Jump to content

Jai Amaravathi


Recommended Posts

Posted

సుప్రీంకోర్టులో అమరావతి భూముల కొనుగోలుపై ముగిసిన వాదనలు - అమరావతి భూములపై దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు...

Image

Posted

Tappudu pracharalu chesina YCP Laxxx xxxxxxxx 

Neutral musugu vesukuni bad ga matladina Muxxx xxxxxxxx

Evari Raajdhani ani book release chesina koxxa gallu aa book opening ki velli hadavidi chesina neethi jaathi leni Pawan kalyan lanti ku.kkalu 

Ekkadaina place chusukuni ongondi raa.. 

 

29k farmers and vala kutumbala ni kshoba ki gurichesi kontha mandhi gunde aagipoyela chesina meeku sapam ga maruddhi.. 

Posted
Just now, Raaz@NBK said:

Tappudu pracharalu chesina YCP Laxxx xxxxxxxx 

Neutral musugu vesukuni bad ga matladina Muxxx xxxxxxxx

Evari Raajdhani ani book release chesina koxxa gallu aa book opening ki velli hadavidi chesina neethi jaathi leni Pawan kalyan lanti ku.kkalu 

Ekkadaina place chusukuni ongondi raa.. 

 

29k farmers and vala kutumbala ni kshoba ki gurichesi kontha mandhi gunde aagipoyela chesina meeku sapam ga maruddhi.. 

idhi 29k farmers samasya ne kadhu.. Andhra Pradesh state lo vunna prathi okkadi samasya.. 

Farmers direct ga debba tinte AP lo vunde prathi pourudu indirect ga debba tinatte.. 

Charitra heenuluna maaripotharu oka state capital development ni addukunna vallu.. 

Posted

అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు  రాష్ట్ర ప్రభుత్వ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు  కొట్టివేసింది. లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అమరావతిలో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం అమలవుతోందంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది నివేదించగా.. ఈ కేసులో ఆ చట్టం వినియోగంలోకి రాదని.. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదించారు. భూములమ్మినవారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలను విన్న సుప్రీంకోర్టు.. రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, మెహఫూజ్‌ నజ్కి వాదనలు వినిపించారు. ప్రతివాదుల తరఫున  పరాస్‌ ఖుర్షీద్‌, శ్యామ్‌ దివాన్‌, సిద్ధార్థ లూత్రా వాదించారు.  

ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందాయి..

ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం కింద కొనుగోలుదారుకు వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున  న్యాయవాది దుష్యంత్‌ దవే  వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు పలుసార్లు ఇదే విషయం ధ్రువీకరించాయని వెల్లడించారు. అమరావతిలో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం అమలవుతుందని ధర్మాసనానికి తెలిపారు. మొత్తం వ్యవహారంలో అనేక లోపాలున్నాయని తెలుస్తోందని.. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని..  2019లో ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందాయని కోర్టుకు తెలిపారు.

ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు..

  ప్రభుత్వ వాదనలతో  ప్రతివాద న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని..  ఒక్కరు కూడా విభేదించనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఎందుకని న్యాయవాది ఖుర్షీద్‌ అన్నారు. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీస్‌ చట్టం వినియోగంలోకి రాదని ధర్మాసనానికి తెలిపారు. ఇద్దరి వ్యవహారంలో మోసం చేశారా లేదా అనేవి ఈ చట్ట ప్రకారం రావన్నారు. 2014 అక్టోబరు నుంచి రాజధాని ఎక్కడో మీడియాలో వచ్చిందని.. 14 గ్రామాల్లో 30 వేల ఎకరాల్లో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయన్నారు. రాజధానిపై 2014 డిసెంబరు 30న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందని సుప్రీంకు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారని స్పష్టం చేశారు. న్యాయ, చట్టపరమైన ఫిర్యాదులు నమోదు కాని కేసుగా ఇది నిలుస్తుందన్న ఖుర్షీద్‌ అన్నారు.  

అంతా బహిరంగంగానే జరిగింది..

 రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చిందని మరో ప్రతివాది తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ అన్నారు. ఆరేళ్ల తర్వాత భూములమ్మిన వారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని.. భూములమ్మిన వారు ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని ధర్మాసనానికి వెల్లడించారు.  స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని హైకోర్టు ఉత్తర్వులతో తెలుస్తోందని.. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం సెక్షన్‌-55 వర్తించదని దివాన్‌ స్పష్టం చేశారు.  రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగానే జరిగిందని శ్యామ్‌ దివాన్‌ ధర్మాసనానికి వివరించారు.  

అసలు ఏం జరిగిందంటే..

గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు జీవోపై స్టే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  

Posted
16 minutes ago, Raaz@NBK said:

idhi 29k farmers samasya ne kadhu.. Andhra Pradesh state lo vunna prathi okkadi samasya.. 

Farmers direct ga debba tinte AP lo vunde prathi pourudu indirect ga debba tinatte.. 

Charitra heenuluna maaripotharu oka state capital development ni addukunna vallu.. 

WA num changed?

Posted
11 minutes ago, Yaswanth526 said:

PK tho start cheyyali ithe mari

Karnudi chaavu ki vanda kaaranaalu annattu, okka PK ani emundi? undavalli, IYR lanti redflower batch kuda unnaru and infact these guys started it first

Posted

ఇన్‍సైడర్ ట్రేడింగ్‍పై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‍పై సుప్రీంకోర్టులో విచారణ 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే

ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద కొనుగుదారులకు వివరాలు ఇవ్వాలన్న దవే 

సుప్రీంకోర్టు, హైకోర్టులు పలుసార్లు ఇదే విషయం ధ్రువీకరించాయన్న దవే 

అమరావతిలో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం అమలవుతుందన్న ప్రభుత్వం 

మొత్తం వ్యవహారంలో అనేక లోపాలున్నాయని తెలుస్తోందన్న ప్రభుత్వం 

ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందన్న ప్రభుత్వం 

2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న ప్రభుత్వం 

2019లో ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందాయని కోర్టుకు తెలిపిన దవే 

ప్రభుత్వ వాదనలతో విభేదించిన ప్రతివాద న్యాయవాదులు 

అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదన్న ఖుర్షీద్

ఒక్కరూ విభేదించనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఎందుకన్న ఖుర్షీద్ 

ఈ కేసులో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదన్న ఖుర్షీద్ 

ఇద్దరి వ్యవహారంలో మోసం చేశారా లేదా అనేవి ఈ చట్ట ప్రకారం రావు 

2014 అక్టోబరు నుంచి రాజధాని ఎక్కడో మీడియాలో వచ్చింది 

14 గ్రామాల్లో 30 వేల ఎకరాల్లో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయి 

రాజధానిపై 2014 డిసెంబరు 30న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది 

కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు 

న్యాయ, చట్టపరమైన ఫిర్యాదులు నమోదు కాని కేసుగా నిలుస్తుందన్న  న్యాయవాది ఖుర్షీద్ 

మరో ప్రతివాది తరపున వాదనలు వినిపించిన న్యాయవాది శ్యామ్ దివాన్ 

రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చింది 

ఆరేళ్ల తర్వార భూములమ్మిన వారి తరపున ఎవరో ఫిర్యాదు చేశారన్న దివాన్ 

భూములమ్మిన వారు ఒక్కరూ ఫిర్యాదు చేయలేదన్న శ్యామ్ దివాన్

స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని హైకోర్టు ఉత్తర్వుతో తెలుస్తోంది

ఈ కేసులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం సెక్షన్-55 వర్తించదన్న దివాన్ 

రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగానే జరిగిందన్న న్యాయవాది శ్యామ్ దివాన్

Posted
13 hours ago, krish2015 said:

Capital cases hearing nadusthundaaa? ekkada news ledu.

Will come during August or September ani Amaravati JAC GVR Shastri garu cheppaaru yesterday in ABN debate 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...