీ ఇంతియాజ్‌ హాజరై, రైతులకు ప్లాట్ల పత్రాలను అందజేశారు. 165 మంది రైతులకు నివాస, వాణిజ్య సంబంధమైన 304 ప్లాట్లను కేటాయించారు. ఇందులో 332 వాణిజ్య ప్లాట్లు, 36 నివాస ప్లాట్లను లాటరీ విధానంలో కేటాయించారు. ఇందులో జరీబు , మెట్టకు సంభంధమైనవి ఉన్నాయి. రైతులకిచ్చిన లేఅవుట్లలో త్వరితగతిన మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా జేసని రైతులు కోరారు. పనులు వేగవంతం చేసినట్టు , నిరంతరం వాటిమీద పర్యవేక్షణ జరుగుతుందని జేసీ వివరించారు.కార్యక్రమంలో ఎంపీపీ పద్మలత, సర్పంచ్‌ నాగమణి, సీఆర్డీయే ప్లానింగ్‌ అధికారి నాగేశ్వరావ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

నెలాఖరుకు అమరావతి బాండ్లు
రూ.2 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం
రాజధానిలో రూ.100 కోట్లతో షాపింగ్‌మాల్‌
రాజధాని పనుల పురోగతిపై సీఎం సమీక్ష

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ఐదెకరాల విస్తీర్ణంలో షాపింగ్‌మాల్‌ నిర్మించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో దీన్ని నిర్మించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. రాజధాని పనుల పురోగతిపై ఆయన శుక్రవారం సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. రాజధాని నిర్మాణానికి రూ.రెండు వేల కోట్ల నిధుల సమీకరణకు ఈ నెలాఖరులో ‘అమరావతి బాండ్లు’ విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రవాస భారతీయుల నుంచి నిధుల సమీకరణకు ప్రత్యేకంగా బాండ్లు తీసుకురావాలని.. రాజధాని నిర్మాణానికి విరాళాల సేకరణ, నిర్వహణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాజధాని రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఒక సంస్థ ఏర్పాటుచేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

24న పెట్టుబడిదారులతో సమావేశం
అమరావతి బాండ్ల విడుదలకు సన్నాహకంగా ఈ నెల 24న ముంబయిలో పెట్టుబడిదారులతో అధికారులు సమావేశమవుతారు. బాండ్లు జారీ చేసేందుకు సీఆర్‌డీఏకు క్రెడిట్‌ రేటింగ్‌ ప్రక్రియ ఈ నెల 22కు పూర్తవుతుంది. ఏ, ఏ+ రేటింగ్‌ వచ్చే అవకాశం ఉందని, ఏఏ కేటగిరీకి ప్రయత్నిస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు. రూ.2 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా బాండ్లు విడుదల చేస్తారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం హామీనిస్తుంది. రాజధాని నిర్మాణానికి ఎంతో మంది ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారని సీఎం తెలిపారు. నరసయ్య అనే వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి నేరుగా తన వద్దకు వచ్చి రాజధానికి విరాళంగా చెక్కు ఇచ్చారని, విదేశాల్లో స్థిరపడిన తెలుగు మహిళ తన కోసం చాలాసేపు వేచి ఉండి మరీ రూ.పది లక్షల చెక్కు ఇచ్చి వెళ్లారని సీఎం ప్రస్తావించారు.

జీ+1 విధానంలో షాపింగ్‌మాల్‌
రాజధానిలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 3840 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. సీనియర్‌ అధికారులకు వ్యక్తిగత గృహాలు నిర్మిస్తున్నారు. వాటిలో వచ్చే సర్వెంట్‌ క్వార్టర్లు కూడా కలిపితే నిర్మిస్తున్నఫ్లాట్లు, గృహాల సంఖ్య ఐదు వేల వరకు ఉంటుంది. మరోపక్క ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 7,500 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ప్రజలకు విక్రయించేందుకు వెయ్యి ఫ్లాట్లు నిర్మించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. వీటన్నిటిలో సుమారు 12 వేల కుటుంబాలు నివసిస్తాయని, రాజధాని జనాభా మరో 50 వేలు పెరుగుతుందని అంచనా. వీరందరి కోసం భారీ షాపింగ్‌మాల్‌ నిర్మాణానికి సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నివాసగృహాలకు సమీపంలో, ప్రధాన అనుసంధాన రహదారికి పక్కన ఐదెకరాల్లో దీన్ని నిర్మిస్తారు. రెండు లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. ఖర్చు తగ్గించేందుకు జీ+1 విధానంలో నిర్మిస్తారు. మధ్య, చిన్నతరహా మాల్స్‌ ఏర్పాటుచేసే అంశాన్నీ పరిశీలించాలని సీఎం సూచించారు.

