Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

Gannavaram airport will soon have all the facilities applicable to an international airport terminal such as immigration section, plant quarantine etc. The old terminal will be used for this purpose since the domestic terminal facilities were moved to the new swanky terminal. It is being decked up with additional facilities and security arrangements. Installation of X-ray baggage scanners, security and surveillance systems and others are going on.

 

The Civil Aviation Minister officially declared Vijayawada Airport as international airport with effect from August 1 when requisite facilities for international operations will be made available. In all likelihood, Dubai-based Emirates airline would begin the first service to Dubai from Gannavaram. According to officials, it has already applied for the bilateral agreement for international air service with the Civil Aviation Ministry to start a service between Vijayawada and Dubai.

 

19243388_1721111661235751_18555984620421

Link to comment
Share on other sites

Thank you Ashok, Venkayya & CBN.

 

Last 3 years lo AP ki benefit jarigindi ante because of Venkayya, Ashok & piyush goyal due to CBN follow ups. Migatha ministries nunchi antha benefits levu.

Link to comment
Share on other sites

bullet point number 3 in that grandeur pic makes me laugh. 

edho statements icchi try cheyyakapothe, then we can laugh... but they are trying very hard... at the end it might happen or it might not happen.. atleast we should appreciate the effort...

Link to comment
Share on other sites

బెజవాడ విమానాశ్రయానికి..అంతర్జాతీయ కళ

06-07-2017 01:29:41
 
 
636349013979521519.jpg
  • కాలుమోపుతున్న ‘కస్టమ్స్‌’
  • 179 మంది సిబ్బందికి శిక్షణ
  • 2.5 కోట్లతో టెర్మినల్‌ ఆధునికీకరణ
  • ఎన్డీఆర్‌ఎఫ్‌ కార్యాలయం కృష్ణాలో
  • విజయవాడలో నేషనల్‌ రైల్‌ అకాడమీ
  • కమాండో శిక్షణకు మరో కేంద్రం
 
విజయవాడ, జూలై 5(ఆంధ్రజ్యోతి):నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టులో మరికొద్ది రోజుల్లో కస్టమ్స్‌ విభాగం అడుగు పెట్టబోతోం ది. విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన నేపథ్యంలో.. తనిఖీ సంబంధ కార్యకలాపాల నిర్వహణకు సిబ్బందిని సంసిద్ధం చేస్తోంది. కార్యాలయాల ఆధునీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కస్టమ్స్‌ హోదా వస్తే.. తక్షణం ఆసియా.. అందునా గల్ఫ్‌ దేశాలకు విమానాలను నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఏపీసీఐఎఫ్‌ దీనిపై గట్టిగా పోరాడింది. అనేక దఫాలు కేంద్రానికి, కస్టమ్స్‌కు లేఖలు రాసింది. ఉమ్మడి ఏపీగా ఉండగా హజ్‌ యాత్రికు లు హైదరాబాద్‌ నుంచే సౌదీ అరేబియాకు వెళ్లేవారు.
 
రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్‌ నుంచే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రకు చెందిన యాత్రికులను విజయవాడ విమానాశ్రయం నుంచి పంపితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. అప్పటి సమాచార, మైనారిటీ వ్యవహారాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ దిశగా కృషి చేశారు. దీంతో అప్పటి కస్టమ్స్‌ ఏపీ కమిషనర్‌ రెహమాన్‌ విజయవాడ ఎయిర్‌పోర్టును పరిశీలించారు. పాత టెర్మినల్‌ భవనంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు రూ.2.5 కోట్ల వ్యయంతో టెర్మినల్‌ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇందులో కస్టమ్స్‌ కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రత్యేకంగా ఐదు గదులను కేటాయించింది. పాత టెర్మినల్‌లో జరుగుతున్న పనులను కస్టమ్స్‌ అదనపు కమిషనర్‌ కాటం బేబి రాజుతో కూడిన బృందం బుధవా రం పరిశీలించింది.
 
ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు, విమానాశ్రయ సివిల్‌, ఎలక్ర్టికల్‌ విభాగాల ఇన్‌చార్జులు పనుల పురోగతిని వివరించారు. ఇంకోవైపు.. మరో వారం రోజుల్లో ఇమిగ్రేషన్‌ అధికారులు కూడా ఎయిర్‌పోర్టుకు రానున్నారు. కాగా.. విజయవాడలోని రాష్ట్ర కస్టమ్స్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పనిచేసే ఇన్‌స్పెక్టర్లు, సూపరింటెండెంట్‌లు మొత్తం 179 మందికి శంషాబాద్‌ విమానాశ్రయంలో శిక్షణ ఇప్పించారు. రూ.కోటి వ్యయంతో అధునాతన తనిఖీ యంత్రాలు కొనుగోలు చేయనున్నారు. కస్టమ్స్‌ విభాగం ఏర్పడగానే.. తక్షణం విజయవాడ నుంచి ఆసియా దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అవకాశం కలుగుతుంది. సింగపూర్‌, మలేసియా, హాంకాంగ్‌లకు విమానాలు నడిపేందుకు ‘ఎయిర్‌ ఆసియా’ ఆసక్తి చూపిస్తోంది. సింగ పూర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా నేరుగా విజయవాడకు సర్వీసును నడిపే అంశాన్ని పరిశీలిస్తోంది.
Link to comment
Share on other sites

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్


636349301520425468.jpg



  • ఎనిమిది ముఖ్య నగరాలకు విజయవాడతో అనుసంధానం
  • రూట్‌ పొడిగింపుతో ప్రత్యక్షంగా మరో రెండు ముఖ్య నగరాలకు
  • ఆయా నగరాలకు వెళ్ళే ప్రయాణికులు లింక్‌ టికెట్‌ తీసుకుంటే సరి

 

నవ్యాంధ్రకే తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాలన్నింటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుసంధానమేర్పడింది. స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ షెడ్యూల్స్‌ను ఆ దిశగా సవరించటం వల్ల ఈ అరుదైన అవకాశం దక్కింది. పరోక్షంగా ఎనిమిది ముఖ్య నగరాలకు అనుసంధానం ఏర్పడింది. రూట్‌ పొడిగింపు వల్ల ప్రత్యక్షంగా మరో రెండు ముఖ్య నగరాలకు విమాన అనుసంధానం ఏర్పడింది.

 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతరాష్ట్ర రూట్లకు నెట్‌వర్క్‌ పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా దేశంలోని హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలకు అనుసంధానమౌతోంది. తాజాగా పరోక్షంగా దేశంలోని ముంబాయి, గోవా, కొచిన్‌, ఛండీఘడ్‌, అహ్మదాబాద్‌, సూరత్‌, జబల్‌పూర్‌, వారణాసి వంటి నగరాలకు అనుసంధానమౌతోంది. జూలై 1వ తేదీ నుంచి సరికొత్త నగరాల అనుసంధానంతోపాటు నేరుగా త్రివేండ్రం, మంగళూరు నగరాలకు కూడా లింక్‌ రూట్‌ విధానంలో చేరుకునే అవకాశం లభించింది. ప్రస్తుతం పొరుగు రాష్ర్టాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు విమానసర్వీసులు నడుస్తున్నాయి. ఢిల్లీకి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఎయిర్‌ ఇండియా మూడు విమానాలను నడుపుతోంది. హైదరాబాద్‌, బెంగళూరులకు స్పైస్‌జెట్‌ సర్వీసులను నడుపుతోంది. చెన్నైకు కూడా స్పైస్‌జెట్‌ సంస్థ విమాన సర్వీసును నడుపుతోంది. ఈ క్రమంలోనే వారణాసికి కొద్దిరోజులు నేరుగా విమానాన్ని స్పైస్‌జెట్‌ సంస్థ నడిపినా.. ఆ తర్వాత రద్దు చేసింది. ముంబాయి, జైపూర్‌లకు విజయవాడ నుంచి నేరుగా విమానాలను నడిపేందుకు జూమ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ముందుకొచ్చినా అదీ కూడా సాకారం కాలేదు.

