Jump to content

AP fibre Grid project


Recommended Posts

  • Replies 610
  • Created
  • Last Reply
రాష్ట్రంలో వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌!
07-12-2017 01:04:01
 
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): తీగసాయం లేకుండానే(వైర్‌లెస్‌) 20 కిలోమీటర్ల దూరంలోనూ ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, టెలివిజన్‌ ప్రసారాలు చేపట్టే ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ఏపీ ఫైబర్‌నెట్‌ సన్నద్ధమైంది. దీనికి రూ.411.1 కోట్లను కేటాయిస్తూ మౌలిక సదుపాయాల ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ బుధవారం ఉత్తర్వు జారీ చేశారు. ఈ పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా మారుమూల ప్రాంతాలకూ ఫైబర్‌ నెట్‌ సేవలను అందించేందుకు వీలు కలుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఎఫ్‌ఎ్‌సవోసీ సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతుందన్నారు.
Link to comment
Share on other sites

asalu ee tv net gola anto artham katldu..akkada avrki istunnaro atrham kavltdu..ademina antha important na..

net kavalsina vallu valle pettinchkontaru...telecom operators madya unna competetion ki valle rates taggistunnaru...

411 croes ante antha easy na ipdu state unna situation lo

Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

private investors would provide services to urban areas only. they would not bother providing services to villages because they are unlikely to break even on those ventures for a long time if ever. govt. investment/subsidies are necessary to make them viable.

 

Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి డ్రీం ప్రాజెక్ట్... అమరావతిలో ప్రారంభించనున్న రాష్ట్రపతి...

   
godavari-12122017-1.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డ్రీం ప్రాజెక్ట్ ప్రారంభించటానికి, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 27వతేదీన ఆంధ్రపద్రేశ్ రాజధాని అమరావతికి వస్తున్నారు... చంద్రబాబు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభించటానికి రాష్ట్రపతి వస్తున్నారు... ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారు... మంగళవారం ఆయా శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి తక్కువ ధరకే కేబుల్, ఇంటర్నెట్ సదుపాయం అందనుంది. చంద్రబాబు నాయుడు 150 రూపాయలకే ఫైబర్ గ్రిడ్‌ ద్వారా కేబుల్, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా డిసెంబర్ 27 నుండి దీనికి సంబంధించిన పనులు మొదలుకానున్నాయి.

 

godavari 12122017 2

ఫైబర్‌ గ్రిడ్‌ కింద రెండు బాక్సులనూ సాఫ్ట్‌వేర్‌తో కలసి రూ.4వేలకే అందచేస్తారు. ఒకేసారి రూ.4 వేలు చెల్లించే వినియోగదారులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. అంత చెల్లించలేని వాళ్లు... తొలుత రూ.1700 చెల్లించి, మిగిలింది నెలకు రూ.99 చొప్పున మూడేళ్లపాటు విడతల వారీగా చెల్లించవచ్చు. అదేవిధంగా రూ.500 చెల్లించి... నెలకు రూ.99 చొప్పున నాలుగేళ్లపాటు సులభవాయిదాల్లోనూ చెల్లించే వీలుంది. దక్షిణ కొరియా, చైనా నుంచి ఈ బాక్సులు వచ్చేందుకు కనీసం 7 వారాలు పడుతుంది. అందువల్ల, రాష్ట్రంలో టీవీ ప్రసారాలు, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించాలని పైబర్‌ గ్రిడ్‌ అధికారులు భావిస్తున్నారు.