చెరువులు, ఉద్యానవనాల అభివృద్ధి
సీఆర్‌డీఏ పరిధిలో అర ఎకరం నుంచి 60 ఎకరాల వరకున్న 69 ఉద్యానవనాలను పచ్చదనంతో తీర్చదిద్దాలని.. యోగా, జిమ్‌ వంటి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ పరిధిలో 30 కి.మీ.పొడవున్న కాలువల సుందరీకరణ పనులు ఈ సీజన్‌లో పూర్తి చేయాలన్నారు.
ః పరిపాలన నగరంలో వచ్చే అన్ని ప్రభుత్వ భవంతులకు సంబంధించి జూన్‌ 16కు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. సచివాలయం టెండర్లు ఈ నెలాఖరుకు ఖరారవుతాయి. పునాదుల నిర్మాణంలో అంతర్జాతీయంగా పేరొందిన కెల్లార్‌వంటి సంస్థలను భాగస్వాములను చేయాలని సీఎం సూచించారు. 6 ఎల్‌పీఎస్‌ జోన్లలో మౌలిక వసతుల కల్పన వేగవంతమవుతోందని కమిషనర్‌ తెలిపారు.

‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌’ భాగస్వామ్యం
అమరావతి అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి ప్రఖ్యాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ (ఎల్‌ఎస్‌ఈ) ముందుకు వచ్చింది. దీనిపై రెండు నెలలపాటు అధ్యయనం చేసేందుకు ఎల్‌ఎస్‌ఈ విద్యార్థులు ఆగస్టులో వస్తున్నారు. అమరావతి అభివృద్ధిపై తమ విద్యార్థులకు వివరించేందుకు సీఆర్‌డీఏకు చెందిన నలుగురు ప్రతినిధులకు ఎల్‌ఎస్‌ఈ కూడా ఆహ్వానం పంపింది. జూన్‌ 4 నుంచి 8 వరకు వీరు ఎల్‌ఎస్‌ఈ విద్యార్థులకు వివరించనున్నారు.

* జూన్‌ మొదటివారంలో సీఆర్‌డీఏ అమరావతిలో ‘రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ కాంక్లేవ్‌’ నిర్వహించనుంది. ఈ సదస్సులో పలు జాతీయ, అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థలు పాల్గొంటాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు.

* రాష్ట్రం మొత్తం మీద లక్ష హోటల్‌ గదులు, రాజధానిలో పది వేల హోటల్‌ గదులు ఏర్పాటుచేయడం లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో 1800 హోటల్‌ గదుల నిర్మాణానికి అంగీకార పత్రాలు (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

* రాజధాని రైతులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించాలని సూచించారు. నేలపాడు, శాఖమూరు గ్రామాలను నమూనా గ్రామాలుగా తీసుకున్నామని కమిషనర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం రాజధానిలో రహదారుల నిర్మాణం, నర్సరీల అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించనున్నారు.

పౌరసరఫరాలశాఖలో సంతృప్తి శాతం పెంచాలి
పౌర సరఫరాలశాఖ పనితీరు మరింత మెరుగుపర్చి ప్రజల్లో సంతృప్తి స్థాయి 90 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బయోమెట్రిక్‌ పనిచేయని లబ్ధిదారుల కోసం ముఖ గుర్తింపు(ఫేస్‌ రికగ్నేషన్‌) విధానాన్ని అమలుచేయాలని ఆదేశించారు. రియల్‌టైం గవర్నెన్స్‌ కేంద్రంలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. జూన్‌లో రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

మూడు కేటగిరీలుగా ఫ్లాట్ల నిర్మాణం
ప్రజలకు విక్రయించేందుకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలు
  ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి
ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో ప్రజలకు విక్రయించేందుకు సీఆర్‌డీఏ నిర్మించనున్న ఫ్లాట్ల పరిమాణాల్ని శుక్రవారం ఖరారు చేశారు. వీటిని మూడు కేటగిరీలుగా నిర్ణయించారు. రాజధానిలో వెలగపూడి సమీపంలో 15 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు. జీ+11 విధానంలో వీటి నిర్మాణం జరుగుతుంది. మొత్తం 1,032 ఫ్లాట్లు కట్టాలన్నది ప్రతిపాదన. వీటి ప్రారంభ ధర(లాంచ్‌ ప్రైస్‌)ను చ.అడుగుకి రూ.3,500గా నిర్ణయించనున్నారు. ఈ ఫ్లాట్లను రెండు, మూడు దశల్లో నిర్మిస్తారు. ఒక్కో దశలో సుమారు 350 ఫ్లాట్ల నిర్మాణం చేపడతారు. వీటిని సీఆర్‌డీఏ సొంతగానే నిర్మించి, విక్రయిస్తుంది. ఏ కేటగిరీలో ఎన్ని ఫ్లాట్లు నిర్మిస్తారు? విస్తీర్ణం ఎలా ఉంటుంది? తదితర వివరాలు ఇలా ఉన్నాయి..
విస్తృత సర్వే..!: రాజధానిలో ఫ్లాట్ల నిర్మాణానికి సిద్ధమవడానికి ముందు సీఆర్‌డీఏ కన్సల్టెన్సీ సంస్థలతో డిమాండ్‌ సర్వే చేయించింది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2013-2017 మధ్య కాలంలో నిర్మించిన ఫ్లాట్లు ఎన్ని? వాటిలో ఎన్ని విక్రయించారు? ఇంకా అమ్మనివి ఎన్ని? ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎంత ధరకు ఫ్లాట్లు విక్రయిస్తున్నాయి? వంటి అంశాలపై సర్వే జరిగింది. ఈ ప్రాంతంలో గత రెండేళ్లలో సగటున సంవత్సరానికి 2,070 నుంచి 2,200 ఫ్లాట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. 2013-17 మధ్య సుమారు 11,300 ఫ్లాట్ల నిర్మాణాలు జరగగా, వాటిలో ఇంత వరకు 6,910 ఫ్లాట్ల విక్రయాలు జరిగినట్టు తెలిపింది.
18ap-state9b.jpg
 