 

ఈ క్రమంలో మరిన్ని నగరాలకు విమాన సేవల భాగ్యం ఎప్పుడు కలుగుతుందని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ త రుణంలో స్పైస్‌ జెట్‌ సంస్థ కొన్ని సవరింపులతో ముందుకు రావటంతో పరోక్షంగా ఎనిమిది ముఖ్య నగరాలకు అనుసంధానం ఏర్పడింది. దీంతో పాటు రూట్‌ పొడిగింపు వల్ల ప్రత్యక్షంగా మరో రెండు ముఖ్య నగరాలకు విమాన అనుసంధానం ఏర్పడింది. ఉదయం బెంగళూరు నుంచి 9.10 గంటలకు విజయవాడ వచ్చే స్పైస్‌జెట్‌ విమాన సర్వీసును త్రివేండ్రం వరకు పొడిగించింది. ఉదయం హైదరాబాద్‌ - విజయవాడ - హైదరాబాద్‌ నడిచే విమాన సర్వీసును మంగళూరు వరకు స్పైస్‌జెట్‌ సంస్థ పొడిగించింది. దీనివల్ల ప్రత్యక్షంగా కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు నగరానికి అదనంగా సర్వీసు పెరగటంతో పాటు.. పరోక్షంగా సూరత్‌, జబల్‌పూర్‌, గోవా నగరాలకు విమాన అనుసంధానం ఏర్పడుతుంది. ఈ సర్వీసు ఉదయం 9.20 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవటం వల్ల సూరత్‌, జబల్‌పూర్‌, గోవా నగరాలకు చేరుకునే విమానాలు ఆ సమయంలో అందుబాటులో ఉంటాయి.

 

ఆయా నగరాలకు వెళ్ళే ప్రయాణికులు లింక్‌ టికెట్‌ తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చే స్పైస్‌జెట్‌ సర్వీసును కొద్ది సమయం అంటే 2.50 కు సవరించారు. దీని ఫలితంగా హైదరాబాద్‌ కు ఈ సర్వీసు 4 గంటలకు చేరుకుంటుంది. ఈ సమయంలో వారణాసి, ముంబాయి, కొచిన్‌, చంఢీగడ్‌, అహ్మదాబాద్‌ నగరాలకు పరోక్షంగా చేరుకోవటానికి విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. లింక్‌ టికెట్‌ తీసుకోవటం వల్ల ఆయా నగరాలకు ప్రయాణీకులు వెళ్ళవచ్చు. లింక్‌ టికెట్‌ వల్ల ఒక విమానాశ్రయంలో దిగి వేరే విమానం ఎక్కి నిర్ణీత ప్రదేశానికి చేరుకోవటం అన్నమాట.

 

బ్యాగేజీ చెకిన్‌ ఇక్కడే చేయించుకోవచ్చు: గిరి మదుసూధనరావు,ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌

స్పైస్‌జెట్‌ సంస్థ పొడిగించిన, సవరించిన షెడ్యూల్స్‌ వల్ల ప్రత్యక్షంగా త్రివేండ్రం, మంగళూరు నగరాలతో పాటు, పరోక్షంగా ముంబాయి, గోవా, కొచిన్‌, ఛండీఘడ్‌, అహ్మదాబాద్‌, సూరత్‌, జబల్‌పూర్‌, వారణాసి నగరాలకు అనుసంధానమేర్పడుతుంది. ప్రయాణికులకు ఒక అవకాశం ఉంది. ఇక్కడే బ్యాగేజి చెకిన్‌ చేయించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీరు లగేజీ తీసుకు వెళ్ళకుండానే నేరుగా హైదరాబాద్‌లో దిగి మీరు వెళ్ళాలనుకున్నచోట దిగవచ్యు. లగేజీని అక్కడ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.


Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎయిర్‌పోర్టులో రన్‌వే పనులపై సీఎం ఆరా
 
 
636356181448296597.jpg
  • ప్రతిబంధకంగా ఉన్న సమస్యలు తెలుసుకున్న సీఎం
  • వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్లు
  •  సాయంత్రం సీఎం తిరిగొచ్చేసరికి అటెన్షన్‌ 
  • విస్తరణ పనుల పరిశీలన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే విస్తరణ పనులకు గురించి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఉదయం కుప్పం వెళుతూ విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో సీఎం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మదుసూధనరావు, ఇతర అధికారులను పిలిచి విమానాశ్రయ విస్తరణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పురోగతి వివరాలను ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మదుసూదనరావు సీఎం చంద్రబాబుకు వివరించారు. పనులు వేగవంతం కావటానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సీఎం ప్రశ్నించగా.. కొన్ని అంశాలను ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత రన్‌వే ఎండ్‌ పాయింట్‌ నుంచి బుద్దవరం మీదుగా వెళ్ళే రోడ్డును డైవర్షన్‌ చేయాల్సి ఉందని, మంచినీటి పైపులైన్లను మళ్లించాల్సి ఉందని, మేజర్‌ డ్రెయిన్‌ను తరలించాల్సి ఉందని, హైటెన్షన్‌ వైర్లను కూడా మార్చాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ విన్న సీఎం చంద్రబాబు వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి విస్తరణకు ప్రతిబంధకంగా ఉన్న అంశాలపై గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. వెంటనే వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించిన తర్వాత విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయించాలని, సమీక్షలు నిర్వహించాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు సూచించారు. సరిగ్గా 11 గంటలకు ఆయన విమానంలో కుప్పం వెళ్ళారు.
 
