Jump to content

బిర్యానీకే పట్టం..! నగరాలన్నింటా ఇదే తీరు


Ramesh39

Recommended Posts

బిర్యానీకే పట్టం..! 

నగరాలన్నింటా ఇదే తీరు 

hyd-sty1a.jpg

 హైదరాబాద్‌: హైదరాబాద్‌ బిర్యానీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతాఇంతా కాదన్నది తెలిసిందే.. నాన్‌వెజ్‌ ప్రియులైతే బిర్యానీ లేనిదే విందే కాదనే భావనలో ఉంటారు..నవాబుల కాలం నుంచి ఆహార నగరంగా పేరుగాంచిన భాగ్యనగరికి ఎవరొచ్చినా ఇక్కడి రుచులను ఆస్వాదించకుండా వెనుదిరగరు. ఇక నగరంలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ.. అన్నివేళలా బిర్యానీకి పెద్దపీట వేస్తున్నారు. ఆఖరికి చిరుతిండి (స్నాక్స్‌) సమయంలోనూ బిర్యానీని లాగించేస్తున్నారు. దేశంలోని 8 నగరాల్లో ఆహార అలవాట్లు, ఎక్కువ మంది ఇష్టపడుతున్న వంటకాలపై ఓ సంస్థ సర్వే చేస్తే.. చికెన్‌ బిర్యానీని అత్యధికులు ఇష్టపడగా... హైదరాబాద్‌ వాసులైతే ఈ విషయంలో అందరికంటే ముందున్నారు.

హైదరాబాద్‌ బిర్యానీ, హలీంకి దేశ, విదేశాల్లో గుర్తింపు ఉంది. ఈ రెండు వంటకాల్లో బిర్యానీ నిత్యం అందుబాటులో ఉంటుంది. రంజాన్‌ మాసంలోనే హలీం రుచులను ఆస్వాదించే వీలుంది. నగరానికి పర్యాటకులు ఎవరువచ్చినా... చికెన్‌ బిర్యానీలో ఉండే అనేక రకాలను ఆరగించకుండా వదలరు. ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే సమయంలోనూ అతిథుల మెనూలో బిర్యానీకి చోటు కల్పిస్తారు. ఇక ఇంటికే వివిధ సరఫరా సంస్థల ద్వారా భోజనం తెప్పించుకొనే వారూ.. బిర్యానీకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడైంది.

hyd-sty1b.jpg

నెలలో 13 నుంచి 15 సార్లు.. 

దేశవ్యాప్తంగా 8 నగరాల్లోని 5 లక్షల మంది నుంచి సర్వే సంస్థ అభిప్రాయాలు సేకరించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, దిల్లీతో పాటు దేశ రాజధాని పరిసర ప్రాంతాలు, పుణె, ముంబయి, కోల్‌కతాలో ప్రజలు మక్కువ చూపుతున్న ఆహారం ఏమిటని ఆరా తీస్తే.. బిర్యానీకి ఎక్కువమంది పట్టంగట్టారు. హైదరాబాదీలైతే ఏ సమయంలో అయినా దీనికే మొగ్గు చూపారు. మధ్యాహ్న, రాత్రి భోజనానికి మధ్య కూడా పార్సిల్‌ సర్వీసు ద్వారా బుక్‌ చేసుకుని నగర ప్రజలు ఆరగిస్తున్నట్లు సర్వేలో తేలింది. నగరంలోని యువకుల్లో చాలామంది నెలలో 13 నుంచి 15సార్లు బిర్యానీని ఇంటికి తెప్పించుకుని లాగించేస్తున్నారు. తర్వాతి వరుసలో బెంగళూరు, ముంబయి, పుణె, కోల్‌కతా ఉన్నాయి

Link to comment
Share on other sites

what ever it is, if even steroids injected into legs / necks also after boiling on flame with 100+ degrees heat everything will goes off.  Even Veg also have the fertilizes and others but we are having ri8. same applies here,  Inkaa cat / xxx antaraa manam yemi seyyalem, if taste is bad will not go to that restaurant again anthe  :close: 

Bathike konnirojulu kummadame taggedi ledu :youth: 

Any day Chicken :no1: Non veg  :pouce:  :award:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...