Jump to content

జీఎస్టీ నిర్ణయం నా ఒక్కడిదే కాదు.....

KING007

Recommended Posts

జీఎస్టీ నిర్ణయం నా ఒక్కడిదే కాదు
17-10-2017 02:50:10
 
636438054106222927.jpg
  • కాంగ్రెస్‌ పార్టీకీ భాగస్వామ్యం
  • అన్ని రాష్ట్రాలనూ సంప్రదించాం
  • కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి నిర్ణయమిది
  • కేంద్ర ప్రభుత్వం చిన్న పాత్రధారే
  • 3 నెలల తర్వాత సమీక్ష: మోదీ
న్యూఢిల్లీ/గాంధీనగర్‌, అక్టోబరు 16: ‘‘జీఎస్టీ అమలు నా ఒక్కడి నిర్ణయం కాదు. పార్లమెంటు ఒక్కటే నిర్ణయించలేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమది. ఈ నిర్ణయంలో కాంగ్రెస్‌ పార్టీకీ సమాన భాగస్వామ్యముంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం చిన్న పాత్రధారి మాత్రమే’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్లో సోమవారం నిర్వహించిన ‘గుజరాత్‌ గౌరవ మహా సమ్మేళనం’లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
‘‘జీఎస్టీ సంస్కరణను అమలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి మోదీ ఒక్కడే తీసుకోలేదు. జీఎస్టీ కౌన్సిల్లో 30 వరకూ పార్టీలున్నాయి. వాటన్నిటినీ సంప్రదించాం. నిర్ణయాల్లో వాటినీ భాగస్వాములను చేశాం. జీఎస్టీ నిర్ణయాల్లో కాంగ్రెస్‌ కూడా సమాన పాత్రధారి. ఇప్పటికైనా ఆ పార్టీ జీఎస్టీపై అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలి’’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ నిరాశావాదాన్ని పెంచి పోషిస్తోందని, కొంతమంది నిరాశావాదులు తప్పుడు గణాంకాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జీఎస్టీపై భయాందోళనలు రేకెత్తించారని తప్పుబట్టారు. వ్యాపారులంతా ఈ విధానాన్ని కోరుకుంటున్నారన్నారు. జీఎస్టీ అమలు తర్వాత వ్యాపారులతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, వారంతా దీనిని కోరుకుంటున్నారని, అధికారిక అలసత్వానికి ఇది చరమ గీతం పాడిందని కొనియాడుతున్నారని చెప్పారు.
 
అయితే, మూడు నెలల తర్వాత జీఎస్టీ అమలును సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు డిమాండ్లను పరిష్కరించడానికి పలు మార్పులు చేస్తామని తెలిపారు. గుజరాత్‌లో ఐదోసారీ అధికారంలోకి వస్తామని స్పష్టం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. కులతత్వం, మతతత్వం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్‌ ఆయుధాలని మండిపడ్డారు. గోధ్రా అనంతర అల్లర్లను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ తనను జైల్లో పెట్టడానికి ప్రయత్నించిందని చెప్పారు. గుజరాత్‌ అభివృద్ధి విషయంలో ఎప్పుడూ విముఖంగానే ఉందని, పైగా తాము అభివృద్ధి చేస్తే విమర్శిస్తోందని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడానికి బదులుగా అభివృద్ధి ప్రాతిపదికన తమతో పోటీ పడతారా అని కాంగ్రె్‌సకు సవాల్‌ విసిరారు.
 
సోనియా గాంధీ, రాహుల్‌ మాత్రమే కాదు.. మొత్తంగా ఆ పార్టీయే బెయిల్‌పై (జమానతీ)గా ఉందని దుయ్యబట్టారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు తమ పార్టీ పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన యుద్ధమని, ఈసారి 150 సీట్లు సాధించడమే తమ లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. గుజరాత్‌ అసెంబ్లీలో 182 సీట్లు ఉంటే, 2002లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 129 గెలుచుకున్నామని, ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నారని, ఈసారి దానిని మించి 150 స్థానాలు గెలుచుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు

Link to comment
Share on other sites

  • Replies 107
  • Created
  • Last Reply
Guest Urban Legend

debba gattiga tagilindhi ga modi ki

bjp fans kuda prathi panikimaalina decision n defend cheyyatam aapi janala reaction telusukuntey manchindhi ...

modi rocks

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...