Jump to content

Bhavani IslandTourism Corporation

sonykongara

Recommended Posts

  • Replies 348
  • Created
  • Last Reply
  • 1 month later...
  • 2 weeks later...
రాజధాని ప్రాంత వాసులకు నయా ఎంటర్‌టైన్‌మెంట్‌
09-12-2017 08:12:18
 
636484039399747467.jpg
  • భవానీద్వీపంలో రూ.16 కోట్ల వ్యయంతో ఏర్పాటు
  • ఈడీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో ట్రయల్‌ రన్‌
  • త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
 విజయవాడ: సప్తవర్ణాల లేజర్‌ కాంతుల్లో కృష్ణమ్మ మెరిసిపోతోంది. చల్లని రాత్రుళ్ళు కమ్మటి సంగీత ఝరిలో ఓలలాడుతూ, ఈ సోయగాలను వీక్షించే అవకాశం మరికొద్ది రోజుల్లో రాజధాని ప్రాంత ప్రజలకు కలగబోతోంది. భవానీ ఐల్యాండ్‌లోని ఫండే టవర్‌ వద్ద కృష్ణానదిలో ఏపీటీడీసీ అధికారులు రూ.16 కోట్ల వ్యయంతో లేజర్‌ షో మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవలే దీని బిగింపు పూర్తయింది. రెండు రోజులుగా ఏపీటీడీసీ అధికారులు ట్రయల్‌ వేస్తున్నారు.
 
మ్యూజిక్‌కు అనుగుణంగా లేజర్‌ షో వస్తుంది. ఆ వెలుగుల్లో ఫౌంటెయిన్లు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుగుల్లో నది జిగేల్‌మని మెరిసిపోతోంది. చైనాలో కనిపించే లేజర్‌ షో డ్యాన్స్‌ ఇక్కడ ఏర్పాటు కావటం విశేషం. వారం రోజులు పరీక్షించిన అనంతరం సీఎం చంద్రబాబు దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావు ట్రయల్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Link to comment
Share on other sites

అమరావతి వాసులకు నయా ఎంటర్‌టైన్‌మెంట్‌. భవానీ ఐలాండ్ లో ఏర్పాటు చేసిన డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ , ఇవాళ క్రిస్మస్ కానుకగా ముఖ్యామంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. దీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. నది మధ్యలో, మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు.

ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.16 కోట్లు ఖర్చు అయ్యింది... దుర్గమ్మ వైభవం, అమరావతి చరిత్ర, మన రాష్ట్రానికి చెందిన ఘనమైన చరిత్రను లేజర్ షో రూపంలో పర్యాటకులకు చూపించనున్నారు... మ్యూజిక్‌కు అనుగుణంగా లేజర్‌ షో వస్తుంది. ఆ వెలుగుల్లో ఫౌంటెయిన్లు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుగుల్లో నది జిగేల్‌మని మెరిసిపోతోంది. చైనాలో కనిపించే లేజర్‌ షో డ్యాన్స్‌ ఇక్కడ ఏర్పాటు కావటం విశేషం.

ప్రతి రోజూ రెండు షో లు వేస్తారు... ప్రస్తుతానికి టికెట్ ఉచితంగా ఉంచారు... తరువాత సందర్శకులకు టికెట్ పెడతారు... టికెట్ రేట్ ఇంకా నిర్ణయించలేదు.. మ్యూజికల్ ఫౌంటైన్ 32 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేశారు. 200 మంది వరకు సందర్శకులు కూర్చునే వీలు ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు ఫౌంటైన్ నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మొదటి షో ప్రారంభమవుతుంది. మ్యూజికల్ షోతో పాటు, లేజర్ షో కూడా నిర్వహిస్తారు. ఇందు కోసం 460 లైట్లు అమర్చారు.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...