godavari 12122017 3

నెలకి రూ.149కి ఉచిత టెలిఫోన్‌, 10ఎంబీపీఎస్‌ వేగంతో కూడిన ఇంటర్‌నెట్‌, ఉచిత ఛానళ్లతో కూడిన కేబుల్‌ టీవీ ఇవ్వాలని ఏపీ ఫైబర్‌ తొలుత ప్రతిపాదించింది. తాజాగా ఇందులో మార్పు చేసి సాధారణ వినియోగదారునికి అవసరమయ్యే పే ఛానళ్లను సైతం నెలకి రూ.149 రుసుంతోనే ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగులోని చాలా వరకు పే ఛానళ్లతోపాటు కొన్ని హిందీ, ఇంగ్లీష్‌ పే ఛానళ్లు, క్రీడలకు సంబంధించిన మరికొన్ని పే ఛానళ్లు ఇందులో ఉండనున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన ఛానళ్ల యాజమాన్యాలతో ఒప్పందాలు సైతం పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల చేస్తున్న ప్రసారాల్లో 220 ఛానళ్ల వరకు వస్తున్నాయి. వీటిల్లో వివిధ భాషలు, విభాగాలకు చెందిన పే ఛానళ్లు ఉన్నాయి.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఇంటింటికి ఫైబర్‌ నెట్‌
26-12-2017 05:19:31

అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఫైబర్‌ నెట్‌ సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఫలాలు ప్రజలందరికీ విస్తరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం నెరవేరనుంది. బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫైబర్‌ నెట్‌ సేవలను జాతికి అంకితమివ్వనున్నారు. నిరంతర అవరోధాల విద్యుత్‌ సరఫరా నుంచి నిరంతర కరెంటు సరఫరాను సాధించి ఇంధన రంగాన్ని సీఎం సుస్థిరం చేశారు. గడచిన మూడేళ్లుగా విద్యుత్‌ కోతల్లేకుండా కరెంటు మిగులు రాష్ట్రంగా మలచడంలో విజయం సాధించారు. ఫలితంగా గడచిన మూడేళ్లలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను విద్యుత్‌ శాఖ దక్కించుకుంది. ఇప్పుడు అదే స్ఫూర్తితో .. రాష్ట్రమంతా ఫైబర్‌ నెట్‌ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
 
‘అందరికీ విద్యుత్‌.. ప్రతి ఇంటికీ ఫైబర్‌ నెట్‌’ నినాదంతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఇంధన, మౌలిక సదుపాయాల కల్పన, సీఆర్‌డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రపంచంలోనే తొలిసారిగా.. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్‌, టెలివిజన్‌ ప్రసారాలు, టెలిఫోన్‌ సేవలతో కూడిన సదుపాయాలను నెలకు రూ.149కే రాష్ట్ర ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ అందించనుంది. రోజంతా వైఫై, 15 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌తో పాటు.. 250 ఛానళ్లు ప్రసారం కావడం ప్రపంచంలోనే అత్యుత్తమ సేవగా పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని విద్యుత్‌ స్తంభాలను వినియోగించుకుంటూ కేవలం రూ.400 కోట్లతోనే ఈ పథకాన్ని పూర్తి చేశారు. వాస్తవానికి భారత్‌ నెట్‌ కింద.. ఈ పథకాన్ని రూ.5000 కోట్లతో పూర్తి చేయాలని కేంద్రం భావించింది. ఈ పథకం కింద 4000 ఖరీదైన సెట్‌టాప్‌ బాక్సును నెలకు రూ.99 చొప్పున వాయిదాల విధానంలో అందజేయనున్నారు. వినియోగదారులు మొబైల్‌ ఫోన్‌నే రిమోట్‌ కంట్రోల్‌గా వాడుకోవచ్చు. వీడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. టెలిఫోన్‌ సేవలను ఇంటర్‌కమ్‌గానూ వినియోగించుకోచ్చు. కనీస ప్యాకేజీ కింద రూ.149 చెల్లిస్తే.. 5 జీబీ ఉపయోగించుకునేలా 15 ఎంబీపీఎస్‌ వేగంతో సేవలు అందుతాయి. రూ.399 స్టాండర్డ్‌ ప్యాకేజీతో 25 జీబీదాకా వినియోగించే వీలుంది. 250 చానెళ్లు చూడొచ్చు.
 