Link to comment
Share on other sites

నెలాఖరుకి ‘అమరావతి బాండ్లు’
19-05-2018 03:52:01
 
  •  రూ.2వేల కోట్ల బాండ్లు మార్కెట్‌లోకి
  •  ప్రవాసుల కోసం ప్రత్యేకంగా జారీ
  •  రాజధాని నిర్మాణాలపై సీఎం సమీక్ష
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్న ‘అమరావతి బాండ్లు’ ఈ నెలాఖరుకు మార్కెట్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన క్రెడిట్‌ రేటింగ్‌ ప్రక్రియ ఈనెల 22లోపు పూర్తికానుంది. ఆ వెంటనే ప్రభుత్వ అనుమతులు పొంది నెలాఖర్లోగా వీటిని జారీ చేయనున్నారు. అమరావతికి కావాల్సిన నిధుల్లో ప్రాథమికంగా రూ.2వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చే బాండ్ల ద్వారా సేకరించాలని నిర్ణయించిన సంగతి విదితమే. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఏపీసీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఈ బాండ్లకు ఏ, ఏ+, ఏఏ క్యాటగిరీల్లో క్రెడిట్‌ రేటింగ్‌ వచ్చే అవకాశముందని, రాజధానిలో వివిధ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు, ఇతర అభివృద్ధి పనులకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ‘అమరావతి బాండ్లు’ జారీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాజధాని నిర్మాణానికి విరాళాలు అందించేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్న దృష్ట్యా ఆ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది చివరినాటికి రాజధానికి మరో 50వేల మంది జనాభా రానున్నారని, వారికోసం అవసరమయ్యే 12వేల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్‌ తెలిపారు. పీపీపీ విధానంలో అతిపెద్ద మాల్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పేరొందిన సంస్థల ద్వారా మధ్య, చిన్నతరహా మాల్స్‌ను నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పరిపాలన నగరంలో చేపట్టే అన్ని భవంతుల నిర్మాణాల టెండర్ల ప్రక్రియ జూన్‌ 16కు పూర్తవుతుందని, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం నెలాఖరుకల్లా పునాదుల స్థాయికి చేరుకుంటుందని శ్రీధర్‌ వివరించారు. ఉండవల్లి-తాడేపల్లి రహదారి విస్తరణకు అడ్డంకులను త్వరగా తొలగించాలని సీఎం ఆదేశించారు. ఏడీసీ ఆధ్వర్యంలోని నర్సరీ, రహదారుల పనుల పురోగతిని శనివారం ఉదయం పరిశీలిస్తానన్నారు. రాజధాని రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Link to comment
Share on other sites

మరావతి నిర్మాణంలో ఎల్‌ఎస్‎ఈ
19-05-2018 03:53:07
 
రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ప్రఖ్యాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ ( ఎల్‌ఎస్‎ఈ) ముందుకొచ్చింది. ఆర్థిక, రాజనీతి, వాణిజ్య శాస్త్రాల బోధనలో పేరొందిన ఈ సంస్థలోని ‘ఎల్‌ఎ్‌సఈ సిటీస్‌’ విభాగం నగర, పట్టణీకరణకు సంబంధించిన పలు అంశాలపై పరిశోధనలు జరుపుతుంది. రాజధాని అభివృద్ధి, ఆర్థిక వనరులు, భవిష్యత్‌ రవాణా వ్యవస్థ తదితరాలపై 2నెలల అధ్యయనానికి ఈ సంస్థ విద్యార్థులు ఆగస్టులో అమరావతికి రానున్నారు.
Link to comment
Share on other sites

జూన్‌లో ‘రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ కాంక్లేవ్‌’
19-05-2018 03:53:22
 
సీఆర్డీయే ఆధ్వర్యంలో వచ్చేనెల మొదటి వారంలో అమరావతిలో నిర్వహించే రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ కాంక్లేవ్‌లో సుప్రసిద్ధ స్థిరాస్థి సంస్థలు పాల్గొననున్నాయి. డీఎల్‌ఎఫ్‌, ఆర్‌ఎంజడ్‌, మై హోం, మహీంద్రా లైఫ్‌ స్పేసెస్‌, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌, దివ్యశ్రీ, షాపూర్జీ పల్లోంజీ, సాలార్‌పురియా సత్వా ఈ మేరకు సమాచారం ఇచ్చాయి.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...