Jump to content

It raids done by bjp on pk before this


sreentr

Recommended Posts

ప్రశ్నిస్తానన్న పవన్‌ పన్నీరుసెల్వంలా మారిపోయారు
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
 

అమరావతి: జగన్ తరహాలోనే పవన్ కూడా మిస్డ్ కాల్ పార్టీల జాబితాలో చేరారంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ దుయ్యబట్టారు. వైకాపాలాగే మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేస్తామని పవన్‌ చెబుతున్నారని.. అంటే జగన్‌ను ఆయన అనుసరిస్తున్నారని అనుకోవచ్చా? అని ప్రశ్నించారు. పవన్ తన మనసు ఎవరి మీదైనా పారేసుకుంటారని...ఆ తర్వాత మూడు నాలుగేళ్లకు ఆరేసుకుంటారని ఎద్దేవా చేశారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పిన పవన్‌.. ఒక్కసారిగా పన్నీరు సెల్వంలా ఎలా మారిపోయారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్‌ను విమర్శించడానికే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా విమర్శలను.. ఆరోపణలను పవన్ దత్తత తీసుకున్నారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సినిమాలో ఇంటర్వెల్ వరకు హీరోలా ఉండి.. ఆ తర్వాత భిన్నమైన రోల్ పోషించినట్టుగా పవన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  పవన్‌ గతంలో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై మనసు పారేసుకుని..తర్వాత ఆరేసుకున్నాడని అన్నారు. నిన్నటివరకు వామపక్ష భావజాలంతో ఉన్న పవన్ ఇప్పుడు పక్షపాత భావజాలానికి మారిపోయారని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను పెంచుతామన్న కేసీఆర్‌ను పొగుడుతున్న పవన్... కాపు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న చంద్రబాబును ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. ఆవేశంలో జరిగిన ఒకటి రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. మంగళగిరిలో పవన్ ఇంటి నిర్మాణం జరిగే చోట తానూ ఇల్లు తీసుకుందామంటే ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నాని.. కానీ పవన్‌కు రూ.40 లక్షలకే ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. సినిమా హీరో మీద మోజుతో తక్కువ రేటుకు ఇచ్చారేమోనని అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...