 మోరితో శ్రీకారం..
రాష్ట్రాన్ని డిజిటల్‌ ఏపీగా తీర్చిదిద్దేందుకు సీఎం గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామంలో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ గ్రామం సాంకేతిక విప్లవ వినియోగంలో దేశానికే నమూనాగా మారింది. ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ అందిస్తున్న సాంకేతిక సహకారంలో నిఘా నేత్రాలు అత్యంత ప్రధానమైనవి. రాష్ట్రవ్యాప్తంగా 20,000 నిఘా కెమెరాలను అమర్చారు. ప్రధాన కూడళ్లలో అమర్చిన ఈ కెమెరాలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చేయడంలో పోలీసు శాఖకు తోడ్పడుతున్నాయి.
 
కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలోనూ ఫైబర్‌ నెట్‌ సేవలందాయి. ఫలితంగా.. పుష్కరాల్లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు. 2019కల్లా 30 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 55 గ్రామాల్లోని లక్ష కనెక్షన్లను 27న రాష్ట్రపతి అందజేస్తారు. ఫైబర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సోమవారం చంద్రబాబు శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. వరుసగా మూడేళ్ల నుంచి విద్యుత్‌, మౌలిక సదుపాయాల కల్పన, సీఆర్‌డీఏలలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను రాష్ట్రం అందుకుంటోందని సంతోషం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

1 కనెక్షన్‌.. 3 సేవలు 
ఏపీ ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు సిద్ధం 
ఇంటింటికీ సమాచార విప్లవం 
రేపు జాతికి అంకితం చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 
ఈనాడు - అమరావతి 