 
సీఎం విమానాశ్రయం నుంచి నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడటంతో సంబంధిత శాఖల అధికారులంతా విమానాశ్రయానికి క్యూ కట్టారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ఎస్‌ఈలు వచ్చారు. అప్పటికే సీఎం వెళ్ళిపోవటంతో ఆయన వచ్చే వరకు వెటరినరీ కళాశాలలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ఉన్నారు. అక్కడే కలెక్టర్‌ లక్ష్మీకాంతం చేయాల్సిన పనులకు సంబంధించి సమీక్ష చేశారు. కుప్పం నుంచి బయలుదేరి నాలుగు గంటలకు సీఎం ఎయిర్‌పోర్టుకు వస్తారని తెలియటంతో వేచి చూశారు. సీఎం వచ్చే గంట ముందు కలెక్టర్‌ విస్తరణ పనులను పరిశీలించారు. సీఎం విమానం దిగిన తర్వాత ఆయనకు ఎదురేగారు.
 
అధికారులంతా ఒకేసారి రావటంతో సీఎం పెండింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరితో కలిసి ప్రస్తుత రన్‌వే ఎండింగ్‌ పాయింట్‌కు వెళ్లి విస్తరణ పనులను పరిశీలించారు. పనులను ఇంకా వేగంగా చేపట్టటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఉదయం సీఎం ఎయిర్‌పోర్టులో రన్‌ వే విస్తరణ పనులపై సమీక్ష చేయంతో సాయంత్రానికి అధికారులంతా అటెన్షన్‌ కావటంతో అప్పటికపుడు పరిష్కారం లభించింది. రెండు నెలల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఒక్కసారిగా చిక్కుముడి వీడింది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


ఉదయం సీఎం ఎయిర్‌పోర్టులో రన్‌ వే విస్తరణ పనులపై సమీక్ష చేయంతో సాయంత్రానికి అధికారులంతా అటెన్షన్‌ కావటంతో అప్పటికపుడు పరిష్కారం లభించింది. రెండు నెలల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఒక్కసారిగా చిక్కుముడి వీడింది.

 

CM vasthey kaani coordinate chesukovana maata depts

ento e daridram ...anni places ki cm vellaledu e govt depts ilage work chesthey kashtam

Link to comment
Share on other sites

  • 2 weeks later...

స్‌పీఎఫ్‌ అధీనంలోకి గన్నవరం విమానాశ్రయం

21ap-state10a.jpg

గన్నవరం విమానాశ్రయం, న్యూస్‌టుడే : గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. శుక్రవారం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) జవానుల అధీనంలోకి వెళ్లింది. ఇప్పటికే కడప, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల్లో భద్రతా వ్యవహారాలను ఎస్‌పీఎఫ్‌ చూస్తోంది. ఈ విభాగం డీఐజీ ఏసురత్నం గన్నవరం విమానాశ్రయంలో నిర్వహించిన సమావేశంలో సిబ్బందికి విధి విధానాలను వివరించారు. రాజధాని ప్రాంతం కావడంతో పాటు ప్రయాణికుల రద్దీ, ప్రముఖుల రాకపోకలు అధికంగా ఉంటాయని చెప్పారు. ఏఆర్‌, ఏపీఎస్‌పీ పోలీసులు కూడా కొంతకాలం విధులు కొనసాగిస్తారని, పూర్తి స్థాయి అవగాహన వచ్చిన తర్వాత పూర్తిగా ఎస్పీఎఫ్‌ అధీనంలోకి తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో 50 రోజులపాటు శిక్షణ పొందిన ఏసీపీ బీఆర్‌ కుందేటితో పాటు ముగ్గురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, 63 మంది కానిస్టేబుళ్లు బాధ్యతలు స్వీకరించారని వెల్లడించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...