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌,  టెలిఫోన్‌, 250 టీవీ ఛానళ్ల ప్రసారాలు... ఈ సేవలన్నీ ఒకే కనెక్షన్‌తో ఇవ్వాలి. అది కూడా చౌక ధరలోనే ఇవ్వాలి. అపరిమిత ఫోన్‌ కాల్స్‌, వీడియో కాలింగ్‌, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి సదుపాయాలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. బుల్లి తెరను... కంప్యూటర్‌గా మార్చేయాలి. మనకు నచ్చిన కార్యక్రమాలు చూసే (ఇంటరాక్టివ్‌ టీవీ) సదుపాయం కల్పించాలి. భవిష్యత్తులో రియల్‌టైంలో కరెంటు మీటర్ల రీడింగ్‌ నమోదు, టెలిమెడిసిన్‌ వంటి అనేక సేవల్ని ఈ విధానంలో అందజేయాలి. ఇలాంటి లక్ష్యాలతో చేపట్టిందే ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు! రాష్ట్రాన్ని ‘డిజిటల్‌ ఏపీ’గా తీర్చిదిద్దే బృహత్తర ఆశయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 27న జాతికి అంకితం చేయనున్నారు. ఇంత వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,03,613 గృహాలకు ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు ఇచ్చారు. వచ్చే మార్చికి కనీసం 10 లక్షల గృహాలకు కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం. గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాల వల్ల అమల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ‘మోరి’ గ్రామంలో ప్రాజెక్టు ప్రారంభించాక, నిర్వహణ విస్మరించడంతో చేదు అనుభవం ఎదురైంది. వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని, లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేస్తే ప్రజలకు ఎంతో మేలు చేసే ప్రాజెక్టు ఇది.
కరెంటు స్తంభాలే ఆధారం! 
భూగర్భంలో హైస్పీడ్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్లు వేయడానికి రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని తేలడంతో, కరెంటు స్తంభాలే ఆధారంగా 23,800 కిలోమీటర్ల మేర ఓఎఫ్‌సీ లైన్లు వేశారు. రూ.330 కోట్లతోనే ఈ పని పూర్తయింది. 
* టెలిఫోన్‌, మొబైల్‌ఫోన్‌ సేవలు అందుబాటులో లేని మారుమూల గ్రామాలు 3,060 వరకు ఉండగా, వాటిలో  60 గ్రామాలకు ఓఎఫ్‌సీ లైన్లు వేయగలిగారు. 
* లైన్లు వేయలేని చోట ఫ్రీ స్పేస్‌ ఆప్టిక్‌ కనెక్షన్‌ (ఎఫ్‌ఎస్‌ఓసీ) పరిజ్ఞానంతో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నారు. 20 కిలోమీటర్ల పరిధిలో తీగలు లేకుండా ఇంటర్నెట్‌ సేవలందించే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని గూగుల్‌ అందిస్తోంది. 
* రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 100 గ్రామాల్ని అన్ని ఇళ్లకు ఇంటర్నెట్‌ కనెక్షన్లున్న గ్రామాలుగా తీర్చిదిద్దారు.
బాక్సులే కీలకం..! 
* ఇళ్లు, సంస్థలకు కనెక్షన్లు ఇవ్వాలంటే భారీ ఎత్తున ఓఎఫ్‌సీ వైర్లు, ట్రిపుల్‌ ప్లే బాక్సులు, మానవ వనరులు కావాలి. వీటి కొరత ఉండడంతో ప్రాజెక్టులో జాప్యం జరుగుతోంది. 
* రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలకు దశలవారీగా ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యం. 
* ఒక ఇంటికిగానీ, సంస్థకుగానీ ఫైబర్‌ నెట్‌ సేవలందించాలంటే రెండు రకాల బాక్సులు అవసరం అవుతాయి. ఇళ్లకు జిపాన్‌ బేసిక్‌, ఐపీటీవీ బాక్సులు ఇస్తారు. ఈ రెండిటినీ కలిపి కస్టమర్‌ ప్రెసిసెస్‌ ఎక్విప్‌మెంట్‌ (సీపీఈ)గా వ్యవహరిస్తారు. ఇంత వరకు 3.8 లక్షల జిపాన్‌ బాక్సులు, 1.21 లక్షల ఐపీటీవీ బాక్సులు వచ్చాయి. తాజాగా జిపాన్‌, ఐపీటీవీ బాక్సులు రెండూ కలిపి ఒకే బాక్స్‌గా వస్తున్నాయి. అలాంటి బాక్సులు 50 వేల వరకు వచ్చాయి.
రూ.235కే అన్నీ..! 
* ఇళ్లకు ఇచ్చే కనెక్షన్లకు నెలకు రూ.235 చొప్పున వసూలు చేస్తారు. దీనిలో రూ.149 ఛార్జీ, రూ.35-36 పన్నులు, రూ.50 ట్రిపుల్‌ ప్లే బాక్స్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌. నెలవారీ ఛార్జీగా వసూలు చేసే రూ.149లో రూ.110 ఎంఎస్‌ఓ, కేబుల్‌ ఆపరేటర్లకు, రూ.39 ప్రభుత్వానికి వెళుతుంది. 
* ఇళ్లకు ఇచ్చే కనెక్షన్లను బేసిక్‌ (రూ.149), స్టాండర్డ్‌ (రూ.399), ప్రీమియం (రూ.599) అని మూడు విభాగాలుగా చేశారు. పన్నులు, ఇన్‌స్టాల్‌మెంట్‌ అదనం. సంస్థలకు ఇచ్చే కనెక్షన్లలోను ఈ మూడు విభాగాలు ఉన్నాయి. రూ.999, రూ.1499, రూ.2499గా ఛార్జీలు నిర్ణయించారు. 
* ఇళ్లకు బేసిక్‌ ప్యాకేజీలో 250 టీవీ ఛానళ్లు, 15 ఎంబీపీఎస్‌ వేగంతో 5 జీబీ ఇంటర్నెట్‌, 1 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తారు. 250లో 90 పే ఛానళ్లు, మిగతావి ఫ్రీ చానళ్లు ఉంటాయి.
ఇతర సేవలు! 
* తొలి దశలో 4 వేల పాఠశాలల్లో వర్చువల్‌ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నారు. 
* రాష్ట్రవ్యాప్తంగా 20 వేల నిఘా కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు. 
* డ్రోన్‌ల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నారు. 
* పబ్లిక్‌ వైఫై సదుపాయం కల్పిస్తారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఇందుకు సంబంధించి ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...